Shanmuga Pandian
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాఘవ లారెన్స్!
రాఘవ లారెన్స్‌కు కెప్టెన్ విజయకాంత్ అంటే ఎంతో ఇష్టం. ఇటీవలే కెప్టెన్ కన్నుమూయగా ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోయాడు లారెన్స్. అంతేకాదు, ఆయన కోసం విజయకాంత్ తనయుడి సినిమాలో నటించేందుకు సిద్ధమని ప్రకటించాడు. విజయకాంత్ చిత్ర పటానికి నివాళులు అర్పించడానికి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు తన కొడుకు షణ్ముగ పాండియన్ భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నానని ప్రేమలత చెప్పింది. దీంతో షణ్ముగ నటించే చిత్రంలో తాను అతిథిగా నటించడానికైనా సిద్ధమని, అది తన బాధ్యత అని పేర్కొన్నాడు. తాజాగా షణ్ముగ పాండియన్ పడై తలైవన్ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించగా అందులో అతిథి పాత్రలో కనిపించడానికి రాఘవ లారెన్స్ మూడు రోజులు కాల్షీట్స్ కేటాయించినట్లు తెలిసింది. అదే విధంగా ఈ చిత్రం విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటానని రాఘవ లారెన్స్ పేర్కొన్నట్లు సమాచారం. కాగా చిత్రాన్ని అన్భు అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. దీనికి ఇళయరాజా సంగీతాన్ని, సతీష్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇది కుంకీ చిత్రం తరహాలో ఏనుగుల ప్రధాన ఇతివృత్తంతో సాగే కథా చిత్రం అని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: హీరోయిన్-డైరెక్టర్ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది? -
విజయ్‌కాంత్ కోసం ఆ పని చేయనున్న లారెన్స్!
కెప్టెన్ విజయ్‌కాంత్ ఇక లేరన్న విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28న కన్నుమూశారు. ఆయన మరణవార్త విని సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. కొందరు సెలబ్రిటీలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కంటతడి పెట్టుకోగా మరికొందరు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ అయ్యారు. హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ కొద్ది రోజుల క్రితమే తన తల్లితో కలిసి విజయ్‌కాంత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించాడు. అతడి సినిమాలో చేస్తా ఆ సమయంలో కెప్టెన్ తనయుడు షణ్ముగ పాండియన్ కెరీర్ బాధ్యతలు నువ్వే తీసుకోవాలని ఇంటిసభ్యులు రాఘవను కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం నాడు రాఘవ కీలక ప్రకటన చేశాడు. 'షణ్ముగ పాండియన్ నెక్స్ట్ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తాను. వీలైతే దర్శకులు మల్టీస్టారర్ కాన్సెప్ట్‌తో రండి. అప్పుడు ఇద్దరం ప్రధాన పాత్రల్లో నటించే వీలుంటుంది. అలాగే కెప్టెన్ రెండో కుమారుడు విజయ ప్రభాకరన్ రాజకీయాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని వీడియో రిలీజ్ చేశాడు. విజయ్‌కాంత్ మీద ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్(ట్విటర్)లో వెల్లడించాడు. అలా తెలుగువారికీ పరిచయం నల్ల ఎంజీఆర్, పురట్చి కలైజ్ఞర్, కెప్టెన్.. ఎలా పలు పేర్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు విజయ్‌కాంత్. తమిళంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న ఆయన ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. కానీ ఛాలెంజ్ రౌడీ, పోలీస్ అధికారం, కెప్టెన్, మా బావ బంగారం, సింధూరపువ్వు, బొబ్బిలి రాయుడు, మరణ మృదంగం.. ఇలా ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో అనువాదమవడంతో ఇక్కడివారికీ సుపరిచితులయ్యారు. ఒక్క రూపాయి తీసుకోలేదు నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే ఈయన ఒక్క రూపాయి పారితోషికం తీసుకునేవారు కాదు. అలాగే తన కార్యాలయంలో నిత్యాన్నదానం చేసేవారు. అటు సందేశాత్మక చిత్రాలు, ఇటు వాణిజ్య సినిమాలు ఏకకాలంలో చేసేవారు. అలాగే ఎందరో నటీనటులను ప్రోత్సహించి మంచి కెరీర్ అందించారు. ఈయన చివరగా తన కొడుకు షణ్ముగ పాండియన్‌ను హీరోగా పరిచయం చేసిన సహాబ్దం సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. I’m happy to share with you all that I’m ready to do a cameo role in captain sir’s Son Shanmuga Pandian’s movie as my respect and love for Vijayakanth sir 🙏🏼 pic.twitter.com/zIlNBqnVs2 — Raghava Lawrence (@offl_Lawrence) January 10, 2024 చదవండి: 'ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది'.. నమ్రత పోస్ట్ వైరల్! విరాట్ నాకు బావ అవుతాడు.. నాతో ఎలా ఉంటాడంటే?: సైంధవ్ హీరోయిన్ -
స్టార్ హీరో కొడుకు కొత్త సినిమా.. అలాంటి కాన్సెప్ట్‌తో
నటుడు విజయ్‌కాంత్ కొడుకు షణ్ముఖ పాండియన్ ఇంతకుముందు 'మధురై వీరన్' చిత్రంతో హీరోగా పరిచమయ్యాడు. తాజాగా ఇతడు హీరోగా చేయబోతున్న కొత్త మూవీ శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డైరక్టర్స్ సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కథనం, మాటలు పార్తీపన్ దేసింగు అందించగా, వాల్టర్, రెక్నా చిత్రాలు ఫేమ్ యు.అన్భు దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల) కస్తూరి రాజా, ఎమ్మెస్ భాస్కర్, యామిని సుందర్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్న ఇందులో మరికొందరు ప్రముఖ నటీనటుల ఎంపిక జరుగుతుందని దర్శకుడు చెప్పారు. ఇది వైవిధ్యభరిత యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర తొలి షెడ్యూల్ కేరళలోని దట్టమైన అడవుల్లో ప్రారంభించినట్లు తెలిపారు. తదుపరి షెడ్యూల్‌ను ఒడిశా, థాయిల్యాండ్ అడవుల్లో చిత్రీకరించనున్నట్లు దర్శకుడు చెప్పారు. ఇది అటవీ ప్రాంతంలోని ఏనుగులు, అక్కడి మనుషుల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దీనికి ఎస్ఆర్ సతీష్ కుమార్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నట్లు చిత్రబృందం చెప్పింది. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
నాన్నకు ప్రేమతో..
తమిళసినిమా: కన్నవారిపై ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అయితే దాన్ని నిరూపించుకోవడానికి విశేష సందర్భం అందరికీ కలగదు. యువ నటుడు షణ్ముగ పాండియన్‌కు అలాంటి మంచి తరుణం కలిసొచ్చింది. సీనియర్ నటు డు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్ పుత్రరత్నాల్లో ఒకరే ఈ షణ్ముగపాండియన్. ఈయన కథానాయకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. షణ్ముగ పాండియన్ నటించిన మదురైవీరన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చిం ది. ఇక విజయకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనది 40 ఏళ్ల గొప్ప నట చరిత్ర. అందులో ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు. ఎందరికో నట జీవితా న్ని ప్రసాదించిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి న నటుడు విజయకాంత్. అలాంటి ఆయన 40 సినీ వసంతోత్సవ వేడుకను ఇటీవల కాంచీపురం సమీపంలో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆ వేడుకలో పాల్గొని ఆశీర్వాదాలు, అభినందనలు అందించారు. అదే వేదికపై విజయకాంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నా, ఆయన చిన్న కొడుకు, నటుడు షణ్ముగపాండియన్ హాజరు కాలేదు. కారణం ఆ సమయంలో ఆయన లండన్‌లో ఉన్నారు. నాన్న 40 నట వసంతాల వేడుకలో పాల్గొన లేకపోయానన్న కొరతను ఇటీవల చెన్నైకి తిరిగొచ్చిన తరువాత తీర్చుకున్నారు. అది ఎలాగంటే తన తండ్రి రెండు కళ్లను తన బాహువులపై పచ్చబొట్టు పొడిపించుకుని ఆయన ముందు నిలిచి ఇది నాన్నపై తనకున్న ప్రేమ అని నిరూపించుకున్నారు. అదే సమయంలో తన తండ్రి ఆశీస్సులు అందుకుని ఎనలేని ఆనంద తరుణాన్ని పంచుకున్నారు. తండ్రితో ఫొటో తీసుకుని మధురానుభూతిని పొందారు. -
మెగాఫోన్ పట్టిన మరో ఛాయాగ్రాహకుడు
తమిళసినిమా: ఛాయాగ్రాహకులు దర్శకులుగా అవతారమెత్తడం అన్నది చాలా కాలంగానే వస్తోంది. దివంగత ప్రఖ్యాత కెమెరామెన్ బాలుమహేంద్ర దర్శకుడిగానూ పలు కళాఖండాలను తెరపై ఆవిష్కరించిన విషయం తెలిసిందే.అదే విధంగా కేవీ.ఆనంద్, మిజయ్ మిల్టన్ వంటి ఛాయాగ్రాహకులు సక్సెప్‌ఫుల్ దర్శకులుగా రాణిస్తున్నారు.తాజాగా పీజీ.ముత్తయ్య వారి బాటలో పయనానికి రెడీ అయ్యారు.ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి మదురైవీరన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. వి.స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు, డీఎండీకే నేత విజయకాంత్ రెండవ కొడుకు షణ్ముగ పాండియన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు సహాబ్ధం అనే చిత్రం ద్వారా పరిచయమైన విషయం తెలిసిందే. కాగా మదురై వీరన్ చిత్రంలో నవ నటి మీనాక్షి కథానాయకిగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలో సముద్రకని, వేల్.రామమూర్తి, మైమ్‌గోపీ, పీఎల్.తేనప్పన్, మారిముత్తు, నాన్‌కడవుల్ రాజేంద్రన్, బాలసరవణన్ నటిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న మదురై వీరన్ చిత్ర తుది భాగాన్ని ఆగస్టులో మదురైలో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు పీజీ.ముత్తయ్య తెలిపారు.ఈయనే ఛాయాగ్రహణం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం గురించి తెలుపుతూ ఇది జల్లికట్టు నేపథ్యంలో రూపొందిస్తున్న కథా చిత్రం అని తెలిపారు.ఇందులో విదేశం నుంచి సొంత ఊరుకు తిరిగొచ్చే యువకుడిగా షణ్ముగపాండియన్ నటిస్తున్నారని చెప్పారు. దీనికి సంతోష్ దయానిధి సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శనివారం నటుడు విజయకాంత్ ఆవిష్కరించారు.