భర్త కళ్లల్లో జిల్లేడు పాలు | wife tries to kill husband with help of paramour | Sakshi
Sakshi News home page

భర్త కళ్లల్లో జిల్లేడు పాలు

Published Thu, Sep 18 2014 9:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

భర్త కళ్లల్లో జిల్లేడు పాలు

భర్త కళ్లల్లో జిల్లేడు పాలు

  • ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం
  • చూపు కోల్పోయిన భర్త
  • నిందితుల రిమాండ్
  • నాగోలు: వివాహేతర సంబంధం పెట్టుకొని.. కట్టుకున్న భర్త కళ్లల్లో జిల్లేడు పాలు పోసి కళ్లు పోవడానికి కారణమైన భార్యను, ఆమె ప్రియుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ కాశీవిశ్వనాథ్ కథనం ప్రకారం... ఎల్బీనగర్ మెడికేర్ ఆసుపత్రి సమీపంలోని పరిమళ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే కొత్తకొండ రాఘవేందర్ (40), సరిత (32) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. రాఘవేందర్ వివాహాలకు డెకరేషన్ చేస్తుంటాడు.

    ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన స్టీల్ వ్యాపారి గోపాల్‌రెడ్డి (37) ఇంట్లో ఓ శుభకార్యానికి డెకరేషన్ చేశాడు. నగరానికి వచ్చిన గోపాల్‌రెడ్డి ఓసారి ఎల్బీనగర్‌లోని రాఘవేందర్ ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో ల్యాండ్‌లైన్‌తో పాటు రాఘవేందర్ భార్య సరిత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. తరచూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ లోబర్చుకున్నాడు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్న రాఘవేందర్‌ను హత్య చేయాలని సరిత తన ప్రియుడు గోపాల్‌రెడ్డితో కలిసి పథకం వేసింది.

    2012, డిసెంబర్, 29న రాఘవేందర్ ఇంట్లో పడుకొని ఉండగా... ఇద్దరూ కలిసి కంట్లో జిల్లేడు పాలు పోశారు. కళ్లు ఎంతకూ తెరుచుకోకపోవడంతో సమీపంలోని ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అదే సమయంలో సరిత కొడుకును హయత్‌నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో చేర్పించి కూతురిని తీసుకుని గోపాల్‌రెడ్డి వద్దకు వెళ్లిపోయింది. కళ్లు కోల్పోయిన రాఘవేందర్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈనెల 13న ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

    అలాగే, గోపాల్‌రెడ్డి తనకు డెకరేషన్ పని నిమిత్తం రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. రూ. లక్ష మాత్రమే చెల్లించాడని, మిగతాది ఎగ్గొట్టాడని రాఘవేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాఘవేందర్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన భార్య సరిత, గోపాల్‌రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

    (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement