devoties
-
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 58,165 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(మంగళవారం) 63,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 01 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం.ఇక.. నిన్న(ఆదివారం) 67,284 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,064 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా లెక్క తేలింది.ధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దు...డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసంధనుర్మాసం సందర్భంగా సుప్రభాతం రద్దుడిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పాసురాళ్లు పఠనంజనవరి 15న తిరిగి సుప్రభాతం ప్రారంభం. -
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(శనివారం) 61,613 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,602 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టోకెన్ లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 56,711 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 19,775 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.64 కోట్లుగా లెక్క తేలింది.నేడు తిరుమలలో గరుడసేవ...కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడవాహనం పై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.రాత్రి 7 గంటలకు గరుడవాహనం పై తిరు వీధుల్లో ఊరేగింపు.ఈ నెల 17 న తిరుమలలో కార్తీక వనభోజనం.18 టిటిడి పాలకమండలి సమావేశం -
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(మంగళవారం) 61,446 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,374 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లుగా లెక్క తేలింది.ఉగ్ర శ్రీనివాసమూర్తి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహించాము. శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించిన టీటీడీ. చిరుజల్లుల మద్య ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.– టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(ఆదివారం) 82,233 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,415 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 61,142 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 21,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 6 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో నిండి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 63,936 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 18,697 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.55 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట TBC వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 84,060 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో గోకులాష్టమి వేడుకలు...శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం28న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసిన టీటీడీ.అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు04/10/2024 - సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.05/10/2024 - ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.06/10/2024 - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం08/10/2024 - ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం. -
తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 18 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 63,202 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,057 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4437 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో గోకులాష్టమి వేడుకలు..శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం28న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసిన టీటీడీ.అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు..04/10/2024 - సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.05/10/2024 - ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.06/10/2024 - ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం08/10/2024 - ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం.బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, విఐపీ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.ఇక.. నిన్న(గురువారం) 76,695 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 34,395 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.96 కోట్లుగా లెక్క తేలింది.19న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీ డిప్ కోటా విడుదలఆగష్టు 19న ఉదయం 10 గంటలకు నవంబర్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీ డిప్ కోటా విడుదల.. ఆగష్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక.. ఆగష్టు 22న వర్చువల్ సేవల కోటా విడుదల.మరోవైపు.. ఆగష్టు 23న అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల. 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల చేయనున్నారు. 24న తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల. ఆగష్టు 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. ఆగష్టు 27న శ్రీవారి సేవ కోటా విడుదల.. https://ttdevasthanams.ap.gov.in సైట్ ద్వారా టికెట్ల బుక్ చేస్కోవాలని టీటీడీ సూచన -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(బుధవారం) 72,967 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 32,421 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.5.26 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు..
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(ఆదివారం) 86,604 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,536 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 61,499 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.04 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 20 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 65,416 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 36,128 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లుగా లెక్క తేలింది. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(మంగళవారం) 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 35,726 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లుగా లెక్క తేలింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
-
తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.ఇక.. నిన్న(శుక్రవారం) 71,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 43,199 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.నేడు ఆగష్టు కోటా టికెట్లుతిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల.సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ సేవా టికెట్లు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.మే 17 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల.మే 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల.మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ టికడట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల.మే 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలమే 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచన. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 3 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(సోమవారం) 70,815 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.16 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 16 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శనివారం) 76,945 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 33,844 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.67 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(శుక్రవారం) 60,545 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 32,527 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.53 కోట్లుగా లెక్క తేలింది. -
May 10 Tirumala: తిరుమలలో నేటి రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 65,508 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 25,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 2.97 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 26 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,313 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 28,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.54 కోట్లుగా లెక్క తేలింది. -
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 30 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,992 భక్తులు దర్శించుకున్నారు. అందులో 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.53 కోట్లుగా లెక్క తేలింది. నిఘా వేశాం.. ఆందోళన వద్దు తిరుమలలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేగుతున్న వేళ అటవీశాఖ అధికారులు స్పందించారు. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. "మార్చి 4 నుండి ఇప్పటి వరకు 5 సార్లు చిరుత సంచారం గుర్తించాము. 250 అధునాతన కెమెరాలను ఏర్పాటు చేసాం. 4g నెట్ వర్క్ కెమెరాల ద్వారా జంతువుల సంచారం వెంటనే అలర్ట్ చేస్తుంది. క్రూర మృగాల సంచారం, చిరుతలు సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది అలెర్ట్ చేస్తాం. టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, వైల్డ్ లైఫ్ సిబ్బంది నడకదారిలో భద్రత చర్యలు చేపడుతాము.. ఏడవ మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తులను గుంపులుగా పంపుతాము భయపడాల్సిన అవసలేదు అన్నారు. అలాగే.. ప్రభుత్వం నియమించిన జాయింట్ కమిటీ ఇప్పటికి మూడు మార్లు తిరుమలలో పర్యటించారు. ఏప్రిల్ మొదటి వారంలో జాతీయస్థాయి వైల్డ్ లైఫ్ కమిటీ సమావేశం అవుతుంది. నడకదారిలో తీసుకోవల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనున్నారు.. భక్తులు అటవీ ప్రాంతంలో వెళ్ల రాదు, శేషాచల కొండల్లో నీటికి కొరత లేదు, ఏనుగులు ప్రతి సంవత్సరం ఒకచోట నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంటాయి. అధునాతన థర్మల్ డ్రోన్ కెమరా రాత్రి సమయంలో కూడా జంతువుల సంచారం పై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు". -
Tirumala: సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 80,532 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,438 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా లెక్క తేలింది. -
నిత్య పూజలు అందుకుంటున్న కేతకీ పార్వతీ పరమేశ్వరులు
సంగారెడ్డి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అంకురార్పణ, ధ్వజారోహణం, శిఖర పూజా కార్యక్రమాలతో జాతర ప్రారంభమైంది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజలతో పాటు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శశిధర్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, నాయకులు సంతోష్ కుమార్ పాటిల్, రుద్రయ్య స్వామి, గాలప్ప పాటిల్, నరేందర్ రెడ్డి, దత్తు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె.. రూ.50కోట్లంటూ.. -
వైభవంగా రాజన్న కల్యాణోత్సవం..
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది. వేదమూర్తుల మంత్రోచ్ఛరణల మధ్య ఉదయం 10.50 గంటలకు కల్యాణం జరిపించారు. రాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఈ తంతు నిర్వహించారు. స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో సుమారు రెండున్నర గంటలపాటు కల్యాణం జరిపించారు. కోవిడ్–19 నిబంధనల మే రకు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆలయంలోకి భక్తులు రాకుండా కట్టడిచేశారు. ఒకే క్యూలైన్ ద్వారా రాజన్న దర్శనానికి అనుమతించారు. అయినప్పటికీ, 50 వేల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. చేతిలో త్రిశూలం, తలపై జీలకర్ర, బాసింగాలతో శివ పార్వతులు శ్రీరాజరాజేశ్వరస్వామిని వివాహం చేసుకున్నారు. మాస్క్‌లు లేకుండా భక్తులు భారీసంఖ్యలో తరలిరావడంతోపాటు ఎక్కడా కోవిడ్ నిబంధనలు అమలు కాలేదు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 16 గంటలు, స్లాట్ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ద్వారా రూ. 3.37 కోట్ల ఆదాయం వచ్చింది. రేపు పెరటాని మాసంలో మూడవ శనివారం కావడంతో తమిళనాడు నుండి భారీగా భక్తులు తరలిరానున్నారు. శని, ఆదివారం వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలను రద్దు చేశారు. -
వసతి చూపవా గోవిందా..
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అద్దెగదుల కోసం తిప్పలు తప్పడంలేదు. గదులు కేటాయింపునకు సంబంధించిన వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక సమస్యలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏడుకొండలవాని దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చే ప్రతి భక్తుడు తిరుమలలో ఓ రాత్రి నిద్రిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతాడు. గదుల కోసం భక్తులు ముందుగా తిరుమలలో సీఆర్వో కార్యాలయానికి చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ జనరల్ కౌంటర్లు, దేవదాయశాఖ కౌంటర్, వీఐపీ, వీవీఐపీ, బోర్డు మెంబర్ల కోసం విడివిడిగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. గదులు అవసరమైన వారు కౌంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గదులు ఖాళీ అవుతుంటే... వరుస క్రమంలో ఉన్న భక్తుల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వస్తుంటాయి. ఆ సమాచారం తెలుసుకుని భక్తులు సీఆర్వో కార్యాలయానికి వెళ్లి గది తాళాలు తీసుకుంటారు. గతంలో అయితే గదులు ఖాళీ అవుతుంటే క్యూలో ఉండేవారికి కేటాయించేవారు. ఇలా గంటల తరబడి భక్తులు క్యూలో నిల్చొని ఇబ్బంది పడకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చారు. మెసేజ్ రాకపోతే గది లేనట్టే.. తిరుమలలో గదుల రిజిస్ట్రేషన్ కోసం టీటీడీ 10 కౌంటర్లు ఏర్పాటు చేసింది. అందులో సిబ్బంది వారాంతపు సెలవులు, అత్యవసర సెలవులు, ఇతరత్రా కారణాలతో రోజుకి ఆరేడు కౌంటర్లు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ కౌంటర్ల వద్ద క్యూలో 200 మంది లోపు మాత్రమే నిలబడే అవకాశం ఉంది. ఒకసారి క్యూలోకి చేరుకున్న భక్తులు సుమారు ఒకటిన్నర గంట సమయం బయటే నిలబడి ఉండాలి. క్యూలో ఉన్న వారి కంటే బయట వేచి ఉన్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. మొదట్లో టీటీడీ నిర్ధేశించిన ప్రకారం భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని బయటకు వచ్చేస్తే... గది ఖాళీ అయినప్పుడు భక్తుడు రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. సమాచారం అందిన అరగంటలో వెళ్లి గది తీసుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరికి గది కేటాయించినా ఎటువంటి మెసేజ్ రావడంలేదు. దీంతో సీఆర్వో కార్యాలయం వద్ద డిస్ప్లే బోర్డు చూస్తూ గంటల తరబడి నిలబడుతున్నారు. మరి కొందరు.. గది కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ‘2 లేదా 3’ గంటల తరువాత కేటాయించవచ్చు అని ఉజ్జాయింపుగా రశీదుపై సమయాన్ని ముద్రించి ఇస్తారు. దీంతో భక్తులు ఇంకా సమయం ఉందని తిరుమలలోని దర్శనీయ స్థలాలు చూసి వచ్చేందుకు వెళ్తుంటారు. ఒక్కో సారి రిజిస్ట్రేషన్ అయిన అరగంటలోనే గది కేటాయిస్తుంటారు. ఆ సమాచారం భక్తులకు వెళ్లడం లేదు. గది అలాట్ అయిన అరగంటలో తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా అది రద్దయిపోతుంది. మొబైల్‌కి సమాచారం రాలేదని భక్తులు తిరుమల అంతా చుట్టి సీఆర్వో కార్యాలయానికి చేరుకునే సరికి.. గది అలాట్ అయ్యిందని, అరగంటలో తీసుకోకపోవటంతో రద్దయిందని చెబుతుండటంతో భక్తులు షాక్‌కు గురవుతున్నారు. పర్యవేక్షణ లోపమే.. అనిల్‌కుమార్ సింఘాల్ ఈవోగా వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ పద్ధతి అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ విధానంలో లోపాలను సరిదిద్దేవారు కరువయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తులకు కేటాయించిన గదుల వివరాలపై వారికి ఎస్ఎంఎస్లు వెళ్లడం లేదని సంబంధిత అధికారులకు తెలియటం లేదని సమాచారం. కౌంటర్లు చాలక ఇబ్బంది పడుతున్న సమాచారమూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదు. అదే విధంగా కౌంటర్లలో పనిచేస్తున్న అధికారులకు సుమారు ఏడేళ్లుగా బదిలీలు లేకపోవటంతో వారు గదుల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
శివయ్యా.. ఏదీ గంగమ్మ..!
వేములవాడ: ఎములాడ రాజన్నను దర్శించుకునే ముందుకు భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవకపోవడం, సుందరీకరణలో భాగంగా గుడిచెరువును మట్టితో నింపి చదును చేయడంతో పక్కనే ఉన్న రాజన్న ధర్మగుండంలో నీళ్లు అడుగంటాయి. ఉన్నకొద్దిపాటి కలుషిత నీటిలో కొందరు స్నానానాలు కానిచ్చేస్తుండగా, చాలామంది వెనుదిరుగుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ఆలయ అధికారులు చేష్టలుడిగి చూడడం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. శివునికే నీటి కటకట.. గంగను ఒదిగిన గంగాధరుడు శివుడు.. అలాంటి శివయ్యకే నీటికటకట ఎదురైంది. తమ ఇలవేల్పు ఎములాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకుని కోర్కెలు తీర్చుకోవాలని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ధర్మగుం డంలో స్నానాలు చేయడం గగనంగా మారింది. అడుగంటిపోయిన నీటితో అవస్థలు పడుతున్నారు. లోతైన ధర్మగుండంలోకి మెట్లపైనుంచి దిగి ఉన్నకొద్దిపాటి మురుగునీటిలోనే స్నానా లు చేసి పైకి రావడం చుక్కలను చూపిస్తోంది. గుండం స్నానాలు శ్రేష్ఠం.. ధర్మగుండంలో స్నానాలు చేయడాన్ని భక్తులు శ్రేష్ఠంగా భావిస్తారు. చలిని సైతం లెక్కచేయ తొలుత పుష్కరిణిలో స్నానాలు చేస్తారు. ఆ త ర్వాతే క్యూలైన్లలోకి వెళ్లి కోడెమొక్కు, ఇతర మొ క్కులు చెల్లించుకుంటారు. ధర్మగుండంలో ఇ ప్పుడు నీళ్లులేక స్నానాలు ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు ధర్మగుండంలోకి దిగి మెట్ల ద్వారా పైకి ఎక్కేందుకు అవస్థలు పడుతున్నారు. కొందరు ధర్మగుండంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ కింద స్నానాలు చేస్తున్నారు. ముందుచూపు లేదు.. రాజన్నను దర్శించుకునేందుకు రెండు నెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కానీ, ధర్మగుండంలోని నీటికొరతను అధిగమించాలనే ఆలోచన రాజన్న ఆలయ అధికారులకు రాలేదు. ఓవైపు ఎల్ఎండీ, మధ్యలో మిడ్‌మానేరులో నీరున్నా ఇక్కడకు తరలించేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేయడంలేదు. అధికారుల ముందుచూపు లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందనే విమర్శలు వస్తున్నాయి. తానం ఎట్ల జేసుడు? రాజన్నకు మొక్కు చెల్లించుకునేందుకు వచ్చినం. గుండంలో నీళ్లులేవు. తానం ఎట్ల జేసుడో అర్థమైతలేదు. ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా గుండంల నీళ్లు ఉంచకపోతే ఎట్లా..? అధికారులు గింత నిర్లక్ష్యం జేయొద్దు. – రాజేశ్వరి, భక్తురాలు, వరంగల్ నీళ్లు నింపుతాం మహాశివరాత్రి జాతర వరకు ధర్మగుండంలో నీళ్లు నింపుతాం. ఇందుకోసం ఎల్ఎండీ పైప్‌లైన్ వినియోగిస్తాం. మరికొన్ని బోర్లు కూడా ఏర్పాటు చేస్తాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటాం. – దూస రాజేశ్వర్,రాజన్న ఆలయ ఈవో -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడనక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని మంగళవారం 68,763 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,229 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ 3.21 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
సాక్షి, తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్‌లో భక్తులతో అన్ని కంపార్ట్మెంట్స్ నిండిపోయాయి. కంపార్ట్మెంట్ల వెలుపల భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 87,336 మంది భక్తులు దర్శించుకోగా, 37,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.49 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. సర్వ దర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, స్వామి వారి ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఆదివారం శ్రీవారిని 68,690 మంది దర్శించుకున్నారు. 24,239 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 2.87కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు చెప్పారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 2 గంటలు, స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. శనివారం స్వామి వారిని 67,135 మంది దర్శించుకున్నారు. 27,172 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ రాబడి రూ. 2.08 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. ఒక కంపార్టుమెంట్లో భక్తులు వెంకన్న దర్శనం కోసం వేచిఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారిని 93,346 మంది భక్తులు దర్శించుకోగా, 23,667 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2.75 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 67,628 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవేంకటేశ్వరస్వామి హుండీ ద్వారా రూ.2.93 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల : తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. బుధవారం 62,351 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 26,676 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2.86కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్ధీ
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. 35 కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3 కోట్ల 2లక్షలు. -
జనసంద్రంగా మారిన ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. మాల విరమణకు చివరిరోజు కావడంతో దుర్గమ్మ కొండపై భక్తుల రద్దీ పెరిగింది. భవానీ దీక్షల విరమణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు విజయవాడకు చేరుకుంటున్నారు. బుధవారం రాత్రి నుంచే స్నాన ఘాట్లు, క్యూలైన్లు, గిరి ప్రదక్షణ ప్రాంతం భవానీ భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. భవానీల సంఖ్య అనూహ్యంగా పెరడగంతో గురువారం తెల్లవారుజామున ఒకటిన్నరకే ఆలయం తెరిచారు. ఎక్కువసేపు క్యూలైన్లలో వేచిచూసే ఇబ్బంది తొలగేలా త్వరగా దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానంతరం మహామండపం వద్ద ఏర్పాటుచేసిన హోమగుండాల్లో నేతి కొబ్బరికాయలు వేసి భవానీలు మొక్కులు తీర్చుకుంటున్నారు. గురుభవానీల సమక్షంలో దీక్ష విరమిస్తున్నారు. ఈరోజు జరిగే పూర్ణాహుతితో భవానీ దీక్షలు లాంఛనంగా పరిసమాప్తి అవుతాయి. అధికారుల నిబంధనలతో భక్తుల ఇక్కట్లు అయితే ఇంద్రకీలాద్రిపై అధికారులు పెట్టిన నిబంధనలతో భవానీ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు పోలీసులు పార్కింగ్ ప్రదేశాన్ని చూపలేదు. లడ్డూ ప్రసాదాలను ఇచ్చే కౌంటర్లు మూడే ఉండడంతో ప్రసాదాల కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. -
రత్నగిరిపై ‘ఏకాదశి’ రద్దీ
స్వామిని దర్శించిన 40 వేలమంది భక్తులు ఎండ వేడి తట్టుకోలేక భక్తుల ఇబ్బందులు అన్నవరం(ప్రత్తిపాడు) : ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం రత్నగిరి శ్రీసత్యదేవుని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సోమవారం 40 డిగ్రీల పైబడి ఎండ కాయడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం పది గంటల నుంచి నేల వేడెక్కి కాళ్లు కాలిపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న తెల్లవారుజామున ఐదు గంటల నుంచి స్వామివారి ఆలయాన్ని తెరిచి భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. నాలుగు గంటల నుంచి వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి గంట ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని వ్రతమాచరించిన చిన రాజప్ప, రెడ్డి సుభ్రహ్మణ్యం: డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, శానసమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీస్సులు, అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఏసీ మండపంలో వ్రతాలకు డిమాండ్: ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వ్రతాలాచరించే భక్తులు రూ.2,000 టికెట్‌తో ఏసీ వ్రతమండపంలో వ్రతాలాచరించేందుకు మొగ్గు చూపారు. సాధారణంగా ప్రతి రోజూ వంద వ్రతాల వరకూ మాత్రమే ఇక్కడ జరుగుతాయి. అటువంటిది సోమవారం రెండు వందలకు పైగా ఈ వ్రతాలు జరిగాయి. స్వామివారిని దర్శించిన 40 వేల మంది భక్తులు: సుమారు 40 వేలమంది భక్తులు సోమవారం సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి వ్రతాలు 3,611 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
తెలుగు రాష్ట్రాలలో కార్తీక శోభ...
-
10 వేలమంది భక్తులతో దివ్యదర్శనం
13 జిల్లాల్లో ప్రముఖ ఆలయాలకు ఉచిత యాత్ర ∙ దేవాదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ అయినవిల్లి : జిల్లా నుంచి ఒకేసారి 10వేల మంది భక్తులు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాలను ఉచితంగా దర్శించేందుకు ‘దివ్యదర్శనం’ ప్రాజెక్టు పేరిట ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ ఆర్జేసీ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు. తద్వారా హిందూ ధర్మం ఉన్నతికి కృషి చేస్తున్నామన్నారు. బుధవారం ఆయన అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వామి అన్నదాన సత్రం నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదాల తయారీకి వంట చెరకుకు బదులు ఎల్పీ గ్యాస్ వినియోగించాలని ఈఓ ఎం.సత్యనారాయణరాజును ఆదేశించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. స్వామివారి ప్రసాదాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ‘దివ్య దర్శనం’ ప్రాజెక్టును అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభించనున్నామన్నారు. ఈ యాత్ర ఐదురోజులు పాటు ఉంటుందని, యాత్రలో పాల్గొనే భక్తులకు ఉచితంగా అన్ని సదుపాయాలనూ కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అయినవిల్లి, అప్పనపల్లి ఆలయాల విశిష్టతను రాష్ట్ర ప్రజలకు తెలిపేందుకు రథయాత్రలు ప్రారంభిస్తామని, ఇందుకోసం ప్రత్యేక రథాలను తయారు చేయిస్తామని చెప్పారు. అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయాన్ని నాలుగు వైపులా విస్తరించేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశామని, అందులో భాగంగానే ఆలయాభివృద్ధికి 4.50 ఎకరాల భూమిని కొనేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులరద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. కొండపైకి వాహనాలు అనుమతించకపోవడంతో భక్తులు కాలినడకన వెళ్లారు. సుమారు 35వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. 28ఏఎల్ఆర్305: క్యూలైన్లలో బారులుదీరిన భక్తులు -
బాసరలో భక్తుల సందడి
బాసర : శ్రావణమాసంలో ఆఖరి శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజామున పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదితీరాన శివాలయంలో పూజలు నిర్వహించారు. తమ చిన్నారులకు ఆలయ అర్చకులచే తల్లిదండ్రులు అక్షరాభ్యాస స్వీకార, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. -
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు
హుజూర్నగర్ : మట్టపల్లి కృష్ణాపుష్కరాలకు ఈనెల 20న గవర్నర్ పర్యటన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గురువారం మట్టపల్లిలోని ప్రహ్లాద ఘాట్‌ను పరిశీలించి గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ పర్యటన షెడ్యూల్ ప్రకారం భక్తుల రద్దీని గుర్తించి అందుకు తగిన విధంగా అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించాలన్నారు. ప్రహ్లాద ఘాట్‌లో వీఐపీలకు కేటాయించిన ప్రదేశంలో నూతనంగా కంచె ఏర్పాటు చేయడంతోపాటు అదే ఘాట్‌లోని మిగిలిన ప్రదేశంలో సాధారణ భక్తులను అనుమతించే విషయంపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గవర్నర్ పూజలు నిర్వహించాక స్థానికంగా గల ముక్కూరు పీఠానికి వెళ్లే దారిని పరిశీలించాల్సిందిగా సూచించారు. జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నామని ఈనెల 19 నుంచి డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడనున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్పెషల్ఆఫీసర్, డీఆర్డీఏ పీడీ అంజయ్య, మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, ట్రైనీ ఎస్పీ చందనాదీప్తి, డీఎస్పీ సునితామోహన్, సీఐ నర్సింహారెడ్డి, తహసీల్దార్ యాదగిరి, ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాంపల్లిగుట్ట గ్యాంగ్ అరెస్టు
ముగ్గురిపై రౌడీషీట్ ఆటో, కత్తి, నగదు స్వాధీనం త్వరలో పోలీస్ ఔట్‌పోస్టు వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు నాంపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి దర్శనం కోసం సమీపంలోని నాంపల్లిగుట్టపైకి వెళ్తుంటారు. ఈ క్రమంలో గుట్టపై గూండాగిరి చేస్తూ భక్తులను ఇబ్బంది పెడుతున్న గ్యాంగ్‌ను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. నాంపల్లి గ్రామానికి చెందిన దండుగుల నవీన్, బోదాసు మహేశ్, శివరాత్రి పర్శరాంను అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల డీఎస్పీ సుధాకర్ సోమవారం వీరిని అరెస్ట్ చూపారు. నిందితుల నుంచి ఓ ఆటో (ఏపీ 15 టీబీ 9663), రూ.7,600, సెల్‌ఫోన్, రెండు పాస్‌పోర్టులు స్వాధీన పరచుకున్నట్లు చెప్పారు. నవీన్, పర్శరాం పాస్‌పోర్టులను సీజ్ చేసినట్లు చెప్పారు. ముగ్గురిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ప్రకటించారు. నాంపల్లి గ్రామంలోని వడ్డెర కులానికి చెందిన వీరు కొన్నేళ్లుగా గల్ఫ్‌కు వెళ్లి ఇటీవలే తిరిగొచ్చారని తెలిపారు. నాంపల్లి గుట్టకు వస్తున్న యువతీయువకులను, భక్తులను బెదిరిస్తూ దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత నెల 30న నాంపల్లికి వచ్చిన పార్వతి అరుణ్‌కుమార్(సిరిసిల్ల) ఫిర్యాదు మేరకు గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. గ్యాంగ్‌ను పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో జీవన్, శ్రీనివాస్, రమేశ్, అనిల్‌ను డీఎస్పీ అభినందించారు. నాంపల్లి గుట్టపైకి చేరుకుంటున్న భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇప్పటికీ పీటీజెడ్ సీసీ కెమెరాలను బిగించామని, సుమారు కిలో మీటర్ వరకు ఏం జరిగినా ఇందులో రికార్డు అవుతుందని పేర్కొన్నారు. రాత్రి 9 గంటల తర్వాత గుట్టపైకి ఎవరినీ అనుమతించమని తెలిపారు. -
రాజమహేంద్రవరం 2 బరంపురం
గోదావరి జలాలతో శివభక్తుల పాదయాత్ర గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఒడిశా నుంచి వచ్చిన శివభక్తులు గోదావరి జలాలతో పాదయాత్రగా తిరుగుపయనమయ్యారు. ఒడిశా రాష్ట్రంలోని బరంపురానికి చెందిన 15 మంది శివ భక్తులు డి. కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో శివమాల దీక్షను బూని గోదావరిలో పవిత్ర స్నానాలు చేసేందుకు రైలు మార్గాన మంగళవారం రాజమహేంద్రవరం చేరకున్నారు. అక్కడ స్నానాలు ఆచరించిన వారు వెంట కలశాలలో గోదావరి జలాలను తీసుకుని పాదయాత్రగా స్వస్థలానికి బయల్దేరారు. జాతీయ రహదారిన నడుస్తూ బుధవారం దివాన్‌చెరువు వచ్చిన వారిని ‘సాక్షి’ పలుకరించింది. గోదావరి పవిత్ర జలాలతో అక్కడ శివలింగాన్ని అభిషేకిస్తే మంచి జరుగుతుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. – దివాన్‌చెరువు (రాజానగరం) -
రాజమహేంద్రవరం 2 బరంపురం
గోదావరి జలాలతో శివభక్తుల పాదయాత్ర రాజానగరం: గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఒడిశా నుంచి వచ్చిన శివభక్తులు గోదావరి జలాలతో పాదయాత్రగా తిరుగుపయనమయ్యారు. ఒడిశా రాష్ట్రంలోని బరంపురానికి చెందిన 15 మంది శివ భక్తులు డి. కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో శివమాల దీక్షను బూని గోదావరిలో పవిత్ర స్నానాలు చేసేందుకు రైలు మార్గాన మంగళవారం రాజమహేంద్రవరం చేరకున్నారు. అక్కడ స్నానాలు ఆచరించిన వారు వెంట కలశాలలో గోదావరి జలాలను తీసుకుని పాదయాత్రగా స్వస్థలానికి బయల్దేరారు. జాతీయ రహదారిన నడుస్తూ బుధవారం దివాన్‌చెరువు వచ్చిన వారిని ‘సాక్షి’ పలుకరించింది. గోదావరి పవిత్ర జలాలతో అక్కడ శివలింగాన్ని అభిషేకిస్తే మంచి జరుగుతుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం ఉదయం వరకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండల వాడి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని నిన్ని(గురువారం) 53,966 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
వన దేవతలకు ఒక్క ఎకరమేనా!
వరంగల్: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సగటున కోటి మంది భక్తులు వస్తారు. జాతర సందర్భంగా వందల ఎకరాల్లో ఎటు చూసినా భక్తులే కనిపిస్తారు. జాతర జరిగే ఏడాది ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అయితే, ఇంతటి ప్రాశస్థ్యం ఉన్న ఆలయానికి ఉన్న భూమి కేవలం ఒక ఎకరం మాత్రమే. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జాతర జరుగుతుంది. అయినా.. జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం భూమి కేటాయించడం లేదు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో మేడారం ఉంది. ఇక్కడ 155 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. రెండేళ్లకోసారి జరిగే జాతర సమయంలో 155 ఎకరాల ప్రభుత్వ భూముల్లో, దీని చుట్టూ ఉండే అటవీ శాఖకు చెందిన వందల ఎకరాల్లో భక్తులు బస చేస్తారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నా వన దేవతలకు ప్రత్యేకంగా భూమి కేటాయించే దిశగా ఏ ప్రభుత్వమూ చర్యలు చేపట్టలేదు. శాశ్వత భూమిలేదు జాతర జరిగే సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం మాత్రమే వన దేవతల ఆలయం పేరిట దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉంది. గద్దెల ప్రాంగణం చుట్టూ ఉన్న మరో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కార్యాలయాలు, భక్తుల వసతి నిర్మాణాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సాంకేతికంగా ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి. మేడారం జాతర జరిగే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఈ భూములను వినియోగించుకుంటోంది. పలు నిర్మాణాలను ఈ భూముల్లోనే చేపట్టింది. శాశ్వతంగా మాత్రం వన దేవతలకు భూములను కేటాయించలేదు. తెలంగాణలో మొదటిసారి జరుగుతున్న ప్రస్తుత జాతర మొదలయ్యే వరకైనా వన దేవతలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తుందనే ఆశాభావంతో ఆదివాసీలున్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖలు సమన్వయంతో వన దేవతల ఆలయానికి ప్రభుత్వ భూములను బదలాయించేందుకు ప్రయత్నించాలని వారు కోరుతున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.
-
ఆలయాల్లో కార్తీక కాంతులు
హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేకువజాము నుంచే శైవక్షేత్రాలు, నది, సముద్ర తీరాలు భక్తుల కళకళలాడాయి. పుణ్యస్నానాలు ఆచరించే భక్తులతో నిండిపోయాయి. గోదావరి తీరంలోని ఖమ్మం జిల్లా భద్రాచల క్షేత్రంలో వేకువజామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి తీరానికి చేరుకున్నారు. పుణ్యస్నానాలు చేసి, శ్రీరాముని సన్నిధిలో దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం పాతాళగంగ వద్ద రద్దీ పెరిగిపోయింది. మల్లికార్జున స్వామి దర్శనానికి జనం పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత సేవలను రద్దు చేసి, స్వామి వారి అలంకార దర్శన సేవభాగ్యం కల్పించారు. తిరుపతిలోని కపిలతీర్థంలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కపిలతీర్థం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భక్తులను దగ్గరగా అనుమతించటం లేదు. శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.సింహాచల వరాహ నరసింహ స్వామి క్షేత్రం, నల్లగొండ జిల్లా యాదాద్రి, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలు కార్తీక దీపారాధన చేశారు. గోదావరి, కృష్ణా నదులతోపాటు బాపట్ల సూర్యలంక, ఒంగోలు, విశాఖ కాకినాడ, బందరు సముద్ర తీరాల్లో భక్తులు కార్తీక స్నానాలు చేస్తున్నారు.