taekwondo
-
NSG: ఆంధ్రప్రదేశ్ తైక్వాండో బృందానికి పతకాలు
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “తైక్వాండో” అండర్ – 14,17, 19 బాల, బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందానికి పతకాలు లభించాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఏపీ టీమ్ మొత్తంగా ఒక రజతం, మూడు కాంస్య పతకాలు గెలుచుకుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజేతలను అభినందించారు. ఇక.. మధ్యప్రదేశ్‌లోని ‘బీటల్’ వేదికగా డిసెంబరు 31 నుంచి జనవరి 5 వరకు ఈ పోటీలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు తెలిపారు. విజేతలు వీరే: ►అండర్ 19 బాలికల (52-55 కేజీలు) విభాగంలో- హస్తి తేజస్విని (యస్.వి.జూనియర్ కాలేజీ ,కోడూరు ఆర్.యస్. అన్నమయ్య జిల్లా)కి రజత పతకం ►అండర్ 19 బాలికల (46-49 కేజీలు ) విభాగంలో వారణాసి హిమ శ్రీ (మున్సిపల్ హై స్కూల్ , కస్పా, విజయనగరం)కి కాంస్య పతకం ►అండర్ 14 బాలికల (16-18 కేజీలు) విభాగంలో ఆకుల సమీరా (జెడ్పీహెచ్ఎస్, భాగ్యనగరం, దొర్నిపాడు, మండలం, నంద్యాల జిల్లా)కి కాంస్య పతకం ►అండర్ 17 బాలురు (73-78 కేజీలు) విభాగంలో పెదగాడి ధనుష్ తేజ(ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అశోక్ నగర్, కాకినాడ, కాకినాడ జిల్లా)కు కాంస్య పతకం -
రష్యా అధ్యక్షుడికి వరుస షాక్‌లు.. తైక్వాండో బ్లాక్ బెల్ట్ కూడా తొలగింపు
Putin Loses Honorary Black Belt By World Taekwondo: ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో క్రీడారంగానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వరుస షాక్‌లు తగుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ అధ్యక్ష పదవిని కోల్పోయిన పుతిన్‌కు తాజాగా వరల్డ్ తైక్వాండో ఫెడరేషన్ షాకిచ్చింది. రష్యా అధ్యక్షుడికి అందించిన గౌరవ తైక్వాండో బ్లాక్ బెల్ట్‌ను తొలగించింది. అలాగే రష్యా, బెలారస్లో ఎటువంటి తైక్వాండో ఈవెంట్లను నిర్వహించబోమని అధికారికంగా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటిస్తూ.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. కాగా, 2013 నవంబర్‌లో తైక్వాండో సమాఖ్య పుతిన్‌కు గౌరవ 9వ డాన్ బ్లాక్ బెల్ట్‌ను అందించింది. World Taekwondo strongly condemns the brutal attacks on innocent lives in Ukraine, which go against the World Taekwondo vision of “Peace is More Precious than Triumph” and the World Taekwondo values of respect and tolerance.#PeaceIsMorePreciousThanTriumphhttps://t.co/nVTdxDdl2I — World Taekwondo (@worldtaekwondo) February 28, 2022 ఇదిలా ఉంటే, ప్రముఖ ఫుట్‌బాల్ సంస్థలు ఫిఫా, UEFA రష్యా జాతీయ జట్టుతో పాటు ఆ దేశ క్లబ్‌లను పోటీల నుండి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో పాటు సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరగాల్సిన యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్‌ను యూరోపియన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ రద్దు చేసింది. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఉక్రెయిన్‌పై యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం తగ్గట్లేదు. ఒక వైపు చర్చలకు సిద్ధమంటూనే.. రష్యా దళాలు భీకర దాడులు జరుపుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో వందల సంఖ్యలో సామాన్య పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడుల్లో రష్యా కూడా తీవ్రంగా నష్టపోతోంది. ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు యావత్ క్రీడాలోకం మద్దతుగా నిలుస్తోంది. చదవండి: పుతిన్‌కు జూడో ఫెడరేషన్ షాక్! -
ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!
Bindeshwar Rai Foundation Teaches Taekwondo And Painting To Girls: మెండైన ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి? దాడికి పాల్పడిన వారిని మట్టికరిపించాలి. ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి? సమాజానికి కరదీపికగా ఉండాలి.ఆడపిల్లల్ని ఇలా తీర్చిదిద్దుతోంది పూనమ్ రాయ్. పూనమ్ రాయ్ అది 1997, ఫిబ్రవరి 2. పూనమ్ రాయ్ జీవితంలో మరచిపోలేని రోజు. మరిచిపోలేని రోజు అనడం కంటే మరపుకు రాని విషాదానికి గురి చేసిన రోజు అనడమే కరెక్ట్. ఆమె జీవితాన్ని అచేతనంగా మార్చి వేసిన దుర్దినం అది. అలాంటి అచేతన స్థితి నుంచి తనను తాను చైతన్యవంతం చేసుకుంది. అంతేకాదు... ఇప్పుడామె వేలాది మంది ఆడపిల్లల్ని చైతన్యవంతం చేసి ధీరవనితలుగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే మూడు వేల మందికి తైక్వాండోలో శిక్షణ ఇప్పించింది. ఈ మహిళా జాగృతోద్యమ కాగడా వెలుగుతూనే ఉండాలని, తన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు ఉంటుందని, తన తర్వాత ఈ జ్యోతిని అందుకునే మరో చెయ్యి తప్పకుండా వస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతోందామె. ఆడపిల్ల తండ్రి బీహార్‌లోని వైశాలిలో పుట్టింది పూనమ్ రాయ్. తండ్రి పీడబ్యుడీలో ఇంజనీర్, తల్లి గృహిణి. ఇంట్లో ఏ విధమైన వివక్ష లేకుండా సోదరులిద్దరితో కలిసి పెరిగింది పూనమ్. బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి పెయింటింగ్ లో ఆనర్స్ చేసింది. తండ్రి ఉద్యోగరీత్యా వాళ్ల కుటుంబం వారణాసికి మారాల్సి వచ్చింది. ఆ వెంటనే ఆమెకు వారణాసికి చెందిన అబ్బాయితో పెళ్లయింది. బీహార్, యూపీల్లో ఆడపిల్లల తండ్రి అంటే వియ్యంకుల ఆధిపత్యానికి తలవంచాల్సిందే. నేటికీ పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు అన్నింటికీ తలవంచుతుంటారు. పూనమ్ పెళ్లి విషయంలోనూ అంతే జరిగింది. వరుడు మణిపాల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేశాడని చెప్పి పెళ్లి చేశారు. పెళ్లి సందర్భంగా భారీగా లాంఛనాలు పుచ్చుకున్నారు. పూనమ్‌కి తన భర్త ఇంటర్ కూడా పూర్తి చేయలేదనే ఓ చేదునిజం పెళ్లయిన రెండు వారాలకు తెలిసింది. పైగా ఆమెకు భర్త, అత్తమామల నుంచి సరైన ఆదరణ లభించలేదు. చదవండి: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! మానసిక, భౌతిక వేధింపులు మొదలయ్యాయి. ఓ రోజు... 1997, ఫిబ్రవరి 2వ తేదీన పూనమ్ భర్త రకరకాలుగా దూషిస్తూ ఆమె మరణిస్తే మరో పెళ్లి చేసుకుంటానంటూ, ఆమెను బాల్కనీలో నుంచి కిందకు తోసేశాడు. ఆమెకు ఆ రోజు ఆ పడిపోవడం మాత్రమే తెలుసు. కోమా నుంచి తిరిగి స్పృహ వచ్చేటప్పటికి ఆరు నెలలు గడిచిపోయాయి. స్పృహ వచ్చిన తర్వాత తెలిసిన విషయం... తాను ఇక ఎప్పటికీ నడవలేదని. శరాఘాతం వంటి ఆ వాస్తవం ఆమెను కుంగదీసింది. అయితే... సోదరులు, తల్లిదండ్రుల ప్రేమ, క్రమం తప్పని ఫిజియోథెరపీతో ఆమె లేచి నిలబడడం, వాకర్ సహాయంతో నడవడం సాధ్యమైంది. పూనమ్‌లో ధైర్యం ప్రోది చేసుకోవడం మొదలైంది. ఇంతలో వాళ్ల నాన్నగారు కాలం చేశారు. ఆమె మానసికంగా కదలిపోయిందాక్షణంలో. ‘‘బాల్యంలో అందరినీ తండ్రి చేయి పట్టుకుని నడిపిస్తాడు. కానీ మా నాన్న నలభై ఏళ్ల వయసులో నన్ను రోజూ చేయి పట్టుకుని నడిపించాడు. కొండంత అండగా ఉన్న నాన్న పోయారు. నా గతంతోపాటు నాన్న జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. నన్ను మామూలు మనిషిని చేయడానికి ఆయన పడిన తపన నన్ను హెచ్చరించసాగింది. మా నాన్నలాగ ప్రతి ఆడపిల్లనూ కంటిపాపలా చూసుకునే తండ్రి ఉంటే సమాజం ఎంత అందంగా ఉంటుందో కదా అనిపించేది. ఆడపిల్ల తనకు ఎదురైన సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన నాకు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో ఆడపిల్లలను చైతన్యవంతం చేయాలనుకున్నాను. స్వీయ రక్షణలో ప్రాథమిక శిక్షణ కూడా తీసుకున్నాను. నాన్న జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవడం కోసం ఆయన పేరుతో బిందేశ్వరీ రాయ్ ఫౌండేషన్‌ను స్థాపించాను. ‘వారణాసి తైక్వాండో అసోసియేషన్’తో కలిసి పని చేస్తున్నాను. ఇప్పటికీ ఆడపిల్లలకు చదువుకు ఖర్చు చేయడానికే ముందు వెనుకలు ఆలోచించే తల్లిదండ్రులున్న సమాజం మనది. వాళ్ల స్వీయరక్షణ కోసం ఫీజులు కట్టాలంటే ముందుకు రారు. అందుకోసం నేను ఉచితంగా తైక్వాండో శిక్షణ ఇప్పించే ఏర్పాటు చేశాను. మా దగ్గర శిక్షణ తీసుకున్న మూడు వేల మందిలో ఇరవై మందికి పైగా జాతీయస్థాయి టోర్నమెంట్లలో పాల్గొన్నారు. భయం పోయింది తైక్వాండో నేర్చుకున్న తర్వాత ఆడపిల్లల్లో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషంగా ఉంది. స్కూలుకు, కాలేజ్‌కి వెళ్లే దారిలో ఆకతాయిలు ఏడిపిస్తే వీళ్లు మార్షల్ ఆర్ట్‌కు పని చెప్తున్నారు. దాంతో తైక్వాండో నేర్చుకున్న పిల్లలను ఒకమాట అనడానికి ఆకతాయిలు కూడా సందేహిస్తున్నారు. ఈ పరిణామంతో మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని పేరెంట్స్ కూడా ముందుకు వస్తున్నారు. వారంలో మూడు రోజులు తైక్వాండో, మరో మూడు రోజులు పెయింటింగ్ లో శిక్షణ ఇస్తున్నాం. మా పిల్లలు వేసిన ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఆయనకు బహూకరించాం. అలాగే బేటీ బచావో, బేటీ పఢావో అంశంతో తల్లి కడుపులో రూపుదిద్దుకున్నప్పటి నుంచి చివరి వరకు సాగే ఆడబిడ్డ జీవిత ప్రయాణాన్ని 648 బొమ్మలతో చిత్రిస్తున్నాం’’ అని చెప్పింది పూనమ్‌రాయ్. చదవండి: Side Effects Of Wearing Jeans: ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో.. -
అక్షయ్ ఎదుట హీరో తైక్వాండో విన్యాసాలు
-
అక్షయ్ అడిగేసరికి భయమేసింది: హీరో
ముంబై: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ యాక్షన్ ఫీట్లకు బోలెడంతమంది అభిమానులు ఉన్నాడు. ఎన్నో రకాల విన్యాసాలను సైతం ఆయన అలవోకగా చేసేవాడు. ఈ క్రమంలో ఓ టోర్నమెంటులో తైక్వాండో విన్యాసాలు చేసిన పాత వీడియోను టైగర్ సోమవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో అక్షయ్ కుమార్ కూడా ఉండటం విశేషం. టైగర్ తైక్వాండో చేస్తుండగా అక్షయ్ మరిన్ని కిక్కులు కొట్టమంటూ అతన్ని ప్రోత్సహించాడు. అక్కడున్న అభిమానులు సైతం అతనిలోని ప్రతిభకు అబ్బురపడిపోతూ చప్పట్లు, ఈలలతో ఉత్తేజాన్ని నింపారు. (టైగర్ ష్రాఫ్ ఫ్యామిలితో దిశా పటానీ టిక్‌టాక్) ఆనాటి ఈ సంఘటన గురించి యాక్షన్ హీరో తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. "సహజంగానే నాకు స్టేజ్ ఎక్కాలంటేనే భయం. అలాంటిది లెజెండరీ హీరో అక్షయ్.. నన్ను ప్రేక్షకులకు కొన్ని కిక్స్ చూపించమని అడుగుతుంటే మరింత భయపడిపోయాను. కానీ ఎలాగోలా తడబడకుండా విన్యాసాలు చేసినందుకు సంతోషించాను" అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ఇప్పటివరకు ఆరు లక్షల మందికి పైగా వీక్షించారు. లాక్డౌన్ కాలంలో షూటింగ్స్‌కు బ్రేక్ పడటం, తనకు కావాల్సిన సమయం దొరకడంతో ఈ హీరో సోషల్ మీడియాలో అభిమానులకు మరింత చేరువయ్యాడు. (సుధీర్ డ్యాన్స్ స్టెప్పులకు టైగర్ ఫిదా) -
‘వేధింపులతోనే దేశం విడిచి వచ్చేశా..’
టెహ్రాన్ : ఇరాన్‌కు ఒలింపిక్ పతకాన్ని అందించిన మొదటి, ఏకైక మహిళా క్రీడాకారిణి కిమియా అలీజాడే తమ దేశంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్లో క్రీడాకారులపై.. ముఖ్యంగా మహిళా క్రీడాకారులపై జరుగుతున్న వేధింపుల పర్వాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. పతకాలు సాధించిన ఆటగాళ్లకు సైతం కనీస గౌరవం ఉండదని వాపోయారు. అందుకనే దేశాన్ని విడిచి యూరప్ వచ్చినట్టు స్పష్టం చేశారు. యూరప్‌నకు తననెవరూ ఆహ్వానించలేదని.. తానే వచ్చానని తెలిపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో అలీజాడే తైక్వాండోలో కాంస్య పతకం సాధించారు. 57 కేజీల కేటగిరీలో ఆమె ఈ పతకం సాధించారు. (చదవండి : పొరపాటున కూల్చేశాం) ‘దేశం విడిచి వస్తున్నప్పుడు చాలా బాధపడ్డా. కానీ, వంచన, అన్యాయానికి గురవుతూ.. అబద్ధాలు, పొగడ్తలు ప్రకటిస్తూ బతకలేను. పతకం సాధించి దేశ గౌరవాన్ని పెంచితే.. దానిని రాజకీయాల కోసం కొందరు వాడుకుంటారు. వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన అధికారులు.. మహిళలు తైక్వాండో లాంటి ఆటలు ఆడరాదు అని నీచంగా మాట్లాడతారు. మా కష్టాన్ని గుర్తించకపోగా.. అవమానిస్తారు. వంచనకు గురవుతున్న ఎందరో క్రీడాకారిణుల్లో నేనొరిని. మేనేజ్మెంట్ నిర్ణయాలతో మాకు ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు. మమ్మల్ని కేవలం వస్తువులుగానే చూస్తారు. అయినా, వారి ఆదేశాల్ని పాటించా. దేశంలో పీడనకు గురయ్యే వారికి హలో..! ‘ఉన్నత స్థానం’ లో ఉన్నవారికి గుడ్‌బై, తమవారిని కోల్పోయి శోకంలో ఉన్నవారికి సంతాపాన్ని తెలుపుతున్నా’అని అలీజాడే పేర్కొన్నారు. (చదవండి : ‘భారత్ ముందుకొస్తే స్వాగతిస్తాం’!) కాగా, అలీజాడే నిర్ణయంపై ఇరాన్ క్రీడాశాఖ సహాయ మంత్రి మహిన్ ఫర్హాదిజాడే మాట్లాడుతూ.. ‘అలీజాడే ఇన్స్టాగ్రామ్ పోస్టు చూడలేదు. అయితే, ఆమె విదేశాల్లో ఫిజియోథెరఫీ చదవాలనుకునేది. బహుశా అదే కారణం కావొచ్చు’అన్నారు. ఇక ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీ హత్యతో మొదలైన ఉద్రిక్తలు అంతకంతకూ తీవ్రమైన సంగతి తెలిసిందే. సులేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట జరగడంతో 56 మంది మరణించగా.. ఉక్రెయిన్ విమానాన్ని ఇరాన్ మిలటరీ కూల్చడంతో మరో 176 మంది మరణించారు. ఇప్పటికే.. చెస్ ఆటగాడు అలీరెజా ఫిరౌజా ఇరాన్ తరపున ఆడనని చెప్పగా.. జూడో ఆటగాడు సయీద్ మొలాయి దేశ విడిచి వెళ్లడం గమనార్హం. (చదవండి : ట్రంప్‌నకు ఇరాన్ గట్టి కౌంటర్!) -
తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణహత్య!!
గురుగ్రామ్ : హరియాణాలోని గురుగ్రామ్‌లో 25 ఏళ్ల భారత యువ క్రీడాకారిణిని కాల్చివేతకు గురైంది. తైక్వాండో క్రీడాకారిణి అయిన సరితను మంగళవారం మధ్యాహ్న సమయంలో ఒక యువకుడు సరితను కాల్చి చంపాడని సమాచారం. అయితే ఈ హత్య వెనుక సరిత కోచ్ హస్తం దాగుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. 'గతంలో సరిత కోచ్ ఆమెను వివాహం చేసుకోవాలని పలుమార్లు వెంటపడగా సరిత చాలాసార్లు తిరస్కరించింది. దీంతో పెళ్లి విషయమై వీరివురి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పెళ్లికి నిరాకరించడంతోనే కోచ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు' అని సరిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. గురుగ్రామ్‌లోని బోరాఖుర్ద్ గ్రామంలో ఓ యువతి కాల్చివేతకు గురైనట్టు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడిఉన్న ఆమెను తైక్వాండో క్రీడాకారిణి సరితగా గుర్తించారు. ఒక యువకుడు మహిళను కాల్చి చంపి పరారైనట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు. సరిత హత్య వెనుక కోచ్ హస్తం ఉందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోచ్ సరితకు 2013 నుంచి తెలుసని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే హత్య తర్వాత కోచ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
చందనకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) జిల్లా స్థాయి తైక్వాండో చాంపియన్íÙప్లో రోజరీ కాన్వెంట్కు చెందిన వడ్డేటి చందన సత్తా చాటింది. దోమలగూడ జీసీపీఈ వేదికగా జరిగిన ఈ టోరీ్నలో అండర్–17 బాలికల 49–52 కేజీల వెయిట్ కేటగిరీలో చందన విజేతగా నిలిచి స్వర్ణాన్ని సాధించింది. బీవీబీపీఎస్కు చెందిన బి. అగర్వాల్ రజతాన్ని గెలుచుకోగా... మదీనా హైసూ్కల్ విద్యార్థి రీడా మీర్జా కాంస్యాన్ని సాధించింది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ఎన్. లక్ష్మీకాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇతర వెయిట్ కేటగిరీల విజేతల వివరాలు 25–27 కేజీల బాలురు: 1. ఆనంద్, 2. అక్షయ్, 3. నిఖిల్ తేజ్; 20–22 కేజీల బాలికలు: 1. సింధూజ, 2. మాన్వి యాదవ్. 29–32 కేజీల బాలురు: 1. బి. అరవింద్ కుమార్, 2. సంపత్ కుమార్, 3. అజయ్, మణిమాన్విత్. 24–26 కేజీల బాలికలు: 1. స్ఫూర్తి, 2. సుమయ్యా అంజుమ్, 3. చంచల్ యాదవ్. 27–29 కేజీల బాలురు: 1. సాయి సంవిత్, 2. మొహమ్మద్ రహమాన్, 3. ఆదిత్య వ్యాస్, కల్యాణ్. 26–29 కేజీల బాలికలు: 1. వర్ష, 2. జియా. -
లక్ష్మీ తులసికి రజతం
హైదరాబాద్: ఇంటర్నేషనల్ తైక్వాండో పోటీల్లో కుత్బుల్లాపూర్ బాలికలు శ్రీజరెడ్డి, లక్ష్మీ తులసి రాణించారు. భారత తైక్వాండో సమాఖ్య ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో లక్ష్మీ తులసి రజత పతకాన్ని గెలుచుకోగా... శ్రీజరెడ్డి కాంస్యాన్ని సాధించింది. కొంపల్లికి చెందిన శ్రీజరెడ్డి 47 కేజీల విభాగంలో మూడో స్థానంలో నిలిచింది. లక్ష్మీ తులసి 51 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఐదు రోజుల పాటు పోటీలు జరుగగా.. పదిహేను దేశాలకు చెందిన దాదాపు 2500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్ర తైక్వాండో జట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టును మంగళవారం ప్రకటించారు. హరియాణాలోని రోహ్తక్లో ఈనెల 26 నుంచి 30 వరకు జాతీయ తైక్వాండో టోర్నీ జరుగుతుంది. జట్టు వివరాలు: జి. రాహుల్, ఎ. నిఖిల్, ఎం. అఖిల్, జి. సాత్విక్, ఎన్. సుధీర్ కుమార్, విశ్వ ఆదిత్య, విజయ్, శ్రీనివాస్ రెడ్డి, సాయి వరుణ్, విశాల్, తనీష్, చైతన్య, విప్రస్ రెడ్డి, సుజన్, బి. సాయి రిత్విక్, బి. సాయి సాత్విక్, శివమణి, అజయ్, తరుణ్, సాయి ఈశ్వర్, రాహుల్ యాదవ్, ప్రణవ్ ఆదిత్య, వేదాంత్, లలిత్ సాయి. -
తైక్వాండో టోర్నీలో కరణ్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: కొరియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్స్ కప్ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారుడు కరణ్ టీకారామ్ చాంపియన్‌గా నిలిచాడు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన క్యాడెట్ బాలుర 35 కేజీల విభాగంలో కరణ్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే టోర్నీలో రాష్ట్రానికి చెందిన ఎన్ఎన్ లీలావతి, టి. గౌతమి, సిమ్రన్ కె. జైన్ రాణించారు. జూనియర్ బాలికల విభాగంలో లీలావతి (46 కేజీలు), సీనియర్ బాలికల కేటగిరీలో గౌతమి (57 కేజీలు), సిమ్రన్ జైన్ (67 కేజీలు) మూడో స్థానంలో నిలిచి తలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వైఎంసీఏ నారాయణగూడ కార్యదర్శి బీజే వినయ్ స్వరూప్, అధ్యక్షుడు ఆర్కే కృష్ణ పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. వారు భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
రాణించిన హైదరాబాద్ క్రీడాకారులు
సాక్షి, హైదరాబాద్: సీకే క్లాసిక్ మలేసియా ఓపెన్ అంతర్జాతీయ తైక్వాండో చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ క్రీడాకారులు ఐదు పతకాలను సాధించారు. మలేసియాలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన పొన్నపల్లి శ్రీలేఖ హెవీవెయిట్ కేటగిరీలో స్వర్ణ పతకం సాధించగా... సాయి దీపక్ పటేల్ పూమ్సే విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు యామగుచి తైక్వాండో అకాడమీ వైఎంసీఏకి చెందిన పి. సంధ్య స్మిత, వితేశ్ చారి, బి. అభిషేక్ లాల్ కూడా ఈ టోర్నీలో ఆకట్టుకున్నారు. క్యోరుగి (ఫైట్) ఈవెంట్లో వితేశ్ రన్నరప్‌గా నిలిచి రజతాన్ని సాధించాడు. అభిషేక్ మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకున్నాడు. మరోవైపు మహిళల పూమ్సే (కటాస్–గ్రూప్ ఫైట్) ఈవెంట్లో సంధ్య కాంస్య పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను వైఎంసీఏ కార్యదర్శి వినయ్ స్వరూప్ అభినందించారు. -
తైక్వాండోలో నిధుల గోల్మాల్
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్‌లో నిధుల గోల్మాల్ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శుక్రవారం వివిధ సామాజిక మాధ్యమాల్లో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ట్రెజరర్ జగన్మోహన్(గుంటూరు) వాటిని వైరల్ చేయడంతో అది హాట్ టాపిక్‌గా మారింది. తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అచ్యుత్‌రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం అసోసియేషన్‌కు సంబంధించిన నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలతో కూడిన కాల్ రికార్డులను ఆయన బహిర్గతం చేశారు. దీంతో ఆయా క్రీడాకారులకు అందించాల్సిన కనీస సౌకర్యాలను, వారికి అందించాల్సిన క్రీడా దుస్తులను సైతం అందించకుండా మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆరోపణలు ఇలా... అచ్యుత్‌రెడ్డి 2006 నుంచి రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్‌కు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్తో కలిసి అచ్యుత్‌రెడ్డి సంయుక్త బ్యాంకు ఖాతాను తెరిచారు. అయితే తన ప్రమేయం లేకుండానే అచ్యుత్‌రెడ్డి నిధులను వాడుకున్నారని జగన్మోహన్ ఆరోపిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన జాతీయస్థాయి టోర్నీకి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) రూ. 10 లక్షల నిధులను కేటాయించిందని దానికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు తన దృష్టికి రాలేదన్నారు. అసోసియేషన్ ఖాతాను తన వ్యక్తిగత ఖాతాగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారని విమర్శించారు. గత పదేళ్లుగా ఇలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారన్నారు. జిల్లా అసోసియేషన్లకు బెదిరింపులు ఆయా జిల్లాల్లో కొనసాగుతున్న అసోసియేషన్లలో తనకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా జిల్లా అసోసియేషన్లకు అఫ్లియేషన్‌ను రద్దు చేస్తామని బెదిరింపు చేస్తున్నారని, దీంతో ఆయా సంఘాల ప్రతినిధులు ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అచ్యుత్‌రెడ్డి విధానాల వల్లనే అసోసియేషన్ నాలుగు విభాగాలుగా చీలిందని అంటున్నారు. క్రీడాకారులకు అవకాశాలు నిరాకరణ ఆయా జిల్లా అసోసియేషన్లలో శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులకు జిల్లాస్థాయి టోర్నీల్లో ఆడేందుకు అవకాశాన్ని అచ్యుత్‌రెడ్డి నిరాకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గత నెలలో కడపలో జరిగిన టోర్నీలో కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయి) క్రీడాకారులకు అవకాశం కల్పించలేదు. దీంతో ఆయా క్రీడాకారులు జిల్లా కలెక్టర్‌ను సైతం ఆశ్రయించారు. దీంతో ఆయన ఆయా జిల్లాల క్రీడా ప్రాధికార సంస్థకు సమాచారాన్ని అందించి వారిని ఆడించేందుకు అవకాశాన్ని తీసేస్తున్నామని ఆయన రాత పూర్వకంగా నివేదికలను పంపారు. దీంతో కడప జిల్లాకు చెందిన అల్తాఫ్ హుస్సేన్ అనే క్రీడాకారుడు డిక్లరేషన్‌ను సమర్పించుకోవాల్సి వచ్చింది. తాను తదుపరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్రాతినిధ్యం వహించనని, ఏ ఇతర అసోసియేషన్ల నుంచి ప్రాతినిధ్యం వహించనని రూ. 10 బాండు మీద రాయించుకున్నారు. ఈ వ్యవహారంపైన ఆయా సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. -
విమానం టాయిలెట్లో మృతపిండం
న్యూఢిల్లీ: గువాహటి నుంచి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏసియా విమానం టాయిలెట్లో మృత పిండం కనిపించడం ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. పిండం వయసు దాదాపు ఆరు నెలలు ఉండొచ్చని సమాచారం. విమాన టాయిలెట్లో పేపర్లలో చుట్టి ఉన్న పిండాన్ని గమనించిన సిబ్బంది.. ఈ పని ఎవరు చేశారో చెప్పాలంటూ మహిళా ప్రయాణికులను ప్రశ్నిస్తుండగా తనకు గర్భస్రావం అయినట్లు 19 ఏళ్ల వయసున్న తైక్వాండో క్రీడాకారిణి వెల్లడించింది. ఆమె ఓ టోర్నమెంట్ కోసం గురువారం తన కోచ్‌తో కలసి దక్షిణ కొరియా వెళ్లాల్సి ఉంది. టాయిలెట్లో సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, పిండం కనిపించిందని ఎయిర్ ఏసియా అధికారులు తెలిపారు. పోలీసులు పిండాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, క్రీడాకారిణికి ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు. అయితే ఆమె గర్భంతో ఉన్న విషయమే తనకు తెలియదనీ, విమానమెక్కే ముందు విమానయాన సంస్థకు సమర్పించిన వివరాల్లోనూ ఈ విషయం లేదని ఆమె కోచ్ చెప్పారు. -
ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం
భువనగిరి : తైక్వాండో ఆత్మరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని తైక్వాండో జిల్లా అధ్యక్షుడు సోలిపురం శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థుల మానసికోల్లాసంతోపాటు విద్యా, ఉద్యోగాల్లో తైక్వాండో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గుర్రం కృష్ణ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు ఈనెలలో మేడ్చల్ జిల్లాలో జరిగే సీనియర్, సబ్‌జూనియర్, వికారాబాద్‌లో క్యాడేట్, మహబూబాబాద్‌లో జూనియర్ విభాగం పోటీల్లో పాల్గొంటారన్నారు. సబ్‌జూనియర్, సీనియర్, క్యాడేట్ సీనియర్ విభాగాల్లో బాలబాలికలకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సుమారు 200 మంది పాల్గొన్న ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బంగారు, వెండి, కాంస్య పతకాలతోపాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా కోశాధికారి మీసాల వెంకటేశం, ఉపాధ్యక్షులు కోట్ల సుధాకర్, శిక్షకులు కోన్‌రెడ్డి శ్రీకాంత్, శివ, శివసాయి, పర్యవేక్షకులు సుధీర్, గోపాలకృష్ణ, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
కామాంధుడి చేతిలో 6 గంటలు నరకం
సాక్షి, న్యూఢిల్లీ: పదుల సంఖ్యలో లైంగిక వేధింపుల కేసులు. జైలుకు వెళ్లటం.. బెయిల్‌పై రావటం... మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడటం ఆ కామాంధుడికి అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న ఓ యువతిపై ఆ కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు గంటలపాటు మృగ చేష్టలతో ఆమెకు నరకాన్ని చూపించాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే... వసంత్ కుంజ్‌లోని రంగ్‌పూరి పహారిలో ఓ యువతి(27) ఒంటరిగా నివసిస్తోంది. మే 29వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చింది. తాళం తీస్తున్న సమయంలో వెనకాల నుంచి వచ్చి ఓ వ్యక్తి అమాంతం ఆమెను ఇంట్లోకి ఈడ్చుకెళ్లాడు. మంచానికి కట్టేసి ఆమెతో బలవంతగా మందు తాగించి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా ఆరు గంటలపాటు అతని వికృత క్రీడలు కొనసాగాయి. చివరకు ఉదయం నాలుగు గంటల సమయంలో ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. స్నేహితురాలి సాయంతో వసంత్ కుంజ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె చెప్పిన ఆనవాళ్లతో పోలీసులు ఓ వ్యక్తి ఫోటోను చూపించారు. ఫోటోలో ఉన్నదే నిందితుడిగా ఆమె అతన్ని గుర్తించటంతో గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడైన సందీప్ చౌహాన్‌ను జూన్1న పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ నేర చరిత్ర... పశ్చిమ్ విహార్‌కు చెందిన 38 ఏళ్ల సందీప్ వివాహితుడు. ఓ పాప కూడా ఉంది. గతంలో తైక్వాండో ట్రైనర్‌గా పని చేసేవాడు. ఏడాదిన్నర క్రితం ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. దాంతో ఉద్యోగం ఊడింది. అప్పటి నుంచి తప్పుడు మార్గంలోనే ప్రయాణిస్తూ వస్తున్నాడు. కంటికి కనిపించిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం, వారి వెంటపడి వేధింపులకు గురిచేయటం, దాడి చేసి వాళ్ల దగ్గరి నుంచి గొలుసులు, ఫోన్లు దొంగతనం చేయటం... అలవర్చుకున్నాడు. ఈ క్రమంలో చాలాసార్లు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటికొచ్చేవాడు. ఇప్పటిదాకా అతనిపై 30 కేసుల దాకా నమోదయినట్లు తెలుస్తోంది. ‘సందీప్ దాడి చేసిన మహిళలెవరూ అతనికి తెలీదు. అప్పటికప్పుడే వారిని లక్ష్యంగా చేసుకుని వారిపై దాడికి పాల్పడుతుంటాడు. కానీ, అత్యాచారం కేసులో అరెస్ట్ కావటం మాత్రం ఇదే తొలిసారి’ అని వసంత్ కుంజ్ ఎస్సై చెబుతున్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం తాను ఉండే ప్రాంతంలోనే ఓ మహిళ ఇంటి ముందు సందీప్ వికృత చేష్టలకు పాల్పడిన నేరంలో జైలుపాలయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఇలా అత్యాచారం కేసులో ఇప్పుడు మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు. పోలీసులేం చేస్తున్నారు?.. కాగా, ఈ ఘటనపై పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని కఠినంగా శిక్షించకపోవటం, సమాజంలో తిరుగుతున్న అతనిపై నిఘా వేయకపోవటం ముమ్మాటికీ పోలీసుల నిర్లక్ష్యమేనని విమర్శిస్తున్నారు. శనివారం ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, సందీప్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ఆత్మ రక్షణ విద్యలో అక్కాచెల్లెళ్ల సవారి
కొనకనమిట్ల: మహిళల రక్షణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.. ఆడవాళ్లపై జరుగుతున్న నేరాలు, ఘోరాలు అంతులేకుండా పోతున్నాయి. సమాజంలో నేర స్వభావం పెరుగుతున్న కొద్ది.. ఆడవారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పటం అవసరం. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటారు.. ఆ కోవలోనే అక్కాచెల్లెళ్లు లహరి అనిత, లిలతా భవానిలు తైక్వాండో (కరాటే) రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఇటీవల విశాఖపట్టణంలో నిర్వహించిన పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి సత్తాచాటారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహమే కొనకనమిట్ల మండలం గొట్లగట్టు కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలలో తొమ్మిది, పదో తరగతి చదువుతున్న లహరి అనిత, లలితా భవానిలు క్రీడలలో మంచి ప్రతిభ కనబరచడంతో పాఠశాల ప్రత్యేకాధికారి ఆర్.సురేఖ, పాఠశాల పీఈటీ వనజలతలు తమ విద్యార్థినులను కరాటే దిశగా ప్రోత్సహించి వారికి మంచి తర్ఫీదునిచ్చారు. అంతకు ముందు కరాటేలో రాజు మాస్టర్ దగ్గర మెళకువలు నేర్చుకున్న అహరి అనిత, లలితా భవానిలు కరాటే విద్యపై మక్కువ చూపించారు. ఇటీవల ఒంగోలులో జరిగిన పోటీలతో పాటు రాష్ట్ర స్థాయిలో వైజాగ్‌లో జరిగిన 13 జిల్లాల కేజీబీవీల కరాటే (తైక్వాండో) పోటీల్లో గొట్లగట్టు కేజీబీవి బాలికలు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సత్తాచాటారు. అక్కడ కేజీబీవీ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్, కామేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, నారాయణ, విద్యాశాఖ జేడీ శ్రీనివాసులు, సర్వశిక్ష అభియాన్ పీఓ ఎం.వెంకటేశ్వరరావు చేతుల మీదుగా కేజీబీవీ బాలికలు అవార్డులు మెమెంటోలు అందుకున్నారు. జాతీయస్థాయిలో పేరు తెచ్చుకోవాలి.. జాతీయస్థాయి పోటీలలో పాల్గొనాలనేది తమ లక్ష్యమని అక్కాచెల్లెళ్లు లహరి అనిత, లలితా భవాని అన్నారు. కరాటేతో పాటు కబడ్డీ అంటే ఇష్టమని కబడ్డీ పోటీల్లో కూడా ప్రావీణ్యం ఉంది. పాఠశాల జోనల్ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాం. మంచి క్రీడాకారిణిలుగా పేరుతెచ్చుకోవాలన్నదే లక్ష్యం.. తైక్వాండోలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన లహరి అనిత, లలిత భవానిలను, తర్ఫీదునిచ్చిన పీఈటీ వనజలతను, పాఠశాల ప్రత్యేకాధికారి సురేఖను పలువురు అభినందించారు. -
తలుపు తెరిస్తే షాక్; సీసీటీవీలో వికృతం
న్యూఢిల్లీ: సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఆ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ వికృత చర్యను చూసి పోలీసులూ నిర్ఘాంతపోయారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు బలమైన చట్టాల కిందట అతణ్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. దేశరాజధానిలో సంచలనం రేపిన ఈ ఘటన గురించి పోలీసులు చెప్పిన వివరాలిలాఉన్నాయి.. తైక్వాండో ట్రైనర్‌గా పనిచేస్తోన్న వ్యక్తి ఒకరు.. వసంత్ కుంజ్ ప్రాంతానికి చెందిన పరిచయస్తురాలిని కలుసుకునేందుకు వెళ్లాడు. దర్వాజ దగ్గర నిలబడి బెల్ కొట్టాడు.. ఆ వెంటనే ప్యాంట్ విప్పేసి వికృతచర్యను మొదలుపెట్టాడు. తలుపు తెరిశాక ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన మహిళను చెరపట్టేప్రయత్నం చేశాడా మాస్టర్. క్షణాల్లో తేరుకున్న మహిళ గట్టిగా కేకలు వేయడంతో మాస్టర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆలస్యం చెయ్యకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరించింది. బాధితురాలు అందించిన సమాచారంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. మహిళ ఇంటి సీసీటీవీ కెమెరా దృశ్యాలనూ సేకరించారు. డోర్‌బెల్ కొట్టి వికృతానికి పాల్పడిన దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయని, లైంగికదాడి యత్నం, అసభ్యప్రవర్తన కింద నిందితుడిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ఆడపిల్లకు ఆటలు ఎందుకు? అన్నారు..
బాక్సింగ్, కరాటే, కుంగ్ఫు, తైక్వాండో లాంటి క్రీడలు పురుషులకే సొంతం అనుకుంటే పొరపాటే. వీటిలోనూ మగవారికి సమానంగా మహిళలు రాణిస్తున్నారు..తమ ప్రతిభను చూపుతున్నారు. రామంతాపూర్‌కు చెందిన కవిత(23) తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ఐదో డాన్ సాధించి... ఈ ఘనత అందుకున్న మొట్టమొదటి మహిళగా రికార్డులకు ఎక్కింది. రామంతాపూర్: కవితకు తైక్వాండో అంటే ఆసక్తి. పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే ఈ క్రీడను నేర్చుకోవాలని అనుకుంది. శిక్షణకు వెళ్తానంటే.. ‘ఆడపిల్లకు ఆటలు ఎందుకు?’ అని వారించారు. అయినా వినకుండా, వారిని ఎదిరించి గురువు జయంత్, సంపూర్ణ లింగంల దగ్గర శిక్షణలో చేరింది. పదో ఏటనే బ్లాక్‌బెల్ట్ సాధించింది. ఈ క్రీడలో జాతీయ స్థాయిలో ఐదో డాన్ సాధించిన పురుషులే చాలా తక్కువ మంది ఉంటారు. దేశంలోనే ఈ ఘనత సాధించిన ప్రథమ మహిళగా కవిత గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు మహిళలే ఈ బెల్ట్ సాధించగా... అందులో కవిత ఒక్కరు కావడం విశేషం. 2004లో కొరియాలో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలో పాల్గొని మూడో డాన్ విజేతగా నిలిచింది. 2008లో అమెరికాలో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలో భారత్ తరఫున పాల్గొని పలు పతకాలు సాధించింది. భారత్‌లో జరిగిన వరల్డ్ తైక్వాండో పోటీలో ఐదో డాన్ విజేతగా నిలిచింది. దేశవిదేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని వందకు పైగా పతకాలు, 30కి పైగా ట్రోఫీలు గెలుచుకుంది. ఐదుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. ప్రస్తుతం కవిత రామంతాపూర్‌లో తైక్వాండో అకాడమీని ప్రారంభించి శిక్షణనిస్తున్నారు. ఒలింపిక్స్లోపతకమేధ్యేయం.. 1994 ఒలింపిక్స్‌లో తైక్వాండో క్రీడ చూసి స్ఫూర్తి పొందాను. నేనూ తైక్వాండో నేర్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. పట్టుదలతో ఈ విద్యనభ్యసించాను. ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించడమే లక్ష్యంగా నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నాను. -
తైక్వాండో విజేతలకు ఘన సత్కారం
డల్లాస్ : డల్లాస్‌లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలలో భారత క్రీడాకారులు అద్భుత విజయం సాధించారు. తెలుగు తేజాలైన కొండాసహదేవ్, అబ్దుల్ కలీల్, సింధు తపస్విలు బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. విజేతలకు స్థానిక తెలుగు సంస్థ టాంటెక్స్ (ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం), తెలంగాణ ఎన్.ఆర్.ఐ. విభాగం సంయుక్తంగా సత్కరించింది. ఇర్వింగ్ లోని అవర్ ప్లేస్ రెస్టారెంట్లో ఈ సత్కార కార్యక్రమం జరిగింది. తెలుగు భాష , సంస్కృతులను డల్లాస్ పరిసర ప్రాంతాల్లో 32 సంవత్సరాలకు పైగా పరిరక్షిస్తూ, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టాంటెక్స్ సంస్థ ప్రస్తుత అధ్యక్షురాలు శీలం కృష్ణవేణి మాట్లాడుతూ తైక్వాండో పోటీల్లో విజయం సాధించి భారత దేశ కీర్తిని చాటిన విజేతలను సత్కరించడం తమ బాధ్యత అని తెలిపారు. సంవత్సరం పొడుగునా వివిధ క్రీడా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు వారందరికీ గర్వ కారణమైన తైక్వాండో విజేతలను, ఈ క్రీడాకారులను ప్రత్యేక శిక్షణ ఇస్తూ తీర్చిదిద్దిన వారి కోచ్ జయంత్ రెడ్డి లను టాంటెక్స్ సంస్థ సభ్యులు జ్ఞాపికలతో సత్కరించారు. డా. మోహన్ గోలి, రఘు చిట్టిమల్లలు, తెలంగాణా ఎన్.ఆర్.ఐ. విభాగ సభ్యులకు, కార్యక్రమం జరిగిన అవర్ ప్లేస్ రెస్టారెంట్ యజమాని నరేంద్ర బాబులకు అభినందనలు తెలిపారు. వీర్నపు చినసత్యం, కోడూరు క్రిష్ణారెడ్డి, కోశాధికారి పాలేటి లక్ష్మి, కార్యవర్గ సభ్యులు శరత్ ఎర్రం, సమీర ఇల్లెందుల, బండారు సతిష్మరియుపాలక మండలి అధిపతి కన్నెగంటి చంద్ర, సభ్యుడు పవన్ నెల్లుట్ల ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. -
దక్షిణ భారత తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కేరళ తైక్వాండో అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 6వ దక్షిణ భారత తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లాకు చెందిన 13 మంది ఎంపికయ్యారని కోచ్ రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులను డీఎస్డీఓ బాషామోహిద్దీన్ అభినందించారు. 2016లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన సబ్–జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ క్రీడాకారులను దక్షిణ భారత తైక్వాండో క్రీడా పోటీలకు ఎంపిక చేశామన్నారు. పోటీలు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ వీకే కృష్ణమీనన్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 20 నుంచి 23వ తేది వరకు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ మాట్లాడుతూ జాతీయస్థాయి క్రీడా పోటీల్లో విజయంతో తిరిగి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోచ్‌లు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారుల వివరాలు సబ్–జూనియర్ విభాగం(అండర్–11) బాలురు 18 కిలోలు–గౌతంకృష్ణారెడ్డి 41 లోలు–రిషీచౌహాన్ బాలికల విభాగం 18 కిలోలు–నిహారిక 20 కిలోలు–నీతు శ్రీ సాయి 24 కిలోలు–జోహ్న 26 కిలోలు–వెన్నెల 29 కిలోలు–నిఖీత సోరేలు క్యాడెట్ విభాగం(అండర్–14) బాలురు 65 కిలోలు–జయేష్ 65 కిలోలు–దత్తుసాయి బాలికలు 33 కిలోలు–రోజా 41 కిలోలు–సాయిదీప్తి 47 కిలోలు–హేమ జూనియర్ విభాగం(అండర్–17) 68 కిలోలు–ఆశాదీక్షిత -
ఓవరాల్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్టు సత్తా చాటింది. హైదరాబాద్ తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో జరిగి న ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు ఓవరాల్ చాం పియన్‌గా నిలిచింది. మొత్తం 500 మంది క్రీడాకారులు తలపడిన ఈ పోటీల్లో హైదరాబాద్ 27 స్వర్ణాలను గెలుచుకొని అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇందులో రాణించిన జూనియర్ క్రీడాకారులు మార్చి 2 నుంచి 5 వరకు కాన్పూర్‌లో జరిగే సబ్ జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ లో... సీనియర్ క్రీడాకారులు మార్చి 17 నుంచి 19 వరకు విశాఖపట్నంలో జరిగే సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు. -
తైక్వాండో పోటీలు ప్రారంభం
భానుగుడి (కాకినాడ) : రాష్ట్ర స్థాయి 34వ సబ్ జూనియర్, 35వ సీనియర్ తైక్వాండో టోర్నమెంట్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఈ పోటీలను ప్రారంభించారు. కాకినాడలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తొలిరోజు పోటీల్లో సబ్‌జూనియర్ విభాగంలో 13 జిల్లాల నుంచి వచ్చిన 150 మందికిపైగా క్రీడాకారులు తలపడ్డారు.ఆటలో చిన్నారులు చూపించిన పోరాట పటిమ అబ్బురపరిచింది. తొలిరోజు విజేతలు వీరే 18 నుంచి 50 కేజీల వరకు ఉన్న సబ్ జూనియర్ విభాగంలో పోటీలు నిర్వహించారు. 18 కేజీల విభాగంలో ఎల్.గౌతమ్కృష్ణారెడ్డి, అనంతరపురం)(గోల్డ్), వి.లిఖిత్ , చిత్తూరు (సిల్వర్), 21కేజీల విభాగంలో ఎ¯ŒS.చైతన్య దుర్గాప్రసాద్, విశాఖపట్నం( గోల్డ్), బి.జశ్వంత్ చిత్తూరు, í(Üసిల్వర్), 23 కేజీల విభాగంలో సిహెచ్ లోహి™Œ, కర్నూలు (గోల్డ్), కె.అవినాష్, విజయనగరం(సిల్వర్), 25 కేజీల విభాగంలో జి.దినేష్ అదిత్య, తూర్పుగోదావరి(గోల్డ్), ఎస్.సాయిగణేష్, చిత్తూరు(సిల్వర్), 27 కేజీల విభాగంలో దేవ్ భరత్ సాçహు, శ్రీకాకుళం(గోల్డ్), జి.తేజ, తూర్పుగోదావరి(సిల్వర్), 29 కేజీల విభాగంలో ఎ¯ŒSఎం దిలీప్, వైఎస్సార్ కడప (గోల్డ్), రెడ్డి లోవరాజు, విశాఖపట్నం( సిల్వర్), 32 కేజీల విభాగంలో బి.కాశీబాబా, వైఎస్సార్ కడప, (గోల్డ్), ఎస్.దేవీ శ్రీ«కర్, గుంటూరు(సిల్వర్), 35 కేజీల విభాగంలో ఎం.వెంకట కార్తీక్ , విశాఖపట్నం (గోల్డ్), సీఎస్ సమరత్, చిత్తూరు(సిల్వర్), 38 కేజీల విభాగంలో కృష్ణబాబు (వైఎస్సార్ స్పోరŠట్స్ స్కూల్) గోల్డ్, జి.వేద కార్తీక్, కర్నూల్(సిల్వర్), 41 కేజీల విభాగంలో ఎం.రిషీ చోహాన్, అనంతపూర్(గోల్డ్), కె.పరశురామ్( వైఎస్సార్ స్పోరŠట్స్ స్కూల్), (సిల్వర్), 44 కేజీల విభాగంలో రిషప్ సింగ్, విశాఖపట్నం (గోల్డ్), బద్రీనాధ్, వైఎస్సార్ కడప, í(Üసిల్వర్), 50 కేజీల విభాగంలో ఆర్.యశ్వంత్, విశాఖ పట్నం, (గోల్డ్), బి.యశ్వంత్ రెడ్డి, తూర్పుగోదావరి(సిల్వర్) పతకాలను గెలుచుకున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.అర్జున రావు తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో సంఘ అధ్యక్షుడు ఆకుల మధుసూధనరావు, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై.భాస్కరరావు, ప్రొహిబిష¯ŒS అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.సత్యనారాయణ, కె.పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. -
తైక్వాండో పోటీలకు 40 మంది ఎంపిక
కాకినాడ సిటీ : తైక్వాండో అసోసియేష¯ŒS రాష్ట్రస్థాయి పోటీలకు వివిధ వెయిట్లలో జిల్లా నుంచి 40 మంది ఎంపికయ్యారు. స్థానిక జిల్లా క్రీడామైదానంలో వివిధ కేటగిరీల్లో జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు ఆదివారం జరిగాయి. జిల్లా అసోసియేష¯ŒS ఆధ్వర్యాన నిర్వహించిన ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మురళీధరరావు, సీబీసీఎ¯ŒSసీ అధ్యక్షుడు ఎం.రత్నకుమార్ ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ పోటీల్లో 20 వెయిట్లలో బాల బాలికల విభాగాల్లో 160 మంది క్రీడాకారులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. స్వర్ణ పతకాలు సాధించినవారు నవంబర్ 11, 12, 13 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని జిల్లా తైక్వాండో అసోసియేష¯ŒS కార్యదర్శి బి.అర్జు¯ŒSరావు తెలిపారు. -
జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు
కల్లూరు: జాతీయ తైక్వాండో రెఫరీలుగా జిల్లా క్రీడాకారులు దాదాబాషా (ఆదోని), ఎంబి రాముబాబు (నందికొట్కూరు), డిఎం బిలాల్ నూర్‌బాషా (నంద్యాల), ఓబులేసు (ఆళ్లగడ్డ) ఎంపికయ్యారు. విశాఖపట్నం ఏయూ జిమ్నాజియం ఇండోర్ స్టేడియంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జాతీయ స్థాయి తైక్వాండో సెమినార్ జరిగింది. ఈ సెమీనార్‌లో జిల్లా క్రీడాకారులు పాల్గొని ఉత్తమ ప్రతిభతో జాతీయ స్థాయి రెఫరీలుగా అర్హత సాధించారు. వీరిని తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు డీఎం గౌస్, శోభన్‌బాబు.. సోమవారం అభినందించారు.