Governing Body meeting
-
నీతిఆయోగ్ భేటీకి ఆరుగురు సీఎంలు దూరం
న్యూఢిల్లీ: హస్తినలో శనివారం జరగబోయే నీతి ఆయోగ్ పాలకమండలి భేటీని విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీలకు చెందిన ఆరుగురు సీఎంలు బహిష్కరించారు. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపారంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి (తెలంగాణ), సిద్ధరామయ్య (కర్ణాటక), సుఖీ్వందర్ సింగ్ సుఖూ (హిమాచల్ ప్రదేశ్)తో పాటు ఎంకే స్టాలిన్ (తమిళనాడు), విజయన్ (కేరళ), భగవంత్ మాన్ (పంజాబ్) ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వమూ భేటీని బాయ్‌కాట్ చేసింది.ప్రణాళికా సంఘమే కావాలి: మమతపశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ మాత్రం భేటీలో పాల్గొంటానని స్పష్టంచేశారు. ‘‘బడ్జెట్ కేటాయింపుల్లో విపక్షాలపాలిత రాష్ట్రాలపై మోదీ సర్కార్ వివక్షను భేటీలో ప్రస్తావిస్తా. బెంగాల్లో విభజన రాజకీయాలు తెస్తూ పొరుగురాష్ట్రాలతో వైరానికి వంతపాడుతున్న కేంద్రాన్ని కడిగేస్తా. నీతి ఆయోగ్ ప్రణాళికలు ఒక్కటీ అమలుకావడం చూడలేదు. ప్రణాళికా సంఘంలో ఒక విధానమంటూ ఉండేది. రాష్ట్రాల సూచనలకు విలువ ఇచ్చేవారు. నీతిఆయోగ్‌లో మా మాట వినే అవకాశం లేదు. పట్టించుకుంటారన్న ఆశ అస్సలు లేదు. అందుకే ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలి’’ అని మమత అన్నారు. నేడు మోదీ నేతృత్వంలో భేటీ 2047 ఏడాదికల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై చర్చించేందుకు నేడు ప్రధాని మెదీ అధ్యక్షతన 9వ నీతిఆయోగ్ పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ భేటీకి కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నారు. అయితే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఈ భేటీకి రావట్లేదని తెలుస్తోంది. పుదుచ్చేరిలో రంగస్వామికి చెందిన ఏఐఎన్ఆర్సీ పార్టీ బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజాజీవనాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్రాలు ఎలా మరింత సమన్వయంతో పనిచేయాలనే అంశాలనూ ఈ భేటీలో చర్చించనున్నారు. వికసిత భారత్‌కు దార్శనిక పత్రం రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రతువులో రాష్ట్రాల పాత్రపై విస్తృతస్థాయిలో చర్చ జరగనుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మూడో జాతీయ సదస్సులో చేసిన సిఫార్సులనూ సమావేశంలో పరిశీలించనున్నారు. -
ముగిసిన టీటీడీ పాలక మండలి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవాస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవే.. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల కోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం శానిటేషన్ ఉద్యోగులు వర్క్ కాంట్రాక్టు ఉద్యోగులు వేతనాలు పెంచాలని నిర్ణయం పోటు కార్మికులకు వేతనాలు 28 వేల నుండి 38 వేలుకు పెంపు, 10 వేలు పెంచాలని నిర్ణయం వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్‌గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయం ఫిబ్రవరిలో రెండు రోజులు పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని నిర్ణయం కళ్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని నిర్ణయం తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు ఆమోదం తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని నిర్ణయం జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల కేటాయింపు శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయం శ్రీవారి ఆలయ పెద్ద జీయార్, చిన్న జీయార్ మఠాలకు ప్రతీ ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో కోటి రూపాయలు పెంపు పెద్ద జీయర్ మఠానికి రెండు కోట్లు నుండి రెండు కోట్ల 60 లక్షలకు పెంపు చిన్న జీయర్ మఠానికి ఒక కోటి 70లక్షల నుండి 2 కోట్ల 10 లక్షలకు పెంపు. -
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే
సాక్షి, తిరుమల: కాంట్రాక్టు ఉద్యోగులను రెగులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందికి రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. టీటీడీ చైర్మన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ భూమన మీడియాకు వెల్లడించారు. ►అలిపిరి గోశాల శ్రీనివాస హోమం ఈ నెల 23 నుంచి ప్రారంభం ►టీటీడీ ఉద్యోగాలకు ఇంటి స్థల కేటాయించే ప్రాంతాలలో 27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మాణం ►15 కోట్లుతో అదనపు రోడ్డు నిర్మాణం ►టీటీడీ ఉద్యోగులు అందరికి ఇంటిస్థలాలు ఇస్తాం, మరిన్ని ఎకరాలు సేకరిస్తున్నాం ►తిరుపతి రాం నగర్ క్యాట్రస్‌లో అభివృద్ధి పనులకు 6.15 కోట్లు ►టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం, శాశ్వత ఉద్యోగులకు 14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6850 ►తిరుమల ఆరోగ్య విభాగంలో 650 ఉద్యోగులను మరో ఏడాది పొడిగింపు, 3.40 లక్షలు కేటాయింపు ►మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయింపు ►రేణిగుంట రోడ్డు నుంచి తిరుచానూరు వరకు 3.11 లక్షలతో అభివృద్ధి ►4.89 లక్షలతో పుదిపట్ల నుంచి వకులమాత ఆలయం అలయం వరకు రూ. 21 కోట్లు ►తిరుపతి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి నూతన టిబీవార్డు నిర్మాణానికి ఆమోదం ►స్వీమ్స్ వద్ద రోగులకు విశ్రాంతి భవనానికి 3.35 లక్షలతో కేటాయింపు ►స్వీమ్స్ వైద్య సదుపాయాలు పెంపునకు కార్డియోకు నూతన భవనం ►స్విమ్స్ ఆసుపత్రి భవనాన్ని ఆధునీకరణకు 197 కోట్లు కేటాయింపు ►తిరుపతి డిఎఫ్ఓ ఆధ్వర్యంలో 3.50 లక్షలతో నూతన కెమారాలు, బోన్లు కొనుగోలుకు నిర్ణయం ►కరీంనగర్లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఆమోదం ►సాంప్రదాయ కళల అభివృద్ధికి టీటీడీ ప్రాథమిక శిక్షణ.. కలంకారీ, శిల్పకళ శిక్షణ ఇవ్వనున్న టీటీడీ -
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, తిరుమల: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహా బ్రహోత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇక, లడ్డూ ప్రసాదం కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా చేయాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీఈ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ ఆధునీకరణకు రూ.14 కోట్లు, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి రూ.12కోట్లు, తిరుపతి విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగిస్తూ అవసరమైన శాశ్వత ఉద్యోగులను నియమించాలని నిర్ణయించింది. అలాగే, ఢిల్లీ ఎస్వీ కాలేజీలో ఆడిటోరియం అభివృద్ధికి రూ. 4.13 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ఆలయంలో మే 3 నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి బ్రహోత్సవాలు జరిపించనున్నారు. ఇక, తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణం విజయవంతంగా జరిగాయి. విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. -
తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, తిరుమల: టీటీడీ పాలక మండలి సమావేశం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకి త్వరగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం స్లాట్ విధానం ప్రారంభిస్తామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చదవండి: అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్లు నడకదారి భక్తులకి దివ్యదర్శనం టికెట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని, మహారాష్ట్ర ప్రభుత్వం ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పది ఎకరాల స్థలం కేటాయించారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య తాక్రే నేడు స్థలానికి సంబంధించిన పత్రాలు అందించారు. దాదాపు 500 కోట్లు విలువ చేసే స్థలం. త్వరలోనే ముంబాయి లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేపడతాం. ఆలయ నిర్మాణానికి పూర్తి ఆర్థికంగా ఇవ్వడానికి గౌతమ్ సింఘానియా ముందుకొచ్చారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు టీటీడీ పాలక మండలి నిర్ణయాలు... ►శ్రీవారి మెట్టు మార్గం మే 5 నుంచి ప్రారంభం ►శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం. పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల నిర్మాణానికి 21 కోట్లు కేటాయింపు. మరో ఏడాదిలో శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి. ►విపత్తుల సమయంలో ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురికాకుండా కమిటి సూచనలు. అనేక ప్రాంతాలలో ఘాట్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి ►రెండు విడతలుగా మరమ్మత్తులు.. 36 కోట్లు ఘాట్ రోడ్డు మరమ్మత్తులు ►తిరుమలలో బాలాజీ నగర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు ►బయో గ్యాస్ ద్వారా అన్నప్రసాద కేంద్రం, లడ్డు తయారీకి ఉపయోగించాలని నిర్ణయం ►తిరుమల లోని టీటీడీ ఉద్యోగులు ఉంటే 737 కాటేజీలు మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయం ►ధన రూపంలో ఇచ్చే విరాళాలు టీటీడీ అన్ని ప్రివిలేజ్ ఇస్తుంది. ఇకపై వస్తు రూపంలో ఇచ్చే వాటికి కూడా ప్రివిలేజ్ ఇవ్వాలని నిర్ణయం ►టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాలపై నిర్ణయం ►సీఎం తిరుపతి పర్యటన, చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన, టాటా క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించనున్న సీఎం ►శ్రీనివాససేతు ప్రారంభం ►బర్డ్ ఆసుపత్రిలో స్మైల్వట్రైన్ కేంద్రం ఏర్పాటు ►తిరుమలలో స్థానికుల సమస్యలు పరిష్కారానికి పాలకమండలి నిర్ణయం -
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 నిబంధనలను సడలించిన నేపథ్యంలో త్వరలో కోవిడ్‌కు ముందులాగా శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరించడంతో పాటు, సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచాలని బోర్డు తీర్మానించినట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ వివరాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ ఆధ్వర్యంలో రూ.230 కోట్లతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఆసుపత్రి భవన నిర్మాణాలు రెండు సంవత్సరాల్లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో సీఎం జగన్‌తో భూమిపూజ చేయించి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. శ్రీ పద్మావతి హృదయాలయంకు అవసరమైన వైద్య పరికరాల కోనుగోలుకు టీటీడీ జెఈవో ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని పాలకమండలి ఏర్పాటు చేసిందన్నారు. పద్మావతి హృదయాలయం ప్రారంభించి 100 రోజులలో 100 అపరేషన్లు నిర్వహించాం. తిరుపతిలో గరుడ వారధి నిర్మాణం కోసం ఏడాదిలో దశల వారీగా టీటీడీ వాటా నుండి రూ.150 కోట్లు చెల్లించి, వచ్చే ఏడాది డిసెంబరు నాటికి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.2.73 కోట్లతో స్విమ్స్‌కు కంప్యూటర్లు కోనుగోలు చేసి పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణకు ఆమోదం తెలిపింది. టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించడానికి రూ.25 కోట్లు నిధి ఏర్పాటు. తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయంను బాలాజి జిల్లా కలెక్టరెట్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి నిబంధనల మేరకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకొన్నారు. తిరుమల మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద భవనంలో స్టీమ్ ద్వారా అన్నప్రసాదాల తయారు చేస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ గ్యాస్, డిజిల్ ద్వారా కేజి స్టీమ్ తయారీకి 4 రూపాయల 71 పైసలు ఖర్చు చేస్తోంది. ఎన్‌ఈడీసీఏపీ వారు సోలార్ సిస్టమ్ ఆర్ఈఎస్సీవో మోడల్ స్టీమ్‌ను కేజి 2 రూపాయల 54 పైసలతో 25 సంవత్సరాల పాటు సరఫరా చేయడానికి టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా టీటీడీకి దాదాపు రూ.19 కోట్లు ఆదాయం చేకూరుతుంది. తిరుమలలో రాబోవు రోజుల్లో హోటళ్ళు, ఫాస్టు ఫుడ్ సెంటర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడళ్ళలో ఉచితంగా అన్నప్రసాదాలు అందించాలని నిర్ణయం. అత్యున్నత స్థాయి నుండి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందించాలని తీర్మానం చేసింది పాలకమండలి. ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడే వ్యాపారులకు ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్స్‌లు మంజూరు చేయాలని టీటీడీ అధికారులకు ఆదేశించారు. తిరుపతిలోని అలిపిరి వద్ద సైన్స్‌సిటి నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎకరాల భూమిలో 50 ఎకరాలు వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని ,ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేస్తారని చైర్మన్ తెలిపారు. తిరుమల నాదనీరాజన మండపం షెడ్డు స్థానంలో శాశ్వత మండపం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నమయ్య మార్గం త్వరలో భక్తులకు అందుబాటులోకి తేవడానికి ఇప్పుడు ఉన్న మార్గాన్ని అభివృద్ధి చేయాలని తీర్మానించింది పాలకమండలి. అటవీ శాఖ అనుమతులు లభించిన తరువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామని చైర్మన్ పేర్కొన్నారు. రూ.3.60 కోట్లతో టీటీడీ ఆయుర్వేద ఫార్మశీకి పరికరాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులో ఉంచాలని తీర్మానించారు. శ్రీవారి ఆలయ మహద్వారం, బంగారువాకిలి, గోపురంకు బంగారు తాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. గోపురాల బంగారు తాపడం విషయంపై ఆగమ పండితులతో చర్చించి క్రేన్ సహయంతో తాపడం పనులు పూర్తి చేయించే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశం జారీచేసారు చైర్మన్. సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచినట్లు మీడియాలో జరిగిన ప్రచారం ఆవాస్తవమని, ధర పెంచే ఆలోచన మా పాలకమండలికు లేదని స్పష్టం చేశారు. -
ఆర్టీసీ పాలక మండలి భేటీ
సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంస్థను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని ఆర్టీసీ పాలకమండలి నిర్ణయించింది. ఏటా రూ.3 వేల కోట్ల వేతన భారాన్ని ప్రభుత్వమే భరిస్తున్నందున సంస్థకు గణనీయంగా ఆర్థిక వెసులుబాటు కలిగిందని పేర్కొంది. ఆర్టీసీ నూతన పాలకమండలి సమావేశాన్ని బుధవారం విజయవాడలో నిర్వహించారు. కీలకమైన 45 అంశాలతో కూడిన అజెండాపై పాలకమండలి సుదీర్ఘంగా చర్చించింది. సమావేశంలో మాట్లాడుతున్న మల్లికార్జునరెడ్డి కొత్త బస్సుల కొనుగోలు, ఆర్టీసీ బస్ స్టేషన్లలో సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై చర్చ సాగింది. కాగా, డ్రైవర్లు, కండక్టర్లను కాంట్రాక్టు విధానంలో నియమించేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని నిర్ణయించినట్టు తెలిసింది. సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, రవాణా, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు ఎంటీ కృష్ణబాబు, ఎస్ఎస్ రావత్, శశిభూషణ్‌కుమార్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారి పరేశ్‌కుమార్, సీఐఆర్టీ డైరెక్టర్ కేవీఆర్కే ప్రసాద్, ఏఎస్ఆర్టీయూ ఈడీ ఆర్.ఆర్.కె.కిషోర్ పాల్గొన్నారు. -
రేపు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ పాలకమండలి 6వ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 20వ తేదీన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరగనుంది. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, తయారీ, మానవ వనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయి వరకు సేవల పంపిణీ, ఆరోగ్యం, పోషణపై సమావేశంలో చర్చ జరగనుంది. వివిధ రంగాలు, శాఖలు, సమాఖ్య సమస్యలపై చర్చించడానికి నీతి ఆయోగ్ పాలకమండలి ఒక వేదికగా పని చేస్తోంది. ఇందులో ప్రధానమంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలితప్రాంతంగా పాల్గొనడంతో పాటు లద్దాఖ్ తొలిసారిæఈ సమావేశంలో పాల్గొంటోంది. ఈ సమావేశంలో పాలక మండలి ఎక్స్–అఫిషియో సభ్యులు, కేంద్ర మంత్రులు, వైస్ చైర్మన్, సభ్యులు, నీతి ఆయోగ్ సీఈవో, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. -
ఆలయ అభివృద్ధికి దాతలు భాగస్వాములవ్వాలి
సాక్షి, విజయవాడ: కనక దుర్గ గుడిలో శాశ్వత కేశఖండన శాల నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అన్నారు. గురువారం మూడు గంటల పాటు కొనసాగిన పాలకమండలి సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన సిబ్బందిని ఆలయపరంగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందు రావాలని కోరారు. డోనర్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ.. పాలకమండలి సమావేశంలో 38 అంశాలపై చర్చించామని తెలిపారు. శివాలయం పునర్నిమాణం, అన్నదానం, ప్రసాదం పొటు, కేశఖండన శాల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. తూర్పు రాజగోపురం నుండి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో దాతలు భాగస్వాములు అవ్వాలని కోరారు. సిబ్బందికి కోవిడ్ ఇన్సూరెన్స్ కల్పించేలా కమిషనర్ దృష్టి కి తీసుకు వెళతామన్నారు. భక్తులు నిర్భయంగా దర్శనానికి రావచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. లాక్ డౌన్ ఎత్తేస్తే దర్శన సమయంలో మార్పులు చేస్తామని వ్యాఖ్యానించారు. -
ఎట్టకేలకు..
- 21న ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశం - రెండేళ్ల తరువాత ప్రజా సమస్యలపై చర్చ - నివేదికల తయారీలో అధికారులు బిజీ బిజీ - ఎంపీపీ, జడ్పీటీసీల హాజరుపై సందిగ్ధత భద్రాచలం: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజనుల సమస్యలపై గత రెండేళ్లుగా ప్రస్తావించే వారే లేని పరిస్థితి. ప్రజా ప్రతినిధుల వ్యవస్థ కూడా లేకపోవటంతో అధికారుల పాలనే కొనసాగింది. కార్యాలయం వరకూ వచ్చి తమ కష్టాలు చెప్పుకోలేని గిరిజనులు సమస్యలతోనే సహజీవనం చేశారు. ప్రజా సమస్యలపై ప్రతి మూడు నెలలకోమారు చర్చించేందుకని నిర్వహించే గవర్నింగ్‌బాడీ సమావేశాలు కూడా రెండేళ్లుగా లేవు. ప్రస్తుతం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా....త్వరలోనే పాలకులు కొలువుతీరుతారని భావిస్తున్న తరుణంలో... ఈనెల 21వ తేదీన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. 2012 జూన్ 13న చివరిగా గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. మధ్యలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశాలు జరిగినప్పటకీ అవి అంతంతమాత్రమేనని చెప్పాలి. రెండేళ్ల తరువాత మళ్లీ ఐటీడీఏ గవర్నింగ్ బాడీ పూర్తిస్థాయిలో సమావేశం కాబోతోంది. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేయాలని అన్ని విభాగాల అధికారులను ఐటీడీఏ పీవో దివ్య ఆదేశించారు. దీంతో ఆయా విభాగాల అధికారులు ఈ రెండేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిపై, ఆయా విభాగాల ద్వారా చేపట్టిన పనులపై సమగ్ర నివేదికను తయారు చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. ఎన్నో సమస్యలు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండగా ఇప్పటి వరకూ దీనిపై కార్యాచరణ లేదు. పెట్టుబడులకు బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఐటీడీఏ నుంచి గిరిజన రైతులకు ఇచ్చే సాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది నుంచి కృషి కేంద్రాల పేరుతో ట్రాక్టర్లు, ఇతర వ్యవయసాయ పనిమట్లు తప్ప రైతులకు కావాల్సిన విత్తనాలను మాత్రం అందించటం లేదు. వర్షాకాలం ప్రారంభమవుతుండటంతో వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. ఉపాధి పథకం కింద కోట్లాది రూపాయిల నిధులు ఉన్నప్పటకీ పనులు సకాలంలో పూర్తి కావటం లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అస్తవ్యస్తంగానే సాగుతున్నాయి. మారుమూల గ్రామాలకు కనెక్టవిటీ పేరుతో చేపట్టిన రహదారులు పూర్తి కాలేదు. వీటిపై ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు గళం విప్పే అవకాశం ఉంది. ముంపు గోడు వినేదెవరు? పోలవరం ముంపు మండలాలైన భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, బూర్గంపాడు( 12 గ్రామాలు మినహా), కుక్కునూరు, వేలేరుపాడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయింపు చేశారు. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న ఈ మండలాలను ఇప్పటి వరకూ భద్రాచలం ఐటీడీఏ అధికారులే పాలనా పరంగా పర్యవేక్షిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ మండలాలను బదలాయించటంతో వీటిపై ఎవరు అజమాయిషీ చేయాలనే దానిపై స్పష్టత లేదు. దీంతో ఈ నెల 21న నిర్వహించే ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ మండలాల సమస్యలపై ప్రస్తావించే అవకాశం ఉంటుందా లేదా అనేదానిపై అనుమానాలు ఉన్నాయి. ఫలితంగా ముంపు మండలాల్లో సమస్యలకు పరిష్కారం ఎవరు చూపుతారనేది ప్రశ్నార్థకం. వచ్చే మూడు నెలలు వరదలు, ఆపై మూడు నెలలు వ్యాధులు, ఇలా వరుస విపత్తులు ఎదుర్కొనేది కూడా ముంపు మండలాల వాసులే. గవ ర్నింగ్బాడీ సమావేశంలో ముంపు మండలాల ఆర్డినెన్స్, వీరి సమస్యలపై కూడా ప్రజా ప్రతినిధులు తీవ్రంగానే స్పందించే అవకాశం ఉంది. ఈసారి గరంగరం... ఇప్పటివరకూ సాగిన ఐటీడీఏ గవర్నింగ్‌బాడీ సమావేశాలకు, త్వరలో జరగబోయే సమావేశాలకు తీవ్రమైన వ్యత్యాసమే ఉంది. సమావేశాలకు ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు ప్రాతినిధ్యం ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన వారు, అంతకు ముందు అయితే న్యూడెమోక్రసీ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ఈ నెల 21న నిర్వహించబోయే గవర్నింగ్‌బాడీ సమావేశంలో పాల్గొనే పార్టీల బలాబలాలు విభిన్నంగా ఉన్నాయి.ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుంచి ఒక ఎంపీతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొననుండటంతో వీరి బలమే ఎక్కువగా ఉండనుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నుంచి ఒక ఎంపీ, ఎమ్మెల్యే, అదే విధంగా టీడీపీ, సీపీఎం పార్టీల నుంచి కూడా ఒక్కో ఎమ్మెల్యే పాల్గొననున్నారు. దీంతో ప్రజా సమస్యలపై సమావేశంలో తీవ్రవాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీపీ, జడ్పీటీసీ హాజరుపై సందిగ్ధత జనరల్ బాడీ సమావేశాల్లో స్థానిక సమస్యలను ప్రస్తావించేది ఆయా మండల ఎంపీపీ, జడ్పీటీసీలే. కానీ జడ్పీటీసీలు ఎన్నికైనప్పటకీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎంపీపీ ఎన్నిక జరుగనే లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నాటికి వీరి ప్రమాణ స్వీకారం లేకున్నట్లైతే గవర్నింగ్‌బాడీ సమావేశానికి వీరు హాజరుకానట్లే. ఈపరిణామాల నేపథ్యంలో రెండేళ్ల తరువాత జరుగుతున్న ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.