
మరో వివాదంలో తమిళనాడు గవర్నర్
ఆరెస్సెస్ ప్రతినిధంటూ డీఎంకే, కాంగ్రెస్ ధ్వజం
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి మరోసారి వివాదాస్పదమయ్యారు. మదురైలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన గవర్నర్.. ‘జై శ్రీరామ్’ నినాదం చేయాలంటూ విద్యార్థులను ఆదేశించారు. కంబ రామాయణం రాసిన ప్రాచీన కవిని సన్మానించే కార్యక్రమంలో భాగంగా ‘ఈ రోజున శ్రీరాముని భక్తుడైన వ్యక్తికి నివాళులు అర్పిద్దాం.
నేను ‘జై శ్రీరామ్’ అంటాను. మీరూ చెప్పండి’ అంటూ విద్యార్థులకు సూచించారు. దీనిపై అధికార డీఎంకే, కాంగ్రెస్ గవర్నర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. డీఎంకే ఆయనను ఆరెస్సెస్ అధికార ప్రతినిధిగా అభివరి్ణంచింది. గవర్నర్ మత నాయకుడిలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అసన్ మౌలానా విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలకు ప్రచార మాస్టర్‌గా మారారని ఆరోపించారు.