భర్త వేధింపులు తాళలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది.
భర్త వేధింపులు తాళలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మారేపల్లి సాయిరెడ్డి, సరిత దంపతులు దూలపల్లి వీకర్‌సెక్షన్ కాలనీలో ఉంటున్నారు. కిరాణా దుకాణం నడిపే సాయిరెడ్డి కొంతకాలంగా భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. జీవితంపై విరక్తి చెందిన సరిత బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సాయిరెడ్డిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.