వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి శివారులోని ఊరచెరువులో ప్రమాదవశాత్తూ మునిగి సాయిరెడ్డి(14) అనే బాలుడు ఆదివారం ఉదయం మృతిచెందాడు.
వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి శివారులోని ఊరచెరువులో ప్రమాదవశాత్తూ మునిగి సాయిరెడ్డి(14) అనే బాలుడు ఆదివారం ఉదయం మృతిచెందాడు. సెలవుదినం కావడంతో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన సాయిరెడ్డి ప్రమాదవశాత్తూ మునిగి మృతిచెందాడు. జైపాల్‌రెడ్డి కుమారుడైన సాయిరెడ్డి 9వ తరగతి చదువుతున్నాడు. గ్రామస్తులు గంటపాటు గాలించి మృత దేహాన్ని వెలికితీశారు.