AK 63: Actor Ajith Kumar Is Set to Join Hands With This Director - Sakshi
Sakshi News home page

Ajith: మూడు హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌తో మళ్లీ జత కట్టనున్న అజిత్‌

Published Sat, Jun 17 2023 2:27 PM | Last Updated on Sat, Jun 17 2023 3:20 PM

AK 63: This Director Work with Ajith - Sakshi

అజిత 63వ చిత్రం ఫిక్స్‌ అయిందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్‌ వర్గాల నుంచి వస్తోంది. అయితే ఆయన నటిస్తున్న 62వ చిత్రమే ఇంకా సెట్‌ పైకి వెళ్లలేదు అంటారా? నిజమే, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ మగిల్‌ తిరుమేణి దర్శకత్వంలో నిర్మించనున్న విడా ముయర్చి చిత్రం జూలై మొదటి వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పుడు అజిత్‌ 63వ చిత్రం గురించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. రేర్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

సన్‌ పిక్చర్స్‌ సంస్థ రజనీకాంత్‌, విజయ్‌, ధనుష్‌ వంటి పలువురు ప్రముఖులు హీరోలతో చిత్రాలు నిర్మించింది. కానీ ఇప్పటి వరకు అజిత్‌తో చిత్రం తీయలేదు. కారణం ఆయన చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనరనేదే కారణం అని టాక్‌ ఉంది. అలాంటిది ఇన్నాళ్లకు ఈ సంస్థ అజిత్‌ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు కారణం దర్శకుడు శివ అని తెలిసింది.

దర్శకుడు శివ ఇంతకుముందు అజిత్‌ హీరోగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం వంటి నాలుగు హిట్‌ చిత్రాలను రూపొందించారన్నది తెలిసిందే. అదేవిధంగా రజనీకాంత్‌ కథానాయకుడిగా సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన అన్నాత్తే చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. దీంతో ఈ సంస్థలో నిర్మితం కానున్న సినిమాలో అజిత్‌ హీరోగా నటించడానికి ఈయనే కారణం అని తెలుస్తోంది. కాగా అజిత్‌ కథానాయకుడిగా సన్‌ పిక్చర్స్‌ నిర్మించే చిత్రానికి శివనే దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

చదవండి: చరణ్‌-ఉపాసనల బిడ్డ కోసం ఊయల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement