అజిత్ అభిమానులకు షాకింగ్ న్యూస్! | Actor Ajith injured while the shoot of Vivegam in Europe | Sakshi
Sakshi News home page

హీరో అజిత్‌కు తీవ్ర గాయాలు

Published Wed, May 31 2017 7:47 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

అజిత్ అభిమానులకు షాకింగ్ న్యూస్! - Sakshi

అజిత్ అభిమానులకు షాకింగ్ న్యూస్!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అభిమానులకు చేదువార్త. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వివేగం' మూవీలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అజిత్ గాయపడ్డారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సత్యజ్యోతి ఫిలింస్‌ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా అజిత్‌తో జత కట్టింది. అజిత్ ఇంటర్ పోల్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్గా నటిస్తున్నాడు. యూరప్‌లో వివేగం మూవీ షూటింగ్ వేగంగా జరగుతుంది. ఈ క్రమంలో ఎలాంటి డూప్ లేకుండా ఓ భారీ యాక్షన్ సన్నివేషాన్ని చిత్రీకరిస్తుండగా అజిత్ అమాంతం కొంత ఎత్తు నుంచి కింద పడ్డారు.

ఈ క్రమంలో ఆయన భుజానికి గాయాలైనట్లు సమాచారం. అజిత్‌కు వెంటనే ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయాల తీవ్రతపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే మూవీ యూనిట్ మాత్రం అజిత్ గాయాలకు సంబంధించి అధికారికంగా విషయాన్ని వెల్లడించలేదు. అజిత్ ను యాక్షన్ సీన్లలో చూడాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అజిత్ గాయం తీవ్రత ఎక్కువైతే కొన్ని రోజులపాటు షూటింగ్ నిలిపివేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement