గాయాలను చూపుతున్న నాగరాణి
గ్యాస్ పొయ్యిపై కోడలి చేతులు కాల్చిన అత్తమామ
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
దుగ్గొండి: అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ కోడలిని వేధింపులకు గురి చేశారు. కోడలి చేతులను గ్యాస్ పొయ్యిపై కాల్చడంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలు మంగళవారం దుగ్గొండి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన అడప కోమలి–బుచ్చయ్య దంపతుల కూతురు నాగరాణిని నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన జల్లి శారద–బుచ్చయ్య దంపతుల కుమారుడు నరేష్‌కు ఇచ్చి 2007 మార్చి నెలలో వివాహం చేశారు. పెళ్లి సమయంలో ఎకరంన్నర భూమి, 15 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చెల్లించారు. కొన్ని రోజుల పాటు సాఫీగా సాగిన సంసారంలో అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి.
దీంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండే వి. ఈ క్రమంలో ఈ నె ల 4న తనకు రూ. 40 లక్షలు కావాలని, మీ పు ట్టింటి నుంచి తీసుకురా వాలని గొడవ చేసి చే యిచేసుకున్నాడు. విషయాన్ని నాగరాణి తన తల్లిదండ్రులకు తెలపడంతో ఆగ్రహించిన అత్తమామ, భర్త కలిసి నాగరాణిని బలవంతంగా గ్యాస్ స్టవ్ వద్దకు తీసుకెళ్లి చేతులను గ్యాస్‌పై ఉంచి బొబ్బలు వచ్చేలా కాల్చారు. విషయం తెలుసుకున్న నాగరాణి కుటుంబ సభ్యులు దీక్షకుంటకు రాగానే నరేష్‌తోపాటు ఆయన తల్లిదండ్రులు నాగరాణి కుటుంబ సభ్యులను కొట్టి గాయపరిచారు. దీంతో నాగరాణి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పరమేష్ తెలిపారు. చికిత్స నిమిత్తం నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రికి తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment