
రాజమహేంద్రవరం 2 బరంపురం
గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఒడిశా నుంచి వచ్చిన శివభక్తులు గోదావరి జలాలతో పాదయాత్రగా తిరుగుపయనమయ్యారు.
అక్కడ స్నానాలు ఆచరించిన వారు వెంట కలశాలలో గోదావరి జలాలను తీసుకుని పాదయాత్రగా స్వస్థలానికి బయల్దేరారు. జాతీయ రహదారిన నడుస్తూ బుధవారం దివాన్‌చెరువు వచ్చిన వారిని ‘సాక్షి’ పలుకరించింది. గోదావరి పవిత్ర జలాలతో అక్కడ శివలింగాన్ని అభిషేకిస్తే మంచి జరుగుతుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు.