
విజయకాంత్‌తో కుమారుడు షణ్ముగపాండియన్
తమిళసినిమా: కన్నవారిపై ఎవరికైనా ప్రేమ ఉంటుంది. అయితే దాన్ని నిరూపించుకోవడానికి విశేష సందర్భం అందరికీ కలగదు. యువ నటుడు షణ్ముగ పాండియన్‌కు అలాంటి మంచి తరుణం కలిసొచ్చింది. సీనియర్ నటు డు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్ పుత్రరత్నాల్లో ఒకరే ఈ షణ్ముగపాండియన్. ఈయన కథానాయకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. షణ్ముగ పాండియన్ నటించిన మదురైవీరన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చిం ది. ఇక విజయకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనది 40 ఏళ్ల గొప్ప నట చరిత్ర. అందులో ఎన్నో సంచలన విజయాలను అందుకున్నారు.
ఎందరికో నట జీవితా న్ని ప్రసాదించిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి న నటుడు విజయకాంత్. అలాంటి ఆయన 40 సినీ వసంతోత్సవ వేడుకను ఇటీవల కాంచీపురం సమీపంలో ఘనంగా నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆ వేడుకలో పాల్గొని ఆశీర్వాదాలు, అభినందనలు అందించారు. అదే వేదికపై విజయకాంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నా, ఆయన చిన్న కొడుకు, నటుడు షణ్ముగపాండియన్ హాజరు కాలేదు. కారణం ఆ సమయంలో ఆయన లండన్‌లో ఉన్నారు. నాన్న 40 నట వసంతాల వేడుకలో పాల్గొన లేకపోయానన్న కొరతను ఇటీవల చెన్నైకి తిరిగొచ్చిన తరువాత తీర్చుకున్నారు. అది ఎలాగంటే తన తండ్రి రెండు కళ్లను తన బాహువులపై పచ్చబొట్టు పొడిపించుకుని ఆయన ముందు నిలిచి ఇది నాన్నపై తనకున్న ప్రేమ అని నిరూపించుకున్నారు. అదే సమయంలో తన తండ్రి ఆశీస్సులు అందుకుని ఎనలేని ఆనంద తరుణాన్ని పంచుకున్నారు. తండ్రితో ఫొటో తీసుకుని మధురానుభూతిని పొందారు.
Comments
Please login to add a commentAdd a comment