Sarita
-
అర్ధరాత్రి తాగొచ్చి నటిని కొట్టేవాడు.. అలాంటి వ్యక్తిని గెలిపించారు!
ఇంటి ఇల్లాలిని చూసుకోలేనోడు సమాజాన్ని మాత్రం ఏం ఉద్ధరిస్తాడు? భార్య కంట నీళ్లు తెప్పించినవాడు ప్రజల గోసలు పట్టించుకుంటాడా? అసలు ఇంటినే గెలవలేనివాడికి అందరి మనసులో స్థానం సంపాదించుకునే అర్హత ఇంకెక్కడిది? కానీ ఇవన్నింటికీ విరుద్ధంగా ఓ వ్యక్తి మాత్రం దర్జాగా ఎమ్మెల్యే పోస్టు సంపాదించాడు. అది కూడా వరుసగా రెండుసార్లు! అతడే ముఖేశ్ మాధవన్..ప్రేమ పెళ్లి విఫలంముఖేశ్ నటుడు, నాయకుడు.. 1988లో సరితను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రానురానూ దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. అవి కాస్తా పెద్దవి కావడంతో 2011లో విడిపోయారు. ఆ తర్వాత 2013లో క్లాసికల్ డ్యాన్సర్ దేవికను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2021లో విడాకులు తీసుకున్నారు.క్యారెక్టర్ లేనివాడుసీపీఎమ్లో కొనసాగుతున్న ఈయన 2016, 2019లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మాజీ భర్త ముఖేశ్ ఎలాంటివాడో చెప్పిన సరిత పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో ఆమె ఏమందంటే.. ముఖేశ్‌కు క్యారెక్టర్ లేదు. ఎదుటివారికి కూసింత గౌరవం కూడా ఇచ్చేవాడు కాదు. పైగా నన్ను అనునిత్యం వేధించేవాడు. అతడి తండ్రి ముందే తాగొచ్చి కొట్టేవాడు. తండ్రి ముందే తాగొచ్చి..అలాగే అమ్మాయిలను వెంటేసుకుని సరాసరి ఇంటికి వచ్చేవాడు. ఎందుకు ఆలస్యమైందని అడిగితే పనివాళ్లముందు జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కొట్టి చీడపురుగులా చూసేవాడు. ఒకసారైతే ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కడుపులో తన్నాడు అంటూ సరిత ఎమోషనలైంది. ఇలాంటి వ్యక్తిని సమాజం నమ్మడం, తమనేదో ఉద్ధరిస్తాడని అందలం ఎక్కించడం నిజంగా విడ్డూరమే!చదవండి: దసరా బాక్సాఫీస్.. రజినీకాంత్ - సూర్య ఫ్యాన్స్ మధ్య వార్! -
రెండు పెళ్లిళ్లు.. విడాకులు.. స్టార్ హీరోయిన్గా క్రేజ్.. 10 ఏళ్ల తర్వాత!
తను స్క్రీన్‌పై కనిపిస్తే చూపు తిప్పుకోవడం కష్టమే! తన క్రేజ్ చూసి స్టార్ హీరోలు సైతం కుళ్లుకునేవారు. 1980వ దశకంలో స్టార్ హీరోయిన్గా రాణించిందీ నటి. దక్షిణాదిన పలు భాషల్లో అగ్రతారగా వెలుగొందిన ఈ సీనియర్ హీరోయిన్ దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించింది. వెండితెర ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆవిడే సరిత.. తన ప్రస్థానాన్ని నేటి కథనంలో చూసేద్దాం.. కెరీర్‌ను మలుపు తిప్పిన మరో చరిత్ర సరిత తెలుగింటి అమ్మాయి. గుంటూరులోని మునిపల్లెలో జన్మించింది. ఈమె నటించిన తొలి చిత్రం 'మంచికి స్థానం లేదు'. కానీ దీనికంటే ముందు సరిత నటించిన 'మరో చరిత్ర' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కమల్ హాసన్ సరసన కథానాయికగా నటించింది. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ కావడంతో సరితకు తెలుగు, తమిళంలో బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. అలా ఆమె నటించిన సినిమాలు గ్రాండ్ సక్సెస్ అందుకున్నాయి. అటు మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది సరిత. ఎన్నో అవమానాలు.. తెలుగులో మహేశ్‌బాబు అర్జున్ సినిమాలో పోషించిన ఆండాలు పాత్రకుగానూ నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. నిజానికి సరిత అందంగా లేదని, ఆమె హీరోయినేంటని చాలామంది నవ్వుకున్నారు. కానీ అలా అవమానించినవారితోనే చప్పట్లు కొట్టేలా చేసింది నటి. కొన్ని సన్నివేశాల్లో సరిత డామినేషన్ చూసి ఆ సీన్లు తొలగించాలని కూడా చెప్పేవారట. కావాలంటే హీరోనైనా మారుస్తాం కానీ సరిత సీన్లు తొలగించేదేలేదని దర్శకులు మొండిగా బదులిచ్చేవారట. ఇక ఆమె కెరీర్ ఎదుగుదలను చూసి ఎందరో తారలు ఓర్వలేకపోయారని కూడా అంటుంటారు. ఎందరో హీరోయిన్లకు గొంతు అరువిచ్చింది.. సాధారణంగా ఒక సెలబ్రిటీ స్థాయికి రాగానే గర్వం తలకెక్కుతుందంటారు. కానీ సరిత మాత్రం ఎప్పుడూ పక్కింటి అమ్మాయిలాగే కనిపించేది, అలాగే మసులుకునేది. ఇతర హీరోయిన్లకు గొంతు అరువివ్వడానికి కూడా ఎప్పుడూ వెనుకాడలేదు. విజయశాంతి, సుహాసిని, మాధవి, సౌందర్య, రమ్యకృష్ణ, నగ్మా, సిమ్రాన్, టబు, సుష్మితా సేన్, రోజా, రాధిక, ఆర్తి అగర్వాల్.. ఇలా ఎందరో తారలకు డబ్బింగ్ చెప్పింది. అమ్మోరు, మా ఆయన బంగారం, మావిచిగురు, అంతపురం సినిమాలకు డబ్బింగ్ చెప్పినందుకుగానూ ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నాలుగు నందులు గెలుచుకుంది. ప్రేమ పెళ్లి.. గొడవలు, వివాదం.. 1988లో మలయాళ నటుడు ముఖేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సరిత. వీరికి ఇద్దరు కొడుకులు శ్రవన్, తేజస్ సంతానం. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ గొడవలు విడాకులకు దారి తీశాయి. 2009లో ముఖేశ్.. సరిత నుంచి వివాహ రద్దు కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. సుదీర్ఘకాలంపాటు ఈ కేసు విచారణ జరగ్గా 2013లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తర్వాత ముఖేశ్.. మిధుల అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. చిన్న వయసులోనే పెళ్లి? విడాకుల వ్యవహారం తర్వాత కుమారుడు శ్రవన్‌తో కలిసి దుబాయ్ వెళ్లిపోయిన సరిత ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత శివకార్తికేయన్ 'మావీరన్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ముఖేశ్ కంటే ముందు తెలుగు నటుడు వెంకట సుబ్బయ్యతో 16 ఏళ్లకే సరిత పెళ్లి జరిగిందని, ఆరు నెలల పాటు కలిసున్న వీరు తర్వాత విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇక సరిత రెండో కొడుకు శ్రవణ్ డాక్టర్, యాక్టర్ కూడా. ఇతడు కల్యాణం అనే సినిమాలో నటించాడు. చదవండి: ఆవేశంతో కుటుంబాన్ని కాల్చిన తెలుగు సినిమా విలన్ -
హస్తం గూటికి జెడ్పీ చైర్పర్సన్ సరిత...
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి పాలమూరులో పునర్ వైభవాన్ని చాటేందుకు పక్కాప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ప్రధానంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంపై ఇదివరకే నజర్ వేసిన ఆ పార్టీ పెద్దలు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టొద్దనే పట్టుదలతో పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు బహిష్కరణ తర్వాత సంప్రదింపులకు శ్రీకారం చుట్టి.. ఆయనను సొంత గూటికి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. అదేవిధంగా బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్ అసమ్మతులు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి తదితరులు సైతం చేయి అందుకోనున్నారు. ప్రధానంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో జూపల్లితో మొదలైన చేరికల పరంపర నడిగడ్డగా పేరొందిన జోగుళాంబ గద్వాల జిల్లాకు పాకింది. ♦ అసమ్మతి నేతలతో మాటాముచ్చట.. కాంగ్రెస్‌లోకి బడా నేతల చేరిక నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరింత దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో పొసగకపోవడంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితాతిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి సైతం హస్తం గూటికి చేరనున్నారు. రేవంత్‌రెడ్డితో ఆయనకు పాత పరిచయం ఉంది. దీంతో రేవంత్‌రెడ్డి.. చంద్రశేఖర్‌రెడ్డితోపాటు సరితాతిరుపతయ్యతో కలిసి అసమ్మతి నేతలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు సరిత, చంద్రశేఖర్ వేర్వేరుగా రోజుకో మండలం చొప్పున పర్యటిస్తున్నారు. అసమ్మతి నేతలు మూకుమ్మడిగా కాంగ్రెస్‌లో చేరేలా సన్నాహాలు ముమ్మరం చేశారు. మరోవైపు గద్వాల, ధరూర్, మల్దకల్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లోని బీఆర్ఎస్కు చెందిన పలువురు ముఖ్య నేతలతో రేవంత్‌రెడ్డి సైతం స్వయంగా ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అలంపూర్ నియోజకవర్గంలో సైతం చాపకింద నీరులా కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వినికిడి. సరితాతిరుపతయ్యతో కలిసి ఓ జెడ్పీటీసీ సభ్యుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు జిల్లాలో చర్చ జోరుగా సాగుతోంది. తెరపైకి బీసీ ఫార్ములా.. మారుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో గద్వాలలో బీసీ ఫార్ములా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ సైతం ఇదే నినాదంతో ముందుకెళ్లాలనే యోచనలో ఉంది. కాంగ్రెస్‌లో చేరుతున్న జెడ్పీ చైర్పర్సన్ సరితాతిరుపతయ్య కురువ సామాజికవర్గానికి చెందినవారు కాగా.. గద్వాల, అలంపూర్‌లో ఈ వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో వీరి రాకతో కాంగ్రెస్‌లో జోష్ నెలకొంది. సర్వేల ఆధారంగా టికెట్ కేటాయిస్తామని పార్టీ అధిష్టానం చెబుతున్నప్పటికీ.. సరితాతిరుపతయ్యకే ఖరారైనట్లు గద్వాల నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మరోవైపు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సైతం బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. కాంగ్రెస్‌లో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈయన కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరే కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు నాయకులు కాంగ్రెస్‌లో చేరాలని యోచిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను బేరీజు వేసుకుంటున్న వారు త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయి తే పోటీ లేకుండా బీసీ వర్గానికి చెందిన ఒకరు ఎన్నికల్లో నిలబడితే గెలిచే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
కరీంనగర్లో లేడీ రియల్టర్ దారుణ హత్య
కరీంనగర్ క్రైం: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు ఒక వివాహిత నిండు ప్రాణాలు బలిగొన్నాయి. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ భగత్‌నగర్‌లోని క్రిస్టల్ ప్లా జా అపార్ట్మెంట్లో వివాహిత గుండా సరిత (35) దారుణ హత్యకు గురైంది. గోదావరిఖని 8 ఇన్‌క్లైన్ కాలనీకి చెందిన ఆకుల ఓదెలు–లక్ష్మిల రెండో కుమార్తె సరిత మంచిర్యాల జి ల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గుండా శ్రీపాల్‌రెడ్డిని 2001లో ప్రేమ వివాహం చేసుకుంది. గోదావరిఖనిలో నివసిస్తున్న వారికి ఆస్మిత్‌రెడ్డి, మణిత్‌రెడ్డి సంతానం. గోదావరిఖనిలో సరిత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండటం నచ్చని శ్రీపాల్‌రెడ్డి అందుకు అభ్యంతరం తెలిపాడు. ఈ వ్యవహారం ఇద్దరి మధ్య గొడవలకు దారితీయడంతో ఏడాది నుంచి సరిత భర్తకు దూరంగా ఉంటోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పనిమీద అప్పుడప్పుడూ కరీంనగర్‌కు వెళ్తుండే ది. ఈ క్రమంలో భగత్‌నగర్‌లోని క్రిస్టల్ అపార్ట్మెంట్ 203 ఫ్లాట్‌లో ఉంటున్న వెంకటేశ్ అనే వ్యక్తితో సరితకు పరిచయం ఏర్పడింది. దీంతో సరిత సుమారు రూ. 20 లక్షలకుపైగా డబ్బును వెంకటేశ్‌కు ఇచ్చింది. సరిత తమ్ముడు ఆకుల సతీశ్ నగరంలోని రాంనగర్లో నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు ఉండటంతో కుమారులతో సహా సరితత మ్ముడి ఇంట్లోనే ఉంది.జూన్ 28న కొడుకులను గోదావరిఖని పంపిన సరిత అదేరోజు సాయంత్రం వెంకటేశ్‌తో కలసి రియల్ ఎస్టేట్ పనులపై వరంగల్‌కు వెళుతున్నానని చెప్పింది. ఆమె సోదరుడు మర్నాడు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. శుక్రవారం సరిత ఫోన్ నుంచి ఆకుల సతీశ్‌కు వెంకటేశ్ వాట్సాప్ కాల్ చేశాడు. సరిత తల గోడకు కొట్టుకుందని, ఫ్లాట్ లోపలే ఉందని, ఆమెను తాళం పగలగొట్టి తీసుకెళ్లాలని చెప్పి పరారయ్యాడు. దీంతో కంగారుపడిన సరిత సోదరి స్వాతి, తమ్ముడు సతీశ్... హుటాహుటిన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తాళం పగలగొట్టి లోనికి వెళ్లిచూడగా రక్తపు మడుగులో, ముఖం, తలపై తీవ్రగాయాలతో సరిత పడి ఉంది. ఆమె మెడకు చున్నీ బిగించి ఉంది. సతీశ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రవికుమార్, సిబ్బంది, క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రధా న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీలే కారణం... సరిత మృతికి వ్యాపార లావాదేవీలే కా రణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే క్రమంలో దాదాపు రూ. 25 లక్షలను పెట్టుబడి కింద వెంకటేశ్‌కు సరిత ఇచ్చిందన్నారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వా లని అడగడంతో వెంకటేశ్ ఇవ్వలేదని.. దీనిపై ఇద్దరికీ గొడవలు జరిగేవని సతీశ్ తెలిపాడు. వెంకటేశ్ నివసిస్తున్న అపార్ట్మెంట్ సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు అతన్ని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. -
గురుకులం: వేద విద్యామణులు
నలుగురు అక్కచెల్లెళ్లు. లక్ష్మి ఆర్య, కవిత ఆర్య, రజిత ఆర్య, సరిత ఆర్య. వీరిది తెలంగాణలోని ఓ వ్యవసాయ కుటుంబం. ఈ నలుగురూ వేదాలను అభ్యసించారు. కంప్యూటర్ యుగంలో అందులోనూ ఆడపిల్లలకు వేదాలెందుకు అనేవారి నోళ్లను మూయిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, అపార పాండిత్యంతో ఔరా అనిపిస్తూ సంస్కృతంలో విద్యార్థులను నిష్ణాతులు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఎదిర గ్రామమైన ఈ అక్కాచెల్లెళ్లను కలిస్తే వేదాధ్యయనం గురించి ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘మా అమ్మానాన్నలు ఆంచ సుమిత్ర, జంగారెడ్డి. నాల్గవ తరగతి వరకు ఊళ్లోనే చదువుకున్నాం. మా మామయ్య విద్వాంసుడవడంతో అతని సూచన మేరకు మా నలుగురు అక్కచెల్లెళ్ల ను కాశీలోని పాణిని కన్యా మహావిద్యాలయంలో చేర్చారు. కాశీ అంటేనే విద్యానగరి. విద్యలన్నీ అక్కడ సులభంగా లభిస్తాయని ప్రతీతి. అక్కడే పదేళ్లపాటు వేదాదేవి సాన్నిధ్య శిష్యరికాలలో విద్యాభ్యాసం చేశాం. ఆత్మరక్షణ కోసం శస్త్ర, శాస్త్రాలు సాధన చేశాం. ► ఆడపిల్లలకు వేదాలా..? వేదాలు బ్రాహ్మణులు కదా చదివేది అనేవారున్నారు. ఆడపిల్లలకు వేదం ఎందుకు అన్నారు. ఎక్కడ రాసుంది స్త్రీ వేదాలు చదవకూడదని, వేద మంత్రమే చెబుతుంది ప్రతి ఒక్కరూ వేదాన్ని పఠించవచ్చు అని. మేం చదివిన గురుకులాన్ని కూడా ప్రజ్ఞాదేవి, భేదాదేవి అనే అక్కచెల్లెళ్లు ఎంతో కృషితో నడిపిస్తున్నారు. రిషిదయానంద్ అనే విద్వాంసుడు స్త్రీని బ్రహ్మ పదవిపై కూర్చోబెట్టారు. వారి వద్ద విద్యను నేర్చుకున్న ఆ అక్కచెల్లెళ్లు వాళ్లు. ఆడపిల్లలు వేదాలు వినడమే నిషేధం అనే రోజుల్లోనే వారిద్దరూ వేదాధ్యయనం చేసి, గురుకులాన్ని స్థాపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి శిష్యులు గురుకులాలు స్థాపించి, వేదాన్ని భావితరాలకు అందిస్తున్నారు. ► అన్ని కర్మలు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలను ఔపోసన పట్టడమే కాదు పౌరోహిత్యం, పుట్టినప్పటి నుంచి మరణించేవరకు మధ్య ఉన్న అన్ని కర్మలూ విధి విధానాలతో చేస్తున్నాం. కొంతమంది ‘ఇదేం విచిత్రం’ అన్నవారూ లేకపోలేదు. అనేవారు చాలా మందే అంటారు. కానీ, మేం వాటికి మా విద్య ద్వారానే సమాధానం చెబుతున్నాం. పురాణ, ఇతిహాసాల్లో గార్గి, మైత్రి, ఘోశ, అపాల .. వంటి స్త్రీలు వేదాభ్యాసం చేసి, తమ సమర్థత చూపారు. అయితే, చాలా మందికి వారి గురించి తెలియదు. ► ఉచిత తరగతులు మా నలుగురిలో లక్ష్మి ఆర్య, సరిత ఆర్య చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో విద్యార్థులకు వేదవిద్యను బోధిస్తున్నారు. పౌరహిత్యంతో పాటు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ భగవద్గీత, సంస్కృత పాఠాలను ఉచితంగా చెబుతున్నాం. మా నలుగురి ఆలోచన ఒక్కటే సంస్కృతం విస్తృతంగా ప్రచారం కావాలి. ఆడపిల్లలూ వేద విద్యలో ముందంజలో ఉండాలి. మా వద్ద పిల్లలతోపాటు పెద్దవాళ్లు కూడా సంస్కృతం అభ్యసిస్తున్నారు’’ అని వివరించారు ఈ నలుగురు అక్కచెల్లెళ్లు. నేటి కాలంలో వేద విద్యపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని, అందుకోసమే తాము వేద విద్యలో పట్టు సాధించాలనుకున్నాం అని తెలిపారు ఈ సోదరీమణులు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత వ్యాకరణంలో రజిత ఆర్య, సరిత ఆర్య పీహెచ్డీ పట్టా అందుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. – నిర్మలారెడ్డి – బాలయ్య, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా, సాక్షి -
స్ఫూర్తి: ముంబై మురికివాడ నుంచి... యూఎస్ యూనివర్శిటీ వరకు!
దురదృష్టం ఒక ద్వారం మూసిపెడితే, కష్టపడేతత్వం పదిద్వారాలను తెరిచి ఉంచుతుంది... అంటారు. ముంబై పేవ్‌మెంట్స్‌పై పూలు అమ్మిన సరిత మాలికి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి చేసే అవకాశం లభించింది. ఈ విజయానికి కారణం ఆమె ఇష్టపడే కష్టపడేతత్వం... సరిత మాలి తల్లిదండ్రులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మూరుమూల ప్రాంతం నుంచి పొట్ట చేతపట్టుకొని మహానగరం ముంబైకి వచ్చారు. అక్కడి ఘడ్కోపర్ మురికివాడలో పుట్టి పెరిగింది సరిత.స్థానిక మున్సిపల్ స్కూల్లో పదవతరగతి చదువుకుంది. ఆ తరువాత కాలేజి చదువు కొనసాగిస్తూనే ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. ట్యూషన్స్ చెప్పగా వచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచుకునేది. పై చదువులకు అవి ఎంతో కొంత సహాయపడ్డాయి. ఒకసారి సెలవులలో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు, బంధువులలో ఒకరు దిల్లీలోని ‘జేఎన్‌యూ’ గురించి గొప్పగా చెప్పారు. ఆ సమయంలోనే అనుకుంది...ఆ యూనివర్శిటీలో ఎలాగైనా చేరాలని! ఆ ఉత్సాహంపై నీళ్లుపోసే మాటలు ఎదురయ్యాయి. ‘జేఎన్‌యూలో అడ్మిషన్ దొరకడం అంతేలికైన విషయం కాదు’ ‘తెలివైన విద్యార్థులు మాత్రమే అక్కడ చదువుకుంటారు’... మొదలైనవి. ఆ తెలివైన విద్యార్థి తాను ఎందుకు కాకూడదు? అని మనసులో గట్టిగా అనుకుంది సరిత. బీఏ మొదటి సంవత్సరం నుంచే ప్రవేశపరీక్షకు ప్రిపేర్ కావడం మొదలుపెట్టింది! ఆమె కష్టం వృథా పోలేదు. ప్రసిద్ధమైన యూనివర్శిటీలో ఎం.ఏ హిందీలో ఆమెకు సీటు వచ్చింది. ‘నేను మరిచిపోలేని రోజు, నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు అది. జేఎన్‌యూలో విస్తృతమైన∙ప్రపంచాన్ని చూశాను. ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను’ అంటుంది సరిత. యూనివర్శిటీలో తనతో ఒక్కొక్కరూ ఒక్కోరకంగా వ్యవహరించేవారు. పేదకుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యంగెస్ట్ రిసెర్చ్ స్కాలర్‌గా తనను స్ఫూర్తిగా తీసుకున్నవారు కొందరైతే,‘సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లకుండా ఈ సాహిత్యం, కవిత్వం వల్ల ఉపయోగం ఏమిటి?’ అని తక్కువ చేసి మాట్లాడిన వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, తన మాటల్లో చెప్పాలంటే ‘జేఎన్‌యూ’ సరితకు మరోప్రపంచాన్ని చూపింది. జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేసిన సరితకు తాజాగా ‘యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి(హిందీ సాహిత్యం) చేసే అవకాశం లభించింది. ‘భక్తి ఉద్యమకాలంలో అట్టడుగు వర్గ మహిళల సాహిత్యం’ అనేది ఆమె పీహెచ్‌డి అంశం. ‘నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. అయితే పేదరికం వల్ల ఎన్నోసార్లు చదువు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినా నేను వెనక్కి తగ్గలేదు. ఏదో రకంగా కష్టపడి చదువుకున్నాను. నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల సహకారం మరవలేనిది. భవిష్యత్‌లో పేదపిల్లలకు నా వంతుగా సహాయపడాలనుకుంటున్నాను’ అంటుంది 28 సంవత్సరాల సరిత మాలి. -
సరిత, సుష్మలకు కాంస్యాలు
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయిలు రెండు కాంస్యాలతో మెరిశారు. 59 కేజీల విభాగంలో సరిత, 55 కేజీల కేటగిరీలో సుష్మ కంచు పతకాలు గెలిచారు. ఆరంభ బౌట్లలో ఓడినా తర్వాతి రెండు బౌ ట్లలో వరుసగా దిల్‌ఫుజా ఇంబెటొవా (ఉజ్బెకిస్తాన్)పై 11–0 తేడాతో (టెక్నికల్ సుపీరియార్టీ)...ఆ తర్వాత దియానా కయుమొవా (కజకిస్తాన్)పై 5–2తో సరిత గెలిచింది. సుష్మ కూడా ఇదే తరహాలో ఆల్టిన్ షగయెవా (కజకిస్తాన్)పై 5–0తో, ఆపై సర్బినాజ్ జెన్‌బెవా (ఉజ్బెకిస్తాన్)ను 12–0 తే డాతో ఓడించి కాంస్యం ఖాయం చేసుకుంది. ఈ ఈ వెంట్ పురుషుల విభాగంలో గ్రీకో రోమన్ రెజ్ల ర్లు ఇప్పటికే ఐదు కాంస్యాలు గెలవడంతో ఓవరాల్ గా భారత్ పతకాల సంఖ్య ఏడు కాంస్యాలకు చేరింది. -
‘రజత’ సరిత
రోమ్: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సరిత మోర్ (57 కేజీలు) రజతం పతకం దక్కించుకోగా... పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), నవీన్ (130 కేజీలు), కుల్దీప్ మలిక్ (72 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. గిలియా రోడ్రిగ్స్ (బ్రెజిల్)తో జరిగిన ఫైనల్లో సరిత 2–4 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషం వరకు 2–0తో ఆధిక్యంలో నిలిచిన సరిత ఆ తర్వాత నాలుగు పాయింట్లు సమర్పించుకొని రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల గ్రీకో రోమన్ కాంస్య పతక బౌట్లలో అర్జున్ 8–0తో రికార్డో (పోర్చుగల్)పై, నీరజ్ 6–4తో శామ్యూల్ జోన్స్ (అమెరికా)పై, నవీన్ 3–1తో స్టీఫెన్ డేవిడ్ (చెక్ రిపబ్లిక్)పై, కుల్దీప్ 10–9 తో లబజనోవ్ (రష్యా)పై గెలుపొందారు. -
వైరలవుతున్న ఏపీ పోలీస్ అధికారిణి పాట!
సాక్షి, అమరావతి: మహమ్మారి కరోనాకు మందు లేకపోవడంతో భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతే కీలకంగా మారింది. ఈనేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కు పిలుపుచ్చాయి. అయితే, స్వీయ నియంత్రణతోనే కోవిడ్-19పై విజయం సాధిస్తామనేది జగమెరిగిన సత్యం. దీంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పలువురు కళాకారులు, సెలబ్రిటీలు తమదైన శైలిలో పాటల రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఏఎస్పీ సరిత అలాంటి ప్రయత్నమే చేశారు. సీఐడీ ఎస్ఐ శ్రీహరి రచించిన పాటను ఆమె తన గళంతో అందర్ని ఆకట్టుకునేలా పాడారు. ‘వద్దురా అన్న... బయటకు రాకురోయన్న.. వద్దన్న నువ్వొస్తే.. కాటేస్తుందిరా కరోనా’ అంటూ సరిత పాడిన పాట ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కరోనాపై పోరాటంలో పోలీసులు ముందున్నారని, ప్రజలు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె పాట ద్వారా విజ్ఞప్తి చేశారు. (చదవండి: కరోనా పోరు: విజేత ఆ ఊరు) (చదవండి: కరోనా అలర్ట్ : హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు..) -
నల్ల పిల్ల హీరోయినా..?
ఇది వెండితెర వెనకాల కథ ఏ ఇంటి అమ్మాయికీ జరగకూడని కథ ఇప్పటివరకూ బయటపడని కథ మగాహంకారం కప్పేసిన కథ ఒక మహిళకు ఉన్న పోరాట గుణం చెప్పే కథ సరైన కథ.. మరో సరిత కథ. వెండితెరపై అద్భుతంగా నటించే సరిత తెర మీద కనిపించే వేరే నటీమణుల పాత్రలకు తెరవెనక తన గొంతుతో ప్రాణం పోస్తుంటారు. ‘మరో చరిత్ర’ ఆమె తొలి చిత్రం. నటిగా 40 ఏళ్లు. 150కి పైగా సినిమాలు, ఎందరో నటీమణులకు డబ్బింగ్.. సరిత ఇప్పుడు తెర మీద కనిపించకపోయినా వినిపిస్తూనే ఉన్నారు. ఇటీవల ఓ వేడుకలో పాల్గొనడానికి దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమెతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ‘మరో చరిత్ర’లాంటి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమా ద్వారా కథానాయికగా పరిచయమయ్యారు. ఈ రిజల్ట్‌ని ఊహించే వయసు కాదు కాబట్టి ఆశ్చర్యపోయి ఉంటారేమో? సరిత: నిజమే. టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆ సినిమా చేశాను. సినిమా అంటే ఏంటో తెలియదు. ఇక హిట్, ఫ్లాప్ గురించి తెలియని ఏజ్, స్టేజ్. బాలచందర్‌గారితో చేసిన ఆ సినిమా నాకో మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ సక్సెస్ పెద్ద సర్ప్రైజ్. రోజులు కాదు.. సంవత్సరాలు ఆడింది. అలాంటి హిట్ మళ్లీ నా కెరీర్లో రాలేదు. లవ్ స్టోరీస్ అంటే ‘మరోచరిత్ర’లా ఉండాలి అన్నట్లు ఆ సినిమా ఓ బెంచ్‌మార్క్ అయిపోయింది. ఇప్పటికీ ఆ సినిమాలోని సన్నివేశాలను కొన్ని సినిమాల్లో వాడటం భలే అనిపిస్తుంది. అసలు బాలచందర్‌గారి కళ్లలో ఎలా పడ్డారు? మా నాన్నగారు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా, ఫైనాన్షియర్‌గా ఉండేవారు. రైటర్ గణేశ్ పాత్రోగారు మా నాన్నగారికి ఫ్రెండ్. ఆయనోసారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నా. నేను స్కూల్ నుంచి వచ్చి, షూస్ విప్పి లోపలకు వెళ్లిపోయాను. గణేశ్‌గారు మా నాన్నగారిని ‘పాప యాక్ట్ చేస్తుందా? బాలచందర్‌గారు హీరోయిన్ కోసం చూస్తున్నారు. కొత్తమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికి 160 మందిని చూశారు’ అని మా నాన్నగారితో అన్నారట. నాకప్పుడు పధ్నాలుగేళ్లే అయినా వయసుకి మించి కనిపించేదాన్ని. గణేశ్‌గారు నాకు పదహారేళ్లు ఉంటాయనుకున్నారు. మా నాన్న నన్ను పిలిచి, ‘యాక్ట్ చేస్తావా?’ అని అడిగితే, ‘నో’ అన్నాను. ఆయన వెళ్లిపోయాక నాన్నగారు ‘ఇది కమల్‌హాసన్ పిక్చర్’ అన్నారు. నా ముఖం బల్బ్‌లా వెలిగిపోయింది. ఒప్పుకున్నాను. మర్నాడు స్కూల్‌కు సెలవు పెట్టి షాపింగ్‌కు వెళ్లాం. చీర, బ్లౌజ్ కొనడానికి. అది కట్టుకుని ఆడిషన్స్‌కి వెళ్లాలనుకున్నాను. మోడ్రన్ డ్రెస్‌లో వెళ్లాలని ఎందుకు అనుకోలేదు? అంతకుముందు చీర కట్టుకునే అలవాటు ఉందా? చీర అలవాటు లేదు. అయితే మామూలు డ్రెస్‌లో చిన్నపిల్లలా కనిపిస్తే హీరోయిన్ లుక్ లేదని సెలక్ట్ చేయరనుకున్నా. అంతకుముందు ‘అనార్కలి’ అనే సినిమాకు టెస్ట్ చేసి చిన్నపిల్లలా ఉన్నానని తీసుకోలేదు. రిజెక్షన్ అంటే నాకు ఇష్టం ఉండదు. అప్పటికి ‘మరోచరిత్ర’ కోసం 160 మందిని చూశారు. వాళ్లలా రిజెక్ట్ కాకూడదనుకున్నాను. నాకింకా గుర్తు. ‘పర్ఫెక్ట్ టైలర్స్’ అనే టైలరింగ్ షాప్ ఉండేది. అక్కడే నా ఫస్ట్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. చీర కట్టుకుని, నేను నచ్చకుండా ఉండకూడదు అనే ఫీలింగ్‌తో వెళ్లాను. యన్టీఆర్గారి మేకప్‌మేన్ పీతాంబరంగారే మేకప్ చేశారు. బాలచందర్‌గారు ఆడిషన్ చేశారు. సెలక్ట్ అయ్యాను. అయితే ఫస్ట్‌డే సజావుగా సాగలేదు. ఏమైంది? కమల్‌హాసన్‌గారి చేతిని ముద్దుపెట్టుకుని, ‘ఏం? తప్పా?’ అని అడగాలి. అప్పుడు ఆయన ‘ముద్దు పెట్టుకున్న చోటే తప్పు’ అంటారు. నేను సిగ్గుపడుతున్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. అది రాలేదు. 7 టేక్స్ అయ్యాయి. మా నిర్మాతగారు నన్ను పంపించడానికి టికెట్స్ బుక్ చేయడానికి వెళ్లిపోయారు. సాయంత్రం బాలచందర్‌గారి అసోసియేట్ అనంత్ నాతో ‘కమల్ అంటే ఇష్టమేనా? అని అడిగారు. ‘చాలా’ అన్నాను. ‘అది ఫేస్‌లో చూపించాలి’ అన్నారు. మర్నాడు షూటింగ్లో కమల్‌గారి మీద ఉన్న ఇష్టాన్ని ముఖంలో చూపించాను. సీన్ ఓకే అయింది. ‘మరోచరిత్ర’కు మిమ్మల్ని తీసుకున్నప్పుడు ‘నల్ల పిల్ల హీరోయినా?’ అనే కామెంట్స్ వినబడ్డాయి. మీరేమైనా హర్ట్ అయ్యారా? అలా అన్నారని రియాక్ట్ అవ్వాలని కూడా తెలియదు. సినిమా రిలీజయ్యాక అమ్మాయి వల్లే పిక్చర్ రన్ అవ్వడం లేదు. తనే మైనస్ అని రాశారు. కానీ సెకండ్ వీక్‌కు ఈ అమ్మాయే ఈ సినిమాకు ప్లస్ అన్నారు. యాక్చువల్‌గా హిందీ రీమేక్‌లోనూ కమల్‌హాసన్‌గారు నన్నే చేయమన్నారు కూడా. ఆ సంగతలా ఉంచితే నాకు ఫెయిర్‌గా ఉండేవాళ్లంటే ఇష్టం. కానీ తర్వాత నా రంగే నాకు ప్లస్ అని, టాలెంటే ముఖ్యం అనితెలుసుకున్నాను. రిజెక్షన్ అంటే ఇష్టపడనన్నారు. ఒకవేళ ‘మరో చరిత్ర’కు సెలక్ట్ కాకపోయుంటే? చదువుకునేదాన్ని. అయితే ‘మరో చరిత్ర’ తర్వాత ఇక నాకు చదువుకునే అవకాశం దక్కలేదు. ఎనిమిదో తరగతితోనే చదువు అయిపోయింది. అందుకే మా పిల్లలను బాగా చదివిస్తున్నాను. సౌందర్య, విజయశాంతి, నగ్మా, రమ్యకృష్ణ, సిమ్రాన్, టబు, నదియా.. ఇలా చాలా మందికి డబ్బింగ్ చెప్పారు.. చెబుతున్నారు. అసలు డబ్బింగ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? డబ్బింగ్ జర్నీ బ్యూటిఫుల్ అంటాను. ఫస్ట్ దాసరి నారాయణరావుగారు స్టార్ట్ చేశారు. ‘గోరింటాకు’ పిక్చర్‌కు అడిగారు. అందులో సావిత్రిగారికి డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్‌కి నన్ను ఎందుకు అడుగుతున్నారా? అనుకున్నాను. నా వాయిస్ బాగుంటుందని, డబ్బింగ్ బాగా చెబుతానని నాకు నేను తెలుసుకోవడానికి టైమ్ పట్టింది. సౌందర్య, విజయశాంతి, నగ్మా వాళ్లైతే సరిత డబ్బింగ్ చెబితే బావుంటుందని నా పేరుని సూచించేవారు కూడా. డైరెక్ట్‌గా కాల్ చేసి ‘సరూ.. చెప్పు’ అని అడిగేవారు. హీరోయిన్గా మూడు షిఫ్ట్స్ పని చేసినప్పటికీ రాత్రంతా కూర్చుని డబ్బింగ్ చెప్పేదాన్ని. టఫ్‌గా ఉండేది. కానీ స్నేహితుల కోసమే కదా అని హ్యాపీగా అనిపించేది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. డబ్బింగ్ పూర్తి స్థాయి ప్రొఫెషన్ అయింది. పెళ్లి తర్వాత బ్రేక్ ఎందుకు తీసుకున్నారు? నేను కావాలని తీసుకున్న నిర్ణయం అది. నా పిల్లల్ని ఆయాలకు వదిలేసి, పని చేయలేను. యాక్టింగ్ అంటే 100 శాతం, డబ్బింగ్ అంటే 100 శాతం.. ఇలా ఏ పని చేసినా నా బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. మా అబ్బాయికి పది నెలల వయసప్పుడు ‘కుట్టయేట్టన్’ అనే మలయాళ సినిమా చేశాను. బాబుకు పాలు పట్టి రండి అని బ్రేక్స్ కూడా ఇచ్చేవాళ్లు. కానీ నా వర్క్‌ని ఎంజాయ్ చేయలేకపోయాను. బిడ్డకు, పనికి నా బెస్ట్ ఇవ్వడం లేదనే ఫీలింగ్ కలిగింది. బాబు ఏం చేస్తున్నాడో అనే ఆలోచన. ఇదే నా లాస్ట్ సినిమా అని నిర్ణయించేసుకున్నాను. అలా బ్రేక్ తీసుకున్నందుకు పశ్చాత్తాపం ఏమైనా? లేదు. యాక్టింగ్‌కు బ్రేకిచ్చినా సినిమాలకు టచ్‌లోనే ఉన్నాను కదా. డబ్బింగ్ చెబుతూనే ఉన్నాను. అయితే కొన్ని మంచి సబ్జెక్ట్స్ మిస్సయ్యాను. వాటిలో తమిళంలో ‘మగళిర్ మట్టుమ్’ (తెలుగులో ‘ఆడవాళ్లకు మాత్రమే’) అనే సినిమా ఒకటి. కమల్‌హాసన్ అయితే ‘వాహినీ స్టూడియోలో ఊయల పెట్టిస్తాను. నువ్వు మాత్రం ఈ సినిమా చేయాల్సిందే’ అన్నారు. నేను మ్యానేజ్ చేయలేనని చెప్పాను. ‘నీకింకా పదిరోజులు టైమ్ ఇస్తాను ఆలోచించుకో’ అని లండన్ వెళ్లిపోయారు. అక్కడినుండి ఫోన్ చేశారు. అప్పుడు నో అన్నాను. తిట్టేశారు. ‘ఇలా అనుకుంటే నువ్విక వర్క్ చేయలేవు’ అని కోప్పడ్డారు (నవ్వుతూ). భర్త (మలయాళ నటుడు ముఖేష్) సపోర్ట్ చేస్తే స్త్రీలకు వాళ్ల వృత్తిలో కొనసాగడం సులువు అవుతుంది. మీ భర్త సహకారం అందలేదా? మా ఆయన సపోర్ట్ అస్సలు లేదు. ముఖేష్‌గారు, మీరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా? నాకు ఆయన కరెక్ట్ కాదు. ఆ తర్వాత తెలిసింది. ఆప్యాయత, అనురాగాలు ఏం లేవు మా మధ్యలో. దేవుడు నాకు బంగారం లాంటి ఇద్దరి పిల్లల్ని ఇచ్చాడు. అది చాలని అనుకుంటున్నాను. ఆయన మీద డిపెండ్ కూడా అవ్వడం లేదు. ఎందుకంటే బాధ్యతలు పంచుకోవడంలో ఆయనెప్పుడూ మాతో లేరు. మనసులు కలవలేదనే విడాకులు తీసుకున్నారా? నాకు డైవర్స్ ఇవ్వకుండానే ఆయన వేరే పెళ్ళి చేసుకున్నాడు. ఫ్రాడ్ చేసి డైవర్స్ పేపర్స్ తీసుకున్నాడు. మేమిద్దరం సెలబ్రిటీలం. డైవర్స్ తీసుకున్నా, డైవర్స్‌కు అప్లై చేసినా కచ్చితంగా మీడియాలో వస్తుంది. కానీ మేమిద్దరం విడాకులు తీసుకోవాలనుకుంటున్నామని, తీసుకున్నామని న్యూస్ వచ్చిందా? ఎందులోనూ రాలేదు. ఒకవేళ నేను ఈ విషయం మీద కేసు పెడితే ఏడేళ్లు జైలులో ఉండిపోతాడు. కానీ అలా చేయలేను. ఎందుకంటే నేను ఏ లాయర్‌ను అపాయింట్ చేసుకున్నా వాళ్లను కొనేస్తున్నాడు. ఎవరూ నిలబడలేదు. నిలబడనివ్వలేదు. నాకు ఇలా జరిగిందనే బాధకంటే ఈ వ్యవస్థ ఇలా ఉన్నందుకు ఎక్కువ బాధ కలిగింది. మన పిల్లలు ఈ సమాజం నుంచి ఏం నేర్చుకుంటారు? అనే బాధ. ఈ సిస్టమ్ తప్పుని తప్పు అని ఎందుకు చెప్పడం లేదు? ఎందుకంటే ఆయన చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన్ని ఏమీ చేయలేం. నువ్వు నన్ను కేరళాలో ఏమీ చేయలేవు అని డైరెక్ట్‌గా చాలెంజ్ కూడా విసిరాడు. దాంతో ఆ విషయాన్ని దేవుడికి వదిలేశాను. నా ఇద్దరు కొడుకులే నా ధైర్యం. పిల్లలకు బాధ లేదా? ఉండకుండా ఎలా ఉంటుంది? కానీ వాళ్లు నాతోనే ఉండాలనుకున్నారు. నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. వాళ్ల కోసం బతుకుతున్నాను. నా బాధ అంతా సెలబ్రిటీస్‌కే ఇలా ఉంటే మామూలు అమ్మాయిల పరిస్థితి ఏంటి? మీడియాను కూడా తనవైపే తిప్పుకుంటున్నాడు. కేరళలో ఉన్న ఓ ప్రముఖ దినపత్రిక వాళ్లు నన్ను ఓ 5 గంటలు ఇంటర్వ్యూ చేశారు. మా పిల్లలతో కూడా మాట్లాడారు. అయితే ఆ తర్వాత ఆ అమ్మాయి కాల్ చేసి మా ఎడిటర్‌గారికి మీ ఆయన ఫోన్ చేశారు అని చెప్పింది. ఆ ఇంటర్వ్యూ బయటకు రాదని అర్థమైంది. ఇంటర్వ్యూ బయటకు రాకూడదని ఎందుకు అంటారు? తప్పు వాళ్ల వైపు ఉండబట్టే కదా. ఆయన లా చదువుకున్నాడు. ఆయన క్లాస్మేట్స్ అందరూ లాయర్లు, జడ్జీలు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సంఘటన వల్ల పిల్లలను పెంచే విధానంలో ఏదైనా మార్పు వచ్చిందా? మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి మనం మన పిల్లలను పెంచుతాం. నా జీవితం నాకిప్పటి వరకూ నేర్పిన పాఠాలను పిల్లల పెంపకానికి ఉపయోగిస్తున్నాను. అయితే సిస్టమ్‌ను నేనెలా మార్చగలను? పెళ్లి విషయంలో నాకు జరిగినది తెలుసుకుని, ‘మమ్మీ.. డబ్బులుంటే న్యాయాన్ని కొనేయొచ్చుగా’ అంటున్నారు. అది ఎంత ప్రమాదకరమైన ఆలోచన? ఆ ఆలోచనతో పిల్లలు పెరగకూడదు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణిలో ఉంటారు. మేం మాట్లాడుకున్న లాయర్ వాళ్ల వైపు వెళ్లేసరికి మా పిల్లలు బాగా అప్సెట్ అయ్యారు. ఆ టైమ్‌లో నేను కూడా అలా అయిపోతే పిల్లలు వీక్ అవుతారు. అందుకే నా బాధను బయటకు చూపించలేదు. ఎందుకంటే ఏం జరిగినా ధైర్యంగా ఉండాలని వాళ్లు నేర్చుకోవాలనుకున్నా. ఇప్పుడు కూడా పిల్లల కోసం దుబాయ్‌లోనే ఉంటున్నారు. సినిమా చాన్సులు వస్తే? నా పిల్లలు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. నా ఫస్ట్ ప్రయారిటీ వాళ్లే. ఒక అబ్బాయి డాక్టర్, రెండో అబ్బాయి ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. నా జీవితాన్ని సంపూర్ణం చేసేది వాళ్లే కాబట్టి నేనూ పిల్లలతోపాటు దుబాయ్‌లో ఉంటున్నాను. మంచి సినిమాకి అవకాశం వస్తే షూటింగ్ చేసి మళ్లీ వెళ్లిపోతాను. ఒక్కసారి మళ్లీ మేకప్ వేసుకుంటే బ్యాక్ ఆన్ ట్రాక్‌లా ఉండాలి. అంత మంచి క్యారెక్టర్ రావాలి. ఎందులో అయినా కాంప్రమైజ్ అవుతాను కానీ పాత్ర విషయంలో కాంప్రమైజ్ కాను. ఇప్పటికీ డబ్బింగ్ చెబుతున్నాను. మీ పిల్లలకు సినిమాల మీద ఆసక్తి ఉందా? ఉంది. కచ్చితంగా వస్తారు. ఇద్దరూ ఆరడుగుల పైనే ఉంటారు. హీరోలుగానే వస్తారు. ఈ ఏడాదిలోనే వద్దాం అనుకుంటున్నారు. దేవుడి దయ వల్ల మంచి బ్రేక్ రావాలి. వ్యక్తిగతంగా పెళ్లి విషయంలో చేదు అనుభవం ఎదురైంది. వృత్తిపరంగా ఏమైనా? కెరీర్‌వైజ్‌గా అలాంటిదేం లేదు. కానీ ఇప్పుడు కొందరు ఆర్టిస్టులు చేదుఅనుభవాలు ఎదురయ్యాయని చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బాధగా కూడా ఉంది. ఆ రోజుల్లో పని వాతావరణం ఎలా ఉండేది? ప్రతి ఒక్కరూ వేరేవాళ్లను గౌరవించుకునేవాళ్లం. షూటింగ్లో ఒక్కచోటే కూర్చునేవాళ్లం. ఇప్పుడు ఎవరి కార్‌వ్యాన్‌లో వాళ్లు ఉంటున్నారు. డబ్బింగ్ చెబుతూ ఇంకా ఇండస్ట్రీతో టచ్‌లోనే ఉన్నాను కాబట్టి ఈ మార్పులు తెలుస్తున్నాయి. మద్రాస్‌లో వాహినీ, ఏవీయం స్టూడియోస్‌లో ఎక్కువగా షూటింగ్స్ జరిగేవి. ఎవరి షూటింగ్లో వాళ్లు ఉన్నా లంచ్ టైమ్‌లో కలిసేవాళ్లం. శ్రీదేవి అమ్మగారైతే లంచ్ ప్రిపేర్ చేసి, దేవుడికి నైవేద్యం పెట్టి మా అందరికీ కలిపి ముద్దలు పెట్టేవారు. అంత బాగుండేవాళ్లం. మీకు వంట వచ్చా? షూటింగ్స్‌కు వండి తీసుకెళ్లిన సందర్భాలున్నాయా? బాగా వచ్చు. ‘అర్జున్’ సినిమా అప్పుడు బిర్యానీ చేశాను. దర్శకుడు గుణశేఖర్‌గారి దగ్గర ‘మధ్యాహ్నం ఆవిడను వదిలేయండి .. మనకు బిర్యానీ వండి పెడతారంట’ అని ప్రకాశ్ రాజ్‌గారు పర్మిషన్ ఇప్పించారు. మహేశ్ కూడా టేస్ట్ చేశారు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సావిత్రిగారు. సినిమాల్లోకి రాకముందు నేను ఆవిడ సినిమాలు ఎక్కువగా చూడలేదు. తమిళంలో పని చేసేటప్పుడు చాలామంది నన్ను ఆవిడతో పోల్చేవారు. సావిత్రిలా.. అంటూ నా గురించి రివ్యూస్‌లో రాసేవారు. దాంతో ఆవిడ సినిమాలన్నీ చూడటం మొదలెట్టాను. అప్పుడు ఆవిడ ఏ రేంజ్ యాక్టరో అర్థం అయింది. ఆమె అంత పేరు రాకపోయినా కొంచెం అయినా తెచ్చుకోవాలనుకునేదాన్ని. ఆవిడ లైఫ్‌ను చూసి మీరు నేర్చుకున్నదేంటి? ఆవిడ గురించి వినడమే తప్ప నేను సావిత్రిగారి జీవితాన్ని చూడలేదు. ‘గోరింటాకు’ సినిమాలో ఆమె చేసిన పాత్రకు డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమాలో ఆవిడ లుక్ మారిపోయింది. బాధ అనిపించింది. నటిగా, వ్యక్తిగా అద్భుతమైన మనిషి సావిత్రిగారు. కానీ ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆవిడ జీవితం తెలుసుకున్నాక ఈ విషయం నా మనసులో నాటుకుపోయింది. ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఎవరితో కష్టసుఖాలు షేర్ చేసుకుంటారు? నాకు అందరూ ఫ్రెండ్సే. ఆనందం, బాధ రెండూ నేనే పంచుకుంటాను. నా పెళ్లి విషయాలు షేర్ చేసుకోవడం సిగ్గనిపించింది. దేవుడున్నాడని నమ్ముతారా? కచ్చితంగా. ఏదో పవర్ ఉందని నమ్ముతాను. నేను సాయిబాబా భక్తురాలిని. మద్రాస్‌లో మైలాపూర్‌లో సాయిబాబా గుడి ఉంది. అక్కడకు తరచూ వెళ్లేదాన్ని. షిరిడీకి కూడా వెళుతుంటాను. కష్టాల్లో బాబా తోడుంటాడని నమ్ముతాను. ‘అర్జున్’లో విలనిజమ్ షేడ్ ఉన్న అత్త పాత్ర చేసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ చేయడానికి సంకోచించాను. ఆ తర్వాత ఆ టీమ్ నన్ను కన్విన్స్ చేసింది. మహేశ్‌బాబు, గుణశేఖర్గార్ల కాంబినేషన్ అంటే చిన్న విషయం కాదు. కథ, నా పాత్ర బాగుంటాయి. నటిగా నా పర్ఫార్మెన్స్ మీద నాకు నమ్మకం ఉంది. అయితే అంత బాగా విలనిజమ్ పండించగలనని ‘అర్జున్’ చేసిన తర్వాతే తెలిసింది (నవ్వుతూ). తమిళ సినిమా ‘అగ్ని సాక్షి’లో పాట పాడారు. ఆ తర్వాత సింగర్‌గా కంటిన్యూ కాలేదేం? నేను సింగర్‌ని అవుదామనుకున్నాను. అయితే ట్రైన్డ్ సింగర్ కాదు. అందుకే కంటిన్యూ కాలేదు. ఇప్పుడంటే పాటలో ఒకటీ రెండూ లైన్లు కూడా పాడిస్తున్నారు. అప్పుడు పాట అంటే ఫుల్ సాంగ్ పాడాల్సిందే. ఫైనల్లీ ఇప్పుడు మీకు మీరే అండ.. పిల్లలకు మీరే అండ. ఎలా ఉన్నారు? హెల్త్ బావుంటే అంతా సెట్ అవుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేవు. పాజిటివ్‌గా ఉంటాను. ఫైనాన్షియల్‌గా ఆహా ఓహో అని చెప్పను కానీ మాకు సరిపడినంత ఉన్నాయి. ఐయామ్ హ్యాపీ. – డి.జి. భవాని -
తొలి పంచ్ అదిరింది
న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సరిత దేవి, మనీషా శుభారంభం చేశారు. శుక్రవారం జరిగిన తొలి రౌండ్ బౌట్లలో వీరిద్దరు అలవోక విజయాలు సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 54 కేజీల విభాగంలో మనీషా 5–0తో క్రిస్టినా క్రుజ్ (అమెరికా)పై సంచలన విజయం సాధించగా... 60 కేజీల విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్ సరిత దేవి 4–0తో డయానా శాండ్రా బ్రగెర్ (స్విట్జర్లాండ్)ను ఓడించింది. ఆదివారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెల్లీ హెరింగ్టన్ (ఐర్లాండ్)తో సరిత, డీనా జోలామన్ (కజకిస్తాన్)తో మనీషా తలపడతారు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న హరియాణాకు చెందిన 20 ఏళ్ల మనీషా తన బౌట్లో ఆరంభం నుంచి ఆధిపత్యం చలాయించింది. గతంలో రెండుసార్లు ఈ మెగా ఈవెంట్లో కాంస్యాలు గెలిచిన 36 ఏళ్ల క్రుజ్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన మనీషా ఏకపక్ష విజయాన్ని దక్కించుకుంది. -
సింపుల్‌గా చెబితే వినవు... తోమాలి.. కొబ్బరిపీచుతో తోమాలి!
వాడిన గిన్నెలకు మకిలి ఎక్కువ.. చాలా జిడ్డుగా ఉంటాయి... మగాళ్లలాగే! సింపుల్‌గా చెబితే వినవు... తోమాలి... కొబ్బరి పీచుతో తోమాలి.. జిడ్డు వదిలేదాకా తోమాలి.. మీరు, మేము.. ‘‘మీ టూ .. మీ టూ’’ అంటూ జిడ్డు వదిలేదాకా తోమాలి.. సరిత (పేరు మార్చాం).. మహబూబ్‌నగర్ నుంచి పదిహేనేళ్ల కిందట హైదరాబాద్ వచ్చింది పని వెదుక్కుంటూ. అప్పటికే ఆమె భర్త చనిపోయి రెండేళ్లయింది. తమ ఊరినుంచే వలస వచ్చిన వాళ్లు ఓ అపార్ట్మెంట్లో పనికి పెట్టారు. ఆ ఓనర్ .. సర్కార్ ఉద్యోగి. భార్యా ఉద్యోగస్తురాలే వేరే ఊళ్లో. సో.. పనికి మాట్లాడుకున్న టర్మ్స్‌లో గిన్నెలు, బట్టలు, ఇల్లు ఊడ్వడం... తుడవడంతో పాటు వంట చేసిపెట్టాలి. ఒక నెల చేసేసరికి యజమాని పరిస్థితి బాగా అర్థమైంది సరితకు. ‘‘వంట చేస్తుంటే చడీచప్పుడు కాకుండా వచ్చి వెనకాలే నిలబడేవాడు. ఇల్లు ఊడ్వడం, తుడవడం నరకంగా ఉండేది. ఇట్లాంటివి నా దగ్గర కుదరవు సర్.. పని చేయమంటే చేస్తాను.. లేకపోతే లేదు అని గట్టిగా చెప్పిన. సారీ అన్నాడు. మామూలుగానే పనిచేసుకుంటూ వెళ్తున్నా. వారం తర్వాత మళ్లీ మునుపటి బుద్ధి చూపించబోయాడు.. ఈసారి వరండా తలుపు తీస్తూ గట్టిగా అరిచిన. ఆయన అపార్ట్మెంట్ లిఫ్ట్ ముందరే ఉంటది. లిఫ్ట్ ముందున్న వాళ్లంతా చూస్తుంటే వెనకాలే వచ్చిన ఆయన ‘‘డబ్బులు దొంగతనం చేసింది.. ఎందుకు అట్లా చేసినవ్ అని అడిగితే అరుస్తూ పారిపోతోంది’’ అని చెప్పినాడు. పనిమనుషులు ఇంతే.. ఎంత బాగా చూసుకున్నా బుద్ధిపోనిచ్చుకోరని తలో మాట అనిరి. ఏడ్చుకుంటూ పోయిన. అప్పటి నుంచి మగవాళ్లే ఉన్న ఇంట్లో పని చేస్తలేను. నేను కాదు దొంగను.. ఆ సారే దొంగ అని ఒర్రాలనిపించింది.. కాని నమ్ముతరా నా మాటను?’’ సరిత ప్రశ్న. నమ్మరు. కారణం.. పనిమనిషిగా ఇక్కడ ఆమె స్టేటస్... టోటల్‌గా స్త్రీగా సమాజంలో ఆమె స్థాయి! తరుణ్ తేజ్‌పాల్ ఇబ్బంది పెట్టిన అమ్మాయి దగ్గర్నుంచి తనుశ్రీ దత్తా మొదలు ప్రియారమణి వరకు... ఉద్యోగాల్లో వాళ్ల హోదా ఏదైనా.. సొసైటీలో స్టేటస్ ఒక్కటే.. మహిళ.. ది సెకండ్ సిటిజన్! అందుకనే వాళ్లు పెదవి విప్పగానే కోట్ల మెదళ్లు ప్రశ్నలను సంధించి పెడతాయి. వాళ్ల బాధ వినకుండానే. సోషల్ మీడియాలో జర్నలిస్ట్ ఉషా తురగ రేవెల్లి రాసినట్టు.. పాలవాడు నీళ్లు కలిపినా అడగం.. ట్రాఫిక్‌లో కాళ్లు తొక్కినా నోరుమెదపం.. వీధుల్లో డ్రైనేజ్ పారినా పట్టించుకోం.. మన ఓట్లు దొంగలించేసినా కిక్కురుమనం.. ఇలాంటి ఎన్నిటికో నోర్మూసుకోవడం అలవాటైన మనకు.. మహిళలు తమ బాధ చెప్పుకోగానే నోరుపారేసుకునే ధైర్యం భలే వస్తుంది. కారణం.. ఎగైన్ సెకండ్ సిటిజన్. అదిగో ఆ స్టేటస్ మార్చడానికి ‘మీ టూ’ ఉద్యమం ఒక మాధ్యమం కావాలి. అప్పుడే ఎందుకు చెప్పలేదు.. ఇప్పుడెందుకు చెప్తున్నారు... లాంటి క్వశ్చన్స్‌కి ఫుల్స్టాప్ పెట్టి ఇప్పుడైనా వినాలి. పనిమనుషులుగా ఇళ్లల్లో పనిచేస్తూ.. యజమానురాలు కాస్తంత చాటైతే చాలు యజమాని చూపులతో ‘రేప్’ అయిపోతూ.. ఆమె ఊళ్లో లేకపోతే అతను ఇంకా అడ్వాన్స్ అయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ... ఆర్థిక అవసరాలను తప్పించుకోలేక.. ఆ దాష్టీకాన్ని భరిస్తూ.. భర్తను ఏమీ అనలేక ఆ అసహనాన్ని పనిమనిషి మీద అనుమానంగా ప్రదర్శిస్తుంటే ఆ అవమానాన్ని దిగమింగుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న ‘మీ టూ’ వ్యథలు వేలల్లో ఉంటాయి అంటుంది రేణుక, హైదరాబాద్‌లోని డొమెస్టిక్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యురాలు. సోషల్ చేంజ్.. ‘‘బాధలు పడ్డ ఆడవాళ్లంతా బయటకు రావాలి.. వస్తేనే తెలుస్తుంది మగవాళ్లకు.. తామెంత హీనంగా ప్రవర్తిస్తున్నామో అని. అప్పుడే ఈ తరం మగపిల్లలు సిగ్గుపడ్తారు. ఇట్లా ఉండకూడదు అని తెలుసుకుంటారు. ఈ మార్పు చట్టాలతో కాదు.. పంచుకున్న బాధలతోనే వస్తుంది’’ అంటుంది కన్స్ట్రక్షన్ రంగానికి చెందిన మీ టూ బాధితురాలు శ్యామల (పేరు మార్చాం). పని ఇచ్చినందుకు ఆమె శరీరాన్ని కోరుకుంటాడు మేస్త్రీ. కుదరదు అంటే అక్కడే కాదు ఏ అడ్డ మీదా కూలీ లేకుండా చేయగలడు. అయినా వెరవక అలాంటి ఒక మేస్త్రీతో తలపడింది శ్యామల. ఫలితం.. ఆమె భర్తకు తాగించి శ్యామల క్యారెక్టర్‌ను అసాసినేట్ చేశాడు మేస్త్రీ. విషయం తెలుసుకుని విస్తుపోయిన శ్యామల మేస్త్రీ చెంప పగలగొడితే.. భర్తతో ఇంట్లోంచి గెంటేయించాడు.. అప్పుడైనా తన దారికి వస్తుందనే నమ్మకంతో. ‘‘ఇట్లాంటివి ఉంటాయి కాబట్టే... వెంటనే చెప్పడానికి భయపడ్తారు. మీ టూ.. ఆ భయం పోగొడ్తోంది.. ఒక ధైర్యం ఇస్తోంది’’ అంటోంది శ్యామల. నేనూ మీ టూ నేనా? స్మార్ట్ ఫోన్లో పాటలు వింటూ బిడీలు చూడుతోంది ప్రభావతి (ఇక్కడా పేరు మార్చాం). ఆమెది నిజామాబాద్ జిల్లాలోని ఓ పల్లె. ‘‘వాట్సప్ ఉందా?’’ అని అడిగితే ఉంది అన్నట్టుగా నవ్వింది. ‘‘మీ టూ గురించి ఏమైనా విన్నారా?’’.. ఈ ప్రశ్నకు స్మార్ట్ ఫోన్లో పాటలు ఆపేసి సీరియస్‌గా చూసింది. ‘‘మా గ్రుపులల్ల షేర్ అయితలేదు కాని.. నాకు తెల్సు దాని గురించి. మస్తు రోజుల్నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా.. కాని ఎవర్ని అడగాల్నో తెల్వలే. ఇప్పుడు అడగొచ్చా..’’ అంది. అడగొచ్చు అంటే.. ‘‘మస్తు ఏండ్లనాటి సంగతి. మా ఆడివిల్ల పెనిమిటి మస్కట్‌కి వోయిన కొత్తల.. గామె మా ఇంటికాడ్నే ఉంటుండే. నేను, మా ఆడివిల్ల ఇద్దరం బీడీలు జేసేటోళ్లం. సాయంత్ర కల్సే కార్ఖానాకు పోయేటోళ్లం. ఆకు, తంబాకు పోసేటోళ్ల కాడి నుంచి మేనేంజర్ (మేనేజర్) దాకా అందరు మా ఆడివిల్ల దిక్కు గదోరకంగా జూసేటోళ్లు. ఆకు ఏసేటోడైతే.. ఏమేమో పరాశకాలాడుతుండే.. మీ అన్న తాన ఎందుకున్నవ్? ఒక్కదానివుండాట్నంటే భయమా? పెనిమిటి లేడని బీరిపోకు.. నేనున్న గదా.. ?’ అనుకుంట ఆమె పానం దినేటోడు. ఆ మాటలిన్కుంట దినాం.. ఏడుస్తుండే. ‘‘అన్నకు జెప్పు’’ అని నేనంటే.. ‘‘చెప్తే.. లొల్లయితది.. మా అత్తగారోల్లకు దెలిస్తే.. నాదే తప్పంటరు.. లేనిపోని అనుమానాలు. పోనీ బీడీలు బంజేతామంటే ఆయన మస్కట్‌కి వోయిన అప్పెట్లా దీరేలే?’’ అని మస్తు బాధపడ్తుండే. పాపం పొల్ల.. అట్లనే ఎల్లదీసింది. గది గూడా మీ టూ కిందకే అస్తదా? గిస్మంటిది గప్పుడుంటే.. మంచిగుండు అనుకుంటున్నా.. తేపతేపకి యాదికస్తుంది’’ అని చెప్పింది ప్రభావతి. అన్ని చోట్లా ఉంది మీ టూ.. జర్నలిజానికో.. సినిమా ఫీల్డ్‌కో సంబంధించింది కాదు.. ఇంట్లో ఉంది.. బయటా ఉంది. అమ్మ, అక్క, చెల్లి దగ్గర్నుంచి ఏ సంబంధం లేని వాళ్ల దాకా ఆడవాళ్లందరూ ఏదో ఒక సందర్భంలో.. ఏదో ఒకరంగా మీ టూకి ట్యాగ్ అయినవాళ్లే... అవుతున్నవాళ్లే! కాబట్టి.. మీ టూని సపోర్ట్ చేయడానికి.. ఆ గళాలు ప్రపంచమంతా వినిపంచేలా చేయడానికి ఏ బంధం.. సంబంధం.. అనుబంధం అక్కర్లేదు. తోటి మనిషన్న కన్సర్న్ చాలు. ‘‘ఉమన్.. అనగానే సెక్సువల్ ఆబ్జెక్ట్గానే ఎందుకు చూస్తారు? ఆమె నో అంటే నో అనే అని ఎందుకు అర్ధం చేసుకోరు? ఈ విషయంలో మగవాళ్లను అవేర్ చేసేందుకు వచ్చిన గ్రేట్ మూవ్మెంట్ మీ టూ’’ అంటుంది బెంగుళూరుకు చెందిన అనూష అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇలాంటి తలనొప్పులు ఎందుకు అని ఆడవాళ్లను మళ్లీ నాలుగు గోడలకే పరిమితం చేసే ప్రమాదమూ రావచ్చు. కాని.. ఉత్పత్తిలో మహిళలకూ సమభాగస్వామ్యం ఇచ్చింది ప్రకృతి. ఆ ధర్మాన్ని ధిక్కరిస్తే.... ఈ ఖాళీకి పూరణ ఉండదేమో! ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం. పురుషుడితో పాటు స్త్రీకి సమాన హోదా ఉంది. అది గ్రహించి అర్థం చేసుకునే చారిత్రక అవకాశం ఇది. మనల్ని మనం మార్చుకుందాం. పట్టుకున్న జిడ్డు వదులించుకుందాం! పరివర్తన చెందడమే కదా నాగరికత అంటే! ఎవరంటారు? స్త్రీకే స్త్రీయే శత్రువు అని? ప్రభావతి మాటలు విన్నాక కూడా. ఈ ఉద్యమం చూశాక అయితే ఆ నానుడి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఒకవేళ ఈ ఉద్యమంలో ఎవరైనా మహిళలు నిందిత పురుషుల గురించి వాళ్లు వాళ్ల ఫీల్డ్స్‌లో లెజెండ్స్ అని సపోర్ట్ చేస్తున్నా... ‘‘సో వాట్? ఎమ్జే అక్బర్ గొప్ప కాలమిస్ట్ కావచ్చు.. వినోద్ దువా సక్సెస్ఫుల్ ఎడిటర్ కావచ్చు.. వికాస్ భల్ క్రియేటివ్ డైరెక్టర్ కావచ్చు... చేతన్ భగత్ పాపులర్ రైటర్ కావచ్చు.. సో వాట్? గొప్పవాళ్లు కాబట్టి తమతో కలిసి పనిచేస్తున్న ఆడవాళ్లతో ఇష్టానుసారంగా ప్రవర్తించొచ్చా? వాళ్ల పేరుకు ముందున్న ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్తో మాకేంటి? వాటితో వాళ్ల సెక్సువల్ మిస్కాండక్ట్ను ఇగ్నోర్ చేయలేం ... చేయం’’ అని బర్ఖాదత్ లాంటి వాళ్లు పవర్ఫుల్ ఆన్సర్ ఇస్తున్నారు. – సరస్వతి రమ -
సరిహిత
పోలిసింగ్, పేరెంటింగ్.. రెండూ టఫ్ జాబ్స్. ఈ రెండు జాబ్స్‌నీ ఎంతో ఇష్టంగా చేస్తున్నారు సరిత! హ్యూమన్ టచ్‌తో ఎంత టఫ్ జాబ్‌నైనా డీల్ చెయ్యొచ్చంటారు ఈ పోలీస్ ఆఫీసర్. అంటే.. క్రైమ్ వెనుక వ్యథను తాకి చూస్తారు.పిల్లలకు హృదయాన్ని తాకేలా కథను చెప్తారు. హితవు పలుకుతారు. పాండవులు వనవాసం చేస్తున్నప్పడు ఒకరోజు నకులసహదేవులు ఇద్దరూ వాకింగ్‌కి బయలుదేరుతారు. వెళ్తుంటే ఒక అందమైన గుర్రం కనిపిస్తుంది. ‘‘ఎన్నో గుర్రాలను చూశాం.. కాని ఇలాంటి గుర్రాన్ని చూడలేదెన్నడు. ఎలాగైనా దీన్ని సొంతం చేసుకోవాలి’’ అని అనుకుంటూ ఆ గుర్రం ఆసామి దగ్గరకు వెళ్తారు. ఆ గుర్రం కావాలి అని అడుగుతారు. ‘‘ఈ గుర్రం సొంతం చేసుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’’ అంటాడు ఆ ఆసామి. ‘‘ఓ దానికేం.. చెప్తాం’’ అంటారు అన్నదమ్ములిద్దరూ. తమ జ్ఞానసముపార్జన మీదున్న నమ్మకంతో. ‘‘ఇక్కడ అయిదు చిన్న చెరువులు, ఒక పెద్ద చెరువు ఉంది. పెద్ద చెరువులోని నీళ్లతో చిన్న చెరువులను నింపొచ్చు. కాని చిన్న చెరువుల నీళ్లతో పెద్ద చెరువును నింపలేం. ఎందుకు?’’ అని అడుగుతాడు ఆసామి. ‘‘ఏముంది.. పెద్ద చెరువు లోతెక్కువుండి ఉంటుంది’’ అని, ‘‘పెద్ద చెరువులో మట్టి నీటిని బాగా పీల్చుకుంటుందేమో’’నని.. రకరకాల జవాబులు చెప్పసాగారు వాళ్ల జ్ఞానానికి తోచినట్టు. ఆ సమాధానాలకు సంతృప్తిపడలేదు ఆసామి. నకులసహదేవుల కంటే పెద్దయిన అర్జునుడు వచ్చాడు ఆన్సర్ చెప్పడానికి. అతని జవాబూ సరికాదు అన్నాడు గుర్రం యజమాని. భీముడు వచ్చాడు. చెప్పాడు. పెదవి విరిచాడు ఆసామి. అతనికి ధర్మరాజే సరైన జవాబివ్వగలడని అగ్రజుడిని పిలిపించారు. ప్చ్.. ధర్మరాజు సమాధానమూ తప్పే. హతవిధీ అనుకున్నారు పంచపాండవులు. అప్పుడు చెప్పాడు ఆసామి.. ‘‘ఈ పెద్ద చెరువు మన తల్లిదండ్రుల్లాంటిది. తతిమావన్నీ పిల్ల చెరువులు. తల్లిదండ్రుల ప్రేమ అనంతం.. ఎంత తోడుకున్నా.. ఇంకా ఊరుతూనే ఉంటుంది. వాళ్ల రుణం తీర్చుకోలేనిది. అందుకే పిల్ల చెరువులు ఖాళీ అయినా పెద్ద చెరువు నిండదు’’ అని చెప్తాడు ఆసామి. ఈ కథ ఇప్పుడు వాట్సప్‌లో వైరల్. ఆ కథ చెప్పిన ఆవిడ పేరు కేజీవి సరిత. ఆంధ్రప్రదేశ్ విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇన్చార్జ్ ఎస్పిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్న చిన్న కథలతో పిల్లలను ఇలా మోటివేట్ చేయడం ఆమెకు ఇష్టం. నేరం జరిగాక విచారించడం కన్నా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నమ్ముతారు. ఆ విశ్వాసాన్ని ప్రాక్టీస్‌లో కూడా పెడ్తారు. అందులో భాగమే ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్. కొంచెం వీలు చిక్కినా దగ్గర్లో ఉన్న బడికి వెళ్లి పిల్లలకు తను నేర్చుకున్న జీవన సత్యాలను చెప్తుంటారు. తన వృత్తిలో ఎదురైన సంఘటనల తాలూకు సారాన్ని పాఠంగా మలిచి వివరిస్తుంటారు.‘‘పిలల్లు భవిష్యత్ నిర్మాతలు. వాళ్లు ఆరోగ్యంగా ఆలోచిస్తే భావి భారతమూ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే పిల్లలకే చెప్తాను’’ అంటారు సరిత. కానిస్టేబుల్ కూతురు సరిత పుట్టిపెరిగింది విజయవాడలో. తండ్రి సీతారామయ్య. రిటైర్డ్ స»Œ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సరిత పుట్టినప్పుడు కానిస్టేబులే. ‘‘నేను కానిస్టేబుల్ కూతురిని’’ అని గర్వంగా చెప్తుంటారు సరిత. తల్లి సీతారత్నం. ఎమ్మే సోషియాలజీ చేశారు. గృహిణి. కాని ఆధునిక ఆలోచనలున్న అమ్మ. ‘‘మా అమ్మది బ్రాడర్ అవుట్‌లుక్. ఆడపిల్లలు కూడా చదవాలి, అని నాన్నకు చెప్పి నన్ను బాగా చదివించింది. నా మీద అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. నాకు ఆమె ఇన్స్పిరేషన్ కూడా’’ అని అమ్మ గురించీ అంతే గొప్పగా ఫీలవుతారు సరిత. సీతారత్నం పుస్తకాలు బాగా చదివేవారట. ముఖ్యంగా నవలలు. వాటి ప్రభావంతోనే కూతురు ఇండిపెండెంట్‌గా ఉండాలని కోరుకునేవారు. అమ్మాయిని ఐఏఎస్ చేయాలని అనుకున్నారు. అందుకే అంతగా ఆర్థికస్థోమత లేకపోయినా కూతురుని మంచి స్కూల్లో చేర్పించారు.అంతే మంచి కాలేజ్‌లో చదివించారు. వాళ్లమ్మ వల్ల సరితా కలెక్టర్ కావాలనే గోల్ పెట్టుకున్నారు చిన్నప్పుడే. ఆరో క్లాస్‌లో ఉన్నప్పుడే ‘‘పెద్దయ్యాక ఏమవుతావ్?’’ అని ఎవరైనా అడగగానే.. టక్కున ‘‘కలెక్టర్ అవుతా’’ అని చెప్పేవారట. అన్నట్టుగానే డిగ్రీ అయ్యాక సివిల్స్ రాశారు. కాని రాలేదు. గ్రూప్ వన్‌లో డీఎస్పీగా వచ్చింది. ‘‘పోలీస్ అంటే చాలా హార్డ్ జాబ్. నువ్వు చాలా సెన్సిటివ్. నీకు సరిపడదు వద్దులే’’ అని తండ్రి అనడంతో ఊరుకున్నారు సరిత. అయితే తనలో ఆశ చావక మళ్లీ సివిల్స్ రాశారు. రాలేదు. ఈలోపు పెళ్లియింది. (భర్త.. కోటేశ్వరరావు, అడ్వకేట్, విజయవాడ). ఒక కొడుకు కూడా పుట్టాడు. ఈసారి గ్రూప్స్రాశారు. మళ్లీ డీఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. ఆ రిజల్ట్స్ వచ్చేటప్పటికి రెండో బిడ్డతో ప్రెగ్నెంట్. ఈసారి తండ్రి వారించలేదు. ‘‘కిందటిసారే తప్పు చేశాను నిన్ను ఆపి. ఈ సారి ఆ తప్పు చేయను’’ అని ప్రోత్సహించారు. సర్వీస్‌లో జాయిన్ అయ్యారు సరిత. సివిల్స్ రాలేదని నిరుత్సాహ పడలేదు. ‘‘నేను దేనికీ రిగ్రెట్స్ ఫీల్ కాను. నాకు అందిన దానిపట్ల నిజాయితీగా ఉంటాను. హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడ్తాను’’ అంటారు సరిత. పెరుగుతున్న నేరాలు ‘‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2015 నుంచి నేరాల రేటు ఎక్కువవుతోందని తేలింది. 15 శాతం పెరిగింది. అన్నీ ఆడవాళ్ల మీద జరుగుతున్నవే. వీటిల్లో తెలిసిన వాళ్లు చేస్తున్న నేరాలే ఎక్కువ. అంటే కుటుంబంలో, లేదంటే ప్రేమ పేరుతో జరుగుతున్నవి అన్నమాట. నేరాలు పెరగడానికి సాంకేతిక అభివృద్ధి కూడా ఒక కారణం. టెక్నాలాజికల్ డెవలప్మెంట్ను బెస్ట్ యూజ్‌కి కాకుండా వరెస్ట్ యూజ్‌కే వాడుకుంటున్నాం. రంగురాళ్ల వేటలో పడి మేలిమి వజ్రాలను వదులుకుంటున్నాం. టెక్నాలజీ అవసరమే కాని ఎంత వరకు? నాకూ ఇద్దరు మగపిల్లలు. ఆరేడు తరగతుల్లోనే వాళ్లకు సెల్ఫోన్స్ఉన్నాయి. నెట్ కనెక్షనూ ఉంది. క్రికెట్ చూడ్డం కోసం, కార్టూన్స్ చూడ్డం కోసం కావాలంటారు. అవి చూస్తుంటే పక్కన అవసరంలేనివి చాలా కనిపిస్తుంటాయి. వాటిని క్లిక్ చేస్తే మెదడులోకి ఏ చెత్త వెళ్తుందో నా పిల్లలకు చెప్తాను. మళ్లీ మన దగ్గర సెక్స్ ఎడ్యుకేషన్ అంటే తప్పుగా అనుకుంటారు. అదొక రిప్రొడక్టివ్ సిస్టమ్‌కు సంబంధించిన సైన్స్ అని అనుకోరు. అలా అనుకోక, వాటి గురించి పరిజ్ఞానం ఇవ్వకపోవడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయి. క్రైమ్కీ అదే కారణం. ఈ రోజు ప్రేమించారని హత్యలు జరిగినా.. ప్రేమించలేదని అటాక్స్ జరిగినా ఇలాంటి రీజన్సే. పొసెసివ్‌నెస్ కారణం. పిల్లల పట్ల తల్లిదండ్రులకు, అమ్మాయి పట్ల అబ్బాయికి ఉన్న పొసెసివ్‌నెస్. పిల్లలు మన బాధ్యత ప్రాపర్టీ కాదు. పిల్లలకూ టీన్స్ జరిగే హార్మోనల్ చేంజెస్‌కి, జీవితంలో స్థిరపడ్డాక అంటే సామాజికంగా, ఆర్థికంగా ఇండిపెండెంట్ అయ్యాక ఏర్పడే అభిప్రాయాలకు మధ్య ఉన్న తేడాను చెప్పగలగాలి. ఆ ఇండిపెండెన్స్ సాధించడానికి చదువు ఎంత ముఖ్యమో చెప్పాలి. చదువుతోపాటు మానవసంబంధాల గొప్పదనాన్ని, విలువనూ వివరించాలి. ఇవ్వాళ్టి పిల్లలకు రోల్ క్లారిటీ ఉండాలి.. అంటే తమ మీద తమకు స్పష్టత ఉండాలి. అలాగే గోల్ క్లారిటీ ఉండాలి. ఏం సాధించదల్చుకున్నారో తెలిసుండాలి. సమాజంలో తను ఎలా ఉండాలి? తను సమాజం ఎలా ఉంటున్నాడో ఎరిగి ఉండాలి. కలలు కనాలి.. సాధించుకునే సత్తా తెచ్చుకోవాలి. స్పర్శ కోల్పోతున్నాం నాకనిపిస్తుంది మనం స్పర్శ కోల్పోతున్నామేమోనని. నా పిల్లలిద్దరికీ చిన్నప్పుడు నా చేయి లిక్ చేసే అలవాటు ఉండేది. మా బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్లు.. ‘‘ఒరేయ్ నా చేయి పట్టుకోరేమర్రా’’ అని వాళ్లు సరదాకి అడిగినా.. ‘‘నీ దగ్గర మమ్మీ స్మెల్ రాదు’’ అని చెప్పేవాళ్లు. స్పర్శ అంత ప్రభావం చూపిస్తుంది. టచ్ కోల్పోవడం వల్ల ఇంటర్‌పర్సనల్ రిలేషన్స్‌ని కోల్పోతున్నాం. సెన్సిటివిటీ పోయి భయం పెరిగింది. భరోసా తగ్గింది. అదే చెడు పరిణామాలకు దారితీçస్తుంది. ఇవన్నిటికీ ఇంకో కారణం.. పేరెంట్స్ రోల్ తగ్గిపోవడం. డ్యూ టు బిజీనెస్. ఇలాంటప్పుడే టీచర్ రోల్, పోలీస్ రోల్ పెరగాలి. క్రైమ్ ప్రివెన్షన్‌ను సోషల్ రెస్పాన్స్బిలిటీగా తీసుకోవాలి’’ అంటారు కేజీవీ సరిత. యూనిఫామ్.. ఒక ఇన్స్పిరేషన్ ఇప్పటి తెలంగాణ (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) లోని నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో డీఎస్పీగా ఫస్ట్ పోస్టింగ్. అక్కడే ప్రారంభించారు ఆమె... క్రైమ్ ప్రివెన్షన్ మెథడ్స్‌ను. తన జ్యూరిస్ డిక్షన్లోని సర్కారు బడులన్నిటికీ వెళ్లారు. ప్రతి సోషల్వెల్ఫేర్ హాస్టల్‌కూ వెళ్లారు. ‘‘నేరస్తులను పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో పోలీస్‌గా నా డ్యూటీ అయిపోతుంది. కాని మళ్లీ మళ్లీ నేరాలు జరక్కుండా ఆపాలి. అంటే నేరం వెనకున్న ఆర్థిక, సామాజిక కోణాలు పరిశీలించాలి. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. నేరం జరక్కుండా ఆపగలిగే జాగ్రత్త అదే. వాటిని పిల్లలకు చెప్పాలి. అదీ నా అసలైన డ్యూటీ. యూనిఫామ్‌లో అడ్రస్ చేస్తే పిల్లలు ఇన్స్పైర్ అవుతారు’’ అంటారు సరిత. ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు అవేర్నెస్ క్యాంప్స్ కూడా నిర్వహించారు. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ పోటీలు పెట్టేవారు. క్రిస్మస్, న్యూ ఇయర్ హాస్టల్స్‌లో, స్కూళ్లల్లో పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసేవారు. ఐ డొనేషన్ క్యాంప్స్ పెట్టేవారు. వరంగల్, ఏలూరు, గుంటూరు .. ఇలా ఏ పట్టణం వెళ్లినా ఆ పద్ధతినే అనుసరించారు. పిల్లలు, మహిళలను చైతన్యపరచాలనేదే ఆమె ధ్యేయం. పిల్లలంటే అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉండాలి. ‘‘ఏ స్కూల్ వాళ్లయినా, కాలేజ్ వాళ్లయినా కేవలం అమ్మాయిలనే కూర్చోబెట్టి చెప్పండి అంటే నేను చెప్పకపోయేదాన్ని. ఏ.. అబ్బాయిలు నేర్చుకోనక్కర్లేదా? అసలు అబ్బాయిలే ఎక్కువ నేర్చుకోవాలి అని అబ్బాయిలనూ పిలిపించేదాన్ని. ఇప్పటికీ పిలిపిస్తాను కూడా’’ అంటారు సరిత. – సరస్వతి రమ -
బస్ డ్రైవర్‌గా అవకాశం ఇవ్వండి
మంత్రి మహేందర్‌రెడ్డిని కోరిన ‘ఢిల్లీ డ్రైవర్’ సరిత సాక్షి, హైదరాబాద్: సరిత.. ఢిల్లీ మహా నగర బస్సు డ్రైవర్! సంస్థాన్ నారాయణ పురం సమీపంలోని సీతియా తండాకు చెందిన ఆమెది నిరుపేద కుటుంబం. ఐదుగురు అక్కాచెల్లెళ్లు. దీంతో హైదరాబాద్ వచ్చి బస్ డ్రైవింగ్ నేర్చుకుంది. 2011 లో ఢిల్లీవెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా చేసింది. ఇప్పు డామె హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కావాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చింది. సీఎం బిజీగా ఉండటంతో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డిని కలసి.. తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్ పోస్టు ఇవ్వాలని కోరింది. మహిళా డ్రైవర్‌గా సరితకు తప్పకుండా ప్రాధాన్యమిస్తామని మంత్రి చెప్పారు. షీక్యాబ్ నడుపుతానంటే ఆమెకు కారు కేటాయిస్తామన్నారు. -
న్యాయం జరిగేవరకూ పోరాటమే!
‘‘బాలు మహేంద్ర దర్శకత్వంలో జయరామ్, సరిత జంటగా నటించిన తమిళ సినిమా ‘జూలీ గణపతి’ని తెలుగులో రీమేక్ చేయాలని డబ్బింగ్, రీమేక్ రైట్స్ కొన్నాను. మా కథను చోరీ చేసి ‘చారుశీల’ తీశారు’’ అని ప్రణతి క్రియేషన్స్ అధినేత కూనిరెడ్డి శ్రీనివాస్ ‘చారుశీల’ బృందంపై ఆరోపణలు చేశారు. ఆధారాలతో సహా ‘చారుశీల’ దర్శక-నిర్మాతలను సంప్రదించగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ - ‘‘స్టార్ ఆర్టిస్టులతో రీమేక్ చేయాలని డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయలేదు. ‘శూర్పణక’ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించా. మేలో ‘చారుశీల’ స్టిల్స్ చూడగా సందేహం కలిగింది. చిత్ర నిర్మాత సాగర్‌గారిని సంప్రదిస్తే, ఫస్ట్ కాపీ వచ్చాక చూద్దామన్నారు. ట్రైలర్ అయితే మక్కీకి మక్కీ కాపీ. వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించా. ఇంతలో ఈ నెల 18న ‘చారుశీల’ విడుదల అని ప్రకటించారు. బయ్యర్లకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ప్రెస్‌మీట్ పెట్టాను. న్యాయం జరిగే వరకూ పోరాడతాను’’ అని చెప్పారు. -
భార్యతో సంబంధం పెట్టుకున్నాడని..
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని గొడ్డలితో నరికి చంపిన సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.వివరాలు..స్థానికంగా నివాసముంటున్న బొంతురాజు తవేరా వాహనాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో రాజు భార్య సరిత ఇంటి పక్కన నివాసముంటున్న ఉప్పుల నగేష్(28)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసన రాజు పలుమార్లు ఇద్దరిని హెచ్చరించాడు. తీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పిన పెడచెవిన పెట్టడంతో.. మనస్తాపానికి గురైన రాజు తన తమ్ముడితో కలిసి బుధవారం రాత్రి నగేష్ ఇంట్లోకి వె ళ్లి నిద్రిస్తున్న అతని కళ్లలో కారం చల్లి గొడ్డలితో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారిలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఆగని ఆడశిశు హత్యలు
ఇద్దరు ఆడ కవలలు పుట్టారని ఒక పాపను గొంతు కోసి చంపిన విషయం నెల్లికుదురు మండలం వావిలాల శివారు మద్దు తండాలోబుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండాకు చెందిన వాంకుడొతూ బాలాజీ, సరితలకు ముగ్గురు సంతానం. మొదటి సంతానంగా బాబు పుట్టగా, రెండో సంతానంగా కవల ఆడ పిల్లలు పుట్టారు. దీంతో ఆవేదన చెందిన తండ్రి ఒక పాపను గొంతు కోసి చంపి పూడ్చిపెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సరితను విచారించారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపుల తో వివాహిత ఆత్మహత్య
భర్త వేధింపులు తాళలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మారేపల్లి సాయిరెడ్డి, సరిత దంపతులు దూలపల్లి వీకర్‌సెక్షన్ కాలనీలో ఉంటున్నారు. కిరాణా దుకాణం నడిపే సాయిరెడ్డి కొంతకాలంగా భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. జీవితంపై విరక్తి చెందిన సరిత బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సాయిరెడ్డిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ చరిత్ర
అగాథంలోకి తొంగి చూస్తే? లోతైన ప్రేమ కనబడుతుంది. పర్వతాలెక్కి పిలిస్తే? ప్రేమ ప్రతిధ్వనిస్తుంది. షరతులతో సంకెళ్లేస్తే? ప్రేమ పట్టరానిదైపోతుంది. కాంక్షలతో కాటేస్తే? కక్షలతో చంపేస్తే? ప్రేమ... మరో చరిత్ర అవుతుంది. ఇలాంటి సినిమా చూడకపోతే? ప్రేమ... భవసాగరంలో కొట్టుకుపోతుంది... బాలు, స్వప్నల స్వప్నంలా..! ప్రేమ ఫలించిందంటే ఏమిటి అర్థం? కథ అయిందనా? చరిత్ర అయిందనా? రెండూ కాదు. నిజం అయిందని! కానీ కమల్, సరితల ప్రేమ నిజం కాలేదు. అంటే వాళ్ల ప్రేమ ఫలించలేదా? ఫలించింది. వాళ్ల ఆత్మలు ఇంకా వైజాగ్ బీచ్ కోటలో కలిసే ఉన్నాయి. ఆత్మలా? మనుషుల్లేరా! ఉన్నారు. ఇప్పుడున్న ప్రేమికులందరి ఆత్మలే ఆ ఇద్దరు. అవునూ... ఇప్పుడూ మనం ఇలా శిథిలాల్లో తిరుగుతున్నాం ఎందుకు స్వప్నా? (కమల్ ఆత్మ) ఈ శిథిలాల వెనుక ఎన్నో కథలుంటాయ్. చిరిగిపోయిన చరిత్ర పుటలు ఎంత చిందరవందరగా పడున్నా శాశ్వతంగా గుర్తుంటాయ్. బాలూ... (సరిత ఆత్మ)స్వప్నా... మనం పెళ్లి చేసుకోకూడదు. ఏ బాలూ...? ప్రేమంతా అయిపోయిందా? ప్చ్... కాదు. పెళ్లి చేసుకుంటే అందరిలా మనం కూడా ఆలుమగలుగా మిగిలిపోతాం? ప్రేమ ఫలించకపోతేనే కథానాయకులమవుతాం. మనది కథెందుకు కావాలి? చరిత్ర కాకూడదా? సరిత విశాఖ విమెన్స్ కాలేజీలో చదువుతోంది. కమల్ ఉద్యోగం మానేసి మద్రాస్ నుండి వైజాగ్ వచ్చేశాడు.ఇద్దరివీ పక్కపక్క ఇళ్లు. కమల్‌ది తమిళ ఫ్యామిలీ. సరితది తెలుగు ఫ్యామిలీ. కమల్‌ది వెజ్ ఫ్యామిలీ. సరితది నాన్‌వెజ్ ఫ్యామిలీ. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరి తల్లిదండ్రులూ డైనమైట్లా పేలారు! ఇద్దర్నీ విడివిడిగా కూర్చోబెట్టి, నిలబెట్టి వంద ప్రశ్నలు వేశారు. ఇద్దరిదీ ఒకటే మాట... మేము ప్రేమించుకున్నాం. మేము ప్రేమించుకున్నాం. ఓ రోజు కమల్ డెరైక్టుగా సరిత ఇంటికే వచ్చేశాడు. సరితను కౌగిలించుకుని ‘ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ విడదీయలేరు’ అన్నాడు. రెండు కుటుంబాల మధ్య పచ్చటి ప్రేమ భగ్గుమంది.రెండు వైపుల పెద్దలూ సమావేశమయ్యారు. ఇక్కడ కమల్ తల్లి సాఫ్ట్. అక్కడ సరిత తండ్రి సాఫ్ట్. కానీ ఇక్కడి తండ్రి, అక్కడి తల్లి ధాటికి ఆ సాఫ్ట్‌నెస్ వర్కవుట్ కాలేదు. పెద్దలకు, పిల్లలకు మధ్య ప్రేమయుద్ధం మొదలైంది. మేం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటాం. మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాం. (కమల్)అందరూ మాకన్నా వయసులో, అనుభవంలో పెద్దవాళ్లు. ఒక్కరూ మా మనసులేమిటో అర్థం చేసుకోరే! (సరిత) పెద్దవాళ్లని గౌరవిస్తున్నాం కదా. అందుకే (కమల్) ఎవరికీ తెలియకుండా బాలు నన్ను లేవదీసుకుపోతే ఏం చేసేవారేం? ఆన్సర్ హర్ (కోపంగా పైకి లేవబోయిన తండ్రితో కమల్). మేమేం చేసినా హద్దులు... హద్దులు దాటి ప్రవర్తించలేదు. దాటితే అప్పుడు నోరు మూసుకుంటారే! కమల్ తండ్రి జె.వి.రమణమూర్తి ఆవేశంగా అరిచాడు. ‘‘వాయి మూడ్రా భడవా... బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాడు.. మాంసం తినే పిల్లను పెళ్లి చేసుకుంటాట్ట. సిగ్గు లేదు. సిగ్గు’’. నేను మాంసం, చేపలు మానేస్తాను అంది సరిత. ఓహో అది గొప్ప త్యాగమా అంది సరిత తల్లి. అదే త్యాగం కాకపోతే నేను మాంసం తింటాను అన్నాడు కమల్.శివ శివా అన్నాడు కమల్ తండ్రి. ఇదంతా కావాలని ఈ అరవోళ్లు చేస్తున్న కుట్ర. అదేదో సామెత చెప్పినట్టు... ఎక్కడో చెన్నపట్నం నుంచి వలస వచ్చినోడికి మా అమ్మాయిని కట్టబెడతామా? ఏం.. తెలుగుదేశం గొడ్డుబోయిందా? (సరిత తల్లి) మీకు భాష మాత్రమే అభ్యంతరమైతే... ఒక్కనెల గడువివ్వండి. మీ తెలుగులో మీకే పాఠాలు చెప్తాను. కవిత్వాలు రాస్తాను. పొయెట్రీ. జస్ట్ వన్ మంత్ (కమల్)రాస్తావ్ అబ్బాయ్ రాస్తావ్. మా నెత్తిన పేడ రాస్తావ్. అందుకే కన్నారు మీ అమ్మా అబ్బా. (సరిత తల్లి) చూడండి... వాళ్లు సరే చిన్నవాళ్లు. మనమైనా కాస్త పెద్ద తరహాగా వ్యవహరించకపోతే ఎలా? వాళ్లిద్దరూ ఒకళ్లనొకళ్లు ప్రేమించుకున్నాం అంటున్నారు. ఇప్పుడు మనమేం చేయాలో అది ముందు ఆలోచించండి. (కమల్ తల్లి) ఏం చేయవలెనా? ముందా చెయ్యి తియ్యమనండి. (కమల్ సరిత చెయ్యి పట్టుకుని ఉంటాడు) అంద కయ్యిడరా. ఈ వయసులో ప్రేమయే! ప్రేమ! వ్యామోహం ద. బలుపు. (కమల్ తండ్రి) వాదన ఆగట్లేదు. ఇదంతా ఎందుకండీ... మాది నిజమైన ప్రేమే అని తెలియజేయడానికి ఏం చెయ్యమంటారో చెప్పండి. చేస్తాం అంది సరిత. ఊ... చూడండీ... మీరెవరూ ఏమీ అనుకోనంటే... నేనొక మాట చెప్తాను. ఒక సంవత్సరం పాటు వాళ్లిద్దర్నీ వేరు చేసి చూడండి. ఆ తర్వాత కూడా వాళ్లు పరస్పరం కోరుకుంటే... అది నిజంగా ప్రేమే. వ్యామోహం కాదు అన్నాడు మధ్యవర్తి. కమల్ ఇంటి ఓనర్. అయితే అప్పుడు పెళ్లి చేయవాలా? పోవయ్యా.. నూరు సంవత్సరమైనా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. అదెల్లా ముడియాదు. (కమల్ తండ్రి). ముడియాదు అనడానికి మీరెవరండీ. నేను చెప్తున్నాను. ఈ సంబంధం నాకు ముడియాదు. ఈ జగన్నాథానికేం (మధ్యవర్తి) పోయింది. పిల్లా పీచా.. నోటికొచ్చినట్టు వాగుతాడు. (సరిత తల్లి)అలా తోసి పారేయకండి. కాస్త ఆలోచించండి. (కమల్ తల్లి) సరిత తండ్రి ఆలోచనలో పడ్డాడు. అవునే. ఆయనజెప్పిందీ కాస్త సబబుగానే ఉన్నట్టుంది. అన్నాడు. ఏం బాలూ అంది కమల్ తల్లి. ఎదుక్కుమా ఇదెల్లా.. ఏదో పెద్ద అగ్ని పరీక్ష లాగా. యూ... యూసీ... మేము ఒప్పుకోం (కమల్) పోనీ ఒప్పుకుందాం బాలూ. వీళ్ల పరీక్షలకు మనం దడిసిపోతామా? ఏం చేసినా మన మనసులు మారవ్. నాకా నమ్మకం ఉంది అంది సరిత. ఊ.. అయితే అన్నాళ్లు ఒకర్నొకరు చూసుకోకూడదు. మాట్లాడకూడదు. ఉత్తరాలు కూడా రాసుకోకూడదు. (సరిత తల్లి) ఆ.. అసలు ఇద్దరూ ఒక ఊర్లోనే ఉండకూడదు. వాణ్ణి హైద్రాబాద్ పంపిస్తున్నాను. (కమల్ తండ్రి) అగ్రిమెంట్ అయింది. కమల్, సరిత విడిపోయారు. కమల్ హైదరాబాద్‌లో. సరిత వైజాగ్‌లో. ఏడాది వరకు వీళ్లు కలుసుకోడానికి వీల్లేదు. డెడ్‌లైన్... డిసెంబర్ 19, 1977. ఈలోపు కలుసుకుంటే ప్రేమ రద్దు. అక్కడ హైదరాబాద్‌లో కమల్‌కి ఎవరైనా ‘కావ్యం’ అంటే సరిత గుర్తుకొస్తోంది. ‘వెన్నెల’ అంటే సరిత గుర్తుకొస్తోంది. ఇక్కడ విశాఖపట్నంలో సరిత... కమల్ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతోంది. అక్కడ కమల్‌కి మాధవి పరిచయం అయింది. మాధవియంగ్ విడో. కమల్‌కి తెలుగు నేర్పిస్తోంది. డాన్స్ నేర్పిస్తోంది. ఇక్కడ సరితకు బావ టార్చర్ మొదలైంది. కమల్ ప్రతి జ్ఞాపకాన్నీ తుడిచేసి, తన తమ్ముడు మిశ్రోకి ఇచ్చి పెళ్లి చేసేందుకు సరిత తల్లే ఆ బావని రప్పించింది. సరితకు ఇంకో టార్చర్.. అమెపై కన్నేసిన బుక్‌షాప్ ఓనర్. అవకాశం కోసం కాచుక్కూర్చున్న కామాంధుడు అతడు. రోజులు గడుస్తున్నాయి. కమల్, సరితల ప్రేమకు ఒక్కోరోజు ఒక్కో పరీక్ష ఎదురౌతోంది. కమల్ నెగ్గుతున్నాడు. సరిత నెగ్గుతోంది. కానీ ఓ రోజు కమల్ ఓడిపోయినంత పని చేశాడు! జూలాజికల్ ఎక్స్కర్షన్ కోసం వైజాగ్ నుండి సరిత, ఆఫీస్ ఇన్స్పెక్షన్ కోసం హైదరాబాద్ నుండి కమల్ కాకినాడ వెళ్లారు. ఓ రెస్టారెంట్లో దిగారు. అనుకోకుండా ఇద్దరివీ పక్కపక్క గదులు. సరితకు తెలీకుండా ఆమె బావ కూడా ఆమెను ఫాలో అయి వచ్చాడు. సరిత ఆశ్చర్యపోయింది. తనపై నిఘా పెట్టినందుకు తల్లిని తిట్టుకుంది. ఇక్కడే స్టోరీ మలుపు తిరుగుతుంది. సరితను చూడకుండా ఉండలేక ఆమె గదిలోకి వెళ్లిన కమల్‌కు సరిత బావ కనిపించాడు. త్వరలో తను సరితను చేసుకుంటున్నట్లు చెప్పాడు. కమల్ నమ్మాడు. కోపంతో వెళ్లిపోయాడు. ఆ కోపం మాధవి మీద ప్రేమ అయింది. ఆ ప్రేమ పెళ్లి కార్డులు వేసే వరకు వెళ్లింది. ఈలోపు కమల్, మాధవి బుక్ ఎగ్జిబిషన్‌కి వెళతారు. అక్కడ స్టాల్ పెట్టిన వైజాగ్ బుక్‌షాప్ ఓనర్ (నటుడు కృష్ణ చైతన్య) కమల్‌కి కనిపిస్తాడు. మాధవిని అనుమానంగా చూడడం గమనించి, నా కాబోయే భార్య అని చెప్తాడు కమల్. ‘పెళ్లి చేసుకోవడం నాకూ చేతనౌను. వైజాగ్ వెళ్లి చెప్పండి’ అంటాడు. ఇక కృష్ణ చైతన్య ఊరుకుంటాడా? నేరుగా వెళ్లి సరితకు, ఆమె అమ్మానాన్నలకు చెప్పాడు. సరిత షాక్ తింది. పరుగున వెళ్లి ‘బాలూ పెళ్లి చేసుకుంటున్నాడా..’ అని కమల్ తల్లిని అడిగింది. నిజం కాదని తెలుసుకుని గుండెమీద చెయ్యి వేసుకుంది. గడువు తేదీ కోసం ఎదురు చూస్తోంది. అక్కడ హైదరాబాద్‌లో కమల్ సరితకు రాసి, పోస్ట్ చేయని ఉత్తరాలను చూసింది మాధవి. వారిద్దరి మధ్య ప్రేమ ఉందని గ్రహించింది. వెంటనే వైజాగ్ వచ్చి సరితకు కమల్ ప్రేమ గురించి చెప్పింది. సరిత పెళ్లి కూడా వట్టి మాటేనని తెలుసుకుంది. తిరిగి హైదరాబాద్ వెళ్లి కమల్‌కు అసలు సంగతి చెప్పింది. ప్రింట్ అయిన పెళ్లి కార్డులను పక్కన పడేసింది. వెంటనే వెళ్లి సరితను కలుసుకొమ్మని కమల్‌కు చెప్పింది. కమల్‌కు ట్రైన్ టిక్కెట్ కూడా బుక్ చేసింది. కమల్ వైజాగ్ బయల్దేరాడు. మాధవి అన్న రెడ్డి, తన చెల్లెలి పెళ్లి పాడైపోయిందన్న ఆవేదనతో, ఆగ్రహంతో కమల్‌ను చంపేందుకు పథకం వేశాడు. రాత్రి 3 గంటలప్పుడు విశాఖపట్నం అప్పారావుకు ఫోన్ చేసి, వాణ్ణి చంపెయ్ అని చెప్పాడు. నా చె ల్లెల్ని దగా చేసినవాడు మరొక దానితో కులకడానికి వీల్లేదు అని అన్నాడు. క్లైమాక్స్ వైజాగ్‌లో కొండ మీద గుడి. కమల్, సరితల లవ్స్పాట్. కమల్ వస్తున్నాడని గుడికి బయల్దేరింది సరిత. ఒంటరిగా సైకిల్ మీద. అమెను ఫాలో అవుతున్నాడు... ఎప్పటినుంచో ఆమె కోసం కాచుక్కూర్చున్న కృష్ణ చైతన్య. ఇప్పటికి ఛాన్స్ దొరికింది.ఇంటికి వచ్చి, అక్కడి నుంచి సరిత వాళ్ల ఇంటికి వెళ్లి ఆమె గుడికి వెళ్లిందని తెలుసుకుని బైక్‌పై బయల్దేరాడు కమల్. మాధవి అన్న రెడ్డి పురమాయించిన రౌడీలు కమల్ని వెంబడించారు. సరితను కృష్ణ చైతన్య వెంటాడుతున్నాడు. కమల్ ను వీళ్లు వెంటాడుతున్నారు. ఒకరు శీలం దోచుకోవడం కోసం. ఇంకొకరు ప్రాణాలు తీయడం కోసం. ఇక్కడ ట్విస్టులేమీ లేవు. సర్వం కోల్పోయి సరిత, ప్రాణాలు కోల్పోతుండగా కమల్ ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకరిలోకి ఒకరు ఒరిగిపోయారు. బాలు... బాలు.. ఇంతకాలం మనం విడిపోయింది మృత్యువు ఒడిలో కలవడానికా? బాలూ ఇది జరక్కముందే నన్ను నీతో లేవదీసుకుపో బాలూ... అంటోంది సరిత. రా స్వప్నా అంటున్నాడు కమల్. ఇద్దరూ సముద్రంలో కలిసిపోయారు. ప్రేమికులు ఓడిపోయారు. కానీ ప్రేమ గెలిచింది. మరో చరిత్ర అయి నిలిచింది. వివరాలు నటీనటులు : కమల హాసన్, సరిత (తొలి పరిచయం), మాధవి, జయవిజయ, కాకినాడ శ్యామల, జె.వి.రమణమూర్తి, కృష్ణచైతన్య, పి.ఎల్.నారాయణ, మిశ్రో. పాటలు : ఆచార్య ఆత్రేయ నేపథ్య గానం : పి.సుశీల, జానకి, వాణీజయరామ్ ఎల్.ఆర్.ఈశ్వరి, రమోలా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాటలు : గణేశ్ పాత్రో సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ నిర్మాత: రామ అరంగణ్ణల్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.బాలచందర్, విడుదల (1978) సమర్పణ: ఆండాళ్ ప్రొడక్షన్స్. విశేషాలు మరో చరిత్ర 1981లో హిందీలో ఏక్ దూజేకే లియే పేరుతో వచ్చింది. ప్లాటినమ్ జూబ్లీ (75 వారాలు) జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే. సరిత అసలు పేరు అభిలాష. బాలచందరే సరితగా మార్చారు. పాటలు ఏ తీగ పువ్వునొ, ఏ కొమ్మ తేటినో (సంతోషం) బలే బలే మగాడివివోయ్ బంగారు నా సామివోయ్ కలిసి ఉంటే కలదు సుఖము... కలసి వచ్చిన అదృష్టము పదహారేళ్లకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే... ఏ తీగ పువ్వునో... ఏ కొమ్మ తేటినో (విషాదం) విధి చేయు వింతలన్నీ... -
9వ తరగతి.. 6వ నెల
పసుపు శుభానికి చిహ్నం. ఒక ఆడపిల్ల పుట్టి, ఎదిగి, విద్యాబుద్ధులతో ప్రయోజకురాలయ్యి, వివాహం చేసుకొని కళకళలాడుతుంటే అది శుభం. శుభప్రదం. కాని- ఈ చిన్నారికి జరిగింది శుభం కాదు. తీవ్ర అన్యాయం. అందుకే ఇవాళ పేజీకి పసుపుపూత పూయలేకపోయాము. నిరసనగా నలుపునే వదిలేశాము. ఈ నిరసన సమాజం నుంచి కూడా రావాలి. ఒక అక్షరానికి వేయి కాగడాలు తోడైనప్పుడే చీకటి నలుపు పోతుంది. పసుపు విరబూస్తుంది. పిల్లలను రంగులు ఆకర్షిస్తాయి. కాని- ఊసరవెల్లి ఒంటి మీద కూడా రంగులుంటాయి. భద్రం... జర భద్రం!! అది నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఊరి చివర రచ్చబండ దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. అంతలో అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వారి ముందు నిలబడిందో అమ్మాయి. ఆమె ముఖంలో ఏదో భయం. కళ్ల నిండా దైన్యం. ఆ అమ్మాయిని చూస్తూనే కొన్ని కనుబొమలు పైకి లేచాయి. కొన్ని నోళ్లు పక్కవారి చెవుల్లో గుసగుసలాడటం మొదలుపెట్టాయి. అది చూసి ఆ పిల్ల మరింత ముడుచుకుపోయింది. పొంగుకొస్తోన్న దుఃఖాన్ని పంటి బిగువున అదిమిపెట్టి... పొట్ట తడుముకుంది. తొమ్మిదో తరగతి చదువుతోన్న తన కడుపులో ఆరు నెలల బిడ్డ. తప్పు చేశానన్న భావన ఓపక్క, ఆ తప్పు వల్ల ఈరోజు తను, తన తల్లిదండ్రులు ఇంతమంది ముందు తలవంచుకోవాల్సి వచ్చిందన్న బాధ మరోపక్క చిత్రవధ చేస్తుంటే... నీళ్లు నిండిన కళ్లతో నిస్సహాయంగా చూస్తూ నిలబడింది. వాదనలు మొదలయ్యాయి. వాదోపవాదాలు పూర్తయ్యాయి. చివరికి ఒక పెద్దాయన గొంతు సవరించుకున్నాడు. ‘చిన్న వయసులో చేయకూడని తప్పు చేసింది సరిత (పేరు మార్చాం). కానీ ఆ తప్పులో తనకు భాగం లేదంటున్నాడు సుభాష్ (అసలు పేరు కాదు). కాబట్టి ఇక చేసేదేమీ లేదు. సరితకు అబార్షన్ చేయించి, ఇక మీదటైనా ఆమెని అదుపులో పెట్టుకోవాలని పంచాయతీ తల్లిదండ్రుల్ని ఆదేశిస్తోంది’ అంటూ తీర్పు వెల్లడించాడు. ఉలిక్కిపడింది సరిత. ఎదురుగా నుంచుని ఉన్న ఇరవై రెండేళ్ల అబ్బాయి వైపు దీనంగా చూసింది. అతడు అప్పటికైనా తనను అంగీకరిస్తే బాగుణ్ను అన్న చిన్న ఆశ కొడిగడుతూ కనిపించింది ఆమె కళ్లల్లో. కానీ అతడికి ఆమె చూపుల్లోని భావం అర్థం కాలేదు. అర్థం చేసుకునే ప్రయత్నమూ చేయలేదు. తను తప్పు చేశానన్న పశ్చాత్తాపం కానీ, తనను నమ్మిన అమ్మాయికి అన్యాయం చేస్తున్నానన్న బాధ కానీ అతడిలో కాస్తయినా లేవు. అతనినా తను నమ్మింది? ఏం చేయాలో తోచక, ఎలా స్పందించాలో అర్థం కాక, ఇది అన్యాయం అంటూ అరిచే ధైర్యం లేక అక్కడే కూలబడిపోయింది. సరితే కాదు. ఇవాళ మన దేశంలోని చాలామంది ఆడపిల్లల పరిస్థితి ఇదే. సుభాష్‌లాంటి మాయగాళ్లు విసిరిన ప్రేమ వలలో అమాయకంగా చిక్కుకున్న చిట్టితల్లులెందరో. ఛిద్రమైన కలలను, చితికిపోయిన జీవితాలను చూసుకుని కన్నీళ్లతో బతకలేక, ధైర్యం చేసి చావలేక... ప్రతిక్షణం చస్తూ బతుకుతోన్న బంగారుతల్లులెంతమందో. లోపం ఎక్కడుంది?! మైనర్ ఆడపిల్లలు ప్రేమలో పడి మోసపోతున్న కేసులు గత పదేళ్లలో బాగా పెరిగిపోయాయని నేషనల్ క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి. ఆడపిల్లల కోసం ఇప్పటివరకూ ఎన్నో చట్టాలు వచ్చాయి. కానీ ఏ చట్టమూ వారిని ఎందుకు సంరక్షించలేకపోతోంది? అమ్మాయిలను కాపాడేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంఘాలు కృషి చేస్తున్నాయి. అయినా మన ఆడపిల్ల ఇప్పటికీ ఎందుకు మోసానికి గురవుతోంది? ఎక్కడ ఉంది లోపం? సరిత చిన్నపిల్ల. అంత చిన్నపిల్లని తల్లిని చేశాడు సుభాష్. అది నేరమని తెలియకే అతడలా చేశాడనుకోవాలా? పైగా ఆ అమ్మాయి ఎవరో తెలీదని పంచాయతీ ముందు చెప్పాడు. అంత దారుణంగా మోసం చేసినందుకు అతడిని తప్పుబట్టాలా లేక ఇలాంటి ఎన్నో కేసుల్లో నేరస్థుడి తరఫువాళ్లు చెప్పినట్టు తెలీక చేశాడనో, పరిస్థితులలా వచ్చాయనో నమ్మాలా? కూతురికి అన్యాయం జరిగిందని తెలియగానే సరిత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు. పంచాయతీకి వెళ్లారు. ఆ తర్వాతే పోలీసులను ఆశ్రయించారు. అంటే వారికి చట్టాల గురించి తెలీదనుకోవాలా లేక వాటిపై నమ్మకం లేదనుకోవాలా? ఓ ఆడపిల్ల బతుకు అన్యాయమైపోయింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. ఆమె పట్ల జరిగిన దారుణాన్ని తీవ్రంగా పరిగణించకుండా, ఆరోనెలలో అబార్షన్ చేస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని కూడా ఆలోచించకుండా తీర్పు ఇచ్చిన పంచాయతీ పెద్దలది అమాయకత్వమనుకోవాలా? చట్టాల గురించిన అవగాహనా రాహిత్యమనుకోవాలా? తమ కొడుకు ఓ ఆడపిల్లని మోసం చేశాడని తెలిసి కూడా సుభాష్ తల్లిదండ్రులు అతణ్ని మందలించలేదు. పైగా పంచాయతీ పెద్దలను, పోలీసులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారు. పోలీసులకు దొరక్కుండా కొడుకు తప్పించుకుపోవ డానికి సాయపడ్డారు. దీన్ని కొడుకు మీద ప్రేమ అనుకని వదిలేయాలా లేక నేరమని శిక్షించాలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెబుతారు! సరితకు న్యాయం ఎవరు చేస్తారు! విలువలు తెలిసినవాళ్లమని విర్రవీగుతాం. ఆడవాళ్లను దేవతలుగా కొలిచే దేశం మనదని విదేశాలకు వెళ్లి మరీ గొప్పలు చెప్పుకుంటాం. ఎక్కడి నుంచో ఓ రాబందు వచ్చి, మన గడపలో పూసిన పసిమొగ్గను తన పాదాల కింద నలిపేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నాం. ఆడుకునే వయసులో తమ కడుపున బిడ్డను మోస్తుంటే... జరిగిన అన్యాయాన్ని తుడిచేయలేక, జరగాల్సిన న్యాయాన్ని సాధించుకోలేక మౌనంగా ఏడుస్తున్నాం. ప్రేమ అనే పవిత్రమైన పదానికి మోసం అనే కొత్త అర్థాన్ని కల్పిస్తున్న కామాంధులని చట్టపరంగా శిక్షించలేక నిస్సహాయంగా నిలబడిపోతున్నాం. ఎవరు తీరుస్తారు మన ఆడపిల్లల కష్టాన్ని! ఎవరు తుడుస్తారు మన ఆడపడుచుల కన్నీళ్లని! ఎవరు సృష్టిస్తారు నిర్భయ భారతాన్ని!! - సమీర నేలపూడి, సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి ఇది ముమ్మాటికీ నేరం! ఐపీసీ సెక్షన్ 376, నిర్భయ చట్టాల దృష్ట్యా ఇది తీవ్రవైన నేరం. ఆ అమ్మాయి తన ఇష్ట ప్రకారమే దగ్గరైనా, ఆమె మైనర్ కాబట్టి దీన్ని రేప్‌గానే పరిగణిస్తుంది చట్టం. ఇలాంటి కేసుల్లో నేరస్థులు చార్జిషీటును బలహీనపర్చి తప్పించుకుంటున్నారు. అలా జరక్కుండా ఉండాలంటే విచారణ మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో జరగాలి. - ఎస్.ప్రదీప్‌కుమార్, న్యాయవాది ఇది వారి వైఫల్యమే! పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు, టీచర్లు ఎప్పటికప్పుడు గమనించాలి. సరిత ఒక అబ్బాయిని చాటుగా కలిసింది. దగ్గరైంది. ఆ నిజాలు దాచిపెట్టింది. భయంతోనో, అపరాధభావంతోనో ఆమె ప్రవర్తనలో తప్పక తేడా వచ్చి ఉంటుంది. అది గమనించకపోవడం ఆమె తల్లిదండ్రులు, టీచర్ల వైఫల్యమే. - ప్రజ్ఞారష్మి, సైకాలజిస్టు భరోసా కల్పించాలి! సరితకి తల్లిదండ్రులు, టీచర్లు, చుట్టూ ఉండేవారి సపోర్ట్ చాలా అవసరం. జరిగినదానికి నిందించకుండా, మరోసారి అలా జరక్కుండా చూసుకొమ్మని లాలనగా చెప్పాలి. భవిష్యత్తు మీద ఆశ, భరోసా కల్పించాలి. లేదంటే తను మానసికంగా కుంగిపోతుంది. - శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక వైద్యాలయం, ఎర్రగడ్డ పోలీసులు సెన్సిటివ్‌గా ఉండాలి! ఇలాంటి సమస్యల పరిష్కారానికి పంచాయతీకి వెళ్లడమే తప్పు. ఇదేమీ ప్రేమ వ్యవహారం కాదు. లైంగిక నేరం. పోలీస్ కంప్లయింట్ ఇవ్వడమే సరైన పద్ధతి. పోలీసులు కూడా ఇలాంటి కేసుల విషయంలో సెన్సిటివ్‌గా ఆలోచించాలి. ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఆ అబ్బాయికి శిక్ష పడేలా చేయాలి. - పద్మావతి, సామాజిక కార్యకర్త, కస్తూర్బా ఆశ్రమ నిర్వాహకులు -
మాటరాని అందమిది
కళ్లు మాట్లాడతాయి.. నవ్వు మాట్లాడుతుంది.. ఆమె రూపం మాట్లాడుతుంది. కాని ఆమె మాట్లాడలేదు. అందమైన రూపాన్నిచ్చిన బ్రహ్మ.. అంతకు మించి ఎందుకనుకున్నాడో ఏమో.. నోటి మాటను ఆమె నొసటన రాయలేదు. అయితేనేం.. ర్యాంప్‌పై వయ్యారాలు ఒలకబోస్తుంది. ప్రకటనల్లో భావాలు వర్షిస్తుంది. సిటీలో మోడల్‌గా రాణిస్తోన్న ఈమె ర్యాంప్‌పై ఎక్కడైనా కనపడితే.. శభాష్ అని పొగడాలనుకుంటున్నారా.. ఉపయోగం లేదు. ఎందుకంటే ఆమెకు వినపడదు కూడా.. అయితేనేం డెఫ్ అండ్ డంబ్ మోడల్‌గా సిటీలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సరిత (22) ఎన్ని అభినందనలకైనా అర్హురాలే. ..:: ఎస్.సత్యబాబు ర్యాంప్‌పై మోడల్‌గా రాణించడమంటే ఆషామాషీ కాదు. రూపం ఒక్కటే సరిపోదు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. చదువుంటే చాలదు. కొరియోగ్రాఫర్స్, డిజైనర్స్ చెప్పింది అలా విని ఇలా అల్లుకుపోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మోడలింగ్ అంటే ప్రతిభావంతులైన సుందరాంగుల ప్రపంచం. అలాంటి ప్రపంచంలోకి అడుగుపెట్టింది మాటరాని, వినలేని సరిత. చిన్ననాటి కలను నిజం చేసుకోవడానికి పెద్ద లోపాన్ని కూడా లెక్కచేయకుండా కృషి చేస్తోంది. ‘మాది వరంగల్. నాన్నది వ్యవసాయం. అమ్మ గృహిణి. మేం మొత్తం ఆరుగురు పిల్లలం’ అంటూ రాయడం మొదలు పెట్టింది సరిత (మా ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ ఇంటర్వ్యూ ఇచ్చింది) ఆమె చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... సారీ ఆమె రాతలోనే.. ఇంట్లో సగానికి పైగా డెఫ్ అండ్ డంబ్.. కారణం తెలియదు కానీ, మా ఆరుగురిలో ఇద్దరు సోదరులు, ఒక సోదరి కూడా నాలాగే మూగ, చెవిటి. మిగిలిన వారు బాగానే ఉన్నారు. అన్నయ్య తనలాగే డెఫ్ అండ్ డంబ్ అయిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఎక్కువగా టీవీ చూసేదాన్ని. అందులో వచ్చే ఫ్యాషన్ చానెల్ నాకు బాగా నచ్చేది. అంతేకాకుండా టీనేజ్‌లో ఉండగా బాగుంటాననే ప్రశంసలు... అప్పుడే నాకు మోడలింగ్ చేయాలనిపించేది. అయితే నాకున్న లోపం వల్ల ఆ ఆశ తీరదు కదా అని బాధపడేదాన్ని. ఈ లోపాన్ని అధిగమించడానికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని ఇంటర్ పూర్తి చేశాను. డెఫ్ మోడల్ కాంటెస్ట్.. అదే సమయంలో మూగ చెవుడు ఉన్నవారి కోసం ప్రత్యేకంగా బ్యూటీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిసింది. ఎలాగైనా అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. అందుకే అతి కష్టం మీద ఇంట్లోవాళ్లని ఒప్పించి హైదరాబాద్ వచ్చేశాను. నెట్లో కాంటెస్ట్‌కు అప్లయ్ చేసి, ప్రిలిమినరీస్‌లో సెలక్టయ్యాను. అన్ని దశలూ దాటాను. చివరికి మిస్ డెఫ్ ఆంధ్రప్రదేశ్‌గా సెలక్టయి, 2012లో ముంబైలో జరిగిన మిస్ డెఫ్ ఇండియా పోటీల్లో సైతం పాల్గొన్నాను. 22 మంది పార్టిసిపేట్ చేశారు. నాకు కిరీటం రాకపోయినా మంచి ఐడెంటిటీ వచ్చింది. ఆ తర్వాత అడపాదడపా ర్యాంప్‌వాక్ అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్గా టాలీవుడ్ మ్యాగజైన్ లాంచ్ సందర్భంగా ర్యాంప్‌వాక్ చేశాను. అలాగే ప్రింట్ యాడ్స్ కూడా వస్తున్నాయి. అయితే రాష్ట్రస్థాయి బ్యూటీ కాంటెస్ట్ గెలిచిన మిగిలిన పేజెంట్స్ విజేతలతో పోలిస్తే తక్కువ. నాకున్న సమస్యపై చాలా మంది సానుభూతి చూపిస్తున్నారే కాని.. అవకాశాలు ఇవ్వడం లేదు. ఏదేమైనా మోడలింగ్ కెరీర్లో ముందుకే వెళ్లాలనుకుంటున్నాను. ఎప్పటికైనా మిస్ డెఫ్ ఇండియా పోటీల్లో సత్తా చాటాలనుకుంటున్నాను. ఇదీ మిస్ డెఫ్ ఇండియా కాంటెస్ట్ నేపథ్యం.. దేశంలో ఉన్న మాటరాని, వినలేని యువతుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి నిర్వహిస్తున్నవే మిస్ డెఫ్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్‌లు. ఆరేళ్ల క్రితమే ప్రారంభమైనా.. ఇప్పుడిప్పుడే అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ సహకారంతో నడిచే డెఫ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. మిగిలిన బ్యూటీ పేజెంట్స్కు భిన్నంగా ఈ పోటీల్లో పాల్గొనే అందగత్తెలకు ఎత్తు, అర్హతల విషయంలో పలు మినహాయింపులున్నాయి. వీరి కోసం ఇంటర్‌ప్రిటర్స్ (సైన్ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకుని సాధారణ భాషలోకి తర్జుమా చేసే అనువాదకులు)ను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. రెండేళ్ల క్రితం ముంబైలోని బిర్లా మాతృశ్రీ సభాగృహలో డెఫ్ ఎక్స్‌పోలో భాగంగా నిర్వహించిన పోటీలో అప్పటి ఆంధ్రప్రదేశ్ తరఫున సరిత పాల్గొంది. ‘మూగవాళ్లకు మాతృభాష సైన్ లాంగ్వేజ్. దీనిపై చాలామందిలో అవగాహన లేదు. సైన్ లాంగ్వేజ్‌లో మాట్లాడడంలో పరిణితి సాధిస్తే డెఫ్ అనే ఆలోచన కూడా రాదు’ అంటారు ఎక్స్పో నిర్వాహకులు, పుట్టుకతో మూగవారైన అలోక్ కేజ్రీవాల్. పాఠశాలల్లో ఖరీదైన డిజిటల్ హియరింగ్ ఉత్పత్తులు అందుబాటులో లేవు. అమెరికాలో అడ్వాన్స్డ్ వీడియో కాలింగ్ డివెజైస్ ఉన్నాయి అంటున్న అలోక్.. మాటలతో ఏకీభవిస్తారు ఈ పోటీలకు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న మరో డెఫ్ అండ్ డంబ్ యువతి కాజల్ థావన్.. 2009లో మమతాసింగ్ అనే మూగ యువతి మిస్ డెఫ్ ఇండియాగా ఎన్నికై మిస్ డెఫ్ వరల్డ్ పోటీలకు సైతం ప్రాతినిథ్యం విహంచింది. అలాగే కనికా బాలి, అంకితాకుమారి.. వీరంతా మాట లేకున్నా మంత్రముగ్ధులను చేసే అందంతో కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు ఇప్పటిదాకా సరైన ప్రాతినిథ్యం లేదనే లోటును సరిత భర్తీ చేస్తోంది. -
