చింతూరు, న్యూస్‌లైన్: ఇన్‌ఫార్మర్ నెపంతో ‘దేశబంధు’ దినపత్రిక విలేకరి సాయిరెడ్డిని శుక్రవారం మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో దారుణంగా హతమార్చారు. గతంలో బాసగూడలో నివాసముండే సాయిరెడ్డి మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో బీజాపూర్‌కు మకాం మార్చారు. మావోయిస్టులకు సహకరిస్తున్నాడనే అభియోగంతో పోలీసులు గతంలో సాయిరెడ్డిని అరెస్టు చేయగా.. అనంతరం ఆయన విడుదలయ్యారు. వ్యాపారంలో భాగంగా బాసగూడ వెళ్లి వస్తుండేవారు. శుక్రవారం భార్యతో కలసి బాసగూడలోని వారాంతపు సంతకు వెళ్లి అపరాలు కొనుగోలు చేస్తుండగా.. గ్రామీణుల వేషధారణలో వచ్చిన మావోయిస్టులు సాయిరెడ్డిపై గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
ఛత్తీస్‌గఢ్‌లో విలేకరిని హతమార్చిన మావోలు
Published Sat, Dec 7 2013 2:17 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement