
తమిళసినిమా: 2017 చాలా బాగుంది. తనలో నమ్మకాన్ని పెంచింది అని అన్నారు నటి కాజల్‌అగర్వాల్. నటిగా దశాబ్దకాలాన్ని అధిగమించిన ఈ బ్యూటీ ఇప్పటికీ తెలుగు, తమిళం భాషల్లో అగ్ర కథానాయకల్లో ఒకరిగా రాణిస్తున్నారు. హీరోయిన్ కాల వ్యవధి పరిమితమే అన్న నానుడిని బద్ధలు కొట్టిన అతి కొద్ది మంది నటీమణుల్లో కాజల్ అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. పలు అపజయాలను ఎదురొడ్డి విజయ పయనం చేస్తున్న ఈ ఉత్తరాది భామను 2017వ ఏడాది ఎలా గడిచిందన్న ప్రశ్నకు గతేడాది చాలా బాగుంది.
నిజం చెప్పాలంటే తనలో నమ్మకాన్ని పెంచింది అని చెప్పారు. కోలీవుడ్‌లో అజిత్‌కు జంటగా వివేగం, విజయ్‌లో మెర్శల్ వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం కలిగింది. ఇక కలలో కూడా ఊహించనివిధంగా టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి సరసన ఖైదీ నంబర్ 150 చిత్రంలో నటించడం మరపురాని అనుభవం. అదే విధంగా రానాతో నేనేరాజు నేనేమంత్రి వంటి విజయవంతమైన చిత్రంలోనూ నటించాను. ఇలా 2017లో వరుస విజయాలతో గడిచిపోయింది. తాజాగా ప్యారిస్ ప్యారిస్, అవే చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పింది. హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్ర తమిళ రీమేక్ చిత్రమే ప్యారిస్ ప్యారిస్ చిత్రం అని తెలిపింది. ఇందులో కంగణా రావత్ పాత్రలో తాను పోషించడం సంతోషంగా ఉందని పేర్కొంది. 2017 బాగుంటే 2018 బహుబాగుంటుందని ఆశాభావాన్ని కాజల్ వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment