అజిత్‌ ‘విశ్వాసం’ ఫస్ట్‌ లుక్‌ | Thala Ajith Kumar Starrer Viswasam First Look Released | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 23 2018 11:13 AM | Last Updated on Thu, Aug 23 2018 12:27 PM

Thala Ajith Kumar Starrer Viswasam First Look Released - Sakshi

కోలీవుడ్ స్టార్‌ తలా అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వాసం. అజిత్‌ హీరోగా వీరం, వేదలం, వివేగం లాంటి సూపర్‌ హిట్స్ అందించిన శివ దర్శకత్వంలోనే ఈసినిమా తెరకెక్కుతోంది. సత్యజ్యోతి ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో అజిత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తలా సరసన తొలిసారిగా నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు డి ఇమాన్‌ సంగీతమందిస్తున్నారు.

2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. వివేగం సినిమా తరువాత అజిత్‌ లాంగ్‌ గ్యాప్ తీసుకోవటంతో ఈ సినిమాలో తలా లుక్‌ ఎలా ఉండబోతోందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్‌కు చాలా సమయమున్నా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇప్పుడే రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్. ఫస్ట్‌లుక్‌లో అజిత్‌ రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. శివ మార్క్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అజిత్‌కు మరో సూపర్‌ హిట్‌ కన్ఫామ్‌ అంటున్నారు ఫ్యాన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement