lord venkateswara swamy
-
కోనాయిపల్లిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తనకు సెంటిమెంట్ అయిన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. సుమారు 12.30 గంటల సమయంలో ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత కేసీఆర్ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వేంకటేశ్వస్వామిని దర్శించుకుని, నామినేషన్ పత్రాలను స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అర్చకులు సీఎంకు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. స్వామి వారి సన్నిధిలోనే గజ్వేల్, కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. మంత్రి హరీశ్‌రావు సైతం నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలుచేసి, వాటిపై సంతకం చేశారు. తర్వాత కేసీఆర్, హరీశ్‌రావు ఆలయం నుంచి బయటికి రాగా.. గ్రామ మహిళలు వారికి తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. సుమారు 1.15 గంటల సమయంలో వారు తిరిగి ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు. -
సింహవాహనంపై ఊరేగిన శ్రీవారు..!
-
శ్రీవారికి రోజు పూజ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే...!
-
భక్తులకు అలర్ట్.. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయంలో పడుతోంది. భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఏటీసీ కౌంటర్ వరకు క్యూలైన్ కొనసాగుతోంది. ఇక, నిన్న(శనివారం) ఒక్కరోజే తిరుమల వెంకటేశ్వర స్వామిని 82,999 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం 38,875 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. కాగా, శనివారం స్వామి వారి హుండీ ఆదాయం 4.27 కోట్లుగా ఉంది. ఇది కూడా చదవండి: శాకంబరీదేవిగా కనకదుర్గమ్మ -
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, తిరుమల: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహా బ్రహోత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇక, లడ్డూ ప్రసాదం కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా చేయాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీఈ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ ఆధునీకరణకు రూ.14 కోట్లు, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి రూ.12కోట్లు, తిరుపతి విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగిస్తూ అవసరమైన శాశ్వత ఉద్యోగులను నియమించాలని నిర్ణయించింది. అలాగే, ఢిల్లీ ఎస్వీ కాలేజీలో ఆడిటోరియం అభివృద్ధికి రూ. 4.13 కోట్లు కేటాయించారు. ఢిల్లీ ఆలయంలో మే 3 నుంచి 16వ తేదీ వరకు శ్రీవారి బ్రహోత్సవాలు జరిపించనున్నారు. ఇక, తిరుపతిలో శ్రీనివాస సేతు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు, కళ్యాణం విజయవంతంగా జరిగాయి. విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. -
పండుగ సందర్భంగా తిరుమలలో ‘దీపావళి ఆస్థానం’
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 24వ తేదీన ‘దీపావళి ఆస్థానం’ టీటీడీ నిర్వహించనుంది. శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలోని సర్వభూపాల వాహనంలో ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా 24న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. శ్రీవారి సేవకు లండన్ భక్తులు లండన్‌లో స్థిరపడిన నీతు అనే భక్తురాలు కేరళలోని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీవారి సేవకు వచ్చారు. నీతు లండన్‌లోని ఒక ప్రముఖ సంస్థలో అధికారిణిగా పనిచేస్తున్నారు. 11 మంది సభ్యుల బృందం నాలుగు రోజులపాటు సేవలు అందించారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు 28 నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 62,203 మంది స్వామి వారిని దర్శించుకోగా, 29,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో రూ. 3.91కోట్లు వేశారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. -
తిరుపతి వెంకన్నకు.. గద్వాల ఏరువాడ జోడు పంచెలు
