స్టార్ హీరో సినిమా వాయిదా.! | Ajith Kumar Viswasam Out Of Diwali Release | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 28 2018 12:01 PM | Last Updated on Thu, Jun 28 2018 12:01 PM

Ajith Kumar Viswasam Out Of Diwali Release - Sakshi

కోలీవుడ్ స్టార్‌ హీరో అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వాసం. ఇటీవల వివేగం సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన అజిత్‌, తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సత్య జ్యోతి ఫిలింస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వాసం రిలీజ్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. దీపావళి సమయానికి షూటింగ్ పూర్తి కావటం కష్టమని భావించిన చిత్రయూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అజిత్‌ సరసన తొలిసారిగా నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు డి ఇమాన్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement