సింహవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు
తిరుమల : బ్రహ్మోత్సవాలలో మూడవరోజు సోమవారం ఉదయం సింహవాహనమెక్కి వేంకటనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతుస్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు ఈ అవతారంలో లోకానికి చాటుతారు.
అలాగే నేటి రాత్రి శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు. .ముక్తిసాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమాడ వీధుల్లో భక్తులు కిటకిటలాడారు.