
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయంలో పడుతోంది. భక్తులు అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండిపోయి ఏటీసీ కౌంటర్ వరకు క్యూలైన్ కొనసాగుతోంది.
ఇక, నిన్న(శనివారం) ఒక్కరోజే తిరుమల వెంకటేశ్వర స్వామిని 82,999 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం 38,875 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. కాగా, శనివారం స్వామి వారి హుండీ ఆదాయం 4.27 కోట్లుగా ఉంది.
ఇది కూడా చదవండి: శాకంబరీదేవిగా కనకదుర్గమ్మ