పెళ్లి ఇష్టం లేక వరుడి​​​​​​​ ఆత్మహత్య? | Groom Krishna Teja Commits Suicide In Warangal District | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇష్టం లేక వరుడి​​​​​​​ ఆత్మహత్య?

Published Wed, Mar 13 2024 12:02 PM | Last Updated on Wed, Mar 13 2024 12:11 PM

Groom Krishna Teja Commits Suicide in Warangal District   - Sakshi

హసన్‌పర్తి/వర్ధన్నపేట: రెండు రోజుల క్రితం అదృశ్యమైన వరుడు కృష్ణ తేజ శవమై లభించాడు. వర్ధన్నపేట సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో పోలీసులు.. వరుడి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నగరంలోని గోకుల నగర్‌కు చెందిన భూక్యా కృష్ణ తేజ(29) వివాహం ఈనెల 16న నర్సంపేటకు చెందిన ఓ యువతితో జరగనుంది. బంధువులు, మిత్రులకు పెళ్లి పత్రికల పంపిణీ చేయడం ప్రారంభించారు.

పెళ్లి ఇష్టం లేకనే?
కృష్ణతేజకు పెళ్లి ఇష్టం లేకనే ఎస్సారెస్పీ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 10న పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కృష్ణ తేజ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై బంధువులు, మిత్రుల ఇళ్లల్లో గాలించారు. ఆచూకీ లభ్యం కాలేదు. అయితే పలివేల్పులలోని ఎస్సారెస్పీ కాల్వ కట్టపై ఓ బైక్‌ పార్క్‌ చేసి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై రాజ్‌కుమార్‌ ఘటనా స్థలికి చేరుకుని బైక్‌ను పరిశీలించారు. అందులో పెళ్లి పత్రికలు లభ్యంకాగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మిస్సింగ్‌ కేసు నమోదు
కృష్ణతేజ తల్లి శకుంతల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కాల్వలో పడ్డాడా? లేక పెళ్లి ఇష్టం లేక పారిపోయాడా అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం వర్ధన్నపేట మండలంలోని శ్రీ రామోజీ కుమ్మరిగూడెం శివారులోని ఎస్సీరెస్పీ కాల్వలో కృష్ణాతేజ మృతదేహం లభ్యమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement