siva
-
కార్తీకం స్పెషల్.. దేశంలోని ప్రముఖ శివాలయాలు
దీపావళి అమావాస్య వెళ్లగానే కార్తీకమాసం ప్రవేశించింది. ఈ మాసంలో శివారాధన ఎంతో శ్రేష్టమని పెద్దలు చెబుతుంటారు. మనదేశంలో వేల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కేదార్నాథ్ (ఉత్తరాఖండ్)భారతదేశంలోని నాలుగు ధామాలలో కేదార్నాథ్ ఒకటి. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌లో మందాకిని నదికి సమీపంలో ఉన్న కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3583 మీటర్ల ఎత్తులో ఉంది.లింగరాజ్ ఆలయం (భువనేశ్వర్)భువనేశ్వర్‌లోని పురాతన శివాలయాలలో లింగరాజ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని సోమవంశీ రాజవంశానికి చెందిన రాజు జజాతి కేశరి నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుని స్వరూపమైన హరిహరుడు. ఈ ఆలయ ప్రస్తావన సంస్కృత గ్రంథాలలో కనిపిస్తుంది.నాగేశ్వర దేవాలయం (గుజరాత్)ఈ ఆలయం ద్వారకకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయాన్ని నాగనాథ్ దేవాలయం అని కూడా అంటారు. ఇది గుజరాత్‌లోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. నాగేశ్వర్ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి విషం శరీరంలోకి ప్రవేశించదని భక్తులు నమ్ముతారు.కాశీ విశ్వనాథ దేవాలయం (ఉత్తర ప్రదేశ్)కాశీ విశ్వనాథ దేవాలయం వారణాసిలో పవిత్ర గంగానదికి పశ్చిమ ఒడ్డున ఉంది. బంగారు పూతతో కూడిన గోపురాలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. కాశీ విశ్వనాథుని సమక్షంలో చివరి శ్వాస తీసుకునే వారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని చెబుతారు.శివోహం శివాలయం (బెంగళూరు)శివుని ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో 65 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం ఉంది. శివోహం శివాలయంలో అతిపెద్ద శివలింగ ద్వారం కూడా ఉంది. ఇక్కడ శివునితో పాటు 32 అడుగుల ఎత్తయిన వినాయకుడి విగ్రహం కూడా ఉంది. ఈ శివాలయంలో ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుందని నమ్మకం.మురుడేశ్వర్ (కర్ణాటక)ఉత్తర కర్ణాటకలోని మురుడేశ్వర్‌లో ఎత్తయిన శివుని విగ్రహం ఉంది. ఆలయం వెనుక అరేబియా సముద్రం గంభీరంగా కనిపిస్తుంది. ఈ విగ్రహానికి సమీపంలో 20 అంతస్తుల శివుని ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి తరలివస్తుంటారు.సిద్ధేశ్వర్ ధామ్ (సిక్కిం)సిద్ధేశ్వర్ ధామ్ ఆలయం సిక్కిం రాజధాని గాంగ్టాక్కు సమీపంలో ఉంది. విష్ణువు, కృష్ణుడు, జగన్నాథుడు శివుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. 12 జ్యోతిర్లింగాలతో పాటు 108 అడుగుల ఎత్తయిన శివుని విగ్రహం కూడా ఇక్కడ ఉంది.ఇది కూడా చదవండి: పార్వతీపురంలో గజ రాజుల బీభత్సం -
టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ బెయిల్ రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని రెండు ప్రాంత్లాలో ఉన్న ఖరీదైన భూములపై కన్నేసి, నకిలీ పత్రాలతో కబ్జా చేసే ప్రయత్నం చేసిన టాలీవుడ్ నిర్మాత, రియల్డర్ బూరుగుపల్లి శివరామకృష్ణ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అరెస్టు అయిన మరుసటి రోజే బెయిల్‌పై బయటకు వచ్చిన ఈయన గురువారం మళ్లీ కటకటాల్లోకి వెళ్లారు. బెయిల్ రద్దు చేయడంతో పట్టుకున్న ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శివరామకృష్ణతో పాటు బెయిల్ పొందిన మరో నిందితుడు లింగమయ్య ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. శివరామకృష్ణ శ్రీవెంకటేశ్వర ఎస్టేట్స్ సంస్థకు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్నారు. రాయదుర్గం పైగా విలేజ్‌లోని సర్వే నం.46లో ఉన్న 83 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు యాచారంలోని మరో 10 ఎకరాల ప్రైవేట్ భూమిపై కన్నేశారు. వీటిపై నకిలీ పత్రాలు సృష్టించిన శివరామకృష్ణ తార్నాకలో ఉన్న స్టేట్ ఆరై్కవ్స్లో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్న కె.చంద్రశేఖర్‌ను సంప్రదించారు. అతడి సహాయంతో వీటికి మద్దతుగా స్టేట్ ఆరై్కవ్స్ నుంచి ఓ నకిలీ పహాణీ, సేత్వార్ రూపొందించి, అటెస్టేషన్ చేయించి తీసుకున్నారు. వీటి ఆధారంగా సైదాబాద్‌కు చెందిన రియల్టర్ ఎం.లింగమయ్యతో కలిసి రంగంలోకి దిగిన శివరామకృష్ణ రాయదుర్గంలోని భూమి తనదే అంటూ అందులో పాగా వేశారు. యాచారంలో ఉన్న ప్రైవేట్ భూమి మీద వివాదం సృష్టించారు. శివరాకృష్ణ సమరి్పంచినవి నకిలీ పత్రాలని తేలి్చన న్యాయస్థానం అది ప్రభుత్వ భూమిగా ప్రకటించింది. దీనిపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు ఈ నెల 17న శివరామకృష్ణ, చంద్రశేఖర్, లింగమయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అనారోగ్య కారణాలు చూపిన శివరామకృష్ణ, లింగమయ్య ఆ మరుసటి రోజే బెయిల్ పొందారు. వీటిని రద్దు చేయాలని కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇరువురికీ మంజూరు చేసిన బెయిల్ రద్దు చేసింది. దీంతో గురువారం శివరామకృష్ణను పట్టుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు. స్టేట్ ఆరై్కవ్స్ ఉద్యోగి చంద్రశేఖర్ ఇప్పటికీ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
రీరిలీజ్.. టాలీవుడ్లో ఇప్పుడిదే ట్రెండ్!
రీరిలీజ్ అనేది ఇప్పుడు టాలీవుడ్లో ట్రెండింగ్‌గా మారింది. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ మూవీస్ వరుసగా మళ్లీ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. అభిమానుల డిమాండ్ మేరకు నచ్చిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. టెక్నాలజీ వాడుకొని అత్యంత నాణ్యమైన 4కేలో సినిమాను రిలీజ్ చేస్తుండడంతో అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆయా చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో చూసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్లో స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు కొన్ని రీరిలీజ్ అయి మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఇప్పుడు వరుసగా నాలుగు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. అవేంటో చూసేయండి.దర్శకధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘విక్రమార్కుడు’. 2006లో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలించింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మూవీ థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. జులై 27న ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.మహేశ్‌బాబు హీరోగా, కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘మురారి’. 2001లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మణిశర్మ అందించిన సంగీతం, పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించింది. మహేశ్‌ని ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరకు చేసిన చిత్రమిది. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం రిలీజ్ కానుంది. మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని 4కే వెర్షన్లో రిలీజ్ చేయనున్నారు.ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘శివ’ కూడా రీరిలీజ్‌కు రెడీ అవుతోంది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ... అక్టోబర్ 5, 1989లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ గతినే మార్చేసింది. ఈ తరం అక్కినేని అభిమానుల కోసం ఈ చిత్రం మరోసారి థియేటర్లో సందడి చేయనుంది. నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అమల, శుభలేఖ సుధాకర్, రఘువరన్, తనికెళ్లభరణి తదితరులు నటించారు.ప్రేమ కథలకు పెట్టింది పేరు గౌతమ్ మీనన్. ఆయన తెరకెక్కించిన క్యూట్ లవ్ స్టోరీ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. నాని-సమంత జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం 2012 డిసెంబర్ 14 విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు. -
వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని ఇద్దరు యువకుల దారుణహత్య
కడ్తాల్: వాట్సాప్ గ్రూపు లొల్లి ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్‌లోని ఓ విల్లాలో గురువారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోవిందాయిపల్లికి చెందిన బీజేపీనేత జల్కం రవి ఇటీవల బటర్ ఫ్లై వెంచర్‌లోని ఓ విల్లాను అద్దెకు తీసుకొని రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ నెల 4న సాయంత్రం బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్నేహితులతో కలిసి రవి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ ఫోటోలను రవి తన గ్రామా నికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై పలువురు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గోవిందాయిపల్లికి చెందిన గుండెమోని శివగౌడ్(25), శేషగారి శివగౌడ్(27)లు రవిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. దీంతో 5వ తేదీన సాయంత్రం రవి వీరిద్దరిని తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అప్పటికే రవి వద్ద బీజేవైఎం నాయకుడు పల్లె రాజుగౌడ్ ఉన్నాడు. నలుగురూ మద్యం తాగడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గ్రూప్ నుంచి నన్ను ఎందుకు తొలగించారు..? ఫొటోలు ఎందుకు డిలీట్ చేశారు అని రవి ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహానికిలోనైన రవి, పల్లె రాజుగౌడ్ కత్తులలో దాడి చేసి గుండెమోని శివగౌడ్, శేషగారి శివగౌడ్‌ను చంపేశారు. అనంతరం విల్లాకు తాళం వేసి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బటర్ ఫ్లై సిటీలోని ఆ విల్లాకు వెళ్లి తాళం పగులగొట్టారు. లోపల రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. గుండెమోని శివగౌడ్ హైదరాబాద్‌లోని ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తుండగా, శేషుగారి శివగౌడ్ డ్రైవర్‌గా పనిచేస్తునట్టు తెలిసింది. యువకుల హత్యలకు వాట్సాప్ వివా దమే కారణమా.. మరేదైనా ఉందా..? అని గ్రామస్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీశైలం– హైదరాబాద్ జాతీ య రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో రెండుగంటలకుపైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో హైదరాబాద్ వెళుతున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ జెడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్ మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. -
టీడీపీ అంతమే.. మా పంతం
అనంతపురం క్రైం: ‘టీడీపీ కోసం నా భర్త, బావ ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి సేవ చేస్తున్నాం. అయినా మాకు తీవ్ర అన్యాయం చేశారు. డబ్బున్నోళ్లకు సీట్లు అమ్ముకుని కురుబ కులస్తులకు మొండిచేయి చూపారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించం. రాష్ట్రంలోని కురుబలంతా టీడీపీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం’ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురుబ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ బుల్లే శివబాల ధ్వజమెత్తారు. ఆమె మంగళవారం అనంతపురం నగర శివారులోని చెరువుకట్ట శ్మశాన వాటికలో భర్త నాగరాజు సమాధిపై ఉన్న ‘టీడీపీ కార్యకర్త’ అనే నేమ్‌బోర్డును తొలగించారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించబోమని భర్త సమాధిపై శపథం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. నలభై ఏళ్లుగా టీడీపీనే కుటుంబంగా..