NSG: ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో బృందానికి పతకాలు | National School Games: Andhra Pradesh Taekwondo Team Won 4 Medals | Sakshi
Sakshi News home page

National School Games: ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో బృందానికి పతకాలు

Published Sat, Jan 6 2024 5:41 PM | Last Updated on Sat, Jan 6 2024 5:54 PM

National School Games: Andhra Pradesh Taekwondo Team Won 4 Medals - Sakshi

జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ “తైక్వాండో” అండర్ – 14,17, 19 బాల, బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందానికి పతకాలు లభించాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రీడల్లో ఏపీ టీమ్‌ మొత్తంగా ఒక రజతం, మూడు కాంస్య పతకాలు గెలుచుకుంది. 

ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విజేతలను అభినందించారు. ఇక.. మధ్యప్రదేశ్‌లోని ‘బీటల్’ వేదికగా డిసెంబరు 31 నుంచి జనవరి 5 వరకు ఈ పోటీలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు తెలిపారు. 

విజేతలు వీరే:
►అండర్ 19 బాలికల (52-55 కేజీలు) విభాగంలో- హస్తి తేజస్విని (యస్.వి.జూనియర్ కాలేజీ ,కోడూరు ఆర్.యస్. అన్నమయ్య జిల్లా)కి రజత పతకం
►అండర్ 19 బాలికల (46-49 కేజీలు ) విభాగంలో వారణాసి హిమ శ్రీ (మున్సిపల్ హై స్కూల్ , కస్పా, విజయనగరం)కి కాంస్య  పతకం
►అండర్ 14 బాలికల (16-18  కేజీలు) విభాగంలో ఆకుల సమీరా (జెడ్పీహెచ్ఎస్, భాగ్యనగరం, దొర్నిపాడు, మండలం, నంద్యాల జిల్లా)కి     కాంస్య  పతకం 
►అండర్ 17 బాలురు (73-78  కేజీలు) విభాగంలో పెదగాడి ధనుష్ తేజ(ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అశోక్ నగర్, కాకినాడ, కాకినాడ జిల్లా)కు     కాంస్య  పతకం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement