అజిత్.. మళ్లీ అతడితోనే..! | ajith to work with siva for the fourth time | Sakshi
Sakshi News home page

అజిత్.. మళ్లీ అతడితోనే..!

Published Thu, Sep 14 2017 3:04 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

అజిత్.. మళ్లీ అతడితోనే..!

అజిత్.. మళ్లీ అతడితోనే..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వివేగం సినిమాతో భారీ వసూళ్లను సాధించిన ఈ టాప్ స్టార్, ఆ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. అయితే షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో అలాగే షూటింగ్ పూర్తి చేసి ఇటీవల సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న అజిత్ తన నెక్ట్స్ సినిమా పనులు మొదలుపెట్టారన్న టాక్ వినిపిస్తోంది.

గతంలో అజిత్ ఓ చారిత్రక చిత్రంలో నటిస్తారన్న టాక్ వినిపించినా.. ప్రస్తుతం ఆ ప్రయత్నాలు విరమించుకున్నారట. మరోసారి తన లక్కీ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నటించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాను స్పేస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నారట. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వీరం, వేదలం, వివేగం లాంటి కమర్షియల్ సక్సెస్ లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి తో అదే ఫీట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు అజిత్, శివ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement