ప్రసాదాల్లో నాణ్యతా లోపం
► ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు
► పట్టించుకోని ఆలయ అధికారులు
నాగలాపురం : టీటీడీ ఆధ్వర్యంలోని వేదనారాయుణస్వామి ఆలయు వార్షిక బ్రహ్మోత్సవాల్లో తయారు చేస్తున్న ప్రసాదాల్లో నాణ్యత లోపించడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నం పిడస కట్టుకుపోవడం, ఉప్పు లేకపోవడం, కారం ఎక్కువగా ఉండడంతో భక్తులు వాటిని తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. కొందరు తినేందుకు వీలుకాక చెత్తబుట్టలో పడేస్తున్నారు. గతంలో బ్రహ్మోత్సవాల సందర్భంలో తిరుమల నుంచి పది వుంది టీటీడీ పోటు సిబ్బంది డెప్యుటేషన్‌పై ఇక్కడికి వచ్చేవారు. ఈ ఏడు పోటు సిబ్బంది ఎవరూ రాలేదు. రెగ్యులర్ సిబ్బంది ఇద్దరితోనే ప్రసాదాలు తయూరీ చేయిస్తున్నారు. గతంలో చక్కెర పొంగళి, వెన్నపొంగళి, దద్దోజనం, పులిహోరా, క్షీరాన్నం, మిళగోహర, కదంబసాదం, దోసె ప్రసాదాలను 100 కేజీల వరకు తయూరు చేసి భక్తులకు అందజేసేవారు. ఈ ఏడాది నిత్య దిట్టాన్నే అనగా 16 కేజీల ప్రసాదాన్ని వూత్రమే తయూరు చేసి భక్తులకు అందజేస్తున్నారు.
బ్రహ్మోత్సవాల ప్రత్యేక ప్రసాదాల సంగతి అలా ఉంచితే ప్రస్తుతం తయూరు చేస్తున్న ప్రసాదాలను తిరస్కరించడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని భక్తులు వాపోతున్నారు. ఈ విషయుంపై ఆలయూధికారి లోకనాథరెడ్డిని వివరణ కోరగా ప్రసాదాల నాణ్యత, తయూరీలో లోపాలు ఉన్నది వాస్తవమేనన్నారు. ఇకపై జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. పోటు సిబ్బందిని బయుటివారిని తీసుకువచ్చి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక దిట్టాలను తయూరు చేసేందుకు ప్రయుత్నిస్తానని తెలిపారు.