సాక్షి, గద్వాల: గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు నియమ నిష్ఠలతో నేత కార్మికులు తయారు చేసిన గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేయడం సంప్రదాయంగా కొనసాగుతుంది. నాటి నుంచి వస్తున్న సంప్రదాయం మేరకు గద్వాలలో చేపట్టిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెల నేత ఇటీవల పూర్తయింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీవారి అలంకరణకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాధీశురాలు శ్రీలతాభూపాల్ లేఖను తీసుకొని పంచెల తయారీ నిర్వాహకుడు మహంకాళి కర్ణాకర్ తిరుపతికి బయలుదేరారు. అక్కడ ఏరువాడ జోడు పంచెలను టీటీడీ అధికారులకు అందజేశారు. ఐదుగురు చేనేత కార్మికులు 41 రోజులుగా నిష్ఠతో శ్రీవారి ఏరువాడ జోడు పంచెలను తయారు చేశారు. మూలవిరాట్‌కు ధరింపజేసే ఏరువాడ జోడు పంచెలు వారసత్వంగా సమర్పణ.. శతాబ్దాలుగా గద్వాల సంస్థానాధీశులు తమ వంశపెద్దల సంప్రదాయ ఆచారంగా శ్రీవేంకటేశ్వరునికి ప్రతిఏటా బ్రహ్మోత్సవాలకు గద్వాల ఏరువాడ జోడు పంచెలను అందజేస్తారు. తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవేంకటేశ్వరునికి ఉత్సవాల మొదటిరోజు, విజయ దశమి రోజున ఈ ఏరువాడ పంచెలను మూలవిరాట్‌కు ధరింపజేస్తారు. గద్వాల సంస్థానాధీశులలో ఒకరైన రాజు సీతారాంభూపాల్ తన వంశస్థుల ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరునికి పంచెలను సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి శ్రీవారికి అందుతున్న ఏకైక కానుక ఏరువాడ జోడు పంచెలు కావడం విశేషం. ఎనిమిది కోటకొమ్ములు.. ఏరువాడ పంచెలు 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పుతో అంచు ఉంటుంది. శ్రీవారికి సమర్పించే ఈ పంచెలపై ఎనిమిది కోటకొమ్ములు ఉంటాయి. ఒక్కొక్క పంచె తయారు కావడానికి దాదాపు 20 రోజుల సమయం పడుతుంది. జోడు పంచెలను లింగంబాగ్ కాలనీలో ప్రత్యేకంగా నిర్మించిన మగ్గంపై ఐదుగురు నేత కార్మికులు ప్రత్యేక భక్తిశ్రద్ధలను పాటిస్తూ ఈ పంచెలను సిద్ధం చేశారు. ఏరువాడ పంచెల తయారీలో కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల శణ్ముఖరావు, కరుణాకర్, రమేష్ పాల్గొన్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం.. తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సందర్భంగా గద్వాల సంస్థానాధీశులు అందించే ఏరువాడ జోడు పంచెలను మూలవిరాట్‌కు ధరింపజేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గత 12 ఏళ్లుగా ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు గర్వపడుతున్నాం. ఈ సేవలో గద్వాల నేత కార్మికులు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ జోడు పంచెలను రెండు రోజుల క్రితం టీటీడీ అధికారులకు అందజేశాం. – మహంకాళి కర్ణాకర్, జోడు పంచెల తయారీదారు -
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
-
భక్తులకు గమనిక: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే..
Tirumala Srivari Brahmotsavam.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత జరగబోయే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరువీది ఊరేగింపుగా నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా.. - సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. - సెప్టెంబరు 27వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. - అక్టోబర్ 1న గరుడ సేవ - సర్వదర్శనం ప్రతీరోజులాగే కొనసాగుతుంది. స్లాట్ విధానంపై త్వరలోనే నిర్ణయం. ఇక, తిరుమలలోని పార్వేట మండపం ఆధునీకరణ కోసం రూ. 2.20 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. అలాగే, అమరావతిలో శ్రీవారి ఆలయం చుట్టూ ఉద్యానవన అభివృద్ధికి రూ. 2.20 కోట్లు కేటాయింపు. టీటీడీ డైరీలు, క్యాలెండర్ల ముద్రణకు ఆమోదం. బేడీ ఆంజనేయ స్వామి కవచాలకు బంగారు తాపడం. ఆనంద నిలయం బంగారు తాపడం పనులను ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు తెలిపారు. దీని కోసం ఆగమశాస్ర్తం పండితులతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే తిరుప్పావడ సేవను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. -
తిరుమల శ్రీవారికి భారీగా విరాళాలు..
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిధిలోని వివిధ ట్రస్తులకు శుక్రవారం రూ.4.5 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో ఓ అజ్ఞాత భక్తుడు టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.4 కోట్లను విరాళంగా అందించాడు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆ దాత డీడీని అందజేశాడు. అయితే మరి కొందరు దాతలు 2.1 కోట్లను విరాళంగా ఇవ్వగా వీటిలో అన్నప్రసాదానికి రూ.కోటి, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10లక్షలు, శ్రీనివాస శంకరనేత్రాలయ ట్రస్టుకు రూ.10 లక్షలు, బర్డ్ ఆసుపత్రి ట్రస్టుకు రూ.40లక్షలు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.20లక్షలు, ప్రాణ దాన ట్రస్టుకు రూ.30లక్షల విరాళాలను భక్తులు టీటీడీ అధికారులను కలసి అందజేశారు. -
చంద్రప్రభ వాహనంపై శ్రీవారు
-
గజవాహనంపై శ్రీనివాసుడు
-
శ్రీవారి వజ్రాలు ఎలా మాయం అయ్యాయి?
-
‘టీటీడీ కబ్జా’ కథలో నిజాలకు పాతర
తిరుమల క్షేత్రాన్ని కేంద్ర ప్రభుత్వం కబ్జా చేయబో తున్నదని, అందుకోసమే పురావస్తు శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారికి తాఖీదు పంపించిందని శనివారం మధ్యాహ్నం నుంచి తెలుగు చానెళ్లు హోరెత్తాయి. ప్రత్యేక హోదా విష యంలో రాష్ట్ర ప్రభుత్వం విలువలతో కూడిన నిర్ణయం తీసుకోవటాన్ని జీర్ణించుకోలేని మోదీ ప్రభుత్వం కక్ష కట్టి ఇలాంటి ప్రయత్నానికి పూనుకు న్నదని కథనాలు నడిపారు. ఈ చర్యతో ఆలయ నిర్వ హణ, టీటీడీ ఆదాయం కేంద్రానికి వెళ్ళిపోతాయని, దీనిని ఆంధ్ర ప్రజలు అడ్డుకోవాలని విషయ పరిజ్ఞా నంలేని మేధావులు టీవీ చర్చల్లో పాల్గొని నొక్కి వక్కాణించారు. పనిలోపనిగా కొన్ని ప్రభుత్వ అను కూల చానెళ్లు ఈ మొత్తం సమస్యకు ప్రధాన కారణం కృష్ణారావు 2011లో రాసిన లేఖ అని పేర్కొన్నాయి. 2011లో నేను రాసిన లేఖ వివరాల్లోకి వెళ్లే ముందు పురావస్తుశాఖ పరిధిలోకి ఆలయాలు వెళితే ఎట్లా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదే శ్లో ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామం, సామర్లకోటల్లోని దేవాలయాలు, శ్రీనివాస మంగాపురం కల్యాణ వెంక టేశ్వర స్వామి దేవాలయం, గుడిమల్లం శివాలయం పురావస్తుశాఖ పరిరక్షణలో ఉన్నాయి. అంటే కేవలం కట్టడం మాత్రమే ఆ శాఖ పరిధిలో ఉంటుంది. ఆలయ నిర్వహణ పూజాది కార్యక్రమాలు యధా విధిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ లేదా టీటీడీ చూస్తాయి. కనుక పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్తే టీటీడీ నిర్వహణ కేంద్రం పరిధిలోకి పోతుంది అను కోవటం అపోహ. సాయంత్రానికల్లా పురావస్తుశాఖ తన లేఖను వెనక్కు తీసుకుంది. ఈ టీకప్పులో తుఫాను సమసిపోయింది. ఇక 2011 లో నేను రాసిన లేఖ పూర్వాపరాలను పరిశీలిద్దాం. 2009లో నేను టీటీడీ కార్యనిర్వహణాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయానికి ఆదికేశవులు నాయుడు టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా కొనసాగుతు న్నారు. అప్పటికే ఆయన ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం కింద శ్రీవారి ఆలయ ప్రాకారాలకు బంగారు తాపడం చేయడానికి పూనుకుంటున్నారు. పాలక మండలి ఇందుకు అవసరమైన తీర్మానం చేయటం, బంగారం సేకరణ కొంతవరకు అప్పటికే జరిగిపో యింది కూడా. నేను బాధ్యతలు చేపట్టాక ఈ అంశంపై ఆలోచించాను. తిరుమలలోని కట్టడాలు మన చారిత్రక వారసత్వ సంపదగా భావించాను. ఆ కట్టడాలను ఉన్నవి ఉన్నట్టుగా భావితరాలకు అందిం చాలని, వాటిలో మార్పు చేసే అధికారం ఎవరికీ లేదని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిద్దాం అని భావించాను. ఇదే సమయంలో ఈ అంశం మీద సుబ్రమణ్య స్వామి రాష్ట్ర హైకోర్టులో ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దాంతో ఆదికేశ వులు ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుబ్రమణ్యస్వామి అక్కడ కూడా గట్టిగా వాదిం చారు. ఫలితంగా హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు ఖరా రుచేసింది. ఆ విధంగా తిరుమల ఆలయం చారిత్రక సౌందర్యాన్ని కాపాడటం సాధ్యపడింది. ఈలోగా ఆదికేశవులు పదవీ కాలం పూర్తి కావడంతో రాష్ట్రప్రభుత్వం బోర్డు స్థానంలో అధికారులతో సాధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అనంత స్వర్ణ మయం ప్రాజెక్టుపై చర్చించింది. భవిష్య త్తులో ఎవరూ ఇలా తెలివితక్కువగా ఆలో చించకుండా ఉండేందుకు వీలుగా ఆలయ కట్టడాల పరిరక్షణ బాధ్యత పురావస్తు శాఖకు అప్పగిస్తే బాగుంటుందన్న నిర్ణయం జరి గింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి సాధికార కమిటీ లేఖ రాసింది. ఈ అంశాన్ని ఆది కేశవులు పత్రికలకు లీక్ చేశారు. దానిపై అసందర్భ చర్చతో ప్రభుత్వం ఈ అంశాన్ని బుట్టదాఖలు చేసింది. అయితే ఉత్తరప్రత్యుత్తరాలు రాష్ట్ర ప్రభు త్వం, టీటీడీల మధ్య జరిగాయి. కనుక పురా వస్తు శాఖ తాజా చర్యకూ, 2011నాటి లేఖకూ ముడి పెట్టడం తప్పు. అయితే పురాతన కట్టడాలను పరి రక్షణపై సరైన విధివిధానాలు ఏర్పాటు చేసుకోకపోతే భవిష్యత్తులో ఈ కట్టడాలకు ముప్పు తప్పదు. 1904 నాటి పురాతన కట్టడాల చట్టాన్ని సవరించి కట్టడా లను పురావస్తు శాఖ అధీనంలోకి తీసుకు రాకుం డానే, ఆ కట్టడాల్లో మార్పులు చేయాలంటే పురావస్తు శాఖను సంప్రదించాలన్న నిబంధన పెడితే సరి. లేనట్టయితే చారిత్రక కట్టడాలను వారసత్వ సంప దను నాయకులు ధ్వంసం చేసే అవకాశం ఉంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
శ్రీవారి సేవలో పన్నీరు సెల్వం
తిరుపతి : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పన్నీరు సెల్వం శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలలోపు సమయం పడుతోంది. -
కల్పవృక్ష వాహనంపై శ్రీవారు
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) స్వామివారిని 91,200 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల లోపు సమయం పడుతోంది. -
ఘనంగా వెంకన్న పూజలు
మునిపల్లి : మారుతి జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు సన్నిధానం లక్ష్మి కాంత్ శర్మ ఆధ్వర్యంలో జీకేఅర్ గ్రూప్స్, వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్లు శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం ఘనంగా పూజలు నిర్వహించారు. మండలంలోని బుదేరా శివారు గుట్టపై గల పూరాతన వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించారు. హోమం, గోపూజ, శాంతి పూజ, బ్రహ్మ పూజ నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 28 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు. రూ.50 గదులు - ఖాళీ లేవు. రూ.100 గదులు - ఖాళీ లేవు. రూ.500 గదులు - ఖాళీ లేవు. ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బహ్మోత్సవం - ఖాళీ లేవు. సహస్ర దీపాలంకరణ సేవ - 100 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం - ఖాళీ లేవు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనం, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల లోపు సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి. రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి. రూ.100 గదులు - ఖాళీ లేవు. రూ.500 గదులు - ఖాళీ లేవు. ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బహ్మోత్సవం - 70 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవ - 100 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం - ఖాళీ లేవు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో గురువారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి నాలుగు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల లోపు సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి. రూ.50 గదులు - 50 ఖాళీగా ఉన్నాయి. రూ.100 గదులు - 400 ఖాళీగా ఉన్నాయి. రూ.500 గదులు - ఖాళీ లేవు. ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బహ్మోత్సవం - 100 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవ - 200 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సం - 120 ఖాళీగా ఉన్నాయి. గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట లోపు సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి. రూ.50 గదులు - 10 ఖాళీగా ఉన్నాయి. రూ.100 గదులు - ఖాళీ లేవు. రూ.500 గదులు - ఖాళీ లేవు. ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బహ్మోత్సవం - 70 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవ - 100 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సం - ఖాళీ లేవు. బుధవారం ప్రత్యేక సేవ సహస్రకలశాభిషేకం. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారిని దర్శించుకోవడానికి శనివారం ఉదయం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ - ఖాళీ లేవు వసంతోత్సవం - ఖాళీ లేవు -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో శనివారం ఉదయం భక్తుల రద్దీ అధికంగా ఉంది. సర్వదర్శనానికి 12 గంటలు, కాలి నడకన వచ్చిన వారికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే రెండో వైకుంఠం కాంప్లెక్స్‌లో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లూ భక్తులతో నిండిపోయాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ - ఖాళీ లేవు వసంతోత్సవం - ఖాళీ లేవు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తింది. వరుసగా విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదల కావడంతో మొక్కులు తీర్చుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తిరుమల వస్తున్నారు. స్వామివారి సర్వదర్శనం కోసం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, నడకదారిన వచ్చిన భక్తులకు 9 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీగా లేవు రూ.50 గదులు - ఖాళీగా లేవు రూ.100 గదులు - ఖాళీగా లేవు రూ.500 గదులు - ఖాళీగా లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీగా లేదు సహస్ర దీపాలంకరణ సేవ - ఖాళీగా లేదు వసంతోత్సవం - ఖాళీగా లేదు బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం -
తిరుమలలో భారీ వర్షం
తిరుమల: తిరుమలలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటసేపు ఆగకుండా కురిసిన వానలో మాడ వీధులన్నీ జలమయమయ్యాయి. భక్తులు వర్షంలో తడిసిముద్దయ్యారు. తీవ్ర ఎండలతో అల్లాడుతున్న భక్తులు వర్షంతో సేదతీరారు. -
వైభవంగా ముగిసిన వార్షిక వసంతోత్సవం
తిరుమల: తిరుమలలో మూడు రోజులపాటు జరిగిన శ్రీవారి వార్షిక వసంతోత్సవం కన్నులపండువగా ముగిసింది. గురువారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఉత్సవ విగ్రహాలను తిరు వీధులలో ఊరేగించారు. అలాగే సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్రస్వామి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవ విగ్రహాలను కూడా ఊరేగించారు. ఈ సందర్భంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే నడకదారి దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
'రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం'
తిరుమల పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం తిరుమలలో విలేకర్లతో మాట్లాడారు. శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సమకరిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అంతకుమందు తిరుమల శ్రీవారిని వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు స్వామీ వారి తీర్థప్రసాదాలను ఆలయంలోని పూజారులు, అధికారులు అందజేశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పాలన పగ్గాలు చేపట్టి.... కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటి సారిగా వెంకయ్యనాయుడు తిరుమలలో శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
వేడుకగా తిరుమంజనం
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా సాగింది. ఉదయం 6 గంటలకు భక్తుల దర్శనాన్ని నిలిపివేసి ఆలయ శుద్ధి ప్రారంభించారు. సుగంధద్రవ్యాలు కలిపిన పవిత్ర మిశ్రమ తిరుమంజనాన్ని ఆలయ ప్రాకారాలకు లేపనంగా పూశారు. ఆనందం నిలయంలోని విమాన వేంకటేశ్వరస్వామిని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ శుద్ధి చేశారు. గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు శ్రీవారికి కొత్త పరదాలు, శ్వేతవర్ణ పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత 11 గంటల నుంచిభక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. - సాక్షి, తిరుమల -
సిబ్బందిని దృష్టిలో ఉంచుకొనే పోలింగ్ తేదీలు:సీఈసీ
దేశవ్యాప్తంగా 9.30 లక్షల పోలింగ్ కేంద్రాల్లో రేపు ఓటరు కార్డు నమోదు ప్రక్రియ చేపడుతునున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్.సంపత్ వెల్లడించారు. తిరుమలలో శ్రీవారిని శనివారం దర్శించుకున్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ప్రజల సౌకర్యంతోపాటు భద్రత సిబ్బందిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ తేదీలు ఖరారు చేసినట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకున్న సంపత్‌కు ఆలయంలో టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు శనివారం ఉదయం సంపత్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్వాగతం పలికారు. -
స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసుడు
తిరుమల : కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడు శనివారం స్వర్ణరథంపై ఊరేగారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవేకంటేశ్వరస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్థరథంపై ఊరేగారు. తిరువీధుల్లో భక్తులకు కటాక్షిస్తూ స్వామివారు విహరించారు. వేలాది మంది భక్తులు స్వామివారి రథాన్ని లాగుతూ శ్రీవారి సేవలో తరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం శనివారం రావడంతో భక్తులు విశేషంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. కర్పూర హారతులతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా టీటీడీ ఈ ఉత్సవాన్ని ముక్కోటి ఏకాదశి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రథోత్సవంలో టీటీడీ అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు , ఈవో ఎంజీ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
కల్పవృక్ష వాహనంపై దేవదేవుడు
-
కల్పవృక్ష వాహనంపై దేవదేవుడు
తిరుమల : తిరుమల బ్రహ్మోత్సవాల్లో నాల్గవ రోజు శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగాడు. పాల కడలి నుంచి వచ్చిన కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తే... తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు వెంకటాద్రివాసుడు. శాశ్వతమైన కైవల్యం ప్రసాదించే కల్పతరువైన స్వామివారు ఉదయం వేళ్లల్లో స్వర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగారు. భక్తుల కోర్కెలు తీరుస్తూ మలయప్పస్వామి తిరుగాడారు. దేవదేవుణ్ని కల్పవృక్ష వాహనంపై వీక్షించిన అశేష భక్తజనం భక్తిసాగరంలో మునిగిపోయారు. రాత్రికి స్వామివారు సర్వభూపాల వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు. మరోవైపు వెంకన్న దర్శనానికి భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి ఆరు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. -
సింహవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
తిరుమల : బ్రహ్మోత్సవాలలో మూడవరోజు సోమవారం ఉదయం సింహవాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతుస్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు ఈ అవతారంలో లోకానికి చాటుతారు. అలాగే నేటి రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు. .ముక్తిసాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమాడ వీధుల్లో భక్తులు కిటకిటలాడారు. -
తిరుమలకు నిలిచిన వాహనాలు
తిరుపతి: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ పిలుపు మేరకు తిరుమతిలో మంగళవారం బంద్ కొనసాగుతోంది. రహదారుల దిగ్బంధంలో భాగంగా తిరుమల రోడ్డును కూడా అడ్డుకున్నారు. తిరుమలకు ఆర్టీసీ, ప్రయివేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా ద్విచక్ర వాహనాలను కూడా అనుమతించే అవకాశం లేదని నిర్వాహకులు తెలిపారు. తిరుమలకు 38 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఆగస్టు 13వ తేదీన వాహనాల రాకపోకల బంద్ నిర్వహించారు. మరోసారి గత నెల 23, 24 తేదీల్లో తిరుమలకు వాహనాలను నిలిపివేయాలని ప్రయత్నించినా, టీటీడీ అధికారుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. బంద్ ప్రభావంతో తిరుమలలో తిరుగు ప్రయాణానికి వేలాదిమంది భక్తులు వేసి ఉన్నారు.