పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన యువకుడు.. పెళ్లై ఏడాది తిరగకముందే | Married Woman Died Due To Young Man Harassment In Warangal | Sakshi
Sakshi News home page

పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన యువకుడు.. పెళ్లై ఏడాది తిరగకముందే

Published Tue, Jan 17 2023 2:50 PM | Last Updated on Tue, Jan 17 2023 2:55 PM

Married Woman Died Due To Young Man Harassment In Warangal - Sakshi

అనూష(ఫైల్‌) , రోడ్డుపై బంధువుల ధర్నా

సాక్షి, వరంగల్‌: యువకుడు, అతని కుటుంబ సభ్యుల వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బండమీదితండాలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన మనుబోతులగడ్డకు చెందిన భూక్య డోలి, బిచినిల చిన్న కుమార్తె మూడు అనూష (24)ను బండమీదితండాకు చెందిన రమేశ్‌కు ఇచ్చి 2022 ఫిబ్రవరి మాసంలో వివాహం జరిపించారు.

ప్రస్తుతం అనూష మూడు నెలల గర్భిణి. వీరి జీవితం సజావుగా సాగుతున్న క్రమంలో తండాకు చెందిన ఉస్మాన్‌తో పాటు మరికొంతమంది వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో గ్రామ పెద్దలు, పోలీసులు హెచ్చరించినా వేధింపులు ఆపకపోవడంతో సోమవారం రాత్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది.

తన కుమార్తె మృతికి కారణమైన ఉస్మాన్, మస్తాన్, ఇమామ్‌సాబ్, సర్వర్, అనిల్, సైదులుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ సంపత్‌రావు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.  
చదవండి: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. శవాలను భద్రపరిచే కెమికల్‌ కలుపుతూ.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement