
కటక్: డిఫెండింగ్ చాంపియన్ హరియాణా శుక్రవారం మొదలైన సీనియర్ జాతీయ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. తెలుగు రాష్ట్రాల జట్లకు ఓటమి ఎదురవగా... హరియాణాతో పాటు రైల్వేస్, మధ్యప్రదేశ్ జట్లు కూడా భారీ విజయాలతో టోర్నీని ఆరంభించాయి. పూల్ ‘ఎ’లో హరియాణా 50–20 స్కోరుతో తెలంగాణ జట్టును ఓడించింది.
పూల్ ‘డి’లో మధ్యప్రదేశ్ 59–35తో ఆంధ్రప్రదేశ్‌పై ఘనవిజయం సాధించింది. ఇదే పూల్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో చండీగఢ్ 40–24తో గుజరాత్‌పై గెలిచింది. పూల్ ‘బి’లో రైల్వేస్ 59–17తో మణిపూర్‌పై ఏకపక్ష విజయం సాధించగా... పూల్ ‘ఎఫ్’లో ఒడిశా 57–28తో విదర్భపై జయభేరి మోగించింది. పూల్ ‘సి’లో మహారాష్ట్ర 39–35తో కేరళపై పోరాడి గెలిచింది.
బరిలో ఉన్న 30 జట్లను ఎనిమిది పూల్స్‌గా విభజించి ముందుగా ప్రిలిమినరీ మ్యాచ్‌ల్ని నిర్వహిస్తున్నారు. ఒక్కో పూల్ నుంచి రెండేసి జట్ల చొప్పున నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment