తిరుమల
తిరుమల క్షేత్రాన్ని కేంద్ర ప్రభుత్వం కబ్జా చేయబో తున్నదని, అందుకోసమే పురావస్తు శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారికి తాఖీదు పంపించిందని శనివారం మధ్యాహ్నం నుంచి తెలుగు చానెళ్లు హోరెత్తాయి. ప్రత్యేక హోదా విష యంలో రాష్ట్ర ప్రభుత్వం విలువలతో కూడిన నిర్ణయం తీసుకోవటాన్ని జీర్ణించుకోలేని మోదీ ప్రభుత్వం కక్ష కట్టి ఇలాంటి ప్రయత్నానికి పూనుకు న్నదని కథనాలు నడిపారు. ఈ చర్యతో ఆలయ నిర్వ హణ, టీటీడీ ఆదాయం కేంద్రానికి వెళ్ళిపోతాయని, దీనిని ఆంధ్ర ప్రజలు అడ్డుకోవాలని విషయ పరిజ్ఞా నంలేని మేధావులు టీవీ చర్చల్లో పాల్గొని నొక్కి వక్కాణించారు. పనిలోపనిగా కొన్ని ప్రభుత్వ అను కూల చానెళ్లు ఈ మొత్తం సమస్యకు ప్రధాన కారణం కృష్ణారావు 2011లో రాసిన లేఖ అని పేర్కొన్నాయి.
2011లో నేను రాసిన లేఖ వివరాల్లోకి వెళ్లే ముందు పురావస్తుశాఖ పరిధిలోకి ఆలయాలు వెళితే ఎట్లా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదే శ్‌లో ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామం, సామర్లకోటల్లోని దేవాలయాలు, శ్రీనివాస మంగాపురం కల్యాణ వెంక టేశ్వర స్వామి దేవాలయం, గుడిమల్లం శివాలయం పురావస్తుశాఖ పరిరక్షణలో ఉన్నాయి. అంటే కేవలం కట్టడం మాత్రమే ఆ శాఖ పరిధిలో ఉంటుంది. ఆలయ నిర్వహణ పూజాది కార్యక్రమాలు యధా విధిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ లేదా టీటీడీ చూస్తాయి. కనుక పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్తే టీటీడీ నిర్వహణ కేంద్రం పరిధిలోకి పోతుంది అను కోవటం అపోహ. సాయంత్రానికల్లా పురావస్తుశాఖ తన లేఖను వెనక్కు తీసుకుంది. ఈ టీకప్పులో తుఫాను సమసిపోయింది.
ఇక 2011 లో నేను రాసిన లేఖ పూర్వాపరాలను పరిశీలిద్దాం. 2009లో నేను టీటీడీ కార్యనిర్వహణాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టే సమయానికి ఆదికేశవులు నాయుడు టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా కొనసాగుతు న్నారు. అప్పటికే ఆయన ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం కింద శ్రీవారి ఆలయ ప్రాకారాలకు బంగారు తాపడం చేయడానికి పూనుకుంటున్నారు. పాలక మండలి ఇందుకు అవసరమైన తీర్మానం చేయటం, బంగారం సేకరణ కొంతవరకు అప్పటికే జరిగిపో యింది కూడా. నేను బాధ్యతలు చేపట్టాక ఈ అంశంపై ఆలోచించాను. తిరుమలలోని కట్టడాలు మన చారిత్రక వారసత్వ సంపదగా భావించాను. ఆ కట్టడాలను ఉన్నవి ఉన్నట్టుగా భావితరాలకు అందిం చాలని, వాటిలో మార్పు చేసే అధికారం ఎవరికీ లేదని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిద్దాం అని భావించాను.
ఇదే సమయంలో ఈ అంశం మీద సుబ్రమణ్య స్వామి రాష్ట్ర హైకోర్టులో ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దాంతో ఆదికేశ వులు ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుబ్రమణ్యస్వామి అక్కడ కూడా గట్టిగా వాదిం చారు. ఫలితంగా హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు ఖరా రుచేసింది. ఆ విధంగా తిరుమల ఆలయం చారిత్రక సౌందర్యాన్ని కాపాడటం సాధ్యపడింది. ఈలోగా ఆదికేశవులు పదవీ కాలం పూర్తి కావడంతో రాష్ట్రప్రభుత్వం బోర్డు స్థానంలో అధికారులతో సాధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అనంత స్వర్ణ మయం ప్రాజెక్టుపై చర్చించింది. భవిష్య త్తులో ఎవరూ ఇలా తెలివితక్కువగా ఆలో చించకుండా ఉండేందుకు వీలుగా ఆలయ కట్టడాల పరిరక్షణ బాధ్యత పురావస్తు శాఖకు అప్పగిస్తే బాగుంటుందన్న నిర్ణయం జరి గింది.
దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి సాధికార కమిటీ లేఖ రాసింది. ఈ అంశాన్ని ఆది కేశవులు పత్రికలకు లీక్ చేశారు. దానిపై అసందర్భ చర్చతో ప్రభుత్వం ఈ అంశాన్ని బుట్టదాఖలు చేసింది. అయితే ఉత్తరప్రత్యుత్తరాలు రాష్ట్ర ప్రభు త్వం, టీటీడీల మధ్య జరిగాయి. కనుక పురా వస్తు శాఖ తాజా చర్యకూ, 2011నాటి లేఖకూ ముడి పెట్టడం తప్పు. అయితే పురాతన కట్టడాలను పరి రక్షణపై సరైన విధివిధానాలు ఏర్పాటు చేసుకోకపోతే భవిష్యత్తులో ఈ కట్టడాలకు ముప్పు తప్పదు. 1904 నాటి పురాతన కట్టడాల చట్టాన్ని సవరించి కట్టడా లను పురావస్తు శాఖ అధీనంలోకి తీసుకు రాకుం డానే, ఆ కట్టడాల్లో మార్పులు చేయాలంటే పురావస్తు శాఖను సంప్రదించాలన్న నిబంధన పెడితే సరి. లేనట్టయితే చారిత్రక కట్టడాలను వారసత్వ సంప దను నాయకులు ధ్వంసం చేసే అవకాశం ఉంది.
ఐవైఆర్ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment