కుట్రలతో నన్నేమీ చేయలేరు: నటి | Kajal Aggarwal is the only heroine to act in two star heroes | Sakshi
Sakshi News home page

కుట్రలతో నన్నేమీ చేయలేరు: నటి

Published Fri, Jul 14 2017 7:41 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM

కుట్రలతో నన్నేమీ చేయలేరు: నటి

కుట్రలతో నన్నేమీ చేయలేరు: నటి

చెన్నై: ‘నాపై కుట్రలు పన్నుతున్నారు. అయితే, అవినన్నేమీ చేయలేవు. నా స్థాయిని ఎవరూ కదిలించలేరు' అంటోంది నటి కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కోలీవుడ్‌లో విజయ్, అజిత్, వంటి ఇద్దరు స్టార్ హీరోలతో నటిస్తున్న ఏకైక హీరోయిన్ కాజల్ అగర్వాల్‌నే. అదే విధంగా తెలుగుతో పాటు హిందీలోనూ అవకాశాలను అందుకుంటున్న నటి కాజల్. తెలుగులో రానాతో రొమాన్స్ చేసిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. హిందీలో సన్నిడియోల్‌తో నటించే లక్కీఛాన్స్ ఈ బ్యూటీని వరించిందనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా పీ.వాసు దర్శకత్వంలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం చేయనున్నట్లు టాక్ ప్రచారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్ ఆగర్వాల్ పై వదంతులు జోరుగానే సాగుతున్నాయన్నది గమనార్హం.ఆ మధ్య ఒక భేటీలో తాను ప్రేమ వివాహమే చేసుకుంటాననీ ఈ నటి చెప్పింది. అంతేకాక తనకు కాబోయే వరుడు సినిమా రంగానికి చెందిన వాడైనా లేదా మరే ఇతర రంగాలకు చెందిన వాడైనా పర్వాలేదనీ తెలిపింది. తను అందంగా లేకపోయినా పర్వాలేదు గానీ కచ్చితంగా ఆరడుగుల పొడవాటి వాడై ఉండాలని పేర్కొన్నారు. దీంతో కాజల్ ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరందుకుంది.

ఒక ప్రముఖ టాలీవుడ్ నటుడితో తరచూ రహస్యంగా కలుసుకుంటున్నారనీ టాక్. అదే విధంగా ఇటీవల అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం హల్‌చల్‌ చేసింది.  ఇలాంటివి కాజల్ ను కలతకు గురిచేశాయట. దీంతో ఈ అమ్మడు కాస్త ఘాటుగానే స్పందించారు. తన ఎదుగుదలను ఓర్వలేని వారే ఇలాంటి దుష్పచారాన్ని చేస్తున్నారు. ఇదంతా వారు తనపై పన్నుతున్న కుట్ర అని నటి ఆరోపించారు. అయితే వారి కుట్రలు పారవనీ, మరి కొన్నేళ్ల వరకూ తాను అగ్రహీరోలతోనే నటిస్తాననీ కాజల్ అన్నారు. తన స్థానాన్ని ఎవరూ కదిలించలేరు అనే ధీమాను వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement