వ్యర్థాలతో వింత ఇల్లు.. నిర్మాణానికి 28 ఏళ్లు.. చూసేందుకు ఎగబడుతున్న జనం! | couple made house with waste material completed in 28 years | Sakshi
Sakshi News home page

వ్యర్థాలతో వింత ఇల్లు.. నిర్మాణానికి 28 ఏళ్లు.. చూసేందుకు ఎగబడుతున్న జనం!

Published Sun, Sep 3 2023 9:20 AM | Last Updated on Sun, Sep 3 2023 9:20 AM

couple made house with waste material completed in 28 years - Sakshi

ఒక జంట 28 ఏళ్లు కష్టపడి ఒక విచిత్రమైన ఇంటిని నిర్మించింది. ఇప్పుడు జనం ఆ ఇంటిని చూసేందుకు క్యూ కడుతున్నారు. వీరు పురాతన, పనికిరాని వస్తువులతో ఈ ఇంటిని నిర్మించారు. ఆర్టిస్ట్‌ మైకల్‌, అతని భార్య లెడా లీవెంట్‌(టెక్స్‌టైల్‌ ఆర్టిస్టు) ఈ ఇంటి నిర్మాణాన్ని 1979లో ప్రారంభించారు. ఈ ఇంటికి వారు ఎలిఫాంట్‌ ఆర్ట్‌ హౌస్‌ అనే పేరు పెట్టారు. కాగా 2007లో మైకల్‌ మృతి చెందాడు. అతని భార్య లెడా లీవెంట్‌ ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇంటి నిర్మాణం పూర్తికావడానికి 28 ఏళ్లు పట్టింది.

‘ది సన్‌’ తెలిపిన వివరాల ప్రకారం ఈ వింత ఇల్లు అమెరికాలోని అరిజోనాలో ఉంది. ఈ ఇల్లు ఎంట్రన్స్‌ మొదలు అంతా వింతగా కనిపిస్తుంది. ఏదో గుహలోకి వెళుతున్న భావన కలుగుతుంది. రాతితో నిర్మించిన ఈ ఇల్లు రంగులమయంగా కనిపిస్తుంది. మూడు ఎకరాల్లో నిర్మింతమైన ఈ ఇల్లు 25 అడుగుల సీలింగ్‌ కలిగివుంది. ఇంటిలో అద్భుతమైన కిటికీలు ఏ‍ర్పాటు చేశారు. వెలుగు కోసం ఇంటిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

ఇంటి గోడలను సిమెంట్‌, రాళ్లు, చెక్క మొదలైన వాటితో నిర్మించారు. అయితే ఇంటిలోని నేల భాగమంతా సమతలంగా ఉండదు. అయితే దీని గురించి తాము ఆలోచించలేదని, ఒక గూడు కావాలని కోరుకుని ఈ అందమైన ఇంటిని నిర్మించామని లెడా తెలిపారు. ఇంటికి విద్యుత్‌, నీరు, ఫోను సదుపాయాలు ఉన్నాయి. కాగా ఈ ఇంటిని చూసేందుకు వేలమంది వస్తుంటారని లెడా తెలిపారు.
ఇది కూడా చదవండి:  ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement