
కొంతమంది చిన్నారులు అత్యంత చిన్న వయసులో అపారమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తుంటారు. వారి అద్భుతమైన ప్రతిభ ఎవ్వరినైనా ఆశ్చర్యంలో ముంచెత్తడమే గాక కట్టిపడేస్తాయి. అంతేగాదు వాళ్లని చూడగానే "పిట్ల కొంచెం కూత ఘనం" అనే ఆర్యోక్తి గుర్తుకురాక మానదు. అలాంటి ప్రతిభ పాటవాలనే ప్రదర్శిస్తోంది ఈ చిన్నారి. చిన్న వయసులో అత్యంత క్లిష్టమైన విద్యలో ఆరితేరి శెభాష్ అనిపించుకుంటోంది.
ఆ చిన్నారే మధురైకి చెందిన ఏడేళ్ల సంయుక్త నారాయణన్. అసాధారణమైన తైక్వాండో నైపుణ్యాలతో యావత్తు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఆ అసాధారణమైన ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది కూడా. అంతేగాదు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్‌స్టా పోస్ట్‌లో ఏడేళ్ల 270 రోజుల వయసులో అతి పిన్న వయస్కురాలైన తైక్వాండో బోధకురాలిగా చరిత్ర సృష్టించిందని పేర్కొంది.
ఈ చిన్నారి ఎంతో మంది పిల్లలకు ప్రేరణ. పిల్లలను క్రీడలకు సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే వారిలోని అపారమైన నైపుణ్యాలు వెలికివస్తాయనేందుకు ఈ చిన్నారే నిదర్శనం. అయితే నెటిజన్లు ఈ గిన్నిస్ పోస్ట్‌పై రకరకాలుగా స్పందించారు.
కొందరేమో చిన్న వయసులో తైక్వాండో సాధన చేయడం హానికరం అని ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం పిల్లలు అసాధారణమై విజయాలు అందుకోగలరని ప్రూవ్ చేసింది ఆ చిన్నారి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
(చదవండి: ఆ పెర్ఫ్యూమ్ ప్రతి గంటకు 108 బాటిళ్లు సేల్ అవుతాయ్..! తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..)
Comments
Please login to add a commentAdd a comment