darsanam
-
దర్శనాల కోసం దళారులను సంప్రదించొద్దు
తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం దళారులను సంప్రదించవద్దని టీటీడీ ఒక ప్రకటనలో భక్తులకు విజ్ఞప్తి చేసింది. తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొంద వచ్చునని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది ఫోన్ నంబర్లతో కూడిన సమాచారంతో ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు టీటీడీ కొన్ని టికెట్లను కేటాయించింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం విభాగాల ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉందని టీటీడీ తెలియజేసింది. టూరిజం విభాగాల ద్వారా రావాలనుకునే భక్తులు నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్లు పొందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కొందరు దళారులు టూరిజం వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసి ఇస్తామని చెప్పి భక్తుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసింది. అలాగే శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది. -
భక్తులకు అలర్ట్.. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయంలో పడుతోంది. భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయి ఏటీసీ కౌంటర్ వరకు క్యూలైన్ కొనసాగుతోంది. ఇక, నిన్న(శనివారం) ఒక్కరోజే తిరుమల వెంకటేశ్వర స్వామిని 82,999 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం 38,875 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. కాగా, శనివారం స్వామి వారి హుండీ ఆదాయం 4.27 కోట్లుగా ఉంది. ఇది కూడా చదవండి: శాకంబరీదేవిగా కనకదుర్గమ్మ -
Srisailam Temple: శ్రీశైలంలో సామాన్య భక్తులకు పెద్దపీట
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ రోజుల్లో సగటున 20 వేల నుంచి 25 వేల మంది, ప్రభుత్వ సెలవు రోజుల్లో 40 వేల నుంచి 50వేల మంది భక్తులు క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. శ్రావణమాసం, కార్తీకమాసం తదితర పర్వదినాల్లో 70 వేల నుంచి 80 వేల దాకా భక్తులు వస్తుంటారు. వీరు సర్వదర్శనం క్యూలలో వెళ్లి మల్లన్నను దర్శించుకుంటారు. దర్శన సమయంలో వీఐపీలు వస్తే సర్వదర్శన క్యూలలోని సామాన్య భక్తులు కొద్దిసేపు ఆగాలి. ఈ సమస్యను పరిష్కరించేందుకు దేవస్థానం నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సర్వదర్శనం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారు సులభంగా స్వామిని దర్శించుకునేలా వీఐపీ ప్రోటోకాల్ దర్శన విధానంలో మార్పులు చేసింది. దీనిని ఈనెల 5 నుంచి దేవస్థానం అమల్లోకి తీసుకొచ్చింది. రోజుకు రెండు సార్లు మాత్రమే దేవస్థానం ప్రవేశపెట్టిన నూతన విధానంలో రోజుకు రెండు సార్లు అది కూడా నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రముఖులకు భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పిస్తారు. ప్రతిరోజు ఉదయం 5.30 నుంచి 6.15 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రముఖులకు విరామ దర్శనాన్ని, అభిషేకం, కుంకుమార్చన జరిపిస్తారు. ఆలయానికి వచ్చే ప్రముఖులు తమ పర్యటన వివరాలను కనీసం రెండు రోజులు ముందుగానే తెలియజేయాలనే నిబంధన పెట్టారు. సిఫారసు లేఖల విధానంలో మార్పులు ప్రముఖులు వసతి, దర్శనం, ఆర్జితసేవలను ఇతరులకు సిఫారసు చేసేందుకు ఎస్ఎంఎస్, వాట్సాప్ విధానాన్ని వినియోగించేవారు. దీనిని రద్దు చేసి విధిగా లెటర్‌హెడ్ పై కనీసం రెండు రోజులు ముందుగా దేవస్థానానికి సమాచారం ఇవ్వాలని నిబంధన పెట్టారు. అలాగే సిఫారసు లేఖపై స్పష్టంగా వసతి కావాల్సిన తేదీలు, దర్శనం, ఆర్జితసేవల వివరాలను, దర్శనానికి వచ్చే భక్తుల ఆధార్, ఫోన్ నెంబర్లను తప్పనిసరిగా పొందుపర్చాలి. యథావిధిగా స్పర్శ దర్శన వేళలు ప్రస్తుతం అమలులో ఉన్న స్పర్శ దర్శన సమయాలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదయం 7 గంటల నుంచి 8.15 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.15 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు స్పర్శదర్శనం కల్పిస్తారు. అలాగే ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు భక్తులకు ఉచిత స్పర్శదర్శనం కొనసాగుతోంది. సామాన్య భక్తుల కోసమే మార్పులు సామాన్య భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనాన్ని మరింత సౌకర్యవంతంగా కల్పించేందుకు ప్రోటోకాల్ దర్శనంలో మార్పులు చేశాం. దేవస్థాన ఆగమ కమిటీ, దేవస్థానం ధర్మకర్తల మండలి సూచనల మేరకు ఈ మార్పులు చేశాం. ఈ కొత్త విధానంలో రోజుకు రెండు సార్లు మాత్రమే ప్రముఖులకు స్వామి అమ్మవార్ల దర్శనం, ఆర్జిత సేవలను కల్పిస్తున్నాం. అలాగే ప్రముఖుల సిఫారసు లేఖల విషయంలో కూడా కొన్ని మార్పులు చేశాం. ఈ నూతన విధానం ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చాం. – ఎస్.లవన్న, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
రేపటి నుంచి భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం
-
శ్రీవారి సన్నిధిలో ఆర్కే రోజా
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న రోజా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు రోజాకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. -
'అద్దె'రిపోయే ఆఫర్
దివ్య దర్శనం.. ద్రవ్యభారం.. ప్రముఖ దేవస్థానాలపై ‘ద్రవ్య’భారం - జనవరి నుంచి ఇప్పటి వరకూ బస్సుల అద్దె రూ.2.5 కోట్లు సగం టీటీడీ, మిగిలిన సగం ఏడు దేవస్థానాలు భరించాలని ఆదేశం అన్నవరం దేవస్థానం వాటాగా రూ.17.85 లక్షలట.. ‘సొమ్మొకరిది.. సోకొకరిది’ అన్నట్టుగా ఉంది ‘దివ్యదర్శనం ’ పథకం అమలు తీరు. ఈ పథకం కింద పేదలకు ఉచితంగా యాత్రలు చేయిస్తున్నామని ప్రభుత్వం ఓ పక్క ప్రచారం చేసుకుంటూనే.. మరోపక్క ఆ యాత్రలకయ్యే ఖర్చులను భరించాల్సిందేనంటూ దేవస్థానాలపై రుద్దడం విశేషం. - అన్నవరం(ప్రత్తిపాడు) తీర్థయాత్రలు చేయలేని పేద భక్తులను వివిధ పుణ్యక్షేత్రాలకు ఉచితంగా బస్సుల్లో తీసుకువెళ్లి దర్శనాల అనంతరం తిరిగి వారి స్వగృహాలకు చేర్చేందుకు ఉద్దేశించిన ‘దివ్యదర్శనం’ పథకాన్ని గత జనవరిలో ప్రభుత్వం ప్రారంభించింది. భక్తులకు దివ్యదర్శనం చేయిస్తున్నందుకు గాను అయ్యే రవాణా చార్జీల భారాన్ని ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలపై మోపింది. దివ్యదర్శనం పథకం కింద వచ్చే భక్తులకు ఇప్పటికే ఆయా దేవస్థానాలు ఉచిత వసతి, భోజనసౌకర్యం కల్పిస్తుండగా.. తాజాగా వారు వచ్చే బస్సుల అద్దె కూడా భరించాలని ఆదేశాల్లో పేర్కొంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకూ ఈ ‘దివ్యదర్శనం’ బస్సులకు అద్దెల కింద రూ.2.5 కోట్లు ఖర్చుకాగా అందులో సగం తిరుమల తిరుపతి దేవస్థానం, మిగిలిన సగం ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలు భరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు దేవస్థానాలు రూ.17,85 లక్షలు చొప్పున చెల్లించాలని దేవాదాయశాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలు అన్నవరం దేవస్థానానికి శనివారం అందాయి. సీజీఎఫ్ నుంచి చెల్లించే వీలున్నా.. ఏటా దేవస్థానాలు తమ వార్షికాదాయంలో 15శాతం ‘కామన్ గుడ్ ఫండ్ ’ తదితర నిధులకు చెల్లిస్తున్నాయి. ఒక్క అన్నవరం దేవస్థానమే సుమారు రూ.15 కోట్ల వరకూ చెల్లిస్తోంది. ఆ మొత్తం నుంచి ఈ ‘దివ్యదర్శనం’ పథకానికి నిధులు ప్రభుత్వం చెల్లించవచ్చు. కానీ అలా చేయకుండా మరలా అదనంగా దీనికి వసూలు చేయడంపై ఆలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దివ్యదర్శనం పథకం ఎన్ని రోజులు అమలైతే అన్ని రోజులు ఈ విధంగా దేవస్థానాలు ఈ భారం మోయాల్సిందేనని అధికారులు తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
శ్రీవారి దర్శనానికి 10 గంటలు సాక్షి, తిరుమలః తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికి 62,069 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో నిండిన భక్తులకు 10 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. గదులు ఖాళీ లేవు. హుండీ కానుకలు రూ.3.29 కోట్లు వచ్చాయి.