క్యూ అవసరం లేదిక..!
ట్యాగ్‌ట్రీతో మొబైల్‌కే టోకెన్
ఆసుపత్రులు, బ్యాంకులకు వెళితే టోకెన్ తీసుకొని మన వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడటం సర్వసాధారణం. అలా కాకుండా మన టోకెన్ నెంబరేదో సెల్‌ఫోన్‌కే వచ్చేస్తే? అంతేకాకుండా మన వంతు ఎప్పుడొస్తుందో? ప్రస్తుతం ఎన్నో టోకెన్ నడుస్తుందో? వంటి సమాచారమంతా ఎప్పటికప్పుడు మనకు తెలిసిపోతే.. ఎంచక్కా మన వంతు రాగానే వెళ్లి పని ముగించుకొని వచ్చేస్తాం కదూ! ట్యాగ్‌ట్రీ యాప్ అచ్చం ఇలాంటి పనే చేస్తుంది.
‘‘బ్యాంకుకో, బిల్లు చెల్లించటానికి మీసేవా కేంద్రానికో, టికెట్ కోసం రైల్వే కౌంటర్‌కో వచ్చిన కస్టమర్ తన సెల్ నంబర్ ఇస్తే వారికి సదరు కౌంటర్లోని వ్యక్తి డిజిటల్ టోకెన్‌ను ఎస్‌ఎంఎస్ ద్వారా గానీ ట్యాగ్‌ట్రీ యాప్ ద్వారా గానీ ఇస్తారు. ఇక ఆ యాప్ ద్వారా అన్ని వివరాలనూ పొందే వీలుంటుంది’’ అని ట్యాగ్‌ట్రీ యాప్ ఫౌండర్ నరసింహమూర్తి చెప్పారు. ప్రస్తుతం గచ్చిబౌలి, కొండాపూర్‌లోని ఐడీబీఐ బ్యాంక్, విజయవాడలోని ఐడీఎఫ్‌సీ సంస్థలు యాప్ సేవలను వినియోగించుకుంటున్నాయని, ఇంకా వెయ్యి మంది యూజర్లు తమ యాప్‌ను వాడుతున్నారని చెప్పారాయన. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. – బిజినెస్‌బ్యూరో, హైదరాబాద్