Que
-
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 30 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,992 భక్తులు దర్శించుకున్నారు. అందులో 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.53 కోట్లుగా లెక్క తేలింది. నిఘా వేశాం.. ఆందోళన వద్దు తిరుమలలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేగుతున్న వేళ అటవీశాఖ అధికారులు స్పందించారు. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. "మార్చి 4 నుండి ఇప్పటి వరకు 5 సార్లు చిరుత సంచారం గుర్తించాము. 250 అధునాతన కెమెరాలను ఏర్పాటు చేసాం. 4g నెట్ వర్క్ కెమెరాల ద్వారా జంతువుల సంచారం వెంటనే అలర్ట్ చేస్తుంది. క్రూర మృగాల సంచారం, చిరుతలు సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది అలెర్ట్ చేస్తాం. టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, వైల్డ్ లైఫ్ సిబ్బంది నడకదారిలో భద్రత చర్యలు చేపడుతాము.. ఏడవ మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తులను గుంపులుగా పంపుతాము భయపడాల్సిన అవసలేదు అన్నారు. అలాగే.. ప్రభుత్వం నియమించిన జాయింట్ కమిటీ ఇప్పటికి మూడు మార్లు తిరుమలలో పర్యటించారు. ఏప్రిల్ మొదటి వారంలో జాతీయస్థాయి వైల్డ్ లైఫ్ కమిటీ సమావేశం అవుతుంది. నడకదారిలో తీసుకోవల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనున్నారు.. భక్తులు అటవీ ప్రాంతంలో వెళ్ల రాదు, శేషాచల కొండల్లో నీటికి కొరత లేదు, ఏనుగులు ప్రతి సంవత్సరం ఒకచోట నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంటాయి. అధునాతన థర్మల్ డ్రోన్ కెమరా రాత్రి సమయంలో కూడా జంతువుల సంచారం పై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు". -
Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం 86,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,849 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.31 కోట్లుగా లెక్క తేలింది. ఇక ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. వేకువజామున ఆలయ మహద్వారం ముందు ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేశారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు కూడా పాల్గొన్నారు. -
ఆమె టార్చర్ కోసం పురుషుల క్యూ.. ఎందుకంటే..
మనిషి ఎంత విచిత్రమైన జీవి అంటే ఒక్కొక్కరి భావోద్వేగాలు ఒక్కో విధంగా ఉంటాయి. వాటిని ఎదుటివారు అర్థం చేసుకోలేరు. ఒకరికి నచ్చని అనుభవం మరొకరికి నచ్చవచ్చు. కొందరు పురుషులు తమ భాగస్వామితో మాత్రమే రొమాన్స్ చేయాలని అనుకుంటారు. మరికొందరు రొమాన్స్‌లో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. అలాంటి తాపత్రయం కలిగిన పురుషులకు కావాల్సినంత టార్చర్ చూపిస్తూ, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తోంది ఇంగ్లండ్ కు చెందిన ఓ అమ్మడు. ఆమె పురుషులపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుంది. వారిని తీవ్రంగా వేధిస్తుంది. ఇందుకోసం వారి నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తుంది. సర్రేలోని ఫర్న్హామ్ నివాసి అయిన అరి మక్టాన్స్ పురుషులను కొట్టడం ద్వారా డబ్బు సంపాదిస్తూ వెనకేసుకుంటోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలా డబ్బులిచ్చి కొట్టించుకునేందుకు పురుష పుంగవులు ఆమె ముందు బారులు తీరుతున్నారు. డైలీ మెయిల్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె ఒక డామినేట్రిక్స్ అంటే శృంగార సమయంలో పురుషులను వేధించే మహిళ. ఆమె ఒక గంటకు 17 వేల రూపాయలు సంపాదిస్తుంది. తిట్టడం మొదలుకొని తోలు బెల్టుతో కొట్టడం వరకు.. ఇలా వివిధ పనులు చేయించుకునే మగవారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుంది. తాను చాలా మంది వివాహాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడినట్లు ఆ మహిళ తెలిపింది. చాలా మంది పురుషులు తమ భాగస్వామి వ్యక్తం చేసే ప్రేమలో హింస ఉందనుకుంటారని, అందుకే వారు భార్యకు దూరంగా ఉంటారని ఆమె పేర్కొంది. అయితే తాను ప్రేమలోని హింసను వారికి అర్థమయ్యేలా చెప్పి, పలువురి కాపురాలు నిలబెడుతున్నానని ఆమె తెలిపింది. కాగా ఆమె తన 19 సంవత్సరాల వయసు నుంచే ఈ పనిని ప్రారంభించింది. ఆమెకు 25 ఏళ్లు వచ్చేసరికి పూర్తి స్థాయి డామినేట్రిక్స్ గా మారింది. ఆమె ఒక నెలకు దాదాపు 20 మంది పురుషుల డిమాండ్లను నెరవేరుస్తుందని సమాచారం. ఇలా వచ్చేవారితో ఆమె ఎప్పుడూ శారీరక సంబంధాలు పెట్టుకోదు. వారి వింత కోరికలను మాత్రమే నెరవేరుస్తుంది. ఆమె కెరీర్‌కు మద్దతు పలికే బాయ్‌ఫ్రెండ్ కూడా ఆమెకు ఉన్నాడు. ఆమె తన పాదాలతో పురుషుల ముఖాన్ని తన్నుతుంటుంది. ఈ తన్నుల కోసం పురుషులు ఆమె దగ్గరికి వస్తుంటారు. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
వ్యర్థాలతో వింత ఇల్లు.. నిర్మాణానికి 28 ఏళ్లు.. చూసేందుకు ఎగబడుతున్న జనం!
ఒక జంట 28 ఏళ్లు కష్టపడి ఒక విచిత్రమైన ఇంటిని నిర్మించింది. ఇప్పుడు జనం ఆ ఇంటిని చూసేందుకు క్యూ కడుతున్నారు. వీరు పురాతన, పనికిరాని వస్తువులతో ఈ ఇంటిని నిర్మించారు. ఆర్టిస్ట్ మైకల్, అతని భార్య లెడా లీవెంట్(టెక్స్టైల్ ఆర్టిస్టు) ఈ ఇంటి నిర్మాణాన్ని 1979లో ప్రారంభించారు. ఈ ఇంటికి వారు ఎలిఫాంట్ ఆర్ట్ హౌస్ అనే పేరు పెట్టారు. కాగా 2007లో మైకల్ మృతి చెందాడు. అతని భార్య లెడా లీవెంట్ ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇంటి నిర్మాణం పూర్తికావడానికి 28 ఏళ్లు పట్టింది. ‘ది సన్’ తెలిపిన వివరాల ప్రకారం ఈ వింత ఇల్లు అమెరికాలోని అరిజోనాలో ఉంది. ఈ ఇల్లు ఎంట్రన్స్ మొదలు అంతా వింతగా కనిపిస్తుంది. ఏదో గుహలోకి వెళుతున్న భావన కలుగుతుంది. రాతితో నిర్మించిన ఈ ఇల్లు రంగులమయంగా కనిపిస్తుంది. మూడు ఎకరాల్లో నిర్మింతమైన ఈ ఇల్లు 25 అడుగుల సీలింగ్ కలిగివుంది. ఇంటిలో అద్భుతమైన కిటికీలు ఏర్పాటు చేశారు. వెలుగు కోసం ఇంటిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇంటి గోడలను సిమెంట్, రాళ్లు, చెక్క మొదలైన వాటితో నిర్మించారు. అయితే ఇంటిలోని నేల భాగమంతా సమతలంగా ఉండదు. అయితే దీని గురించి తాము ఆలోచించలేదని, ఒక గూడు కావాలని కోరుకుని ఈ అందమైన ఇంటిని నిర్మించామని లెడా తెలిపారు. ఇంటికి విద్యుత్, నీరు, ఫోను సదుపాయాలు ఉన్నాయి. కాగా ఈ ఇంటిని చూసేందుకు వేలమంది వస్తుంటారని లెడా తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు -
‘క్యూ’ మొదలైంది.. తినే తిండిలో కల్తీ జరిగితే..?
కల్తీ అనేది మన జీవితాల్లో కలిసిపోయింది. తాగే నీరు కల్తీ, తినే తిండి కల్తీ, పీల్చే గాలి కల్తీ.. అన్నీ కల్తీనే. మనం తినే తిండిలో జరిగే కల్తీ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తల గురించి హెచ్చరిస్తూ... రవ్వంత సందేశానికి కొండంత వినోదాన్ని జోడించి రూపొందుతున్న చిత్రం ‘క్యూ’. శ్రీకాంత్ గాదిరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిత్యా క్రియేషన్స్ పతాకంపై ఎ. బ్రహ్మయ్య-జి.విశాల్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తోషి అనే నవ యువకుడు హీరోగా పరిచయమవుతున్న ఈ విభిన్న కథాచిత్రంలో సీనియర్ నటుడు దిల్ రమేష్ ఓ కీలకపాత్ర పోషిస్తుండగా... గంగారామ్, శ్రీనివాస్, అజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అందాల భామ అశ్విని హీరోయిన్. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ మొదలైంది. . ముహూర్తపు సన్నివేశానికి... ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న దిల్ రమేష్ క్లాప్ కొట్టగా... నిర్మాతల్లో ఒకరైన బ్రహ్మయ్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ చిత్రం స్టంట్ మాస్టర్ దేవరాజ్ ఫస్ట్ షాట్ కు డైరెక్షన్ చేశారు. రియల్ లైఫ్ పోలీస్ ఆఫీసర్ గంగారామ్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుండడం గమనార్హం. తెలుగు తెరపై ఇప్పటివరకు స్పృశించని అత్యంత వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న "క్యూ" చిత్రానికి పని చేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మంచి పేరు తెస్తుందని దర్శకుడు శ్రీకాంత్ గాదిరాజు తెలిపారు. తమ దర్శకుడు శ్రీకాంత్ గాదిరాజు చెప్పిన కథ తమకు విపరీతంగా నచ్చి, తనపై నమ్మకంతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టామని నిర్మాతలు బ్రహ్మయ్య-విశాల్ రావు పేర్కొన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తున్న విక్కీ మాస్టర్ కి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ‘క్యూ’ చిత్రం చూసేందుకు ప్రేక్షకులు కచ్చితంగా క్యూ కడతారనే నమ్మకం ఉందని, ఇంత మంచి చిత్రంతో హీరోగా పరిచయమవుతుండడం గర్వంగా ఉందని అన్నారు చిత్ర కథానాయకుడు తోషి. -
క్యూ అవసరం లేదిక..!
ట్యాగ్ట్రీతో మొబైల్‌కే టోకెన్ ఆసుపత్రులు, బ్యాంకులకు వెళితే టోకెన్ తీసుకొని మన వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడటం సర్వసాధారణం. అలా కాకుండా మన టోకెన్ నెంబరేదో సెల్‌ఫోన్‌కే వచ్చేస్తే? అంతేకాకుండా మన వంతు ఎప్పుడొస్తుందో? ప్రస్తుతం ఎన్నో టోకెన్ నడుస్తుందో? వంటి సమాచారమంతా ఎప్పటికప్పుడు మనకు తెలిసిపోతే.. ఎంచక్కా మన వంతు రాగానే వెళ్లి పని ముగించుకొని వచ్చేస్తాం కదూ! ట్యాగ్‌ట్రీ యాప్ అచ్చం ఇలాంటి పనే చేస్తుంది. ‘‘బ్యాంకుకో, బిల్లు చెల్లించటానికి మీసేవా కేంద్రానికో, టికెట్ కోసం రైల్వే కౌంటర్కో వచ్చిన కస్టమర్ తన సెల్ నంబర్ ఇస్తే వారికి సదరు కౌంటర్లోని వ్యక్తి డిజిటల్ టోకెన్‌ను ఎస్ఎంఎస్ ద్వారా గానీ ట్యాగ్‌ట్రీ యాప్ ద్వారా గానీ ఇస్తారు. ఇక ఆ యాప్ ద్వారా అన్ని వివరాలనూ పొందే వీలుంటుంది’’ అని ట్యాగ్‌ట్రీ యాప్ ఫౌండర్ నరసింహమూర్తి చెప్పారు. ప్రస్తుతం గచ్చిబౌలి, కొండాపూర్‌లోని ఐడీబీఐ బ్యాంక్, విజయవాడలోని ఐడీఎఫ్సీ సంస్థలు యాప్ సేవలను వినియోగించుకుంటున్నాయని, ఇంకా వెయ్యి మంది యూజర్లు తమ యాప్‌ను వాడుతున్నారని చెప్పారాయన. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. – బిజినెస్‌బ్యూరో, హైదరాబాద్ -
నిర్లక్ష్యానికి క్యూ
తల్లీబిడ్డ మృతి ఘటనలో అడుగడుగునా అన్ని శాఖల వైఫల్యం దర్శన క్యూల ఏర్పాటులో సంబంధిత శాఖల నిర్లక్ష్యం.. సమన్వయ లోపం భద్రతా ప్రమాణాలు పాటించకుండా అతి విశ్వాసంతోనే క్యూల నిర్మాణం ఘటనకు బాధ్యత మీరంటే మీరేనంటూ ఒకరిపై ఒకరి ఫిర్యాదులు తిరుమల: తిరుమలలో స్వామి దర్శన క్యూలు మృత్యుమార్గాలుగా మారుతున్నాయి.. తిరుమలేశుని సన్నిధిలో అభంశుభం తెలియని తల్లీబిడ్డా ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. సోమవారం రాత్రి విద్యుదాఘాతం మిగిల్చిన ఈ విషాద ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో ‘తిలాపాపం.. తలా పిడికెడు’గా మారింది. టీటీడీ విద్యుత్, సివిల్, విజిలెన్స్ విభాగాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. అడుగడుగునా ఆయా విభాగాల సమన్వయ లోపాలను తాజా ఘటన ఎత్తిచూపింది. భద్రతా ప్రమాణాల్లేని క్యూలు శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్ష మంది వచ్చే తిరుమల క్యూల నిర్మాణంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించటం లేదు. భక్తుల రద్దీ, ఇతర సందర్భాల్లో అవసరాలకు తగ్గట్టుగా ఉన్నతాధికారులు‘తాన’ అంటే చాలు వారి మెప్పుకోసం కింది స్థాయి అధికారులు ‘తందానా’ అంటూ భజన చేస్తూ.. రాత్రిరాత్రే క్యూలను నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వాటి నిర్మాణంలో కనీస మార్గదర్శకాలు కూడా పాటించటం లేదు. క్యూల నిర్మాణంలో ప్రధాన పాత్రధారులైన సంబంధిత సివిల్, ఎలక్ట్రికల్, విజిలెన్స్ విభాగాలు ఏమాత్రం సమన్వయ సహకారంతో పనిచేయటం లేదు. ఎక్కడ బడితే అక్కడ తాత్కాలిక క్యూలను నిర్మించేందుకు అధికారులు మొగ్గుచూపుతున్నారు. ఏమీ జరగదులే! అన్న అతివిశ్వాసంతో క్యూలు నిర్మిస్తున్నారు. వాటిని నిర్మించాక చేతులు దులిపేసుకుంటున్నారు. నిర్వహణలో ఏమాత్రం జాగ్రత్తలు పాటించటం లేదు. చేతు లు కాలాక... ఆకులు పట్టుకున్న చందంగా ఏదైనా ఘటన జరిగిన తర్వాత మాత్రం హడావుడి చేస్తూ తర్వాత చేతులు దులుపుకుకోవడం ఇక్కడి విభాగాల అధికారుల అలవాటుగా మారింది. క్యూల నిర్మాణంలో లోపాలు.. ప్రస్తుతం సర్వదర్శన క్యూలు, కాలిబాట క్యూలు, రూ.300 టికెట్లు క్యూల నిర్మాణంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. కూలేందుకు సిద్ధంగా రేకులు కనిపిస్తున్నాయి. కరెంట్‌పోల్ మధ్యలో ఉంచి క్యూ నిర్మించటం బహుశా తిరుమలలో మాత్రమే కనిపిస్తుందేమో!. కిలోమీటర్ల మేర ఇనుప కమ్మీలనే అనుసంధానం చేస్తూ క్యూలు నిర్మించారు. మధ్యలో ఎక్కడా కూడా ఖాళీ కనిపించదు. నిత్యం వేలాది మంది వేచి ఉండే ఇనుప కమ్మీల క్యూలలో ఎక్కడైనా కరెంట్ సరఫరా అయితే పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రిప్పర్లు పనిచేయకపోతే ఎలాంటి పరిణామాలుంటాయి? అన్నవి ఊహకు అందవు. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్లే ఇలాంటి పరిస్థితి ఉంది. పరస్పర ఫిర్యాదులు విద్యుదాఘాతంతో తల్లీబిడ్డ మృతిచెందిన ఘటనపై పరస్పర ఫిర్యాదులు చేసుకునేందుకు సివిల్, ఎలక్ట్రికల్, విజిలెన్స్ విభాగాలు పోటీ పడుతున్నాయి. క్యూ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, క్యూ నుంచి ఫుట్‌పాత్ వరకు సిమెంట్ ర్యాంపు లేకపోవటం, విద్యుత్ వైర్లు వెళ్లే ప్రాంతంలోనే భద్రతా పరంగా అత్యవసర ప్రవేశ ద్వారం నిర్మించటం, వాటిని తెరిచి ఉంచటం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని సివిల్, విజిలెన్స్ విభాగాలపై ఎలక్ట్రికల్ విభాగం ఫిర్యాదు చేసింది. క్యూల వద్ద ఇష్టానుసారంగా విద్యుత్ వైర్లు వదిలేయటం, ఎర్త్‌తో పాటు ట్రిప్పర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా పర్యవేక్షించకపోవడం, రెండు రోజులుగా వర్షం కురుస్తున్నా విద్యుత్ సరఫరాలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఎలక్ట్రికల్ విభాగంపై సివిల్, విజిలెన్స్ శాఖలు ఫిర్యాదు చేశాయి. ఇష్టానుసారంగా విద్యుత్ వైర్లు తిరుమలలో అనేక ప్రాంతాల్లోనూ విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడబడితే అక్కడ విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు సంచరించే ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపించింది. విద్యుత్ సరఫరా అయ్యే వైర్లు, జంక్షన్ బాక్సులు అడ్డదిడ్డంగా ఏర్పాటు చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే ఏర్పాటు చేశారు. వర్షం వస్తే వైర్ల నుంచి సరఫరా అయ్యే విద్యుత్ వల్ల అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా జరిగిన ఘటన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దకపోతే భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదు.