
కోలీవుడ్‌లో అజిత్, శివ, అనిరుధ్‌లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో వచ్చిన వేదలం, వివేగం సినిమాలు కాసుల పంట పండించాయి. అయితే ఇంత మంచి రికార్డ్ ఉన్న తమ నెక్ట్స్ సినిమాకు అనిరుధ్ ను పక్కన పెట్టేయాలని భావించారు అజిత్, శివ. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న విశ్వాసం సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నట్టుగా ప్రకటించారు.
కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏమో.. యువన్ స్థానంలో అనిరుధ్ వచ్చి చేరాడు. విశ్వాసం సినిమాకు కూడా అనిరుధ్‌తోనే మ్యూజిక్ చేయించాలని ఫిక్స్ అయ్యారు. కోలీవుడ్‌లో భారీ సినిమాలతో దూసుకుపోతున్న అనిరుధ్ మ్యూజిక్ ‘విశ్వాసం’కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే అనిరుధ్ ఎంట్రీపై విశ్వాసం టీం అధికారిక ప్రకటన చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment