ఆ ముగ్గురితో భలే మంచి అనుభవం! | Lucky actress Kajal Aggarwal in the South | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురితో భలే మంచి అనుభవం!

Published Fri, Jul 7 2017 11:08 PM | Last Updated on Tue, Oct 30 2018 7:36 PM

ఆ ముగ్గురితో  భలే మంచి అనుభవం! - Sakshi

ఆ ముగ్గురితో భలే మంచి అనుభవం!

తమిళసినిమా:  దక్షిణాదిలో అదృష్టవంతులైన ముద్దుగుమ్మల్లో నటి కాజల్‌అగర్వాల్‌ ఒకరని చెప్పడం అతిశయోక్తి కాదు. అన్ని భాషల్లో కలిసి దశాబ్దకాలంలో అర్ధశత చిత్రాలను పూర్తి చేసి అరుదైన మైలురాయిని దాటిన కథానాయకి కాజల్‌అగర్వాల్‌. నేటికీ ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ కోలీవుడ్‌లో ఏకకాలంలో స్టార్‌ నటులు అజిత్, విజయ్‌లతో రీల్‌ రొమాన్స్‌ చేస్తుండడం విశేషమే అవుతుంది. విజయ్‌కు జంటగా ఇప్పటి కే తుపాకీ, జిల్లా చిత్రాల్లో నటించారు. తాజాగా మెరసిల్‌ చిత్రంలో జత కడుతున్నారు. ఇక అజిత్‌తో తొలిసారిగా వివేగం చిత్రంలో నటిస్తున్న కాజల్‌ ఇంతకు ముందే నటుడు సూర్యతో కలిసి మాట్రాన్‌ చిత్రంలో నటించారు. కాగా ఈ ముగ్గురి గురించి ఈ అమ్మడి అభిప్రాయాలేమిటో చూద్దాం.

అజిత్‌: సెట్‌లో అందరితో చాలా ప్రేమగా, గౌరవంగా ఉంటారు. ఎవరికీ ఉచిత సలహాలు వంటివి ఇవ్వరు. అయితే అజిత్‌ను గమనిస్తేనే చాలా విషయాలను నేర్చుకోవచ్చు. అజిత్‌ బిరియానీ అందరికీ స్పెషల్‌. ఆయన నాకు బిరియానీ వండిపెట్టారు. అబ్బ ఎంత బాగుందో!

విజయ్‌: కఠిన శ్రమజీవి. సెట్‌లో చాలా శాం తంగా ఉంటారు. అయితే కెమెరా ముందుకు వెళ్లారంటే అందరూ అబ్బురపరపడాల్సిందే. అంత అంకితభావంతో నటిస్తారు. ఇక జయాపజయాలను తలకెక్కించుకోకుండా ఉండాలన్నది విజయ్‌ నుంచే నేర్చుకోవాలి.
సూర్య: చాలా అద్భుత నటుడు. పాత్రగా మారడానికి శక్తి వంచనలేకండా కృషి చేస్తారు. ఈ ముగ్గురు స్టార్‌ నటులతో కలిసి నటించడం భలే మంచి అనుభవం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement