Sai reddy
-
మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూత
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన స్వగ్రామం జూపాకలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చదవండి: కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 13 మంది మృతి అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా? -
ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసి మృతి
ధారూరు: ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ఓ తెలుగు యువకుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. బాత్రూంలో కిందపడి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం హరిదాస్‌పల్లికి చెందిన సాయిరెడ్డి, నాగేంద్రమ్మ దంపతుల కుమారుడు హరి శివశంకర్‌రెడ్డి (25) హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత విద్య కోసం 2018లో ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడి సౌత్రన్ క్రాస్ యూనివర్సిటీలో ప్రస్తుతం పీజీ రెండో ఏడాది చదువుతున్నాడు. ఈ నెల 15న తన గదిలో బాత్రూంకు వెళ్లిన శివశంకర్‌రెడ్డి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్నేహితులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. మెదడులోని నరాలు చిట్లిపోవడంతో 5 రోజుల క్రితం బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో సోమవారం మరణించా డు. ఈ విషయాన్ని స్నేహితులు అతడి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలంటూ ఆస్ట్రేలియా నుంచి ప్రవాస భారతీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా, సాయిరెడ్డి, నాగేంద్రమ్మ దంపతులకు నలుగురు సంతానం. గతంలో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. మిగిలిన ఒక్క కొడుకు శివశంకర్‌రెడ్డి కూడా చనిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. -
అగ్రిగోల్డ్లానే అక్షయగోల్డ్ బాధితులనూ ఆదుకుంటాం
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఎదురెదురుగు వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఊబలంక సమీపంలో గురువారం వెలుగుచూసింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో వినయ్‌కాంత్ రెడ్డి(22) అనే ఇంజనీరింగ్ విద్యార్థితో పాటు వెంకట సాయిబాబా రెడ్డి(28) మృతిచెందగా.. సాయిబాబా కూతురితో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
చెరువులో మునిగి బాలుని మృతి
వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి శివారులోని ఊరచెరువులో ప్రమాదవశాత్తూ మునిగి సాయిరెడ్డి(14) అనే బాలుడు ఆదివారం ఉదయం మృతిచెందాడు. సెలవుదినం కావడంతో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన సాయిరెడ్డి ప్రమాదవశాత్తూ మునిగి మృతిచెందాడు. జైపాల్‌రెడ్డి కుమారుడైన సాయిరెడ్డి 9వ తరగతి చదువుతున్నాడు. గ్రామస్తులు గంటపాటు గాలించి మృత దేహాన్ని వెలికితీశారు. -
వేధింపుల తో వివాహిత ఆత్మహత్య
భర్త వేధింపులు తాళలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మారేపల్లి సాయిరెడ్డి, సరిత దంపతులు దూలపల్లి వీకర్‌సెక్షన్ కాలనీలో ఉంటున్నారు. కిరాణా దుకాణం నడిపే సాయిరెడ్డి కొంతకాలంగా భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. జీవితంపై విరక్తి చెందిన సరిత బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సాయిరెడ్డిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో విలేకరిని హతమార్చిన మావోలు
చింతూరు, న్యూస్‌లైన్: ఇన్ఫార్మర్ నెపంతో ‘దేశబంధు’ దినపత్రిక విలేకరి సాయిరెడ్డిని శుక్రవారం మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో దారుణంగా హతమార్చారు. గతంలో బాసగూడలో నివాసముండే సాయిరెడ్డి మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో బీజాపూర్‌కు మకాం మార్చారు. మావోయిస్టులకు సహకరిస్తున్నాడనే అభియోగంతో పోలీసులు గతంలో సాయిరెడ్డిని అరెస్టు చేయగా.. అనంతరం ఆయన విడుదలయ్యారు. వ్యాపారంలో భాగంగా బాసగూడ వెళ్లి వస్తుండేవారు. శుక్రవారం భార్యతో కలసి బాసగూడలోని వారాంతపు సంతకు వెళ్లి అపరాలు కొనుగోలు చేస్తుండగా.. గ్రామీణుల వేషధారణలో వచ్చిన మావోయిస్టులు సాయిరెడ్డిపై గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.