భర్త కళ్లల్లో జిల్లేడు పాలు
ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం చూపు కోల్పోయిన భర్త నిందితుల రిమాండ్ నాగోలు: వివాహేతర సంబంధం పెట్టుకొని.. కట్టుకున్న భర్త కళ్లల్లో జిల్లేడు పాలు పోసి కళ్లు పోవడానికి కారణమైన భార్యను, ఆమె ప్రియుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ కాశీవిశ్వనాథ్ కథనం ప్రకారం... ఎల్బీనగర్ మెడికేర్ ఆసుపత్రి సమీపంలోని పరిమళ అపార్ట్మెంట్లో నివాసముండే కొత్తకొండ రాఘవేందర్ (40), సరిత (32) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. రాఘవేందర్ వివాహాలకు డెకరేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన స్టీల్ వ్యాపారి గోపాల్‌రెడ్డి (37) ఇంట్లో ఓ శుభకార్యానికి డెకరేషన్ చేశాడు. నగరానికి వచ్చిన గోపాల్‌రెడ్డి ఓసారి ఎల్బీనగర్లోని రాఘవేందర్ ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో ల్యాండ్‌లైన్‌తో పాటు రాఘవేందర్ భార్య సరిత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ లోబర్చుకున్నాడు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్న రాఘవేందర్‌ను హత్య చేయాలని సరిత తన ప్రియుడు గోపాల్‌రెడ్డితో కలిసి పథకం వేసింది. 2012, డిసెంబర్, 29న రాఘవేందర్ ఇంట్లో పడుకొని ఉండగా... ఇద్దరూ కలిసి కంట్లో జిల్లేడు పాలు పోశారు. కళ్లు ఎంతకూ తెరుచుకోకపోవడంతో సమీపంలోని ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అదే సమయంలో సరిత కొడుకును హయత్‌నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్లో చేర్పించి కూతురిని తీసుకుని గోపాల్‌రెడ్డి వద్దకు వెళ్లిపోయింది. కళ్లు కోల్పోయిన రాఘవేందర్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈనెల 13న ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే, గోపాల్‌రెడ్డి తనకు డెకరేషన్ పని నిమిత్తం రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. రూ. లక్ష మాత్రమే చెల్లించాడని, మిగతాది ఎగ్గొట్టాడని రాఘవేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాఘవేందర్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన భార్య సరిత, గోపాల్‌రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
మహిళ సజీవదహనం
మిర్యాలగూడ కైం : ఓ మహిళ సజీవదహనమైంది. సన్నిహితంగా ఉంటున్న యువకుడే ఆమెపై కిరోసిన్ పోసి, నిప్పంటించి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఆదివారం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకా రం.. అనుముల మండలం అల్వాలకు చెందిన కన్నెబోయిన రాములమ్మ కూతురు సరిత(35) వివాహం దేవరకొండకు చెందిన బ్యాంకు ఉద్యోగి నీలం వెంకటేశ్వర్లుతో 14 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి కుమారుడు, కూతురు జన్మించారు. మూడేళ్లుగా సరిత భర్తతో విడిగా ఉంటూ మిర్యాలగూడ మందులవారి కాలనీలో నివసిస్తోంది. కుమారుడు రాహుల్ హైదరాబాద్‌లో ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా, కుమార్తె శ్రీజ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి అభ్యసిస్తోంది. సరిత తన తల్లిగారి ఊరైన అల్వాలకు చెందిన యువకుడు ఆవులదొడ్డి కరుణాకర్‌తో సన్నిహితంగా మెలుగుతోంది. ఘర్షణ పడి.. ఆపై కిరోసిన్ పోసి..? అల్వాలకు చెందిన కరుణాకర్ తరచు సరిత ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కరుణాకర్ తీవ్ర ఆవేశానికి లోనైసరితపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు భావిస్తున్నారు. అయితే అదే సమయంలో సరిత కరుణాకర్‌ను పట్టుకోవడంతో అతడికి మంటలు అంటుకున్నాయి. ఏదో విధంగా సరితను విడిపించుకున్న కరుణాకర్ ఇంటి ఆవరణలో ఉన్న నల్లా వద్ద మంటలను చల్లార్చుకుని, ఓ యువకుడి సహాయంతో ఆస్పత్రికి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లోనే నిద్రిస్తున్న సరిత కూతురు లేచి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి మంటలు, పొగరావడాన్ని గమనించారు. వెంటనే ఇంటి వెనుక భాగం తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా మంటల్లో కాలుతున్న సరిత ఒంటిపై నీళ్లు చల్లారు. తీవ్ర గాయాలైన సరిత అక్కడికక్కడే మృతిచెందింది. మరోగదిలో ఉన్న సరిత కూతురును స్థానికులు క్షేమంగా బయటకు పంపారు. పోలీసులకు సమాచారం అందించగా డీఎస్పీ మోహన్, సీఐ సుదర్శన్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. నల్లగొండ నుంచి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. పెళ్లికి ఒప్పుకోరనే.. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణాకర్‌ను పోలీసులు విచారించారు. కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్న తాము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, దీనికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోరనే బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే అతడి చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే సరితకు తీవ్ర గాయాలై చనిపోవడం, కరుణాకర్ స్వల్పంగా గాయపడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరుణాకర్ ఈ ఘాతుకానికి ఒటిగట్టి పోలీసులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా మెరుగైన చికిత్స కోసం కరుణాకర్‌ను అతడి బంధువులు హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి కన్నెబోయిన రాములమ్మ ఫిర్యాదు మేరకు కరుణాకర్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. -
చెదరగొట్టి...చితకబాది
ప్రగతినగర్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలంటూ మంగళవారం ఉదయం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు ముందు జాగ్రత్తగా కోర్టు వద్దే ఇనుప కంచెలు వేయడంతో విద్యార్థులు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. అనంత రం కలెక్టరేట్‌లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కలెక్టరేట్లో ముఖ్యమైన అధికారులు ఎవరూ లేరని సముదాయించారు. విద్యార్థులు సమస్యలతో సతమతమవుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం, ప్రభుత్వం ఉదాసీనత చూపడం సరి కాదంటూ పీడీఎస్‌యూ నాయకులు మండిపడ్డారు. కలెక్టరేట్ గేటు వరకైనా అనుమతి ఇవ్వాలని కోరారు. పోలీసులు ఇందుకు అంగీకరించకపోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. విద్యార్థులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయినా విద్యార్థులు ఆగకపోవడంతో లాఠీ చార్జి చేసి అక్కడి నుంచి చెదరగొట్టా రు. దీంతో పలువురు విద్యార్థులు ఇనుప కంచెలో ఇరుక్కుపోయారు. మిగిలినవారు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెబుతూ విద్యార్థులను దొరికినవారిని దొరికినట్టు అరెస్టు చేశారు. విద్యార్థులు పోలీసు వాహనాలు కదలకుండా అడ్డు తగలడంతో పోలీసులు రెచ్చిపోయి వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ప్రైవేట్ అటోలో తోసి ఠాణాలకు తరలించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. పొలీసుల చర్య అమానుషం సమస్యలపై ఉద్యమించిన విద్యార్థులను అరెస్టు చేయడం అమానుషమని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకురాలు సరిత అన్నారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోసం తాము పోరాడుతుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన లేదని, గవ ర్నర్గిరీ కొనసాగుతోందనడానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అరెస్టయినవారిలో పీడీఎస్‌యూ నాయకులు అన్వేష్, సౌందర్య, సుధాకర్, సుమన్, గౌతంకుమార్, సాయినాథ్, ఆజాద్, రా జు, స్వప్న, రాజేశ్వర్, అరుణ్‌కుమార్, కల్పన, ప్రగతి, స్వరూప, దేవరాజు, గణేష్, కళ్యాణ్, కిరణ్, రాకేష్, క్రాంతి, కార్తిక్, సుజిత్‌కుమార్, నరేష్, స్వప్న తదితరులు ఉన్నారు. కలెక్టరేట్‌ను ముట్టడించిన సమయం లో జరిగిన తోపులాటలో ఓ విద్యార్థికి సంబందించిన వెండి గొలుసు పడిపోయింది. అరెస్టు అనంతరం కొంత మంది విద్యార్థులు గొలుసు కోసం వెతికారు. దొరకకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. -
అడ్డుగా ఉన్నాడనే అంతం
వీడిన టైలర్ హత్య కేసు మిస్టరీ ప్రియుడితో కలిసి చంపించిన భార్య నిందితులకు రిమాండు శంషాబాద్: పట్టణంలో కలకలం సృష్టించిన టైలర్ హత్య కేసు మిస్టరీ వీడింది.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్యే ప్రియుడితో కలిసి భర్తను చంపించింది. పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. శంషాబాద్ ఏసీపీ సుదర్శన్ విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. శంషాబాద్ మాజీ ఎంపీపీ తోట లచ్చయ్య కుమారుడు శ్రీశైలం స్థానికంగా టైలర్‌గా పనిచేస్తూ మధురానగర్‌కాలనీలోని సొంతింట్లో ఉంటున్నాడు. మహేశ్వరం మండలం సరస్వతీగూడకు చెందిన సరితను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లికి ముందే సరితకు స్వగ్రామానికి చెందిన సందీప్‌తో వివాహేతర సంబంధం ఉంది. వివాహానంతరం కూడా సరిత భర్తకు మత్తుమందు ఇచ్చి ఇంట్లోనే తన సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తమ ‘బంధా’నికి అడ్డుగా ఉన్న శ్రీశైలాన్ని అంతం చేయాలని సరిత, సందీప్ పథకం వేశారు. ఈక్రమంలో సందీప్ తన స్నేహితులైన సరస్వతీగూడ, లేమూరు గ్రామాలకు చెందిన జంగయ్య, బాల్‌రాజ్, యాదగిరిలతో విషయం చెప్పాడు. శ్రీశైలం హత్యకు సహకరిస్తే రూ. 50 వేలతో పాటు ఓ ప్లాటు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈక్రమంలో గత మే 26న అర్ధరాత్రి సందీప్‌తో పాటు అతడి మగ్గురు స్నేహితులు ఇండికా కారులో శంషాబాద్‌లోని శ్రీశైలం ఇంటికి వచ్చారు. యాదగిరి గేటు వద్ద కాపలా ఉండగా మిగతా వారు ఇంట్లోకి వెళ్లారు. తమతో తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో నిద్రిస్తున్న శ్రీశైలం తలపై మోదారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతడిని కారులో వేసుకొని శంషాబాద్ మండలంలోని బూర్జుగడ్డ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. శ్రీశైలం మృతి చెందే వరకు అక్కడ రాడ్డుతో అతడి తలపై విచక్షణారహితంగా బాదారు. మృతిచెందాడని నిర్ధారించుకున్న వారు తిరిగి మధురానగర్‌లోని శ్రీశైలం ఇంటికి వెళ్లారు. సందీప్ సరిత వద్ద నుంచి రూ. 2500 తీసుకొని ఇంట్లో రక్తపు మరకలను తుడిచిన దుస్తులను కారులో వేసుకుని రాళ్లగూడ రహదారివైపు వెళ్లారు. శ్రీైశె లం ఇంటి వద్ద ఉన్న అతడి బైక్‌ను బాల్‌రాజ్ తీసుకుని రాళ్లగూడ ఔటర్ సర్వీసు రోడ్డువైపు కారు వెంబడి వెళ్లాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నిస్తుండగా పెట్రోలింగ్ శబ్దాన్ని విని మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు వెళ్లిపోయారు. మార్గమధ్యంలో ఉప్పల్ సమీపంలో ఇనుపరాడ్డుతో పాటు రక్తపు మరకలున్న దుస్తులను పడేశారు. మృతదేహం పక్కనే బైకు పడేద్దామనుకున్న బాల్‌రాజ్ భయపడి స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందున్న ఖాళీ స్థలంలో పెట్టి సరస్వతీగూడకు వెళ్లిపోయాడు. తీవ్ర భయాందోళ నకు గురైన బాల్‌రాజ్ స్థానిక పెద్దమనుషులకు విషయం చెప్పాడు. మరుసటి రోజు స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మొదట రాజకీయ లేదా ఆర్థిక కారణాలే హత్యకు దారి తీసి ఉండొచ్చని అనుమానించారు. అనంతరం శ్రీశైలం భార్య సరిత తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ఆ దిశగా విచారణ జరిపారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని నిర్ధారించుకున్నారు. తొలుత బాల్‌రాజ్‌తో పాటు సరితను అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం సందీప్, జంగయ్య, యాదగిరిలను అరెస్ట్ చేశారు. సరితతో పాటు మిగతా నలుగురిని శుక్రవారం రిమాండుకు తరలించారు. కేసు ఛేదించిన సిబ్బందిని ఏసీపీ ఈ సందర్భంగా ప్రశంసించారు.