
Tirumala Srivari Brahmotsavam.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత జరగబోయే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరువీది ఊరేగింపుగా నిర్వహించాలని నిర్ణయించింది.
అందులో భాగంగా..
- సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.
- సెప్టెంబరు 27వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
- అక్టోబర్ 1న గరుడ సేవ
- సర్వదర్శనం ప్రతీరోజులాగే కొనసాగుతుంది. స్లాట్ విధానంపై త్వరలోనే నిర్ణయం.
ఇక, తిరుమలలోని పార్వేట మండపం ఆధునీకరణ కోసం రూ. 2.20 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. అలాగే, అమరావతిలో శ్రీవారి ఆలయం చుట్టూ ఉద్యానవన అభివృద్ధికి రూ. 2.20 కోట్లు కేటాయింపు. టీటీడీ డైరీలు, క్యాలెండర్ల ముద్రణకు ఆమోదం. బేడీ ఆంజనేయ స్వామి కవచాలకు బంగారు తాపడం. ఆనంద నిలయం బంగారు తాపడం పనులను ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు తెలిపారు. దీని కోసం ఆగమశాస్ర్తం పండితులతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే తిరుప్పావడ సేవను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.