అజిత్ తదుపరి చిత్రానికి టైటిల్ ఫిక్స్ | Ajith, Siva next film title fixed | Sakshi
Sakshi News home page

అజిత్ తదుపరి చిత్రానికి టైటిల్ ఫిక్స్

Published Thu, Nov 23 2017 3:31 PM | Last Updated on Thu, Nov 23 2017 3:31 PM

Ajith, Siva next film title fixed - Sakshi

వీరం, వేదలం, వివేగం లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన అజిత్, శివ ల కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. వివేగం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అజిత్.. త్వరలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. ఈ సినిమాను కూడా శివ దర్శకత్వంలోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు అజిత్. ఈ సినిమాకు విశ్వాసం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో అజిత్ శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ 'V' అనే అక్షరంతోనే మొదలయ్యాయి. అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ తన తదుపరి చిత్రాన్ని కూడా V తోనే మొదలయ్యేలా ప్లాన్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనుంది. త్వరలోనే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement