సాక్షి, తిరుమల: తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుమలలో ఏడో రోజు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా సూర్యప్రభ వాహనంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు పాల్గొన్నారు. ఇక, స్వామి వారికి భక్తులు కర్పూర నీరాజనాలు పడుతున్నారు.
కాగా, ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇక, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం ఉండనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ ఉండనుంది.
మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,884గా ఉంది. నిన్న హుండీ ఆదాయం 2.70 కోట్లుగా ఉంది. ఇక, 32,213 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు - గజ వాహనం
— SVBCTTD (@svbcttd) September 23, 2023
#gajavahanam #tirumala #tirumalatirupatidevasthanam #TTD #Brahmotsavam #brahmotsavalu #Tirupati #tirupatibalajitemple #venkateswaraswamy #venkateswara #govinda #spiritual #spirituality #devotional #devotion #hinduism #hindhudharmam pic.twitter.com/hqnjwqENi1
Comments
Please login to add a commentAdd a comment