కుటుంబమే పారీ్టగా పని చేశామన్నారు. పార్టీ కోసం తన భర్తతో పాటు బావ పావురాల కిష్టాను కోల్పోయామని చెప్పారు. తనకు అనంతపురం అసెంబ్లీ లేదా పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం ఇస్తామని లోకేశ్ పాదయాత్రలో హామీ ఇచ్చారన్నారు. అనంతపురం అర్బన్‌తో కనీస పరిచయం లేని దగ్గుపాటికి సీటిచ్చిన చంద్రబాబు.. పార్టీ కోసం కష్టపడిన ప్రభాకరచౌదరికి మొండిచేయి చూపారని మండిపడ్డారు. చంద్రబాబు నా వెంట్రుకతో సమానమన్న గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు అభ్యర్థిగా, కాంట్రాక్టులు చేసుకునే అమిలినేని సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం అభ్యర్థిగా అవకాశం కల్పించి.. చాలా ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనలాంటి బీసీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. బీసీల పార్టీ అని పదేపదే చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవానికి బీసీలను ఏనాడూ పట్టించుకోలేదని శివబాల విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముగ్గురు కురుబలకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారని చెప్పారు. వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు గుర్తింపు దక్కిందని చెప్పారు. -
ఆ సమాధానాలు మూడో భాగంలో చెబుతాం
హీరోయిన్ అంజలి నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ ఇది. ఈ సీక్వెల్లో శ్రీనివాస రెడ్డి, సునీల్, సత్య, అలీ, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, రాహుల్ మాధవ్ కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్ శివ తుర్లపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శివ తుర్లపాటి మాట్లాడుతూ –‘‘మా సినిమాలోని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవని కొందరు సినీ విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు ‘గీతాంజలి’ పార్టు 3లో ఉంటాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత దర్శకుడు తేజగారి ‘జై’ సినిమాతో కొరియోగ్రాఫర్‌గా మారాను. వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్లి, అక్కడ డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తున్నాను. నేను అమెరికాలో చేసిన ఓ కవర్ సాంగ్ ద్వారా కోన వెంకట్‌గారు నాకు పరిచయం అయ్యారు. ఇక దర్శకుడిగా నా తదుపరి సినిమా కోసం రెండు కథలు రెడీగా ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
కాశీలో హిందువుగా మారిన రష్యన్ మహిళ
విశ్వనాథుడు కొలువైన కాశీ నగరం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనది. దేశ విదేశాల నుంచి మహాశివుని భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇదే కోవలో నిజమైన ప్రశాంతతను వెతుక్కుంటూ కాశీకి వచ్చిన ఒక రష్యన్ మహిళ సనాతన ధర్మాన్ని స్వీకరించి, ఇంగా నుండి ఇంగానందమయిగా మారారు. వారణాసిలోని శివలా ఘాట్ సమీపంలోని వాగ్యోగ పీఠం వద్ద ఇంగానందమయి ఈ దీక్ష తీసుకున్నారు. ఇంగా రష్యాలోని మాస్కో నివాసి. ఈ దీక్షకు ముందు ఆమె భారతీయుల తరహాలో వస్త్రధారణ చేశారు. పూజలో కూర్చొని, సనాతన ధర్మ ప్రక్రియను అనుసరించి, హిందూ మతాన్ని స్వీకరించారు. పండితులు ఆశాపతి త్రిపాఠి నుండి ఇంగా దీక్షను స్వీకరించారు. అనంతరం ఆమె మహాశివునికి రుద్రాభిషేకం చేశారు. పండితులు ఆశాపతి త్రిపాఠి తనకు జీవితంలో ప్రశాంతతను అందించారని ఇంగా తెలిపారు. తాను ఇప్పటికే తాంత్రిక దీక్షను స్వీకరించానని, అయితే తనలోని అశాంతిని తొలగించుకునేందుకు సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు ఇంగా తెలిపారు. శివునికి రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం శాంతించాలని ప్రార్థించానని ఇంగా పేర్కొన్నారు. -
ఓటీటీలో టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రాచీ టకర్, నేహా దేశ్‌పాండే, ప్రభాకర్ , కునల్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త వెబ్ సిరీస్ ఎల్ఎస్డీ. ఈ సీరీస్‌కు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ మోదుగ , శివ కోన సంయుక్తంగా నిర్మించారు. ఈ సిరీస్‌ను సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఎల్ఎస్డీ ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. మూడు జంటల మధ్య జరిగే ఆసక్తికరమైన సన్నివేశాలు, ఫారెస్ట్ ట్రిప్ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేస్తున్నాయి. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో ఆద్యంతం సస్పెన్స్ ఉన్నట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్లో ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ వెబ్ సిరీస్‌కు ప్రవీణ్ మని, శశాంక్ తిరుపతి సంగీతం అందిస్తున్నారు. -
HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సర్వీసు నుంచి తొలగించేందుకు చర్యలు
-
ఆకట్టుకుంటున్న'భూతద్ధం భాస్కర్ నారాయణ' టైటిల్ సాంగ్
శివ కందుకూరి, రాశిసింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'భూతద్ధం భాస్కర్ నారాయణ'. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి, పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల స్వరపరిచి స్వయంగా పాడిన ఈ పాట చాలా క్యాచిగా ఉంది. పురుషోత్తం రాజ్, సురేష్ బనిశెట్టి రాసిన లిరిక్స్ హీరో క్యారెక్టరైజేషన్ ని ఆకట్టుకునేలా ప్రజెంట్ చేశాయి. -
ఎమోషనల్ రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశీ, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వర్ రావు నిర్మించిన ఈ చిత్రం జనవరి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇండస్ట్రీని బతికించుకునేందుకు ‘రాఘవరెడ్డి’లాంటి సినిమాలను ప్రేక్షకులు విజయవంతం చేయాలి. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపిస్తున్నాయి’’ అన్నారు. ‘‘ఇంట్రవెల్ అందరికీ నచ్చుతుంది. క్లైమాక్స్ సీన్స్ ఎమోషనల్‌గా టచ్ అవుతాయి. ఆడియన్స్ కంటతడి పెడతారు’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా ‘రాఘవ రెడ్డి’ అనే ఓ మంచి సినిమా తీశాను’’ అన్నారు సంజీవ్. ‘‘ఈ సినిమాలో కూతురే ప్రపంచంగా బతికే దేవకి పాత్ర చేశాను’’ అన్నారు రాశీ. ‘‘ఈ సినిమాలో క్రిమినాలజీ ఫ్రొఫెసర్ రాఘవ రెడ్డిగా శివగారు నటించారు. యూత్‌కి కావల్సిన ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, సోషల్ మెసేజ్ కూడా ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. -
‘ఉండి’ టీడీపీలో నువ్వా? నేనా?
ఉండి: పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశానికి కంచుకోటగా చెప్పుకొనే ఉండి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు రోడ్డెక్కాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ నాయకులు చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉండిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వి.వి.శివరామరాజు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఉండి రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద ఉన్న టీడీపీ మండల కార్యాలయం ముందు ఆదివారం టీడీపీ నాయకులు నిరసనదీక్ష చేపట్టారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పాల్గొని శ్రేణులను ఉత్సాహపరుస్తూ వారితో నిరసనకు దిగారు. అనంతరం శిబిరంలోకి ఎమ్మెల్యే రామరాజు వచ్చారు. కొద్దిసేపటి తరువాత మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆ శిబిరానికి పక్కనే మరో శిబిరం ఏర్పాటు చేయించి అందులో కూర్చుని నిరసన చేపట్టారు. దీంతో ఆయన అనుచరులు కూడా ఆ శిబిరంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల విభేదాలు మరోసారి రోడ్డెక్కడంతో నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. చాలామంది మాజీ ఎమ్మెల్యే శివరామరాజు శిబిరంలోకి చేరి ఆయనకు మద్దతు తెలపడంతో విభేదాలు మరింత పెరిగాయి. ఈ మధ్యకాలంలో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకునేందుకే టీడీపీ నాయకులు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారుగానీ వారికి చిత్తశుద్ధి లేదంటూ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ప్రస్తుత ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర దూషణలకు దిగారు. ఉండి టీడీపీ కంచుకోటకు బీటలువారాయని ఆ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. -
అంతుచిక్కని మహమ్మారి.. శోక సంద్రంలో తల్లిదండ్రులు
హైదరాబాద్: అంతుచిక్కని వ్యాధితో పోరాడిన సందెపల్లి శివచరణ్ ఓడిపోయి మృత్యువు ఒడికి చేరుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆదివారం ఇంట్లోనే ప్రాణాలు విడిచాడు. మృతుడి అన్న అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం, ముల్కలపల్లి గ్రామానికి చెందిన సందెపల్లి ఉప్పలయ్య, పారిజాత దంపతులు చాలాకాలం క్రితం నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి స్థానిక సోనియాగాందీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి సందెపల్లి అఖిల్, సందెపల్లి శివచరణ్ ఇద్దరు కుమారులు. అయితే వీరిద్దరూ చిన్ననాటి నుంచే అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారు మస్క్యూలర్ డిస్ట్రోఫి అనే వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నడవలేకపోవడం, నడుస్తూ పడిపోవడం వంటి లక్షణాలతో ప్రారంభమైన వ్యాధి రానురాను కదల్లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది. క్రమంగా చేతులు, కాళ్లు వంకరపోయి పూర్తిగా చచ్చుబడిపోవడంతో ఒకరు 12, మరొకరు 8వ ఏట నుంచి మంచానికే పరిమితమయ్యారు. పిల్లల దుస్థితిని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. తీవ్ర జ్వరంతో శివచరణ్ మృతి ఈ క్రమంలో వారు 2017లో సాక్షిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లల దుస్థితిపై ఆడి.. పాడే.. వయస్సులో అంతుచిక్కని వ్యాధి అంటూ 2017 మే నెలలో సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. సాక్షి కథనానికి స్పందించిన బీఎల్ఆర్ ట్రస్టు చైర్మన్, ప్రస్తుత బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి వారిని కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంబైలో వ్యాధికి సంబంధించి వైద్యం లభిస్తుందని, అందుకు తమకు స్థోమత లేదని బీఎల్‌ఆర్‌తో తల్లిదండ్రులు వాపోయారు. తనకున్న పరిచయాలతో అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరి వైద్యం చేయించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారని కొంత కాలం మందులు వాడాలన్న వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర జ్వరంతో శివచరణ్ ఆదివారం మృతిచెందాడు. పెద్ద కొడుకు అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఎల్ఆర్ వారికి ఆర్థికసాయం అందజేసి ధైర్యం చెప్పారు. -
ఓ ఊరి ఆత్మకథ
శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా మల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. మల్లి మాట్లాడుతూ– ‘‘ఒక ఊరికి ఆత్మ ఉంటే.. ఆ ఆత్మ తన కథ తానే చెబితే ఎలా ఉంటుంది? అనేది చిత్రకథాంశం’’ అన్నారు. ‘‘మంచి యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సురేష్ భార్గవ్. -
శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే!
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో మూఢనమ్మకాలకు సంబంధించిన ఉదంతమొకటి సంచలనంగా మారింది. మహాశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆలయంలో ఒక యువకుడు వృక్షాలను కట్ చేసే యంత్రంతో తన గొంతు కోసుకున్నాడు. సమాచారం తెలియగానే అతని కుటుంబ సభ్యులు పరుగుపరుగున ఆలయానికి చేరుకుని, బాధితుడిని చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధిత యువకుని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటన రఘునాథ్పురా గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన పల్టూ రామ్ కుమారుడు దీపక్ కుశ్వాహ్(30) కూలీనాలీ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంటాడు. దీపక్ తండ్రి పల్టూరామ్ తెలిపిన వివరాల ప్రకారం దీపక్‌కు ఇద్దరు పిల్లలు. దీపక్ మహాశివుని భక్తుడు. గత కొంతకాలంగా దీపక్ ఉదయం, రాత్రివేళల్లో మహాశివునికి పూజలు చేస్తుంటాడు. ఇటీవల దీపక్ తాను మెడ కోసుకుని మహాశివుని ప్రసన్నం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పల్టూ రామ్ తన కుమారుతో అటువంటి పని చేయవద్దని చెప్పాడు. అయితే కుమారుడు అతని మాట వినలేదు. కాగా దీపక్ ఒక నోట్‌బుక్‌లో మహాశివుని మంత్రాలను, శివునితో సాగించిన సంభాషణను రాస్తుంటాడు. దానిలో దీపక్ మహాశివునికి తనను తాను అర్పించుకుంటానని రాశాడు. దానిలో పేర్కొన్న విధంగా ఉదయం 4 గంటలకు ఆలయానికి వెళ్లాడు. అక్కడ చెట్లు కట్ చేసే యంత్రంతో మహాశివుని సమక్షంలో తన మెడను కట్ చేసుకుని జయజయధ్వానాలు చేశాడు. దీనిని అక్కడున్నవారు గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు వెంటనే ఆలయానికి చేరుకుని భాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దీపక్ చిన్నాన్న ప్రసాద్ మాట్లాడుతూ దీపక్ మెడ కట్ చేసుకున్న సమయంలో ‘జై భగవాన్ శంకర్’ అనే నినాదాలు చేశాడని తెలిపారు. బాధితునికి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్ సచిన్ మాహుర్ మాట్లాడుతూ దీపక్ అనే యువకుడు స్వయంగా తన మెడ కోసుకున్నాడని, అతనికి వైద్య చికిత్స జరుగుతున్నదని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. ఇది కూడా చదవండి: సీమా హైదర్, అంజూ తరహాలో రాజస్థాన్ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు.. -
కరెంటుషాక్‌తో ఒకరు.. భయంతో మరొకరు..
కల్వకుర్తి టౌన్: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు నీటిగుంతలో కరెంటుషాక్‌కు గురై మరణించగా, మరొకరు భయంతో ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. కల్వకుర్తికి చెందిన అనిల్(18), రాజేశ్ వాటర్ప్లాంట్లలో ఆటోడ్రైవర్లు. తమ పనులు ముగిసిన తర్వాత కల్వకుర్తి తిమ్మనోనిపల్లి వద్ద ఉన్న నరసింహారెడ్డి వ్యవసాయ పొలంలోని నీటిగుంతలో ఈత కొట్టడానికి వెళ్లారు. పక్క పొలంలో ఉన్న కుర్మిద్దకు చెందిన శివ (22)ను సైతం ఈత కొట్టడానికి పిలిచారు. ముగ్గురు కలిసి నీటిగుంతలోకి దిగారు. అయితే అది లోతుగా ఉండటంతో నీటిని బయటకు తోడేందుకు విద్యుత్ మోటారు ఏర్పాటు చేశారు. నీళ్లు తోడేస్తుండగా మధ్యలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వారు గుంతలోకి దిగి ఈత కొడుతున్నారు. కొద్దిసేపటికి కరెంటు సరఫరా కావడంతో అనిల్ విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో భయాందోళనకు గురైన శివ సమీపంలోని మరో వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
వడ్డించడానికి రెడీగా ఉన్న 'రాజుగారి కోడిపులావ్'..!
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'రాజు గారి కోడిపులావ్' కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన పాటలు, వీడియోలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. (ఇది చదవండి: కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్ రిలీజ్.. కానీ డైరెక్టర్ మిస్సింగ్!) 'రాజు గారి కోడిపులావ్' చిత్రంలో నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. అలాగే అందరికి సుపరిచితుడు అయిన బుల్లితెర నటుడు ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ మనీ సంగీతమందించారు. (ఇది చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) -
ఆ డైరెక్టర్‌తో వన్స్‌మోర్ అంటున్న అజిత్, ఆ బ్యానర్లో మాత్రం..
అజిత 63వ చిత్రం ఫిక్స్ అయిందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. అయితే ఆయన నటిస్తున్న 62వ చిత్రమే ఇంకా సెట్ పైకి వెళ్లలేదు అంటారా? నిజమే, లైకా ప్రొడక్షన్స్ సంస్థ మగిల్ తిరుమేణి దర్శకత్వంలో నిర్మించనున్న విడా ముయర్చి చిత్రం జూలై మొదటి వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పుడు అజిత్ 63వ చిత్రం గురించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. రేర్ కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ రజనీకాంత్, విజయ్, ధనుష్ వంటి పలువురు ప్రముఖులు హీరోలతో చిత్రాలు నిర్మించింది. కానీ ఇప్పటి వరకు అజిత్‌తో చిత్రం తీయలేదు. కారణం ఆయన చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనరనేదే కారణం అని టాక్ ఉంది. అలాంటిది ఇన్నాళ్లకు ఈ సంస్థ అజిత్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు కారణం దర్శకుడు శివ అని తెలిసింది. దర్శకుడు శివ ఇంతకుముందు అజిత్ హీరోగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం వంటి నాలుగు హిట్ చిత్రాలను రూపొందించారన్నది తెలిసిందే. అదేవిధంగా రజనీకాంత్ కథానాయకుడిగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన అన్నాత్తే చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. దీంతో ఈ సంస్థలో నిర్మితం కానున్న సినిమాలో అజిత్ హీరోగా నటించడానికి ఈయనే కారణం అని తెలుస్తోంది. కాగా అజిత్ కథానాయకుడిగా సన్ పిక్చర్స్ నిర్మించే చిత్రానికి శివనే దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. చదవండి: చరణ్-ఉపాసనల బిడ్డ కోసం ఊయల -
నాన్న శివ సినిమాకు కస్టడీ సినిమాకు కనెక్షన్..
-
Tamil Nadu: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి Vs ఎంపీ!
తిరుచ్చి వేదికగా అధికార డీఎంకే వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు చెందిన మద్దతు దారుల మధ్య బుధవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం తమ నేతకు విలువ ఇవ్వడం లేదంటూ ఎంపీ శివ అనుచరులు మంత్రి నెహ్రూకు వ్యతిరేకంగా తొలుత నల్ల జెండాలను ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీంతో పోలీస్ స్టేషన్లోకి చొరబడి మరీ ఎంపీ అనుచరులను మంత్రి వర్గీయులు చితక్కొట్టారు. సాక్షి, చెన్నై: డీఎంకేలో నగరాభివృద్ధి శాఖ మంత్రిగా, పారీ్టలో సీనియర్ నేతగా కేఎన్ నెహ్రూ మంచి గుర్తింపు పొందారు. ఇక, ఎంపీ శివ ఢిల్లీ వేదికగా డీఎంకే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఇద్దరు తిరుచ్చికి చెందిన వారే. ఇదే జిల్లా నుంచి మరో మంత్రిగా అన్బిల్ మహేశ్ కూడా ఉన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేకున్నా, మంత్రి నెహ్రూ, ఎంపీ తిరుచ్చి శివ మాత్రం ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్నారు. నిరసనతో మొదలై.. తిరుచ్చిలో బుధవారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త భవనాల నిర్మాణాలకు శంకు స్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటికి ప్రారంభోత్సవాలు పెద్దఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి నెహ్రూ బిజీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమాలకు ఎంపీ తిరుచ్చి శివను ఆహ్వానించక పోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో తిరుచ్చి కంటోన్మెంట్‌లోని ఎంపీ శివ ఇంటికి సమీపంలోని ఓ క్రీడా మైదానం ప్రారంభోత్సవానికి ఉదయాన్నే మంత్రి నెహ్రూ వచ్చారు. ఈ సమయంలో శివ వర్గీయులు నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన తెలియజేయడం వివాదానికి ఆజ్యం పోసింది. శివ వర్గీయులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రా రంబోత్వవాన్ని ముగించుకుని మంత్రి నెహ్రూ తిరుగు ప్రయాణంలో ఉండగా, ఆయన మద్దతుదారులు రెచ్చి పోయారు. తిరుచ్చి శివ ఇంటి ముందు ఆగి ఉన్న కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఇంటి ముందు ఉన్న వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. మంత్రి కళ్లెదుటే ఈ దాడులు జరగడం గమనార్హం. అంతటితో వదిలి పెట్టక నేరుగా మంత్రి మద్దతుదారులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భద్రతా విధుల్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. 100 మందికి పైగా వచ్చిన మంత్రి మద్దతుదారులు లోనికి చొరబడి వీరంగం సృష్టించారు. తిరుచ్చి శివ వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శాంతికి గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ శివ ఇంటి వద్ద పోలీసు భద్రతను పెంచారు. పోలీసు స్టేషన్లోకి చొరబడి దాడులకు పాల్పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పార్టీ నాయకుల వీరంగంపై సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్ చేశారు. தேர்தலுக்கு முன்னாடியே போலீஸ் ஸ்டேசனுக்கு லஞ்சம் குடுத்த @KN_NEHRU வை அமைச்சரா ஆக்குனா ஸ்டேசன்ல இதான் நடக்கும். pic.twitter.com/XezvEN06DW — Savukku Shankar (@Veera284) March 15, 2023 నెల్లైలోనూ వివాదం.. తిరుచ్చిలో ఇద్దరు కీలక నేతల మద్దతు దారుల మధ్య వార్ చోటు చేసుకుంటే, తిరునల్వేలిలో మేయర్, జిల్లా కార్యదర్శి మధ్య సమరం రాజధానికి చెన్నైకు చేరింది. తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్ శరవణన్, జిల్లా పార్టీ కార్యదర్శి అబ్దుల్ వకాబ్ మధ్య వివాదంతో ఆ కార్పొరేషన్ డీఎంకే చేజారే పరిస్థితి నెలకొంది. అబ్దుల్ వకాబ్ మద్దతుగా 30 మందికి పైగా కార్పొరేటర్లు మేయర్ శరవణన్‌కు వ్యతిరేకంగా తిరుగు బావుట ఎగుర వేశారు. మేయర్‌ను తప్పించాలని నినాదిస్తూ చెన్నైకు బుధవారం ప్రయాణమయ్యారు. మా«ర్గంమధ్యలో తిరుచ్చిలో మంత్రి కేఎన్ నెహ్రూను కలిసి కొందరు కార్పొరేటర్లు వినతి పత్రం సమరి్పంచారు. గురువారం చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో మేయర్‌పై ఫిర్యాదు చేయనున్నారు. ఐదుగురికి పార్టీ నుంచి ఉద్వాసన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడుల నేపథ్యంలో పోలీసు స్టేషన్లోకి చొరబడి వీరంగం సృష్టించిన వారిపై డీఎంకే అధిష్టానం కన్నెర్రజేసింది. తిరుచ్చి కార్పొరేటర్లు ముత్తసెల్వం, విజయ్, రాందాసు, యూనియన్ నేత దురై రాజ్, ఉపనేత తిరుపతిని పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఎంకే కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఐదుగురు పోలీసు స్టేషన్లో లొంగి పోయారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడి ప్రత్యర్థులపై జరిపిన దాడికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీరంతా పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు. -
డై హార్డ్ ఫ్యాన్.. వెండితెరపై ‘సాఫ్ట్వేర్’ కుర్రాడు
మధురవాడ (భీమిలి): ఆ యువకుడికి సినిమాలంటే పిచ్చి..ఎలాగైనా సరే తెరపై కనిపించాలని కలలుగన్నాడు. చిన్నతనం నుంచీ ఇదే ధ్యాస. వయసు పెరిగే కొద్దీ లక్ష్యం మరింత బలపడింది. చిన్నచిన్న పాత్రలతో ఆకట్టుకున్నాడు. కట్ చేస్తే డై హార్డ్ ఫ్యాన్ సినిమాతో హీరో అయ్యాడు. మంచి టాక్ తెచ్చుకోవడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరనుకుంటున్నారా? విశాఖకు చెందిన శివ రామకృష్ణ ఆలపాటి. సింపుల్‌గా శివ అలపాటి. చదవండి: రెండోపెళ్లిపై చర్చకు దారితీసిన రేణు దేశాయ్ కామెంట్స్ శివది స్వస్థలం పీఎంపాలెం కాగా.. విశాఖ కిర్లంపూడి లే అవుట్లో నివాసం ఉంటున్నాడు. శివ హీరోగా ‘డై హార్డ్ ఫ్యాన్’ చిత్రంలో నటించారు. ఈ నెల 2న చిత్రం హైదరాబాద్‌లో విడుదలైంది. త్వరలోనే ఏపీ అంతటా విడుదల చేయనున్నారు. సినిమా యూత్‌ను మెప్పించింది. దీంతో తన ఆశలకు ఈ చిత్రం జీవం పోసినట్టుందని శివ పేర్కొన్నాడు. శివ సరసన ప్రియాంక్ శర్మ హీరోయిన్ నటించగా, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అభిరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోయిన్‌కి, అభిమానికి మధ్య జరిగిన సస్పెన్స్ కామెడీ డ్రామానే ఈ సినిమా కథ. సినిమా అంటే ప్రాణం మొదటి నుంచీ సినిమాలన్నా..నటనన్నా చాలా ఇష్టం. ఓ వైపు చదువుకుంటూ మరోవైపు సినిమా రంగంవైపు అడుగులేశా..సాఫ్ట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ మరోవైపు వెండితెరపై నటిస్తున్నా..సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఐదేళ్లు హైదరాబాదు, పూనేలో పనిచేశా.. గతంలో చిన్న చిన్న చిన్న క్యారక్టర్లు వచ్చేవి. వీటిలో ‘నేనే లేని నా ప్రేమ కథ , రన్ వెబ్ సిరీస్‌లో మేజర్ రోల్ చేశాను. తర్వాత 2019లో హైదరాబాద్‌లో జరిగిన ఆడిషన్స్ హీరో రోల్‌కి అవకాశం వచ్చింది. ఉద్యోగం, నటన రెండూ సాధ్యం కాదు కనుక ఉద్యోగం మానేశా. వారం రోజుల్లో విశాఖ థియేటర్లలో డై హార్డ్ ఫ్యాన్ చిత్రాన్ని విడుదల చేస్తాం. – శివ, హీరో -
ఆ దర్శకుడితో రజనీకాంత్ మరో సినిమా!
ఫేవరేట్ దర్శకులను రిపీట్ చేయడంలో సూపర్ స్టార్ రజనికాంత్ ఎప్పుడూ ముందుంటాడు. మేకింగ్ కూడా నచ్చితే ఇక డేట్స్ ఫుల్ గా కేటాయిస్తాడు. రీసెంట్ టైమ్స్ లో పారంజిత్ తో వరుసగా రెండు చిత్రాలు చేశాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తున్నారు. అన్నాత్తే దర్శకుడికే మరో అవకాశం ఇవ్వబోతున్నారట. రజనీ హీరోగా నటిస్తున్న అన్నాత్తే షూటింగ్ పూర్తైంది. దీపావళికి ఘనంగా రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత రజనీకాంత్ నటించే కొత్త చిత్రంపై కోలీవుడ్ లో రకరకాల రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.ఒకసారి పెరియా స్వామి అనే యంగ్ డైరెక్టర్ తో మూవీ చేయనున్నాడని మరోసారి సొంత అల్లుడు ధనుష్ కు అవకాశం ఇవనున్నారని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. కాని రజనీ ఆలోచన వేరుగా ఉంది. ప్రస్తుతం అన్నాత్తేను డైరెక్ట్ చేసిన శివను మరోసారి తనని డైరెక్ట్ చేసేందుకు అవకాశం ఇచ్చారట. అన్నాత్తే దర్శకుడు అంటే ఎవరో కాదు.. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు చిత్రాలను తెరకెక్కించన దర్శకుడు. 2014లో కోలీవుడ్ వెళ్లి అక్కడ అజిత్ కు వరుసగా బ్లాక్ బస్టర్స్ అందించాడు. దాంతో స్టార్ డైరెక్టర్ గా మారాడు.ప్రస్తుతం కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు.అందుకే ఈ దర్శకుడికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడట సూపర్ స్టార్. స్టోరీ రెడీ చేస్తే డేట్స్ ఇస్తానని మాట ఇచ్చాడట.మరోవైపు శివ దర్శకత్వంలో నటించేందుకు సూర్య చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అన్నాత్తేకు ముందు సెట్స్ పైకి వెళ్లాల్సిన సినిమా వీరిది. కాని రజనీకాంత్ కోసం డెట్స్ అడ్జెస్ట్ చేశాడు సూర్య. ఇప్పుడు తలైవా మరోసారి శివ డేట్స్ ను బ్లాక్ చేయబోతున్నారు. మరి సూర్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది. -
Anie Siva: ఐస్‌క్రీమ్‌లు అమ్మిన ఊరికే ఎస్ఐగా వచ్చింది!
మలయాళ నటుడు మోహన్‌లాన్ ‘ఆమె కథ అందరికీ స్ఫూర్తి కావాలి’ అని ఫేస్బుక్లో రాశాడు. కేరళ ప్రతిపక్ష నాయకుడు సతీశన్ ‘ఓహో... ఏమి పట్టుదల’ అని శ్లాఘించాడు. కేరళ డిజిపి లోక్‌నాథ్ బెహరా ‘నీకేం కావాలో చెప్పమ్మా’ అని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ ‘ఆనీ శివ’ అనే కొత్త మహిళా ఎస్.ఐ గురించి. జూన్ 25న ఆమె ఎస్.ఐ అయ్యింది అక్కడ. పదేళ్ల క్రితం భర్త, తల్లిదండ్రులు వదిలేయగా ఏ ఊళ్లో అయితే నిమ్మరసం, ఐస్‌క్రీమ్‌లు అమ్ముతూ వచ్చిందో అదే ఊరికి ఆమె ఎస్.ఐ. అయ్యింది. ‘నా పాతరోజుల మీద ఇంతకు మించి ఏం ప్రతీకారం తీర్చుకోను’ అందామె. మనం పేడముద్దలా ఉంటే జీవితం విసిరికొట్టినప్పుడు హరీమంటాం. బంతిలా ఉంటే ఆనీ అవుతాం. ఆమె కథ ఇది. రెండు మూడు రోజులుగా కేరళలో ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ వార్తల్లో ఉంది. సాధారణంగా ఇలా సినిమాల్లో జరుగుతుంటుంది. అయితే కల్పన కంటే నిజ జీవితంలోనే ఎంతో అనూహ్యత ఉంటుంది. అందుకే ఆనీ శివ జీవితం ఇప్పుడు చాలామందికి స్ఫూర్తికానుంది. ఒక విశేష నియామకం త్రివేండ్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే వర్కల అనే టౌన్‌కు జూన్ 25న ఆనీ శివ సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చింది. అది ఆమెకు తొలిపోస్టు. అంతకుముందు ఆమె రెండు సంవత్సరాలుగా కొచ్చిలో ట్రయినింగ్ లో ఉంది. అది పూర్తి కావడంతో వర్కలకు పోస్టింగ్ ఇచ్చారు. మామూలుగా అయితే అసలు ఇది ఏ మాత్రం చెప్పుకోదగ్గ వార్త కాదు. కాని వర్కలకు ఆనీ శివ ఎస్.ఐగా రావడం మాత్రం పెద్ద వార్త. ఎందుకంటే పదేళ్ల క్రితం అదే టౌన్లో ఆమె పొట్టకూటి కోసం నిమ్మకాయ రసం అమ్మింది. ఐస్‌క్రీమ్‌లు అమ్మింది. ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేసింది. సరుకులు ఇంటింటికి తిరిగి అందించే బాయ్‌గా పని చేసింది. వేయి పనులు చేసింది బతకడానికి. ఎందుకంటే ఆమె భర్త వదిలిపెట్టిన గతి లేని స్త్రీ. పైగా ఒక బిడ్డకు తల్లి. కన్నవాళ్లు తన్ని తరిమేసిన మహిళ. అలాంటి మహిళ ఆ ఊళ్లో బతికింది. కాని ఇవాళ అదే మహిళ ఆ ఊరికే ఎస్.ఐగా తిరిగొచ్చింది. ప్రేమ–వంచన త్రివేండ్రంకు గంట దూరంలో ఉండే కంజీరంకులమ్ అనే చిన్న ఊరికి చెందిన ఆన్నీ శివ తను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగా ప్రేమించిన కుర్రాడితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఏమాత్రం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ప్రేమించినవాడు ఆమెతో వర్కలలో కాపురం పెట్టాడు. ఒక కొడుకు పుట్టాడు. అప్పటికి ఆమె పట్ల విముఖత ఏర్పరుచుకున్న అతడు ఆమెను ఆమె ఖర్మానికి వదిలి వెళ్లిపోయాడు. జీవితంలో దెబ్బ తిన్న ఆనీ శివ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ‘గడప ఎక్కావంటే కాళ్లు విరగ్గొడతాం’ అన్నారు. దాంతో గతి లేక వర్కల వచ్చి అక్కడ ఉంటున్న నానమ్మ ఇంట్లోని స్థలంలో చిన్న షెడ్ వేసుకుని జీవించసాగింది. ఆమె తల్లి, అన్న, తండ్రి కొడుకు పేరు శివ స్వరూప్. కొడుకును సాకడానికి ఆనీ శివ నిమ్మకాయరసం, ఐస్‌క్రీమ్‌లు అమ్మింది. వర్కల పుణ్యక్షేత్రం. అక్కడ గుడి చాలా ఫేమస్. పాపనాశం బీచ్‌లో మునిగితే పాపాలు పోతాయని నమ్మిక. అందుకని యాత్రికులు వస్తుంటారు. వారికి తినుబండారాలు అమ్మేది. ఆ డబ్బు చాలక ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా మారింది. ఇంకా ఏ పని దొరికితే అది. ఆమె తను స్త్రీగా ఉంటే ఇబ్బంది అని పూర్తిగా అబ్బాయి క్రాఫ్‌లో తిరిగేది. చూసేవారు ఆమెతో ఉన్న కొడుక్కు అన్నగాని తండ్రి గాని అనుకునేవారు. ఇన్ని పనులు చేస్తూనే ఆన్నీ తన చదువు తిరిగి కొనసాగించింది. కష్టపడి డిగ్రీ సోషియాలజీ పూర్తి చేసింది. స్నేహితుని సలహా ఆమె చురుకుదనం, శరీర స్వభావం గమనించిన మిత్రుడు నువ్వు పోలీసాఫీసర్‌గా సరిపోతావు.. ట్రై చెయ్ అని సలహా ఇచ్చాడు. దాంతో ఆనీ నియామక పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం మొదలెట్టింది. 2016లో ఆమె మహిళా కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె లక్ష్యం ఎస్.ఐ కావడం వల్ల తిరిగి పరీక్షలు రాయడం కొనసాగించి 2019లో ఎస్.ఐగా సెలెక్ట్ అయ్యింది. ట్రైనింగ్, ప్రొబేషన్ పూర్తయ్యాక తన ఊరికే ఎస్.ఐగా వచ్చింది. ప్రశంసల వెల్లువ ఆమె పోస్టింగ్ తీసుకున్న వెంటనే ఆమె జీవితం గురించి అక్కడ విశేష కథనాలు రావడంతో కేరళలో ఆనీకు ప్రశంసలు వెల్లువెత్తాయి. సినిమా, రాజకీయ రంగాలలోని ప్రముఖులు ఆమె తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనాన్ని చాలా ప్రశంసించారు. ‘ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తి కావాలి’ అని మోహన్‌లాల్‌తో సహా అందరూ కోరుకున్నారు. ఆనీకి కూడా తన విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. ‘నన్ను బాధించిన పాతరోజుల మీద ఇంతకు మించి ఏం ప్రతీకారం తీర్చుకోను?’ అని అంది. తన ఇంటర్వ్యూలలో తన కొడుకు కొచ్చిలో చదువుకుంటున్నాడని, ట్రయినింగ్ సమయంలో అక్కడే స్కూల్లో వేశానని, ఇప్పుడు ఇద్దరం వేరు వేరుగా ఉండాల్సి వస్తోందని అందామె. అది చదివిన కేరళ డిజిపి వెంటనే కొచ్చికి బదిలీ చేశారు. తల్లీకొడుకులను కలపడానికి ఈ ట్రాన్స్ఫర్ చేశాం అని ఆయన తెలియచేశారు. లోకం మారాలి వివాహంలో విభేదం వచ్చి కూతురు పుట్టింటికి వస్తే అక్కున చేర్చుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగానే ఉంటారు. కాని లోకులే సూటిపోటి మాటలు అంటుంటారు. లోకులకు భయపడి తల్లిదండ్రులు తమ కూతుళ్లను వారి ఖర్మానికి వదిలిపెడుతున్నారు. లోకుల ధోరణి మారాలి. అప్పుడు వివాహిత స్త్రీలు తమకు తల్లిదండ్రుల అండ ఉంది అనుకుంటారు. ఆత్మహత్యల వరకూ వెళ్లరు అంది ఆనీ. – సాక్షి ఫ్యామిలీ -
'తలా' దర్శకుడి తండ్రి కన్నుమూత
చెన్నై: ప్రముఖ తెలుగు, తమిళ దర్శకుడు శివ తండ్రి జయకుమార్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. జయకుమార్ 400కు పైగా లఘు చిత్రాలకు డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు. ఆయన తండ్రి వేలన్ కూడా అనేక సినిమాలకు నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశారు. ఇక జయ కుమార్ చిన్నకొడుకు బాలా మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణిస్తుండగా పెద్దకొడుకు శివ తొలుత సినిమాటోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో ప్రవేశించారు. (మరో విషాదం : కమెడియన్ కన్నుమూత) తెలుగులో శ్రీరామ్, నేనున్నాను, మనసు మాట వినదు, గౌతమ్ ఎస్ఎస్సీ, బాస్ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. తర్వాత గోపీచంద్ శౌర్యం సినిమాతో దర్శకుడిగా మారారు. అలా శంఖం, దరువు సినిమాలను తెరకెక్కించారు. కానీ టాలీవుడ్లో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ మీదనే ఫోకస్ పెట్టారు. కార్తీ సిరుతాయ్, తరువాత హీరో అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు, ప్రస్తుతం ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
మరో బుల్లితెర నటుడికి సోకిన కరోనా
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా బుల్లితెర నటులను వెంటాడుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా మరో నటుడు ప్రాణాంతక వైరస్ బారిన పడ్డాడు. టీవీ నటుడు సాక్షి శివకు కరోనా సోకినట్లు సమాచారం. వివిధ చానెళ్లలో ప్రసారమవుతున్న అక్క మొగుడు, నెంబర్ 1 కోడలు, మౌనరాగం సీరియల్స్‌లో నటిస్తున్న శివకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో మరోసారి టీవీ పరిశ్రమలో కలకలం రేగింది. వరుసగా పలువురికి కరోనా సోకుతుండటంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నా.. కేసులు పెరుగుతున్నాయని వాపోతున్నారు. (తెలుగు టీవీ నటికి కరోనా పాజిటివ్ ) మరోవైపు.. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌కు రావాలో.. వద్దో అర్థం కాక టీవీ నటులు అయోమయంలో పడ్డారు. కాగా ఇప్పటికే ఇద్దరు నటులు సహా ప్రముఖ చానెల్లో ప్రసారమవుతున్న ఆమె కథ సీరియల్ కథానాయిక నవ్య స్వామి కరోనా బారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన నవ్య.. తాను ధైర్యంగా మహమ్మారితో పోరాడతానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.