సాక్షి, తిరుమల: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహా బ్రహోత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకుంది.
ఇక, లడ్డూ ప్రసాదం కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా చేయాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీఈ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ ఆధునీకరణకు రూ.14 కోట్లు, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి రూ.12కోట్లు, తిరుపతి విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగిస్తూ అవసరమైన శాశ్వత ఉద్యోగులను నియమించాలని నిర్ణయించింది.
అలాగే, ఢిల్లీ ఎస్వీ కాలేజీలో ఆడిటోరియం అభివృద్ధికి రూ. 4.13 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ఆలయంలో మే 3 నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి బ్రహోత్సవాలు జరిపించనున్నారు. ఇక, తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణం విజయవంతంగా జరిగాయి. విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment