
రాఘవ లారెన్స్‌కు కెప్టెన్ విజయకాంత్ అంటే ఎంతో ఇష్టం. ఇటీవలే కెప్టెన్ కన్నుమూయగా ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోయాడు లారెన్స్. అంతేకాదు, ఆయన కోసం విజయకాంత్ తనయుడి సినిమాలో నటించేందుకు సిద్ధమని ప్రకటించాడు. విజయకాంత్ చిత్ర పటానికి నివాళులు అర్పించడానికి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు తన కొడుకు షణ్ముగ పాండియన్ భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నానని ప్రేమలత చెప్పింది. దీంతో షణ్ముగ నటించే చిత్రంలో తాను అతిథిగా నటించడానికైనా సిద్ధమని, అది తన బాధ్యత అని పేర్కొన్నాడు.
తాజాగా షణ్ముగ పాండియన్ పడై తలైవన్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించగా అందులో అతిథి పాత్రలో కనిపించడానికి రాఘవ లారెన్స్ మూడు రోజులు కాల్‌షీట్స్ కేటాయించినట్లు తెలిసింది. అదే విధంగా ఈ చిత్రం విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటానని రాఘవ లారెన్స్ పేర్కొన్నట్లు సమాచారం. కాగా చిత్రాన్ని అన్భు అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. దీనికి ఇళయరాజా సంగీతాన్ని, సతీష్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇది కుంకీ చిత్రం తరహాలో ఏనుగుల ప్రధాన ఇతివృత్తంతో సాగే కథా చిత్రం అని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.
చదవండి: హీరోయిన్-డైరెక్టర్ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది?
Comments
Please login to add a commentAdd a comment