Vivegam
-
సెంటిమెంట్లతో ఒప్పించేసాడట..!
సెంటిమెంట్ అందరికీ ఉంటుంది. సినిమారంగంలో కాస్త ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. సక్సెస్‌తో ఆ సెంటిమెంట్ ఇంకా అధికం అవుతుంది. దర్శకుడు శివ అలాంటి సెంటిమెంట్‌ను నమ్ముతున్నారు. ఛాయాగ్రహకుడయిన ఈయన దర్శకుడిగా అవతారమెత్తి సక్సెస్ అయ్యారు. కోలీవుడ్‌లో వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం చిత్రాలను తెరకెక్కించారు. విశేషం ఏమిటంటే ఈ నాలుగు చిత్రాల్లోనూ హీరో అజితే. తొలి చిత్రం విజయవంతం కావడంతో ఆ కాంబినేషన్ వరుసగా నాలుగు చిత్రాల వరకూ కొనసాగింది. ఐదో చిత్రం కూడా చేయబోతున్నారన్న ప్రచారం సాగినా, దానికి కాస్త బ్రేక్ పడింది. మధ్యలో యువ దర్శకుడు హెచ్.వినోద్ అజిత్ హీరోగా చిత్రం చేస్తున్నారు. దీంతో దర్శకుడు శివ వేరే నటుడిని చూసుకోవలసిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఆయనకు హీరో దొరికాడు. అవును సూర్య హీరోగా శివ తాజా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరన్న చర్చ తెరపైకి వచ్చింది. శివ దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటిలోకీ విశ్వాసం పెద్ద విజయాన్ని సాధించింది. దీంతో ఆ చిత్ర హీరోయిన్ నయనతార దర్శకుడు శివకు సెంటిమెంట్‌గా మారిందట. అంతే సూర్యతో చేసే చిత్రంలో ఆమెను హీరోయిన్గా ఎంపిక చేయాలని భావించారని తెలిసింది. అయితే నయనతార కాల్షీట్స్ అంత ఈజీగా లభించడం కష్టతరమే. అయినా శివ తన సెంటిమెంట్‌ను ఆమెకు వివరించడంతో కాదనలేకపోయిందని సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్‌తో దర్భార్, విజయ్‌తో ఆయన 63వ చిత్రంలోనూ నటిస్తున్నానని, ఆ రెండు చిత్రాలు పూర్తి కావడానికి సెప్టెంబరు వరకూ పడుతుంది. ఆపై కావాలంటే కాల్షీట్స్ సర్దుబాటు చేయగలనని నయనతార చెప్పడంతో అందుకు దర్శకుడు శివ సంతోషంగా సరే అన్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. మొత్తం మీద సెంటిమెంట్ అలా వర్కౌట్ అయ్యిందన్న మాట. ఇక ఇప్పటికే గజని, ఆదవన్, మాస్ చిత్రాల్లో సూర్యతో రొమాన్స్ చేసిన నయనతార మరోసారి అందుకు సిద్ధం అవుతోందన్నమాట. -
స్టార్ హీరో సినిమా వాయిదా.!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వాసం. ఇటీవల వివేగం సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన అజిత్, తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వాసం రిలీజ్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. దీపావళి సమయానికి షూటింగ్ పూర్తి కావటం కష్టమని భావించిన చిత్రయూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అజిత్ సరసన తొలిసారిగా నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు డి ఇమాన్ సంగీతమందిస్తున్నారు. -
ఫ్లాప్ సినిమా.. యూట్యూబ్ రికార్డ్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటీవల అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం వివేగం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. దాదాపు 130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ నిరాశపరచటంతో డిజాస్టర్ల జాబితాలో చేరింది. అయితే ఈ సినిమాను బాలీవుడ్ జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇటీవల వివేగం సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ వీర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ సినిమాను తొలివారంలో ఏకంగా 2.6 కోట్ల మంది యూట్యూబ్‌లో చూశారు. గతంలో ఏ దక్షణాది చిత్రానికి తొలి వారంలో ఈ స్థాయిలో వ్యూస్ దక్కలేదు. అయితే తెలుగు సినిమాను కూడా ఉత్తరాది ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసు గుర్రం, దువ్వాడ జగన్నాథమ్ చిత్రాలు అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల లిస్ట్‌లో నిలిచాయి. అందుకే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లుగా తెరకెక్కిన దక్షిణాది చిత్రాల హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. -
అజిత్ సినిమాకు మళ్లీ అతనే..!
కోలీవుడ్‌లో అజిత్, శివ, అనిరుధ్లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో వచ్చిన వేదలం, వివేగం సినిమాలు కాసుల పంట పండించాయి. అయితే ఇంత మంచి రికార్డ్ ఉన్న తమ నెక్ట్స్ సినిమాకు అనిరుధ్ ను పక్కన పెట్టేయాలని భావించారు అజిత్, శివ. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న విశ్వాసం సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో.. యువన్ స్థానంలో అనిరుధ్ వచ్చి చేరాడు. విశ్వాసం సినిమాకు కూడా అనిరుధ్‌తోనే మ్యూజిక్ చేయించాలని ఫిక్స్ అయ్యారు. కోలీవుడ్‌లో భారీ సినిమాలతో దూసుకుపోతున్న అనిరుధ్ మ్యూజిక్ ‘విశ్వాసం’కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే అనిరుధ్ ఎంట్రీపై విశ్వాసం టీం అధికారిక ప్రకటన చేయనుంది. -
గతేడాది బాగుంది!
తమిళసినిమా: 2017 చాలా బాగుంది. తనలో నమ్మకాన్ని పెంచింది అని అన్నారు నటి కాజల్‌అగర్వాల్. నటిగా దశాబ్దకాలాన్ని అధిగమించిన ఈ బ్యూటీ ఇప్పటికీ తెలుగు, తమిళం భాషల్లో అగ్ర కథానాయకల్లో ఒకరిగా రాణిస్తున్నారు. హీరోయిన్ కాల వ్యవధి పరిమితమే అన్న నానుడిని బద్ధలు కొట్టిన అతి కొద్ది మంది నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. పలు అపజయాలను ఎదురొడ్డి విజయ పయనం చేస్తున్న ఈ ఉత్తరాది భామను 2017వ ఏడాది ఎలా గడిచిందన్న ప్రశ్నకు గతేడాది చాలా బాగుంది. నిజం చెప్పాలంటే తనలో నమ్మకాన్ని పెంచింది అని చెప్పారు. కోలీవుడ్‌లో అజిత్‌కు జంటగా వివేగం, విజయ్‌లో మెర్శల్ వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం కలిగింది. ఇక కలలో కూడా ఊహించనివిధంగా టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నంబర్ 150 చిత్రంలో నటించడం మరపురాని అనుభవం. అదే విధంగా రానాతో నేనేరాజు నేనేమంత్రి వంటి విజయవంతమైన చిత్రంలోనూ నటించాను. ఇలా 2017లో వరుస విజయాలతో గడిచిపోయింది. తాజాగా ప్యారిస్ ప్యారిస్, అవే చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పింది. హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్ర తమిళ రీమేక్ చిత్రమే ప్యారిస్ ప్యారిస్ చిత్రం అని తెలిపింది. ఇందులో కంగణా రావత్ పాత్రలో తాను పోషించడం సంతోషంగా ఉందని పేర్కొంది. 2017 బాగుంటే 2018 బహుబాగుంటుందని ఆశాభావాన్ని కాజల్ వ్యక్తం చేశారు. -
అజిత్‌తో స్వీటీ..
సాక్షి, సినిమా: అజిత్‌ను ఆయన అభిమానులు స్మార్ట్‌గా చూసి చాలా ఏళ్లే అయ్యింది. నలబై(ఏళ్లు)లో పడ్డాను.. ఇంకా ఎంత కాలం యువకుడిగా నటించాలి అని ఆయనే చాలా కాలం క్రితం బహిరంగంగా అనేశారు. అన్నట్టుగానే ఆ తరువాత మెరిసిన జుట్టు, గెడ్డం అంటూ వరుసగా సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో నటిస్తూ వస్తున్నారు. వీరం, వేదాళం, వివేగం వంటి చిత్రాల్లో అజిత్ ఇలా రియల్ గెటప్స్‌తోనే తన అభిమానుల్ని అలరించారు. అయితే ఫర్ ఏ ఛేంజ్ అన్నట్లుగా తాజా చిత్రంతో మళ్లీ పాత అజిత్‌గా యంగ్‌గా కనిపించడానికి రెడీ అవుతున్నారట. అందుకు బాగా కసరత్తులు చేసి బరువు కూడా తగ్గారని తెలుస్తోంది. అజిత్ ఇంత స్మార్ట్‌గా మారి తాజాగా ఓ చిత్రంలో నటించనున్నారని సమాచారం. ఆయన శివ దర్శకత్వంలో నాలుగోసారి నటించనున్న చిత్రానికి ‘విశ్వాసం’ అనే టైటిల్‌ను కరారు చేసిన విషయం తలిసిందే. వీరం,వేదాళం చిత్రాల్లో దాదాగానూ, వివేగం చిత్రంలో ఇంటర్ పోల్ అధికారిగానూ నటించిన అజిత్ తాజాగా మరోసారి విశ్వాసం కోసం దాదాగా మారబోతున్నారని తెలిసింది. ఇది ఉత్తర చెన్నైలోని దాదాల మధ్య జరిగే పోరు ఇతివృత్తంగా తెరకెక్కనుందట.ఈ చిత్రం 90 శాతం చెన్నైలోనే చిత్రీకరించుకోనుందని సమాచారం. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఈ బారీ చిత్రం జనవరి 19న సెట్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతుంది. ఇందులో అజిత్‌తో జత కట్టే నాయకి ఎవరన్నది ఇంకా రివీల్ కాలేదు. అయితే నటి కీర్తీసురేశ్‌తో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. కాగా తాజాగా అందాల భామ అనుష్కను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ బ్యూటీ ఇంతకు ముందు ‘ఎన్నై అరిందాల్’ చిత్రంలో అజిత్‌తో రొమాన్స్ చేశారన్నది గమనార్హం. అయితే విశ్వాసంలో అనుష్క నటించే విషయాన్ని చిత్ర వర్గాలు ఇప్పటికీ అధికారిక పూర్వకంగా వెల్లడించలేదు. నటి అనుష్క నటించిన ద్విభాషా చిత్రం భాగమతి ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలై పెద్ద అటెన్షన్‌నే క్రియేట్ చేసింది. ఈ హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రం సంక్రాంతికి వెండితెరపై అలజడి సృష్టించడానికి రెడీ అవుతోందని సమాచారం. -
అజిత్ తదుపరి చిత్రానికి టైటిల్ ఫిక్స్
వీరం, వేదలం, వివేగం లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన అజిత్, శివ ల కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. వివేగం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అజిత్.. త్వరలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ఈ సినిమాను కూడా శివ దర్శకత్వంలోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు అజిత్. ఈ సినిమాకు విశ్వాసం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో అజిత్ శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ 'V' అనే అక్షరంతోనే మొదలయ్యాయి. అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ తన తదుపరి చిత్రాన్ని కూడా V తోనే మొదలయ్యేలా ప్లాన్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనుంది. త్వరలోనే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. -
మళ్లీ అదే టీంతో..
తమిళసినిమా: వివేగం చిత్ర టీమ్ రిపీట్ కానుందా? అంటే.. అవుననే అంటున్నా యి కోలీవుడ్ వర్గాలు. నటుడు అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్లో ఇప్పటికి వరుసగా వీరం, వేదాళం, వివేగం మూ డు చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో వీరం, వేదాళం చిత్రాలు కమర్శియల్‌గా మంచి విజయాన్ని సాధిం చాయి. ఇక వివేగం చిత్రం చిత్రీకరణ పరంగా హాలీవుడ్ చిత్రాల స్థాయిలో ఉన్నా రెండు చిత్రాల స్థాయిలో విజయం సాధించలేదన్నది విమర్శకులు మాట. అయినా నటుడు అజిత్ మళ్లీ దర్శకుడు శివకు మరో అవకాశం ఇచ్చారన్నది తా జా సమాచారం. వివేగం చిత్రం ఆశిం చిన విజయాన్ని పొందకపోయినా బాధ వద్దని మరో చిత్రం చేద్దామని అజిత్ దర్శకుడు శివకు భరోసా ఇచ్చినట్లు టాక్. దీంతో రెట్టించిన ఉత్సాహంతో దర్శకుడు శివ మంచి కథను రెడీ చేస్తున్నారట. ఈ కథ సింగిల్ లైన్ అజిత్‌కు నచ్చేయడంతో బెటర్మెంట్స్ చేయమని చెప్పారట. ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇంతకు ముందు అజిత్‌తో ఆరంభం, వేదాళం చిత్రాలను నిర్మించిన నిర్మాత ఏఎం.రత్నం కోడలు, నిర్మాత ఐశ్వర్య అజిత్ ఓకే అంటే ఆయనతో చిత్రం చేయడానికి రెడీ అని ఒక ఇంటర్వూ్యలో ప్రకటించారు. దీంతో వారి సంస్థకు అజిత్ చిత్రం చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రాన్ని వివేగం చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందనే తాజా సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్. -
నాలుగు గంటల్లో.. సౌత్ హీరో ప్రపంచ రికార్డ్
-
నాలుగు గంటల్లో.. సౌత్ హీరో ప్రపంచ రికార్డ్
సౌత్ సినిమా హాలీవుడ్ కు కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటికే అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా స్టార్ వార్స్ పేరిట ఉన్న రికార్డ్ ను అజిత్ హీరోగా తెరకెక్కిన వివేగం టీజర్ చెరిపేసింది. అయితే అజిత్ అభిమానులకు ఆ ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు. తాజాగా వివేగం రికార్డ్ ను విజయ్ హీరోగా తెరకెక్కిన మెర్సల్ చెరిపేసింది. ఈ సినిమా టీజర్ కు కేవలం నాలుగు గంటల్లోనే 6 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. విజయ్ పేరిట అరుదైన రికార్డ్ క్రియేట్ చేయాలన్న పట్టుదలతో అభిమానులు చేసిన కృషి ఫలించింది. అత్యధిక లైక్స్ సాధించటం మాత్రమే కాదు కేవలం నాలుగు గంటల్లోనే ముప్పై లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు కేవలం 20 గంటల్లోనే కోటికి పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేస్తున్నారు. -
వివేగం వరల్డ్ రికార్డ్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం వివేగం. మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు టాక్ ఎలా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వివేగం మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో అత్యథిక లైక్స్ సాధించిన టీజర్ గా ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ఇన్నాళ్లు ఈ రికార్డ్ హాలీవుడ్ యాక్షన్ మూవీ స్టార్ వార్స్ పేరిట ఉండగా.. అజిత్ వివేగం 5 లక్షల 70 వేలకు పైగా లైక్స్ సాధించిన ఆ రికార్డ్ ను తన సొంతం చేసుకుంది. జేమ్స్ బాండ్ తరహా కథా కథనాలతో తెరకెక్కిన వివేగం సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. అజిత్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అక్షరహాసన్ మరో కీలక పాత్రలో అలరించింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించాడు. -
అజిత్.. మళ్లీ అతడితోనే..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వివేగం సినిమాతో భారీ వసూళ్లను సాధించిన ఈ టాప్ స్టార్, ఆ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. అయితే షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో అలాగే షూటింగ్ పూర్తి చేసి ఇటీవల సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న అజిత్ తన నెక్ట్స్ సినిమా పనులు మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో అజిత్ ఓ చారిత్రక చిత్రంలో నటిస్తారన్న టాక్ వినిపించినా.. ప్రస్తుతం ఆ ప్రయత్నాలు విరమించుకున్నారట. మరోసారి తన లక్కీ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాను స్పేస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నారట. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వీరం, వేదలం, వివేగం లాంటి కమర్షియల్ సక్సెస్ లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి తో అదే ఫీట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు అజిత్, శివ. -
ఆ క్రేజీ కాంబినేషన్ లేనట్టే..!
కొద్ది రోజులుగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, మాస్ హీరో అజిత్ తో ఓ సినిమా చేయబోతున్నాడన్న వార్త సౌత్ సినీ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం రోబో సీక్వల్ 2.ఓతో బిజీగా ఉన్న శంకర్, తన నెక్ట్స్ సినిమా అజిత్ హీరోగా తెరకెక్కించబోతున్నాడని.. ఇప్పటికే ఈ మేరకు చర్చలు మొదలయ్యాయని ప్రచారం జరిగింది. అభిమానులు కూడా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తే పాత రికార్డ్ లన్ని తిరగరాయటం కాయం అని ఫిక్స్ అయ్యారు. అయితే అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లుతూ అలాంటి ప్రాజెక్ట్ ఏది చర్చల్లో లేదని ప్రకటించారు శంకర్ టీం. ప్రస్తుతం రోబో సీక్వల్ పనుల్లోనే బిజీగా ఉన్న శంకర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎవరితోనూ చర్చించలేదని తెలిపారు. అజిత్ కూడా వివేగం సినిమా తరువాత సర్జరీ చేయించుకొని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా లేనట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. -
షూటింగ్లో హీరోకు గాయాలు, ఆపరేషన్
సాక్షి, చెన్నై: తమిళ ప్రముఖ హీరో అజిత్‌కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆయనకు ఇంతకు ముందు కూడా పలు మార్లు శస్త్ర చికిత్సలు జరిగిన విషయం తెలిసిందే. హీరో అజిత్ యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా తనే నటించడానికి ప్రయత్నిస్తారు. ఇటీవల విడుదలైన ‘వివేగం’ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఈ చిత్రంలో నటించడానికి అజిత్ ముందుగానే చాలా కసరత్తులు చేశారు. తన బాడీని సిక్స్పాక్కు మలుచుకుని నటించారు. బల్గేరియాలో ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో స్టంట్ మాస్టర్‌తో పోరాడే సన్నివేశంలో నటిస్తుండగా అజిత్ భుజానికి బలమైన గాయం అయ్యింది. వెంటనే అక్కడ ప్రథమ చికిత్స చేయించుకుని వెంటనే షూటింగ్లో పాల్గొన్నారట. అయితే నెలలోపు శస్త్ర చికిత్స చేయించుకోవాలని అక్కడి వైద్యులు సూచించారట. చెన్నైకి తిరిగొచ్చిన అజిత్ ఇంటిలోనే చికిత్స చేయించుకుంటున్నారు. అలాంటిది ఈ నెల 7న ఆయన నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయన భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు వెల్లడించారు. రెండు నెలల పాటు అజిత్‌కు విశ్రాంతి అవసరం అని సలహా ఇవ్వడంతో ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా అజిత్ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. -
మరో చిత్రానికి రెడీ!
తమిళసినిమా: కోలీవుడ్ నటులలో అజిత్ రూటే వేరు. ఎవరి గురించి పట్టించుకోరు. వివాదాల జోలికి పోరు. తాననుకున్నది చేసుకుపోయే మనస్తత్వం. తన నిర్మాతల్ని, దర్శకుల్ని తనే ఎంచుకుంటారు. అలా దర్శకుడు శివతో వీరం, వేదాళం, తాజగా వివేగం అంటూ వరుసగా మూడు చిత్రాలు చేశారు. ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణను చూరగొన్నాయి. గత వారం విడుదలైన వివేగం చిత్రం మిశ్రమ స్పందనలతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర రికార్డులనే బ్రేక్ చేస్తోందంటున్నారు సినీపండితులు. ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లను, ఎదుర్కొంటున్న విమర్శలను వింటూ మౌనం పాటిస్తున్న అజిత్ ఇటీవల దర్శకుడు శివను తన ఇంటికి పిలిపించుకుని వివేగం చిత్రానికి సంబంధించిన చాలా విషయాలను చర్చించారట. చిత్రంపై వస్తున్న విమర్శల గురించి కలత వద్దనీ, వాటిని అధిగమించేలా మరో చిత్రం చే ద్దాం అన్నారట. దీంతో నోట మాట రాక దర్శకుడు శివ కంట ఆనందభా ష్పాలు రాలాయట. దీని గురించి శివ తెలుపుతూ వివేగం చిత్ర నిర్మాణ సమయంలోనే అజిత్‌కు పలు కథలను చెప్పానని, అందులో తనకు నప్పే కథను అజిత్ ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే తమ తాజా చిత్రం గురించి అజిత్‌నే వెల్లడిస్తారని శివ పేర్కొన్నారు. కాగా వీరం, వేదా ళం, వివేగం మూడు వేర్వేరు నేపథ్యాల్లో తెరకెక్కిన కథా చిత్రాలుగా విజ యం సాధించిన నేపథ్యంలో ఈ సారి అజిత్, శివ కాంబినేషన్లో భారీ ఛారి త్రక కథా చిత్రం రూపొందే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
వివేకంపై విమర్శలా?
తమిళసినిమా: వివేకం చిత్రంపై నెటిజన్ల విమర్శలను సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం వివేకం. కాజల్‌అగర్వాల్ నాయకిగా కమలహాసన్ రెండవ కూతురు అక్షరహాసన్ కీలక పాత్రలో నటించిన వివేకం చిత్రాన్ని శివ దర్శకత్వంలో సత్యజ్వోతి ఫిలింస్ సంస్థ నిర్మించింది. చిత్రం గత 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందనతోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వివేకం చిత్రం మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూల్ చేసినట్లు సమాచారం. చిత్రంలో కొన్ని అసహజ సన్నివేశాలు చోటుచేసుకున్నా, నటుడు అజిత్ ఈ చిత్రంలో అంకిత భావంతో నటించిన తీరును, అందుకు పడిన కఠిన శ్రమను అందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తున్నారు.అదే విధంగా ఛాయాగ్రాహకుడి నైపుణ్యం, గ్రాఫిక్స్ సన్నివేశాలు, పోరాట దృశ్యాలు, ఛేజింగ్ దృశ్యాలు హాలీవుడ్ చిత్రాల స్థాయిల్లో ఉన్నాయంటూ పలువురు అభినందిస్తున్నారు. కలెక్షన్ల రికార్డులు : ఇక వివేకం చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ చిత్రం విడుదలైన తొలిరోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.33 కోట్లు వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడులోనే రూ. 17 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా చెనైలో వివేకం చిత్రం కబాలి చిత్ర రికార్డును బద్దలు కొట్టిందని సమాచారం. రెండు రోజుల్లో రూ.66 కోట్లు, మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిందంటున్నారు. తీవ్ర విమర్శలు: అయితే ఇప్పుడు చిత్రం విడుదలైన కొన్ని గంటలకే విమర్శల పేరుతో నెటిజన్లు వీడియో రూపంలో ఏకిపారేస్తున్నారు. కొందరైతే చిత్రాలను చూడకుండానే నటులపైనో, చిత్ర యూనిట్పైనో వ్యక్తిగత ద్వేషాలతో తీవ్రంగా విమర్శలు చేయడం ప్రారంభించారు. అలాంటి విమర్శకులు వివేకం చిత్రాన్ని వదలలేదు. కొందరు చిత్రాన్ని చూడకుండానే అజిత్‌ను, చిత్ర యూనిట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు విమర్శించిన వీడియోలను చూసిన సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అజిత్ శ్రమకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను వివేకం చిత్రంపై వస్తున్న విమర్శలకు స్పందించిన నటుడు, నృత్యదర్శకుడు లారెన్స్ వివేకం చిత్రానికి అజిత్ పడిన శ్రమకు శిరసు వంచి నమస్కరిస్తున్నాన్నన్నారు. వివేకం చిత్రంపై కొందరు కావాలనే విమర్శనలు చేస్తుండడం బాధ కలిగిస్తోందన్నారు. చిత్రంలో అబ్బురపరచే పలు సన్నివేశాల గురించి వారు మాట్లాడలేదని, అలాంటి వారికి విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లారెన్స్ అన్నారు. అదే విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చిత్రాలను నిర్మిస్తున్నారని, అలాంటి చిత్రాలను చూడాలా? వద్దా?అన్నది ప్రేక్షకుల నిర్ణయానికే వదిలేయాలని నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.దర్శకుడు, ఛాయాగ్రాహకుడు విజయ్ మిల్టన్ కూడా వివేకం చిత్రంపై విమర్శలను ఖండిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. -
వివేకంతో ఢీ అంటున్న తప్పాట్టం
తమిళసినిమా: అజిత్ హీరో చిత్రం వస్తుందంటే ఒక మోస్తరు చిత్రాలను కూడా ఆ చిత్ర విడుదల దరిదాపుల్లో విడుదల చేయడానికి ముందుకురారు. అలాంటిది నూతన దర్శకుడు, నవ నిర్మాత కలయికలో కొత్త నటీనటులతో నిర్మించిన చిత్రాన్ని అజిత్ చిత్రానికి పోటీగా విడుదల చేసి పెద్ద సాహసమే చేశారు. ఆ చిత్రమే తప్పాట్టం. గత గురువారం అజిత్ చిత్రం వివేకంతో పాటు విడుదలైన తప్పాట్టం చిత్రానికి మంచి విమర్శలు, ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోందని చిత్ర వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పాట్టం చిత్రం గురించి ఒక లుక్కేస్తే, పబ్లిక్ స్టార్ దురై సుధాకర్ హీరోగా నటించగా ఆయనకు జంటగా డోనా నాయకిగా నటించారు. కోవై జయకుమార్, పేనామణి, కూత్తుపట్టరై తులసి, పేరాసిౖయె లక్ష్మి, రూఫి, పొల్లాచ్చి ఎంకే.రాజా ప్రధాన పాత్రల్లో నటించారు. నవ దర్శకుడు ముజిపూర్ రహ్మాన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఆదంబావా నిర్మించారు. 1984లో ఒక కుగ్రామంలో జరిగే కథగా తెరకెక్కించిన తప్పాట్టం చిత్రాన్ని దర్శకుడు చాలా సహజత్వంతో రూపొందించారు. చావులకు డప్పులు వాయించే ఒక యువకుడికి, అతడిని పిచ్చిగా ప్రేమించే అక్క కూతురికి మధ్య ప్రేమ,పెళ్లి, ఈ గ్రామంలో ఒక మోతు బారు రైతు ఇలా సాగుతుంది కథ. కంటపడిన యువతుల్ని కాంక్షించే ఆ మోతు బారి రైతు బారిన కథానాయకి పడుతుంది.ఆమె అతని నుంచి తప్పించుకోవడంతో పాటు అతని చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ పగతో రగిలే ఆ మోతుబారి రైతు ఏం చేశాడు, అందుకు చిత్ర కథానాయకుడి రియాక్షన్ ఏమిటీ? తదితర ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం తప్పాట్టం. చాలా చిన్న చిత్రంగా నిర్మించిన తప్పాట్టంకు మంచి స్పందన వస్తుందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
అజిత్ ‘వివేగం’కు ధీటుగా ‘తప్పాట్టం’ వసూళ్లు
చెన్నై: సీనియర్ హీరో అజిత్ కుమార్ సినిమా వస్తుందంటే.. ఒక మోస్తరు చిత్రాల విడుదల సైతం నిలిచిపోయే పరిస్థితి. అలాంటిది ఓ కొత్త నిర్మాత.. కొత్త దర్శకుడు, నూతన నటీనటులతో రూపొందించిన సినిమాను అజిత్ సినిమాకు పోటీగా వుడుదల చేయడం, అదికాస్తా బిగ్ హీరోకు ధీటుగా వసూళ్లు రాబట్టడం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఆ సినిమా పేరు.. తప్పాట్టం. గత గురువారం అజిత్ చిత్రం వివేగంతో పాటు విడుదలైన తప్పాట్టం చిత్రానికి విమర్శకుల ప్రశంసలతోపాటు విపరీతమైన ప్రేక్షకాదరణా లభిస్తోంది. ‘తప్పాట్టం’లో పబ్లిక్ స్టార్ దురై సుధాకర్ హీరోగా నటించగా, ఆయనకు జంటగా డోనా మెప్పించారు. కోవై జయకుమార్, పేనామణి, కూత్తుపట్టరై తులసి, పేరాసిౖయె లక్ష్మి, రూఫి, పొల్లాచ్చి ఎంకే.రాజా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. నవ దర్శకుడు ముజిపూర్ రహ్మాన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఆదంబావా నిర్మించారు. 1984లో ఒక కుగ్రామంలో జరిగే కథగా తెరకెక్కించిన తప్పాట్టం చిత్రాన్ని దర్శకుడు చాలా సహజత్వంతో రూపొందించారు. కథేంటి? చావులకు డప్పులు వాయించే ఒక యువకుడికి, అతడిని పిచ్చిగా ప్రేమించే అక్క కూతురికి మధ్య ప్రేమ, పెళ్లి, ఈ గ్రామంలో ఒక మోతుబరు రైతు ఇలా సాగుతుంది కథ. కంటపడిన యువతుల్ని కాంక్షించే ఆ మోతుబరి రైతు బారిన కథానాయకి పడుతుంది.ఆమె అతని నుంచి తప్పించుకోవడంతోపాటు అతని చెంప ఛెళ్లుమనిపిస్తుంది. ఆ పగతో రగిలే ఆ మోతుబరి రైతు ఏం చేశాడు, అందుకు చిత్ర కథానాయకుడి రియాక్షన్ ఏమిటి? తదితర ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం తప్పాట్టం. -
హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో 'వివేగం'
-
హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో 'వివేగం'
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వివేగం. అజిత్ హీరోగా వీరం, వేదలం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కింది వివేగం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ రికార్డ్ లన్నింటినీ చెరిపేయగా.. తాజాగా రెండున్నర నిమిషాల నిడివితో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అజిత్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. తొలిసారి కాజల్.. అజిత్ తో జత కట్టగా అక్షర హాసన్ కీలక పాత్రలో నటించింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో పాటు అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉన్నాయి. వివేగం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఆగస్ట్ 24న రిలీజ్ కు రెడీ అవుతోంది. -
ఉద్వేగం కలిగించే అజిత్
తమిళసినిమా: ఇతరులకు ఉద్వేగం కలిగించడంలో ఆజిత్కు ఆయనే సాటి అని ప్రముఖ హాలీవుడ్ నటి అమిలా టెర్జిమెహిక్ పేర్కొన్నారు. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వివేగం. కాజల్‌అగర్వాల్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. బోలెడు విశేషాలు, అంతకంటే మరిన్ని అంశాలతో వివేగం చిత్రం ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందులో అజిత్ కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ టీమ్‌లో ప్రధాన పాత్రను పోషించిన అమిలా టెర్జిమెహిక్ తన అనుభవాలను పంచుకుంటూ అంతర్జాతీయ స్థాయి చిత్రం వివేగం ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలోకి పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. తాను నటించన హాలీవుడ్ చిత్రం ది నవంబర్ మెన్ చిత్రం చూసి దర్శకుడు శివ తనను వివేగం చిత్రంలో నటిండానికి ఎంపిక చేసినట్లు తెలిసిందన్నారు. ఈ చిత్ర కథ, అందులో తన పాత్ర గురించి దర్శకుడు చెప్పగానే చాలా నచ్చేసిందన్నారు. నటుడు అజిత్‌ను కలువక ముందే ఆయన ఎంత పెద్ద నటుడో తెలుసుకున్నానని చెప్పారు. అంత పెద్ద స్టార్ నిడరంబరంగా ఉండటం ఆయనకే చెల్లిందన్నారు. చిత్రంలో రిస్కీ ఫైట్స్‌లోనూ ఎలాంటి డూప్ లేకుండా నటించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఆయన ప్రవర్తనను, వృత్తి భక్తిని చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. -
వంద కోట్ల సినిమా రిలీజ్ వాయిదా
కోలీవుడ్ టాప్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ వివేగం. అజిత్ హీరోగా వీరం, వేదలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ మీద కన్నేశారు. జేమ్స్ బాండ్ తరహా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ముందుగా ఆగస్టు 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతుండటంలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం మరింత సమయం కేటాయించాలన్న ఉద్దేశంతో సినిమాను రెండు వారాల పాటు వాయిదా వేశారు. తెలుగులో వివేకం పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకే సారి ఆగస్టు 24న రిలీజ్ చేయనున్నారు. కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. -
కూతురు మతం మారడంపై స్పందించిన హీరో
చెన్నై: మతం మారానంటూ తన రెండో కూతురు అక్షరహాసన్ చేసిన సంచలన ప్రకటనపై ఆమె తండ్రి, సీనియర్ హీరో కమల్ హాసన్ స్పందించారు. 'హాయ్ అక్షు. నువ్వు మతం మార్చుకున్నావా? నువ్వు మతం మారినా సరే నాకు నువ్వంటే ఇష్టమే. మతంతో సంబంధంలేని ప్రేమ నిస్వార్ధమైనదని నేను నమ్ముతాను. నీ జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయ్. ప్రేమతో మీ బాపు (నాన్న)' కమల్ ట్వీట్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్షర హాసన్ మాట్లాడుతూ.. ఆస్తికత్వంపై నమ్మకం లేదంటూనే బౌద్ధమతానికి మారానని చెప్పింది. తనకు అక్క శృతీహాసన్ మాదిరిగా దేవుడిపై నమ్మకం లేదని, అయితే ఆసక్తితోనే బౌద్దమతం స్వీకరించినట్లు అక్షర వివరించింది. శివ దర్శకత్వంలో స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న వివేగం చిత్రం ద్వారా ఆమె కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. సంబంధిత కథనం అందుకే మతం మారాను: నటి Hi. Akshu. Have you changed your religeon? Love you, even if you have. Love unlike religeon is unconditional. Enjoy life . Love- Your Bapu — Kamal Haasan (@ikamalhaasan) 28 July 2017 -
అందుకే మతం మారాను: నటి
చెన్నై: ఆస్తికత్వంపై నమ్మకం లేదంటూనే బౌద్ధమతానికి మారానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ రెండో కూతురు అక్షరహాసన్ చెప్పింది. ఆ మధ్య షమితాబ్ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన ఈ బ్యూటీ తాజాగా స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న వివేగం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ నేపథ్యంలో అక్షరహాసన్ ఇటీవల చెన్నైలో విలేకరులతో మాట్లాడింది. చిన్ననాటి నుంచే దర్శకత్వంపై ఆసక్తి ఉందని ఆమె తెలిపింది. ముంబయిలో కొన్ని చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పని చేశానని చెప్పింది. 'ప్రస్తుతం నటనపై ఆసక్తి కలగడంతో అటుగా దృష్టి సారిస్తున్నాను. అమ్మా, నాన్న, అక్క, ఇతర బంధువులు అందరూ ఈ రంగంలోనే ఉన్నారు. వారందరితో ఒక మూవీ చేయాలనుంది. ముందు దర్శకురాలిగా ఓ విజయం సాధించిన తరువాత అమ్మానాన్న, అక్క కాల్షీట్స్ తీసుకుని వారితో సినిమా చేస్తాను. నాకు అక్క మాదిరి దేవుడిపై నమ్మకం లేదు. అయితే ఆసక్తితోనే బౌద్దమతం స్వీకరించాను. నాన్న కమల్‌హాసన్ గురించి చాలా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా.. లేదా.. అన్నది ఆయన ఇష్టం. దాని గురించి మాట్లాడబోనని' నటి అక్షరహాసన్ స్పష్టం చేసింది. -
జేమ్స్ బాండ్ మూవీలా...
తమిళ స్టార్ హీరో అజిత్– దర్శకుడు శివలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరం, వేదాళం’ ఘన విజయం సాధించాయి. ఈ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘వివేగం’. కాజల్ కథానాయిక. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ తమిళంలో నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంఠినేని ‘వివేకం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నవీన్ శొంఠినేని మాట్లాడుతూ– ‘‘110 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘జేమ్స్ బాండ్’ తరహా మూవీగా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు టీజర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘ప్రేమ పుస్తకం, ప్రేమలేఖ, వీరుడొక్కడే’ వంటి చిత్రాలతో అజిత్ తెలుగులోనూ హిట్స్ సాధించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. తెలుగులో ‘శౌర్యం, శంఖం, దరువు’ వంటి హిట్ చిత్రాలను శివ తెరకెక్కించారు. అజిత్‌తో ఆయన చేసిన ఈ మూడో సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. అనిరుథ్ రవిచంద్రన్ పాటలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
తిరుమలలో హీరో అజిత్
తిరుమల: ప్రముఖ తమిళ హీరో అజిత్ మంగళవారం కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. అజిత్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వచనం అందించి స్వామి వారి తీర్దప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు దర్శనం అనంతరం అజిత్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. తెల్ల షర్ట్, పంచెలో అజిత్ కూల్‌గా కనిపించారు. కాగా అజిత్ తాజా చిత్రం ‘వివేగం’ వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆయన ఇంటర్‌పోల్ ఏజెంట్‌కు కనిపించనున్నారు. అలాగే హీరోయిన్లుగా కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ నటించారు. అజిత్ తన ప్రతి సినిమా విడుదలకు ముందు తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ అని ఆయన సన్నిహితులు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం అజిత్ సోమవారం సాయంత్రమే తిరుమల చేరుకున్నారు. -
అజిత్ 'వివేగానికి' భారీ రేటు!
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న హీరో అజిత్ తాజా చిత్రం 'వివేగం'.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మేకర్స్ తాజాగా తెలుగు మార్కెట్‌పై దృష్టి పెట్టారు. స్పై థ్రిల్లర్‌గా తమిళ, తెలుగు భాషల్లో ఆగస్టు 10న ఈ సినిమా విడుదలకానుంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 4.5 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. వ్యాపారపరంగా చూసుకుంటే తెలుగు మార్కెట్లో అజిత్ సినిమాకు ఇదే హయ్యెస్ట్ రేటు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అక్షరహాసన్ కీలక పాత్రలోనూ నటిస్తోంది. హిందీ స్టార్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో అజిత్ రిస్కీ సన్నివేశాల్లోనూ డూప్ లేకుండా నటించారని చిత్రబృందం చెప్తోంది. -
హలో..బై తప్ప స్నేహం లేదట
తమిళసినిమా: సాధారణంగా ఒకే చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తే వారి మధ్య స్నేహం, లేదా వైరం ఏర్పడుతుండడం చూస్తుంటాం. మిత్రత్వం అయితే ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటారు. అదే ఒకరికొకరు పొసగక పోతే గొడవలు, విమర్శలే. కానీ ఇద్దరు నటీమణులు ఒక చిత్రంలో కలిసి నటించినా హలో..బై అనే మాటలతోనే సరిపెట్టుకున్నారట. వారెవరో కాదు, అందాల భామ కాజల్‌అగర్వాల్, అక్షరహాసన్. ఈ ముద్దుగుమ్మలు కలిసి నటించిన చిత్రం ఏమిటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్.వివేగం, అజిత్ కథానాయకుడిగా నటించిన ఇందులో కాజల్‌అగర్వాల్ కథానాయకిగా నటించింది. మరో ప్రధాన పాత్రలో కమలహాసన్ రెండవ వారసురాలు అక్షరహాసన్ నటించింది. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రంలో కాజల్‌అగర్వాల్‌కు అక్షరహాసన్‌కు మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉండవట. దీంతో వీరి మధ్య పెద్దగా స్నేహం ఏర్పడలేదట. షూటింగ్ స్పాట్లో ఎదురు పడినప్పుడు మాత్రం హలో చెప్పుకునే వారట. షూటింగ్ పూర్తి అయ్యి గుమ్మడికాయ కొట్టినప్పుడు ఒక సెల్ఫీ తీసుకుని బై చెప్పడం వరకే ఈ భామలు పరిమితం అయ్యారట. ఇంతకీ ఈ బ్యూటీస్ మధ్య స్నేహం ఏర్పడకపోవడానికి కారణాలేంటబ్బా ‘ ఇప్పుడీ విషయమే సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. మొత్తం మీద వివేగం చిత్రం వచ్చే నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఎవరి నటన ఎలా ఉంది, ఎవరికి ఎంత పేరు తెచ్చి పెడుతుంది అన్నది తేలేది అప్పుడే. -
వీరాభిమానం.. విగ్రహం
హీరోలకు అభిమానులుండటం కామన్. అభిమాన హీరో సినిమా ఫంక్షన్స్, సినిమా విడుదలైనప్పుడు వీరిదే హంగామా. వీరాభిమానులైతే ఈ హంగామాతో పాటు అభిమాన హీరో పేరిట సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అంతేకాదండోయ్... అభిమాన హీరోకు విగ్రహాలు కూడా పెట్టేస్తుంటారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ అభిమానులు ఆయన విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. తమిళంలో అజిత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘వివేగమ్’ సినిమాలో నటిస్తున్నారు. కొన్ని రోజుల కిందట విడుదలైన ఆ సినిమా టీజర్ కొద్ది గంటల్లోనే రికార్డు వ్యూస్ దక్కించుకుంది. టీజర్లో అజిత్ నడిచి వస్తుంటారు. ఆ తరహాలోనే వాకింగ్ స్టైల్లో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ‘వివేగమ్’ మూవీ రిలీజ్ టైమ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు చెన్నై కోడంబాక్కమ్ టాక్. -
మలుపు తిప్పే వివేగం
తమిళసినిమా: వివేగం చిత్రం అందులో నటించిన నటీనటులు, సాంకేతిక వర్గం కేరీర్‌ను మలుపు తిప్పే చిత్రంగా ఉంటుందట. ఇది అన్నది ఎవరో కాదు ఆ చిత్ర దర్శకుడు శివ. అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం వివేగం. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ భారీఎత్తున్న నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాజల్‌అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్న ఇందులో అక్షరహాసన్ ముఖ్య భూమికను పోషిస్తున్నారు. అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్న వివేకం చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 10న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.చిత్రాన్ని సెన్సార్‌కు పంపే పనిలో చిత్ర యూనిట్ ఉంది. కాగా ఇందులో అజిత్ రిస్కీ సన్నివేశాల్లోనూ డూప్ లేకుండా నటించారని ఇప్పటికే ఆ చిత్ర చాయాగ్రహకుడు వెట్రి గొప్పగా చెప్పారు. కాగా వివేగం చిత్రాన్ని అజిత్ సహా చిత్ర యూనిట్ అంతా చూశారని, అందరూ ఏక కంఠంతో చెప్పిన మాట ఈ చిత్రం తమ కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రంగా ఉంటుందనేనని దర్శకుడు శివ అన్నారు. కాగా ఇందులో అనిరుథ్ కర్ణాటక సంగీతంతో ఒక పాటకు ప్రయోగం చేశారట. ఆ పాట చిత్రానికి హైలెట్ అవుతుందంటున్నాయి చిత్ర వర్గాలు. -
సెర్బియాకు వివేగం చిత్ర యూనిట్
తమిళసినిమా: వివేగం చిత్రం మరోసారి యూరప్ దేశాలకు వెళ్లనుందన్నది తాజా సమాచారం. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వివేగం. కాజల్‌అగర్వాల్ నాయకి, అక్షరహాసన్ కీలక పాత్రలోనూ నటిస్తున్న ఇందులో హిందీ స్టార్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే వివేగం చిత్రంలో వివేక్ ఓబెరాయ్ది విలన్ పాత్ర కాదని ఆ చిత్ర దర్శకుడు శివ ఇటీవల వెల్లడించారు. కాగా సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్, సర్వైవా అనే సింగిల్ సాంగ్ విడుదలై అజిత్ అభిమానుల్ని ఖుషీ పరుస్తున్నాయి. అజిత్ ఇటర్పోల్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన అభిమానులు చిత్ర విడుదల ఎప్పుడెప్పుడాని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా వివేగం చిత్రం పూర్తిగా యూరప్ దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ముఖ్యంగా బల్గేరియాలో అధిక భాగం షూటింగ్‌ను నిర్వహించారు. ఇటీవలే షూటింగ్ ముగించుకుని చిత్ర యూనిట్ చెన్నై చేరుకుంది. కాగా మరి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి సెర్బియా వెళ్లనున్నట్లు చిత్ర దర్శకుడు శివ తెలిపారు. కాగా వివేగం చిత్రాన్ని ఆగస్ట్ నెలలో భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. -
ఆయన చాలా స్వీట్!
అందాల భరిణి కాజల్‌అగర్వాల్ కెరీర్ ప్రస్తుతం చాలా పీక్‌లో ఉందనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఏకకాలంలో ఇళయదళపతి విజయ్‌తో మెర్సల్ చిత్రంలోనూ, అజిత్‌లతో వివేగం చిత్రంలోనూ రొమాన్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు గత 19వ తేదీన తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ట్విట్టర్లో అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. వారితో కాజల్ ట్విట్టర్లోనే కాసేపు ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపిగ్గా బదులిచ్చారు. అందులో వివేగం చిత్రం గురించి చెప్పమన్న అభిమాని ప్రశ్నకు ఈ చిత్రం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు. అయితే అందులో తన పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుందని చెప్పారు. అజిత్ గురించి చెప్పమన్న ప్రశ్నకు ఆయన చాలా మంచి నటుడని పేర్కొన్నారు. వివేగం చిత్ర యూనిట్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. వెంటనే మరి విజయ్ గురించి అన్న ప్రశ్నకు విజయ్‌తో నటించిన తుపాకీ చిత్రంలో నటించిన పాత్ర తన మనసుకు చాలా దగ్గరగా ఉందని పేర్కొన్నారు. విజయ్ చాలా స్వీట్ పర్సన్ అని, అద్భుత నటుడని చెప్పింది. మెర్సల్ చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కాజల్ పేర్కొన్నారు. పదేళ్ల నటన జీవితాన్ని పూర్తి చేసుకున్న కాజల్‌అగర్వాల్ తమిళం, తెలుగు, హిందీ మొదలగు భాషలతో కలిసి అర్ధ శత చిత్రాల మైలు రాయిని చేరుకున్నారన్నది గమనార్హం -
అజిత్‌కు అది సెంటిమెంటా..?
సెంటిమెంట్‌కు చాలా మంది ప్రాధాన్యతనిస్తుంటారు. అయితే అది సినిమా విషయంలో కాస్త ఎక్కువనే చెప్పాలి. ఒక చిత్రం హిట్ అయితే అందుకు కారణమైన విషయాన్ని సెంటిమెంట్‌గా తరువాత కూడా ఫాలో అవుతుంటారు. అలాఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలా నటుడు అజిత్‌కు ఒక సెంటిమెంట్ ఉందా? అంటే లేకపోలేదంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఒక సమయంలో అజిత్ అపజయాలనే పడవలో ఆటుపోటులకు గురైనా ఇటీవల వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు. సమీపకాలంలో చూసుకుంటే వీరమ్, వేదాళం చిత్రాలు వరుసగా అజిత్ విజయాల గ్రాస్ పెంచాయనే చెప్పాలి. వీరమ్ చిత్రం జనవరి 10న విడుదల కాగా, వేదాళం నవంబర్ 10న విడుదలైంది. తాజాగా నటిస్తున్న చిత్రం వివేగం. కాజల్‌అగర్వాల్ నాయకిగా నటిస్తున్న ఇందులో కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 10న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే ఈ మూడు చిత్రాల మొదటి అక్షరం ‘వి’ తో మొదలవుతోంది. ఈ మూడు చిత్రాలకు దర్శకుడు శివ కావడం విశేషం. ఇలా అజిత్ నటిస్తున్న చిత్రాలు వరుసగా 10వ తేదీన తెరపైకి రావడం, వి అక్షరాలతో చిత్ర పేర్లు నిర్ణయించడం అన్నది కాకతీళీయమా? లేక సెంటిమెంట్‌గా భావించి ఆ తేదీల్లో విడుదలకు ప్లాన్ చేసుకుంటున్నారా? అన్నది ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కాగా వివేగం చిత్రంపైనా భారీ అంచనాలే నెలకొన్నాయి. -
అజిత్ అభిమానులకు షాకింగ్ న్యూస్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అభిమానులకు చేదువార్త. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వివేగం' మూవీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అజిత్ గాయపడ్డారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో కాజల్ అగర్వాల్ తొలిసారిగా అజిత్‌తో జత కట్టింది. అజిత్ ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. యూరప్‌లో వివేగం మూవీ షూటింగ్ వేగంగా జరగుతుంది. ఈ క్రమంలో ఎలాంటి డూప్ లేకుండా ఓ భారీ యాక్షన్ సన్నివేషాన్ని చిత్రీకరిస్తుండగా అజిత్ అమాంతం కొంత ఎత్తు నుంచి కింద పడ్డారు. ఈ క్రమంలో ఆయన భుజానికి గాయాలైనట్లు సమాచారం. అజిత్‌కు వెంటనే ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయాల తీవ్రతపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే మూవీ యూనిట్ మాత్రం అజిత్ గాయాలకు సంబంధించి అధికారికంగా విషయాన్ని వెల్లడించలేదు. అజిత్ ను యాక్షన్ సీన్లలో చూడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అజిత్ గాయం తీవ్రత ఎక్కువైతే కొన్ని రోజులపాటు షూటింగ్ నిలిపివేయనున్నారు. -
టెంపర్‌తో లక్ వర్కౌవుట్ అవుతుందా?
కోలీవుడ్‌లో మార్కెట్ ఖాళీ అనుకున్న సమయంలో నటుడు అజిత్‌తో వివేగం చిత్రంలో జత కట్టే అవకాశం నటి కాజల్ అగర్వాల్‌ను మరోసారి లైమ్‌టైమ్‌లోకి తీసుకొచ్చింది. ఆ తరువాత మరో స్టార్ హీరో విజయ్‌తో ఆయన 61వ చిత్రంలో నటించే అవకాశం తలుపుతట్టింది. ఇలా ఒకే సారి ఇద్దరు ప్రముఖ హీరోలతో నటిస్తుండడంతో సంబరాలు చేసుకుంటోంది నటి కాజల్‌అగర్వాల్. తెలుగులోనూ తన తొలి దర్శకుడు తేజా దర్శకత్వంలో రానాతో రొమాన్స్ చేస్తున్న కాజల్ ఇటీవల వివేగం చిత్రం కోసం ఐరోపా దేశాలు చుట్టొచ్చింది. ఆ లొకేషన్స్‌ను తన ట్విట్టర్లో పోస్ట్ చేసి, అక్కడ నటించిన అనుభవాలను పంచుకుంది. ఒక తెలుగు చిత్రం కోసం హైదరాబాదులో మండే ఎండల్లో నటించి, వివేగం చిత్రం షూటింగ్ కోసం ఐరోపా దేశాలకు వెళ్లానని చెప్పుకొచ్చింది. అక్కడ సూర్యరశ్మినే చూడలేదన్నారు. జిల్ అనిపించే మంచు ప్రాంతాల్లో నటించిన అనుభవం మరపురానిదని పేర్కొంది. ముఖ్యంగా సైబీరియా, లోతట్టు మంచు ప్రాంతం అయిన మాసిటోనియా, పోలెండ్ వంటి సుందరమైన ప్రాంతాల్లో నటించడం సరికొత్త అనుభూతిని కలిగించిందని పేర్కొంది. ఉత్తరాదికి చెందిన ఈ అమ్మడు బాలీవుడ్‌లోని కొన్ని చిత్రాల్లో నటించినా, అక్కడ రాణించలేకపోయింది. ఈ బ్యూటీకి ఆ కొరత వెంటాడుతూనే ఉందట. అలాంటిది మరోసారి బాలీవుడ్లో తన లక్కు పరీక్షించుకునే అవకాశం వచ్చిందట. కాజల్‌అగర్వాల్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో నటించి సక్సెస్‌ను అందుకున్న టెంపర్ చిత్రం తాజాగా హిందీలో రీమేక్ కానుంది. రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా నటించనున్న ఇందులో నాయకి అవకాశాన్ని కాజల్ దక్కించుకుందన్నది తాజా సమాచారం. ఈ చిత్రం అయినా బాలీవుడ్లో కాజల్‌కు లక్ అవుతుందా లేక కిక్ నిస్తుందా అన్నది చూడాలి. -
హాలీవుడ్ రేంజ్లో అజిత్ 'వివేగం' టీజర్
-
హాలీవుడ్ రేంజ్లో అజిత్ 'వివేగం' టీజర్
కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వివేగం టీజర్ వచ్చేసింది. అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఫారిన్ లోకేషన్లలో భారీ యాక్షన్స్ సీన్స్‌తో రూపొందించిన టీజర్ అభిమానులను అలరిస్తోంది. అజిత్ ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో కాజల్ అగర్వాల్ తొలిసారిగా అజిత్‌తో జత కట్టింది. అక్షర హాసర్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్ రిలీజ్ అయిన పది గంటల్లోనే రెండు మిలియన్ల వ్యూస్ సాధించిన రికార్డ్ సృష్టించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సెన్సేషన్ సృష్టించిన వివేగం, టీజర్ తోనూ అదే హవా చూపిస్తోంది. ఆగస్ట్‌లో వివేగం మూవీ రిలీజ్ కి యూనిట్ ప్లాన్ చేస్తుంది. -
సూపర్ స్టార్‌కు షాకిస్తున్న అజిత్
-
సూపర్ స్టార్‌కు షాకిస్తున్న అజిత్
సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బైలింగ్యువల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నాడు సూపర్ స్టార్. అందుకే తమిళ నాట కూడా భారీ రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే మహేష్ జోరుకు అజిత్ బ్రేక్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న అజిత్ ప్రస్తుతం మాస్ స్పెషలిస్ట్ శివ దర్శకత్వంలో వివేగం అనే యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమాను కూడా ఆగస్టు 11నే రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. స్పైడర్ సినిమా రిలీజ్ సమయంలోనే అజిత్ సినిమాకు రిలీజ్ అయితే కోలీవుడ్ మహేష్ బాబు సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. కోలీవుడ్ లో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా.. మహేష్ బాబు సినిమాకు థియేటర్లు కూడా భారీ స్థాయిలో లభించకపోవచ్చని భావిస్తున్నారు. మరి నిజంగానే ఈరెండు భారీ చిత్రాలు పోటి పడతాయా..? లేక సర్థుకుపోయి డేట్లు మార్చుకుంటారా..? చూడాలి. -
షార్ప్ షూటర్‌గా దుమ్మురేపిన అజిత్!
అగ్రహీరో అజిత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వివేగం' తాజా లుక్ అభిమానులను థ్రిల్లింగ్‌కు గురిచేస్తున్నది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ స్నిప్పర్గా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు శివ ట్వీట్ చేసిన ఫొటోలో షార్ప్ షూటర్‌గా అజిత్ అదరగొట్టాడు. మంచులో పడుకొని తుపాకీతో గురిపెట్టిన ఆయన తాజా ఫొటో.. అభిమానులను అలరిస్తోంది. ఈ ఏడాది విడుదలవుతున్న రజనీకాంత్ 'రోబో 2.0' తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న సినిమా 'వివేగం'. ఈ సినిమాలో అజిత్ సిక్స్‌ప్యాక్ తో అదరగొట్టబోతున్నాడు. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఇంటర్‌పోల్ ఆఫీసర్ కావడంతో ఎక్కువ శాతం చిత్రీకరణ యూరోపియన్ దేశాల్లోనే జరుపుతున్నారు. కమల్‌హాసన్ చిన్న కుమార్తె అక్షరా హాసన్ తమిళ తెరకు పరిచయమవుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక. హిందీ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. స్టైలిష్ విలన్‌గా వివేక్ లుక్ ఈ సినిమాలో ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రం ఆగష్టు 10న థియేటర్లను పలకరించనుంది. VIVEGAM -
అజిత్ ఫోన్ కాల్.. హీరో విజయ్ భార్య అలక!
చెన్నై: వరుస మూవీలతో బిజిబిజీగా ఉన్న తమిళ హీరో విజయ్ సేతుపతికి ఓ సర్ ప్రైజ్ కాల్ రావడంతో అతడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. కానీ ఆయన భార్య జెస్సీ సేతుపతి మాత్రం తెగ ఫీలైపోయారట. అసలు ఏమైందంటే.. 'వివేగమ్'తో పాటు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న స్టార్ హీరో అజిత్ కుమార్ ఆ మూవీ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాడు. గతేడాది నుంచి ఇప్పటివరకూ విడుదలైన కొన్ని మూవీలు (సేతుపతి, కాధలం కదంతు పొగమ్, ఇరైవి, రెక్క, ధర్మదురై అండ్ ఆనందవన్ కట్టలై) చూశాడు. విజయ్ చాలా తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు ఆ కథల ఎంపికపై అజిత్ ఇంప్రెస్ అయిపోయాడు. విజయ్ సేతుపతికి ఫోన్ చేసి అతడి మూవీలను మెచ్చుకున్నాడు. ఇదే తరహాలో విభిన్న మూవీలతో ప్రేక్షకులకు వినోదం పంచాలని విజయ్ కి సూచించాడు. ఇంతవరకూ ఒకే కానీ, ఈ క్రమంలో విజయ్ ఇరకాటంలో పడ్డాడు. నటుడు విజయ్ భార్య జెస్సీ సేతుపతి స్టార్ హీరో అజిత్‌కు వీరాభిమాని. వివేగమ్ మూవీ షెడ్యూల్ బ్రేక్ సమయంలో భర్తతో కలసి వెళ్లి అజిత్‌ను కలవాలని జెస్సీ ప్లాన్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్త విజయ్ మరిచిపోయాడు. అజిత్ తనకు ఫోన్ చేసి ప్రశంసించాడని చెప్పగానే సంతోషించక పోగా విజయ్ భార్య జెస్సీ కాస్త ఫీలయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అజిత్ ఫోన్ చేస్తే తన గురించి గానీ, తామిద్దరం కలవాలని ప్లాన్ చేసుకున్న విషయాన్ని చెప్పలేదని విజయ్ పై జెస్సీ అలిగారట. ఇటీవల రజనీకాంత్, విజయ్‌కి ఫోన్ చేసి అభినందించగా, తాజాగా అజిత్ కూడా ఫోన్ చేసి ప్రశంసించడంపై కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. -
హ్యాట్రిక్ ప్లాన్‌లో హిట్ కాంబినేషన్
వరుస బ్లాక్ బస్టర్లతో కోలీవుడ్‌లో దూసుకుపోతున్న స్టార్ హీరో అజిత్.. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్లను రిపీట్ చేస్తూ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే ఆ ప్రాజెక్ట్ మీద హైప్ క్రియేట్ చేస్తున్నాడు అజిత్. గతంలో తనకు వీరం, వేదలం సూపర్ హిట్స్‌ను అందించిన శివ దర్శకత్వంలో ప్రస్తుతం వివేగం సినిమా చేస్తున్నాడు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుండగా తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు అజిత్. తనతో బిల్లా, ఆరంభం సినిమాలను తెరకెక్కించిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు అజిత్. మాస్ హీరోగా ఉన్న అజిత్‌ను స్టైలిష్ లుక్‌లో చూపించిన విష్ణువర్ధన్, మరోసారి అజిత్ కోసం డిఫరెంట్ సబ్జెక్ట్‌ను రెడీ చేశాడట. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ చోళ రాజుగా నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వివేగం షూటింగ్లో బిజీగా ఉన్న అజిత్ నుంచి త్వరలోనే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
సూపర్ స్టార్‌కు సైడ్ ఇచ్చాడు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు మురుగదాస్. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గర నుంచి సూపర్ స్టార్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మహేష్ సినిమా రిలీజ్ అవుతున్న జూన్ 23నే కోలీవుడ్ టాప్ హీరో అజిత్ మూవీ, వివేగంను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది చిత్రయూనిట్. అదే జరిగితే కోలీవుడ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న మహేష్, మురుగదాస్‌ల సినిమాకు కష్టాలు తప్పవు. అయితే వివేగం టీం తాజా ప్రకటనతో సూపర్ స్టార్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వివేగం సినిమాను ముందుగా అనుకున్నట్టుగా జూన్ 23న కాకుండా ఆగస్ట్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో పోస్ట్ ప్రొడక్షన్‌కు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. దీంతో మహేష్ బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు గ్యాప్ దొరికింది.