వైభవంగా ముగిసిన వార్షిక వసంతోత్సవం | tirumala annual Spring Carnival completed | Sakshi
Sakshi News home page

వైభవంగా ముగిసిన వార్షిక వసంతోత్సవం

Published Thu, Apr 21 2016 8:38 PM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

వైభవంగా ముగిసిన వార్షిక వసంతోత్సవం - Sakshi

వైభవంగా ముగిసిన వార్షిక వసంతోత్సవం

తిరుమల: తిరుమలలో మూడు రోజులపాటు జరిగిన శ్రీవారి వార్షిక వసంతోత్సవం కన్నులపండువగా ముగిసింది. గురువారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఉత్సవ విగ్రహాలను తిరు వీధులలో ఊరేగించారు.

అలాగే సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్రస్వామి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవ విగ్రహాలను కూడా ఊరేగించారు. ఈ సందర్భంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement