కల్వకుర్తి టౌన్: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు నీటిగుంతలో కరెంటుషాక్‌కు గురై మరణించగా, మరొకరు భయంతో ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. కల్వకుర్తికి చెందిన అనిల్(18), రాజేశ్ వాటర్‌ప్లాంట్లలో ఆటోడ్రైవర్లు. తమ పనులు ముగిసిన తర్వాత కల్వకుర్తి తిమ్మనోనిపల్లి వద్ద ఉన్న నరసింహారెడ్డి వ్యవసాయ పొలంలోని నీటిగుంతలో ఈత కొట్టడానికి వెళ్లారు. పక్క పొలంలో ఉన్న కుర్మిద్దకు చెందిన శివ (22)ను సైతం ఈత కొట్టడానికి పిలిచారు. ముగ్గురు కలిసి నీటిగుంతలోకి దిగారు.
అయితే అది లోతుగా ఉండటంతో నీటిని బయటకు తోడేందుకు విద్యుత్ మోటారు ఏర్పాటు చేశారు. నీళ్లు తోడేస్తుండగా మధ్యలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వారు గుంతలోకి దిగి ఈత కొడుతున్నారు. కొద్దిసేపటికి కరెంటు సరఫరా కావడంతో అనిల్ విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో భయాందోళనకు గురైన శివ సమీపంలోని మరో వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment