
రోమ్: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్‌లో భారత రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సరిత మోర్ (57 కేజీలు) రజతం పతకం దక్కించుకోగా... పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), నవీన్ (130 కేజీలు), కుల్‌దీప్ మలిక్ (72 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. గిలియా రోడ్రిగ్స్ (బ్రెజిల్)తో జరిగిన ఫైనల్లో సరిత 2–4 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషం వరకు 2–0తో ఆధిక్యంలో నిలిచిన సరిత ఆ తర్వాత నాలుగు పాయింట్లు సమర్పించుకొని రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల గ్రీకో రోమన్ కాంస్య పతక బౌట్‌లలో అర్జున్ 8–0తో రికార్డో (పోర్చుగల్)పై, నీరజ్ 6–4తో శామ్యూల్ జోన్స్ (అమెరికా)పై, నవీన్ 3–1తో స్టీఫెన్ డేవిడ్ (చెక్ రిపబ్లిక్)పై, కుల్‌దీప్ 10–9 తో లబజనోవ్ (రష్యా)పై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment