వివేగం వరల్డ్ రికార్డ్ | Ajith Vivegam world record | Sakshi
Sakshi News home page

వివేగం వరల్డ్ రికార్డ్

Published Fri, Sep 15 2017 12:47 PM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

వివేగం వరల్డ్ రికార్డ్

వివేగం వరల్డ్ రికార్డ్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం వివేగం. మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు టాక్ ఎలా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వివేగం మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో అత్యథిక లైక్స్ సాధించిన టీజర్ గా ప్రపంచ రికార్డ్ సృష్టించింది.

ఇన్నాళ్లు ఈ రికార్డ్ హాలీవుడ్ యాక్షన్ మూవీ స్టార్ వార్స్ పేరిట ఉండగా.. అజిత్ వివేగం 5 లక్షల 70 వేలకు పైగా లైక్స్ సాధించిన ఆ రికార్డ్ ను తన సొంతం చేసుకుంది. జేమ్స్ బాండ్ తరహా కథా కథనాలతో తెరకెక్కిన వివేగం సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. అజిత్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అక్షరహాసన్ మరో కీలక పాత్రలో అలరించింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement