కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఓ అజ్ఞాత భక్తుడు వజ్రాలు పొదిగిన బంగారు భుజకీర్తులను కానుకగా సమర్పించాడు.
మూలమూర్తి అలంకరణ కోసం సమర్పించిన నూతన ఆభరణాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. కాగా, విశేష దినాల్లో వజ్రాలు పొదిగిన బంగారు భుజకీర్తులను మూలమూర్తికి అలంకరిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తెలిపారు.