తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 30 కంపార్ట్‌మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.
ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,992 భక్తులు దర్శించుకున్నారు. అందులో 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.53 కోట్లుగా లెక్క తేలింది.
నిఘా వేశాం.. ఆందోళన వద్దు
తిరుమలలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేగుతున్న వేళ అటవీశాఖ అధికారులు స్పందించారు. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. "మార్చి 4 నుండి ఇప్పటి వరకు 5 సార్లు చిరుత సంచారం గుర్తించాము. 250 అధునాతన కెమెరాలను ఏర్పాటు చేసాం. 4g నెట్ వర్క్ కెమెరాల ద్వారా జంతువుల సంచారం వెంటనే అలర్ట్ చేస్తుంది. క్రూర మృగాల సంచారం, చిరుతలు సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది అలెర్ట్ చేస్తాం. టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, వైల్డ్ లైఫ్ సిబ్బంది నడకదారిలో భద్రత చర్యలు చేపడుతాము.. ఏడవ మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తులను గుంపులుగా పంపుతాము భయపడాల్సిన అవసలేదు అన్నారు.
అలాగే.. ప్రభుత్వం నియమించిన జాయింట్ కమిటీ ఇప్పటికి మూడు మార్లు తిరుమలలో పర్యటించారు. ఏప్రిల్ మొదటి వారంలో జాతీయస్థాయి వైల్డ్ లైఫ్ కమిటీ సమావేశం అవుతుంది. నడకదారిలో తీసుకోవల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనున్నారు.. భక్తులు అటవీ ప్రాంతంలో వెళ్ల రాదు, శేషాచల కొండల్లో నీటికి కొరత లేదు, ఏనుగులు ప్రతి సంవత్సరం ఒకచోట నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంటాయి. అధునాతన థర్మల్ డ్రోన్ కెమరా రాత్రి సమయంలో కూడా జంతువుల సంచారం పై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు".
Comments
Please login to add a commentAdd a comment